
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.త్రయోదశి ప.12.54 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి రా.1.10 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.9.32 నుండి 11.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.49 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.52 వరకు, అమృత ఘడియలు: రా.7.01 నుండి 8.35 వరకు, మాసశివరాత్రి.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వైరం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
వృషభం... పరిచయాలు విస్తృతమవుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.
మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
కర్కాటకం... శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు.
సింహం... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
కన్య.. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు అనుకూల పరిస్థితులు.
తుల... ప్రముఖుల నుండి ఆహ్వానాలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.
వృశ్చికం... వ్యయప్రయాసలతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు, ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
ధనుస్సు... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం... వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం... నూతన పరిచయాలు. సంతోషదాకయమైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి . వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు తగ్గుతాయి.
మీనం.... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.