
బహుళ ప్రజాదరణ పొందిన రియాల్టి షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17 (KBC-17)’ ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ షోకు సుదీర్ఘకాలంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నబిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాక్చాతుర్యంతో పాటు, పార్టిసిపెంట్ల ప్రతిభాపాటవాలు కూడా వీక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఎసిసోడ్‌లోని ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన పోటీదారు సాకేత్ నంద్‌కుమార్ ఒక ప్రశ్న దగ్గర ఇరకాటంలో పడిపోయాడు. అప్పటివరకు వరుసగా సమాధానాలు చెప్పి, కొన్నింటికి లైఫ్‌లైన్లను వాడుకొని సరిగ్గా రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ దగ్గర ఆగిపోయాడు. రోల్‌ఓవర్ కంటెస్టెంట్‌గా హాట్ సీట్‌లో కూర్చున్న సాకేత్ నందకుమార్ ఏకంగా ఆరు భాషలు మాట్లాడకలగడంపై బిగ్ బీ ప్రశంసలు కురిపించారు. దీంతో గెస్ట్‌ని జర్మన్‌లో స్వాగతించమని అడిగి కాసేపు సందడి చేశారు. ఇక షోలోని ప్రశ్నల విషయానికి వస్తే రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సోనార్ హాట్ సీట్ తీసుకొని రూ. 12,50,000 ప్రైజ్ మనీతో నిష్క్రమించాడు.
రూ. 25 లక్షల ప్రశ్న ఏంటి అంటే
"1932లో తన టెస్ట్ అరంగేట్రంలో, ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?" అనేది ప్రశ్న.
ఎ) ది ఓవల్ బి) మెల్బోర్న్ సి) సిడ్నీ డి) ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే అప్షన్లు ఇచ్చారు.
సమాధానం తెలియక పోవడంతో సాకేత్ చివరి లైఫ్‌లైన్‌ను ఎంచుకున్నాడు కానీ సమాధానం లభించలేదు. చివరికి ఆప్షన్ ఏ ది ఓవల్ అనే తప్పు సమాధానం చెప్పాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.

ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (1910-1952)
కాగా పంజాబ్‌కు చెందిన నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీ అలియాస్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు 1932–33లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు. బిల్ వుడ్‌ఫుల్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతమైన 102 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్‌మాన్‌తో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌న ఇబ్రహీం అలీ ఖాన్ తన ముత్తాత నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీలా ఉంటాడని భావిస్తారు.
చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
క్విజ్ మాస్టర్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకున్న సాకేత్ నందకుమార్ తాను గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా.
బిర్యానీ లవర్ : తాను బిర్యానీ ప్రేమికుడిని కాబట్టి,గెల్చుకున్న డబ్బుతో భారతదేశం అంతటా పర్యటించి దేశంలో లభించే వివిధ రకాల బిర్యానీలను రుచి చూస్తాడట. అంతేకాదు తన తల్లికి బహుమతిగా సొంత రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు.
ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు