
నల్గొండ జిల్లా: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వట్టికోట ప్రవీణ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నంచి డాక్టరేట్ లభించింది. డాక్టర్ సయ్యద్ అజీమ్ ఉన్నిసా పర్యవేక్షణలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ప్రవీణ్ పరిశోధన చేసినందుకు ఇటీవల యూనివర్సిటీలో నిర్వహించిన 84 స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వీసీ కుమార్ మొగళం చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.