
వీధి కుక్క.. చిరుత పులి.. ఒళ్లు గగుర్పొడిచే పోరాటం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాడోపేడో తేల్చుకుందామన్నట్టుగా.. చిరుత పులితోనే వీధి కుక్క పోరాటానికి దిగింది. ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఈ దృశ్యం చూసిన అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నిఫాడ్‌లో రాత్రి సమయంలో గ్రామంలోకి చేరుకున్న ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసింది. దీంతో తిరగబడిన ఆ శునకం.. పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత మెడని గట్టిగా పట్టుకుని.. తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి దూకుడుగా చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. కుక్క పులి దాడి నుంచి బయటపడింది. అయితే, చిరుత గాయపడిందా? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై స్పష్టత రాలేదు.
A stray dog and a leopard had a face off in Nashik’s Niphad, with the dog astonishingly overpowering the big cat and dragging it nearly 300 metres before it fled. The video of the encounter has gone #viral .#leopard #StrayDogs #viralvideo #Maharashtra #nashik #MaharashtraNews pic.twitter.com/wMswGJKTQv
— Salar News (@EnglishSalar) August 22, 2025