నేషనల్ ఇండియా హబ్ గాలా డిన్నర్‌లో యువీ సందడి | Former Indian Cricketer Yuvraj Singh At National India Hub Of Gala | Sakshi
Sakshi News home page

నేషనల్ ఇండియా హబ్ గాలా డిన్నర్‌లో యువీ సందడి

Aug 16 2025 7:45 PM | Updated on Aug 16 2025 7:57 PM

Former Indian Cricketer Yuvraj Singh At National India Hub Of Gala

అమెరికాలోని ఇల్లినాయిస్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.  చికాగోలోని నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో  జరిగిన 79వ  భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు  భారత మాజీ క్రికెటర్‌, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు.  

ఇక ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని నేషనల్ ఇండియా హబ్ నిర్వహించిన  గాలా డిన్నర్ ఈవెంట్‌ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఈవెంట్ జరిగింది.  గాలా డిన్నర్ లో భాగంగా యువరాజ్ సింగ్ తో పలు సంఘాల నాయకులు, ప్రవాసులు భేటీ అయ్యారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇండియా హబ్  ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖ డాకర్ల సహాకారంతో  ఉచిత వైద్య సేవలు అందిచనున్నారు.  ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ YouWeCan కోసం భవిష్యత్తులో  నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయటానికి ఆయన ఆసక్తి చూపించారు.  

నేషనల్ ఇండియా హబ్ వార్షిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఛారిటీ గాలా డిన్నర్  ఈవెంట్ కి విశేష స్పందన రావటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్  వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు K.K. రెడ్డి, పలువురు ప్రముఖులు, తదితరులు సంస్థ గురించి  వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా  వెల్లడించారు.  నేషనల్ ఇండియా హబ్  ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను  ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు  పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు.  ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్,  ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.  

యువరాజ్ సింగ్ తో గాలా డిన్నర్  ఏర్పాటు చేయటం  పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను  పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా  అందరికీ 79వ  భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement