ప్రాణాపాయ స్థితిలోకి పీజీ వైద్య విద్యార్థిని
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం పీజీ విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నారని అధికారులు తెలిపారు. విష ప్రయోగంగా అనుమానిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధి శనివారం తెలిపారు. గురువారం రాత్రి రిమ్స్ గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్ వార్డులో 25 ఏళ్ల బాధిత విద్యార్థిని ఉన్నారు. క్యాంటిన్ నుంచి ఫ్లాస్‌్కలో తెచి్చన టీని గ్లాసులోకి వంపుకుని పక్కన పెట్టుకున్నారు.
ఖాళీ దొరికిన వెంటనే రెండు సార్లు చప్పరించారు. టీ బాగోలేదని, దుర్వాసన వస్తోందని ఆమె తెలపడంతో తోటి వారు ఆ టీ జోలి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి వారు వెంటనే ఆమెను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ‘బాధిత విద్యారి్థని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. ఫ్లాస్‌్కతోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించాం. ఇది విష ప్రయోగంగా కనిపిస్తోంది’అని ఓ అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాలు అందాకే వాస్తవం వెల్లడవుతుందని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. క్యాంటిన్ సీల్ చేసి, టీ ఫ్లాస్క్ తీసుకువచి్చన క్యాంటిన్ ఉద్యోగిని పోలీసులు ప్రశి్నస్తున్నారు.