
మానిటరీ పాలసీపై ప్రజాభిప్రాయం కోరుతూ ఆర్‌బీఐ చర్చాపత్రం
ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా లేక వృద్ధికి ఊతమిచ్చేలా ఏవైనా కొత్త ప్రమాణాలను పరిశీలించాలా అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఒక చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇందులో నాలుగు ప్రశ్నలు పొందుపర్చింది.
ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఆహార, రిటైల్ ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితుల్లో మానిటరీ పాలసీకి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా? 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ వేగంగా ఎదుగుతున్న భారత్‌లాంటి దేశంలో స్థిరత్వం, వృద్ధికి మధ్య సమతౌల్యత సాధించేందుకు 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ సరైనదేనా? ద్రవ్యోల్బణ శ్రేణిని సవరించాలా? ద్రవ్యోల్బణ లక్ష్య స్థాయిని తొలగించి, కేవలం శ్రేణిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ 18లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.