
ఇద్దరి నిర్వాహకుల అరెస్టు
హైదరాబాద్: వ్యభిచారం గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో యువతిని రిహబిలిటేషన్ సెంటర్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కడప జిల్లా అరవీడు కూర్మయ్యగారిపల్లికి చెందిన పల్లపు నరేష్ (34) నగరానికి వలస వచ్చి మూసాపేట భవానీనగర్‌లో ఉంటున్నాడు.
చిత్తూరు జిల్లాకు చెందిన కొండా నాగరాజు (51)తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి రెండు నెలలుగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సనత్‌నగర్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా నరేష్ నాగరాజులతో పాటు మూసాపేట రాఘవేంద్రకాలనీకి చెందిన గుణశేఖర్ (26) అనే విటుడిని అరెస్టు చేశారు. అలాగే మరో యువతిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.