తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్ | Robotic Workshop for Telugu Students By NATS | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్

Aug 15 2025 4:36 PM | Updated on Aug 15 2025 4:36 PM

Robotic Workshop for Telugu Students By NATS

అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్‌లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై  అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్‌లో తెలిపారు. 

అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్‌లైన్ వర్క్ షాప్‌కి మేరీల్యాండ్‌తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్‌షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్‌ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement