అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్‌ అయ్యాడు..! ట్విస్ట్‌ ఏంటంటే.. | How a boy who lived in orphanage Become IAS without UPSC | Sakshi
Sakshi News home page

అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్‌ అయ్యాడు..! ట్విస్ట్‌ ఏంటంటే..

Aug 22 2025 3:51 PM | Updated on Aug 22 2025 4:14 PM

How a boy who lived in orphanage Become IAS without UPSC

ఐఏఎస్‌ అయ్యేందుకు యువత ఎంతగా పరితపిస్తుందో తెలియనిది కాదు. కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఏళ్లుగా ప్రిపేర్‌ అవ్వతూ ఐఏఎస్‌ అవ్వాలని తపిస్తుంటారు. అలాంటి కలను ఇక్కడొక వ్యక్తి ఎలా సాకారం చేసుకున్నాడో వింటే విస్తుపోతారు. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ వింటే..నిజాయితీగా లభించిన ఉద్యోగం మంచిగా చేసుకుంటూ..అధికారుల మన్ననలను పొందుతూ ఊహించని విధంగా తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సక్సెస్‌ స్టోరీ ఇది.

ఈయన్ని మరో అబ్దుల్‌ కలాం అనొచ్చు. అతడే కేరళకు చెందిన అబ్దుల్‌ నాజర్‌. అతడి బాల్యం కష్టాలతో ప్రారంభమైంది. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని దూరం చేసింది. పాపం తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిమనిషిగా మారి జీవనం సాగించాల్సి వచ్చింది. రాను రాను పరిస్థితి కడు దయనీయంగా మారడంతో నాసర్‌ అతని తోబుట్టువులు అనాథశ్రమంలో పెరగాల్సి వచ్చింది. 

అంతేగాదు పదేళ్ల వయసులో కుటుంబాన్ని పోషించుకునేందుకు డెలివరీ బాయ్‌గా..ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్‌ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితక పనులు చేసుకుంటూ చదువుని సాగించేవాడు. ఇన్ని కష్టాల మధ్యలో ఎక్కడ చదువుని మాత్రం వదిలేయలేదు నాజర్‌. అలా రాష్ట్ర ఆరోగ్య శాఖలో క్లర్క్‌ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఇష్టమైన డ్రీమ్‌. అయితే అదరిలా నాసర్‌కి కూడా యూపీఎస్సీకి ప్రిపరై, సివిల్స్‌ రాయాలని ఉండేది. 

కానీ తనకున్న బాధ్యత రీత్యా అది సాధ్యపడదు. అదీగాక అంత డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకోవడం అనేది సాధ్యమై పని కాదు. అందుకని అతడు ఎంచుకున్న మార్గం వింటే వావ్‌..అని మెచ్చకోకుండా ఉండలేరు. ఎందుకుంటే తనకు లభించిన ఉద్యోగాన్నే అధికారుల మన్ననలను పొందేలా వర్క్‌ చేయాలని భావించాడు. అతడి కష్టానికి తగ్గా ప్రతిఫలం ప్రమోషన్ల రూపంలో వస్తూనే ఉండేది. అలా మొత్తం 20 ఏళ్ల అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. 

అతని అత్యుత్తమ ట్రాక్‌ రికార్డు కారణంగా 2017లో సివిల్స్‌ ఎగ్జామ్‌ రాయకుండానే ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందాడు. చెప్పాలంటే తన అచంచలమైన కృషితో అత్యున్నత అధికారి అయ్యాడు. ఈ కథ ఆలోచింప చేసేలా ఉన్నా..బహుశా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ నాసర్‌ ఈ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు దశాబ్దాల ఓపిక, అచంచలమైన కృషి, కష్టపడేతత్వం వంటివి ఆయుధాలుగా మలుచుకున్నాడనేది గుర్తురెగాలి. 

ఈ స్టోరీ కలను సాకారం చేసుకోలేకపోయామని కృశించి పోకూడదు..శక్తివంతమైన ఆలోచనా దృక్పథంతో సాధ్యమయ్యేలా చేసుకోవచ్చని తెలుపుతోంది. ఓపికతో నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటూపోతే..ఏదో ఒకనాటికి లక్ష్యానికి చేరకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అంతేగాదు పట్టుదలతో అడియాశగా మిగిలిన కలను సైతం ఆశాకిరణంగా మార్చుకోవచ్చని అబ్దుల్‌ నాసర్‌ కథే చెబుతోంది కదూ..!.

(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement