breaking news
Crime News
-
పది రూపాయలు ఇవ్వలేదని తాతను చంపిన మనవడు
-
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
Hyderabad: వైద్యురాలికి వేధింపులు
బంజారాహిల్స్: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న వైద్యురాలికి అందులోనే పనిచేస్తున్న యువకుడి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే వైద్యురాలు (41) ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నారు. 2021 సంవత్సరంలో సెంటర్ సూపర్వైజర్గా నామాల వెంకటేష్ వంశీని నియమించుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలితో పరిచయం ఏర్పడగా.. ఆమె ఫోటోలు తీస్తూ నానా రకాలుగా వేధించసాగాడు. గత ఏడాది నుంచి వెంకటేష్ వంశీ బాధిత వైద్యురాలిని అనుసరిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత అక్టోబర్‌లో ఆమె అపార్ట్మెంట్లోకి కూడా చొరబడి కారును ధ్వంసం చేశాడు. ఆమె అర్ధనగ్న ఫోటోలను, వీడియోలను బంధు మిత్రులకు వాట్సప్‌లో షేర్ చేశాడు. దీంతో తనను వేధిస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంకటేష్‌వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 77, 78 (1)(2), 79, 351 (2), 324 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
హైదరాబాద్ లో దారుణ హత్య..
-
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్‌పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
ప్రాణం మీదకొచ్చిన పార్టీ
బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్ లేఔట్‌లోని ఓ హోటల్లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్ వేసుకుని కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది. లంచం అడిగారు హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్ హెచ్ఏల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
కోడలిని కొట్టి కొట్టి చంపి.. సూసైడ్ గా చిత్రీకరణ
-
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్‌ప్లస్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
మొదటి భర్త కొడుకుని నెలకేసి కొట్టిన రెండో భర్త..
-
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.ఏం జరిగింది..సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్‌డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.లీలాలో పరివర్తన..నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్‌లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్‌తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్‌లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్‌లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్‌లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్‌వాక్ కోచ్‌గా మారి.. అనేక మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్‌పేటలో కిరాతకం -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
కంఠం కొరికి చంపేశాడు..?
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని బెలమర గ్రామంలో దండుపాటి అప్పమ్మ(68) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలాకి పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలి కుమారుడు మద్యానికి బానిసగా మారి భార్యాపిల్లలకు దూరంగా తల్లి అప్పమ్మ వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. తల్లీకొడుకులపై కోడలు అనురాధ గతంలో వేధింపుల కేసు పెట్టడంతో ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్పమ్మ కంఠంపై గాయంతో మృతిచెందటంతో కొడుకు వెంకటరమణ మద్యం మత్తులో తల్లి కంఠం కొరికి చంపినట్లు ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతురాలు అప్పమ్మకు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయని, దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
మరదల్ని ఎందుకు చంపాడంటే!
బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్‌కు మద్యం అలవాటు ఉంది. తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి
హైదరాబాద్: పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాంనగర్‌కు చెందిన చాకలి గోపాల్, శైలజ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఎయిర్‌పోర్టు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా శైలజ వారు నివాసం ఉండే అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తుంది. గోపాల్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి శైలజను వేధిస్తున్నాడు. దీనిపై ఇటీవలే ఆమె సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తిరిగి ఇంటికి వచి్చంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పుల్లుగా మద్యం తాగి వచి్చన గోపాల్ భార్యతో గొడవకు దిగి..వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 నుంచి 25 కత్తిపోట్లు పొడవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. పిల్లలు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన గోపాల్ అనంతరం పారిపోయాడు. శైలజ అరుపులకు బయటకు వచి్చన చుట్టుపక్కల వారు ఆమెను అంబర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాంచంద్రారెడ్డి కేసు నమోదు చేసి..మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్‌లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్‌కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరుపతి సంస్కృత వర్సిటీ కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity) లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్‌లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. తిరుపతి వెస్ట్ స్టేషన్ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్‌లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. పార్లమెంట్లో ఆందోళన.. తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు. -
హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు
మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్‌కు చెందిన జోంద్లే సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్లో టీ స్టాల్ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్ పక్కనే ఉన్న రాడ్‌తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుండెపోటు కాదు.. ఆత్మహత్యే
కొండాపూర్(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్ మండలం మద్వార్కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
కారులో పట్టుబడ్డ 20 కోట్ల నగదు ఎవరిది?
సాక్షి, పుట్టపర్తి: ఓ కారు.. ఇద్దరు వ్యక్తులు.. రూ.కోట్ల నగదు.. పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి స్వా«దీనం చేసుకున్నారు. కానీ విషయం బయటకు చెప్పలేదు. ఎలాగోలా బయటకు వచ్చి హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సోమవారం పెనుకొండ సీఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ సమీపంలోని ఓ ప్రాంతంలో ధ్వంసమైన కారులో నుంచి రూ.1.20 కోట్ల నగదు స్వా«దీనం చేసుకున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ డబ్బు ఎవరిదన్నది మాత్రం తెలపలేదు. అన్నీ అనుమానాలే..పోలీసులు స్వా«దీనం చేసుకున్న డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు. రూ.20 కోట్ల వరకు కారులో ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది అనుమానాలకు తావిస్తోంది. డబ్బు బడా వ్యాపారవేత్తలదా? రాజకీయ నాయకులదా అన్నది వారం రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం తమ అదుపులో ఉన్న వారెవరన్న విషయాన్నీ మీడియాకు వెల్లడించలేదు. గోరంట్ల పోలీసులకు సమాచారం.. ‘కియా’ స్టేషన్లో కేసు పెనుకొండ శివారులోని జాతీయ రహదారిపై ద్వంసమైన కారులో నగదు పట్టుబడినట్లు సోమవారం పెనుకొండ సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవన్ మీడియాకు తెలిపారు. తొలుత పెనుకొండ సమీపంలో ధ్వంసమైన ఓ కారులో డబ్బు ఉందంటూ గోరంట్ల పోలీసులకు సమాచారం అందిందని, అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బు స్వా«దీనం చేసుకున్నారని, అయితే అది కియా పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో ఇక్కడ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇదంతా నిజమే అయితే ఆ డబ్బు ఎవరిది? పోలీసుల అదుపులో ఉన్న ఆ ఇద్దరు ఎవరన్నది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కారులోని వ్యక్తులే సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కియా స్టేషన్ పోలీసులకు లేదా పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా గోరంట్ల పోలీసులకు ఎందుకిచ్చారు? ఈ అంశంలో గోరంట్ల పోలీసుల ప్రమేయం ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. హవాలా డబ్బేనా? పెనుకొండ పరిధిలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపకాల్లో తేడా కారణంగా హవాలా మనీ గురించి తరలిస్తున్న వారే బయట పెట్టారా? లేక దారిదోపిడీదారులు వెంబడించి ఎత్తుకెళ్లారా? అనేది సస్పెన్స్‌గా మారింది. విచారణ చేస్తున్నాం ఈ నెల 5న సూరత్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారును స్వా«దీనం చేసుకుని..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కియా పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేపట్టాం. డబ్బు ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోతుగా విచారణ చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. కారులో డబ్బు తీసుకెళ్తుండగా.. కొందరు దుండగులు దారి కాచి దోపిడీ చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గోరంట్ల పోలీసులను ఆశ్రయించగా.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారుతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారణ చేయగా.. డబ్బు తమదేనని చెబుతున్నారు. అయితే అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం.’ – రాఘవన్, పెనుకొండ సీఐ -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్‌కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
ఖాకీ తండ్రి... కంత్రీ కొడుకు
సాక్షి, నరసరావుపేట: పెడదారిపడుతున్న కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన తండ్రి తనయుడి మోసాలను చూసీచూడనట్టు వదిలేశాడు. కన్న పేగు మమకారంతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే నమోదైన కేసుల్లో బయటపడేలా చేస్తుండటం ఆ కొడుకు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటుపడిన ఓ ఏఎస్ఐ కొడుకు చేసిన నిర్వాకానికి ఏకంగా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠా జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నగదు వసూలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది. నకిలీ రవాణాశాఖ అధికారుల పేరుతో... చిలకలూరిపేట బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వినుకొండ రూరల్ మండలంలో అయ్యప్పస్వామి భజనకు హాజరుకావడానికి గుంటూరు నుంచి వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాలర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాలర్‌ను ముందుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఆపడంతో ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ట్రాలర్‌ను ఆపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు, చిన్న తురకపాలేనికి చెందిన ఎస్కే బాషా, బాలయ్యనగర్‌కు చెందిన వెంకట్రావ్, నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గోపి, మహేష్ లు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నలుగురు తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, ఒకరు మాత్రం నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. హైవేపై వెళ్తున్న లారీలను రవాణాశాఖ అధికారుల పేరిట ఆపి నగదు వసూలు చేయడం కోసమే ఆపాం అని, అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చినట్టు తెలియవచ్చింది. పోలీసు దందాలకు నాయకుడు రౌడీషిటర్ ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడిపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో రౌడీషిట్ నమోదై ఉంది. పదుల సంఖ్యలో చీటింగ్, చోరీలు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపరణలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి రౌడీషిటర్లను తరచూ పోలీసుస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండాలి. ఈ పోలీసు కంత్రీ కుమారుడిని ఇటీవల కాలంలో స్టేషన్‌కి పిలిచి కౌన్సెలింగ్ చేపట్టిన దాఖలాలు లేవని రూరల్ పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తండ్రికి ఉన్నతాధికారులతో ఉన్న సత్ససంబంధాలతో రౌడీషిటర్ల కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సెట్ చేశారట. గతేడాదిగా సదరు రౌడీషిటర్‌తో పోలీసు ఉన్నతాధికారులు మామూళ్ల వసూళ్లకు ఏజెంట్‌గా నియమించినట్టు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లను ఈ రౌడీషిటరే తండ్రి తరపున వెళ్లి బెదిరించి మరీ వసూళ్లు చేసేవాడని పోలీసు వర్గాలే చెప్పుకొస్తున్నాయి. తమ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అండతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారని, అయినా ఏం చేయలేక మిన్నుకుండిపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సదరు ఏఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కోటప్పకొండ వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన ఘటనలో తండ్రీకొడుకులను శిక్షించి ఉంటే ఈ సమస్య వచ్చేంది కాదని అంటున్నారు. ఇతని బా«ధితులు నరసరావుపేటలో పదుల సంఖ్యలో ఉన్నా తండ్రి అధికారంతో బా«ధితులు బయటకు రావడానికి భయపడుతున్నారు. -
వీధికుక్కలు వెంబడించడంతో స్కూటరిస్టు మృతి
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. రాయచోటిలోని కొత్తపేటలో నివాసం ఉండే ఫజల్ (42) ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాలివీడు రోడ్డులో ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవాలని బైకును వేగంగా నడిపాడు. అయినా కుక్కలు విడిచిపెట్టలేదు. దీంతో వేగాన్ని అదుపుచేసుకోలేక ఎదురుగా ఉన్న గుడి గోడను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాయచోటిలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చలనం లేదని వాపోతున్నారు. -
పాతికేళ్ల నాటి పగ!
సాక్షి, సిటీబ్యూరో/జవహర్‌నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్‌ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. అప్పట్లో డాన్‌గా వ్యవహరించిన సుదేశ్ సింగ్... నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్‌గా చెలామణి అయ్యాడు. మంగళ్‌హాట్, ధూల్‌పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్‌్కఫోర్స్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు. వెంకటరత్నంనే ఇన్ఫార్మర్గా అనుమానించి... ఈ ఎన్‌కౌంటర్‌తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్‌లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్‌కు డ్రైవర్‌గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి... చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్‌గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.కాపుకాసి దారుణంగా హత్య చేసి..నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. -
తల్లిదండ్రుల ఎదుటే గొంతు కోసి ఘాతుకం
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్‌కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్‌గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్‌తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు. సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
HYD: రియల్టర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
నా కూతురు మృతికి అల్లుడే కారణం
దుబ్బాకరూరల్: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులకు తరుచు తెలుపడంతో నచ్చజెప్పేవారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్‌కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్‌కుమార్ హరీష్‌కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్‌కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్‌కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్‌కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్..
శామీర్‌పేట్: ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టిన ఘటన శనివారం శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ ఉత్తమ్ సోనె (31), స్థానికంగా నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా ట్రాక్టర్ నడుపుతూ వెళ్తుండగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్జె 17 జిబి 0546 నంబరు గల లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందిగా మరో వ్యక్తి జగదేవ్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ట్రాక్టర్‌ను లారీ వెనక నుండి అతివేగంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచి్చందని, దీన్ని బట్టి లారీ వేగాన్ని అంచనా వేయొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై సుమారు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాక్టర్ భాగాలను రోడ్డుపై నుండి తొలగించారు. ప్రమాద తీవ్రతకి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు. -
మిత్రుల కళ్ల ముందే.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్మెట్లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్‌ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్‌ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది. దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్‌ను రప్పించిన మిత్రులు రవిశంకర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్‌పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
గలీ గలీ మే చోర్ హై!
పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్‌స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్‌లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్.. లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు. -
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
కడప పోక్సో కోర్టు కీలకతీర్పు
కడప అర్బన్: కడప పోక్సో కోర్టు కీలక తీర్పునిచ్చింది. లైంగిక దాడికేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 10,000/– జరిమానా విధించింది. అంతేగాక గుంతకల్ డీఆర్ఎం బాధితురాలికి రూ.10.50లక్షల పరిహారం చెల్లించాలని కడప పోక్సో కోర్టు జడ్జి సి. ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.వివరాలు..2019 జనవరి 27వ తేదీన తిరుపతి– నిజామాబాద్ (రైలు నంబర్ 12793) రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని బి–2 కోచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక ప్రయాణిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో బోగీలోని టాయ్‌లెట్‌కు ఒంటరిగా వెళ్లింది. అదే రైలులో ఉన్న నిందితుడు ఆమెను వెంబడించి, టాయిలెట్ లోపలికి నెట్టి, లైంగిక దాడికి పా ల్పడ్డాడు.చిన్నారి కేకలు వేయగా తల్లిదండ్రులు, ప్రయాణికులు తలుపు తట్టడంతో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడు.ప్రయాణికులు నిందితుడిని ఎస్1 కోచ్‌లో పట్టుకుని, డ్యూటీలో ఉన్న టీటీఐకి అప్పగించారు. రైలు కడప రైల్వే స్టేషన్లోప్లాట్ఫాం నంబర్ 3కి చేరుకున్నప్పుడు, నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, సికింద్రాబాద్ ఆర్పీఎస్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు అధికార పరిధి ఆధారంగా కడప ఆర్పీఎస్కు బదిలీ చేశారు. రైల్వే డీఎస్పీ (రిటైర్డ్) రమేష్ ఈ కేసు (క్రైం.నంబర్.08/2019)ను దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు గాలి రామ్ ప్రసాద్ రెడ్డిని 2019 ఫిబ్రవరి 5న అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.కడప పోక్సో కోర్టు ఆదేశాలతో గాలి రామ్‌ప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి(28)కి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఈ ఘటన జరిగిన తేదీన విధుల్లో ఉన్న టీటీఐ (ట్రావెలింగ్ టికెట్ ఇ¯న్స్పెక్టర్)పై శాఖాపరమైన చర్యలకు న్యాయస్థానం సిఫార్సు చేసింది. ఈ కేసును కడప పోక్సోకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, అప్పటి పీపీ సానేపల్లి రామసుబ్బారెడ్డి వాదించారు. ఈ కేసు వివరాలను కడప రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. -
వికృత చేష్టలకు బలైన విద్యార్థిని
ఆ చిన్నారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కనింది. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. తనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే వ్యయప్రయాసల కోర్చి ధర్మవరానికి వెళ్లి మరీ చదువుకునేది. కానీ బస్సులో ఓ విద్యార్థి తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్న ఆ విద్యార్థిని ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. బుధవారం సాయంత్రం జీవితాన్ని ముగించింది.సత్యసాయి జిల్లా: మండల పరిధిలోని పులేటిపల్లికి చెందిన స్పందన(17) ధర్మవరంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఎనిమిది రోజుల క్రితం కళాశాలకు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి ఆమెతో ఆసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని మందలించింది. దీంతో పట్టరాని కోపంతో ఆ విద్యార్థి బస్సులో ప్రయాణికుల ముందే స్పందనపై రెండుసార్లు దాడి చేశాడు. ఘటనపై స్పందన ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమ పరిధిలోకి రాదని తప్పించుకున్నారు. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా.. అతడిని పిలిపించి మందలిస్తామన్నారు. ఓ బాలికపై భౌతిక దాడి చేస్తే మందలిస్తారా.. అంతేనా.. అని బాధపడిన చిన్నారి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసిన బాలిక చివరకు మృత్యువు ఒడిలోకి చేరింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లుగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒకేసారి అన్నదమ్ములను కాటువేసిన పాము
అనంతపురం: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రాణాపాయ స్థితిలో.. అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్‌ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో..
