
ప్రస్తుత అవసరాలను క్యాష్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేసి లక్షలు ఆర్జించిన వాళ్లెందరో ఉన్నారు. ఇక్కడ కాస్త క్రియేటివిటీ..విభిన్నంగా ప్రత్యేకతను చాటుకోవడమే సక్సెస్ మంత్ర. అలాంటి సీక్రెట్‌ని ఫాలో అవుతూ ఇక్కడొక వ్యక్తి ఏకంగా సాప్ట్‌వేర్ ఉద్యోగులనే తలదన్నేలా లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేస్తున్నాడో వింటే తెల్లబోవడం ఖాయం. ఈ విధంగా కూడా ఇంతలా సంపాదించడం సాధ్యమేనా.. ? అనే సందేహం కలుగక మానదు.
మహారాష్ట్రకు చెందని ఒక వ్యక్తి డాగ్ వాకర్‌గా పనిచేస్తూ..రూ. 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ఎంబిఏ డిగ్రీ ఉన్న తన సోదరడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడట. అతడి సోదరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు రూ. 70 వేలు సంపాదిస్తుంటే.. ఈ వ్యక్తి మాత్రం పెంపుడు కుక్కలను టేకర్‌గా తన సోదరుడి కంటే ఎక్కువ ఆర్జించడం విశేషం. అతడు మొత్తం 38 కుక్కల సంరక్షణను చూసుకుంటాడు. ఒక్కో కుక్కకు రూ. 15 వేళు ఛార్జ్ చేస్తాడట. అలా అతడు నెలకు రూ. నాలుగు లక్షల పైనే ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
అది సాధ్యమేనా..
భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ 2026 నాటికి ₹7,500 కోట్లు దాటుతుందని అంచనా. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్లు , పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పెంపుడు జంతవుల యజమానులు డాగ్ వాకర్, సంరక్షణ నిపుణుల సేవలను కోరుకోవడంతో .. ఇప్పుడు ఇదే ..అత్యంత ఆదాయ మార్గ వృత్తిగా మారింది.
ముంబై లేదా పూణే వంటి నగరాల్లోని చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు ₹300 నుండి ₹500 వరకు వసులు చేస్తారట. రోజుకు పది నుంచి 15కు పైగా పెంపుడు జంతువుల బాధ్యత తీసుకుంటే ఇలా లక్షల్లో ఆర్జించడం సాధ్యమే అని అంటున్నారు నిపుణులు. ఆ కేర్ టేకర్లు పెంపుడు జంతువుల సంరక్షణ, డాగ్ వాకింగ్ వంటి ప్రీమియం సేవలకు అనుగుణంగా డబులు వసూలు చేయడం జరుగుతుందట.
జంతు యజమానుల నమ్మకాన్ని పొందిన జంతుకేర్ టేకర్లు, కచ్చితమైన షెడ్యూలింగ్‌తో ఈ రేంజ్‌లో డబ్బులు సంపాదిస్తారని చెబుతున్నారు. అయితే అధి మొత్తంలో ఆర్జించడం అనేది సంరక్షణ నిపుణుడి తీరు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ ఉద్యోగాలదే డిమాండ్ కాబోలు..!.
(చదవండి: ప్రపంచంలోనే అతి సన్నని కారు..! ఎంతటి ఇరుకు సందుల్లో అయినా..)