సిద్దిపేట జిల్లా (గజ్వేల్): ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18) ఇంటర్మీడియెట్ చదివి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళుతోంది. ఇదిలా ఉండగా శంకర్ కుటుంబీకుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేశ్ అలియాస్ రహీం బాబా వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో శ్రావణికి మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ఒకరినొకరు ఇష్టపడే స్థాయికి చేరింది. కాగా, నవంబర్ 30న మహేశ్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రావణి మానసికంగా కుంగిపోవడాన్ని గమనించిన తండ్రి శంకర్ ఆరా తీయగా మహేశ్‌ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో శ్రావణి బుధవారం ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆమె తమ్ముడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వెంటనే ఇంటికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. ఈ ఘటనపై శ్రావణి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇందిరమ్మ చీరతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
చిన్నశంకరంపేట (మెదక్): బిడ్డను తన నుంచి వేరు చేస్తారనే ఆందోళనతో రెండేళ్ల బిడ్డకు ఉరివేసి.. తాను ఉరివేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల ఆఖిల చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం కాగా, మేనమామ సిద్దాగౌడ్ వద్ద పెరిగింది. రెండేళ్ల క్రితం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్‌గౌడ్ నిద్రలో హఠాన్మరణం చెందాడు. అప్పటికే వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. భర్త దశదిన కర్మ నుంచే బిడ్డను మాకు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవాలంటూ అఖిలకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన బిడ్డను వదిలేదిలేదన్న అఖిల.. మేనమామ ఇంటి వద్దనే ఆరు నెలలుగా జీవిస్తుంది. అత్తింటి వారు మరోసారి సంకాపూర్‌లో ఉన్న కోడలు వద్దకు వెళ్లి ఇందిరమ్మ చీర వచ్చింది తీసుకెళ్లాలంటూ ఆదివారం అత్తింటికి తీసుకువచ్చారు. ఏమైందో ఏమో కానీ మంగళవారం ఉదయం అత్త ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్న సమయంలో తన రెండేళ్ల కుమారుడు రియన్స్‌కు ఉరివేసి, అదే చీరతో తాను ఉరివేసుకుని అఖిల ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మృతురాలి మేనమామ సిద్దాగౌడ్ అత్తింటి వేధింపులే తన మేనకోడలు, మనవడి మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డను వేరుచేయాలనే అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే తన మేనకోడలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి అత్తమామలపై కేసు నమోదు చేశారు. -
తల్లితో వివాహేతర బంధం పెట్టుకొని.. బిడ్డను గర్భవతిని చేసి..
మహబూబాబాద్ జిల్లా: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడు. మళ్లీ ఆ తల్లి సాయంతోనే అబార్షన్ చేయించాడు. ఈ ఘటన ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం వెలుగు చూసింది. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌కు చెందిన సైదులుబాబు స్థానికంగా ఉన్న మరో కాలనీకి చెందిన ఓ వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో రెండు నెలల కిందట తల్లి సహాయంతో బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేయటంతో సఖి కేంద్ర నిర్వాహకులకు విషయం తెలిసింది. బాలికను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక.. తనకు అబార్షన్ చేయించిన విషయం చెప్పడంతో వారు బయ్యారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన సైదులుబాబుపై పోక్సో కేసు నమోదు చేయగా, అబార్షన్‌కు సహకరించిన బాలిక తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు. -
భార్య కొత్త చీర కట్టిందని కోపంతో భర్త ఏం చేసాడంటే
టేక్మాల్ (మెదక్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చంపి, ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బరి్ధపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (37), మంజుల (35) దంపతుల కుమారుడు ప్రవీణ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో చికిత్స కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించారు. అయితే భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం ఈ ఏడాది దసరా పండుగ సమయంలో సొంత గ్రామమైన బర్దిపూర్కు మకాం మార్చాడు. ఈ విషయమై తరచుగా గొడవపడుతుండగా గత నెల టేక్మాల్ పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. భార్యపై అనుమానంతో శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు. తన భార్యను చంపేస్తానని, తనను తలెత్తుకోలేకుండా చేస్తోందని తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ అమ్మమ్మ ఊరికి వెళ్లడంతో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజుల ముఖంపై దిండు పెట్టి శ్వాసఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దూలానికి తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్ఐ అరవింద్, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ కృష్ణ ఆధారాలను సేకరించారు. -
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్‌షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్‌కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్‌మెంట్‌కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్‌మెంట్‌కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్‌కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్‌కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్‌లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
Khammam: సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టితో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు 9 ఏళ్ల బాలుడు ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానిక అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంగా చూపే పకడ్బందీ ప్లాన్ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.గత నెల (నవంబర్ 29, శనివారం) రాత్రి టిప్పర్‌తో పెద్దన్న వెంకటేష్‌ను ఢీకొట్టాడు. టిప్పర్ బ్రేక్‌డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దంపతులను బలిగొన్న పొగమంచు
కర్ణాటక: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్‌రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నగరంలోని డాన్‌బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అరి్పంచారు. -
హనుమకొండలో నర్సింగ్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్‌టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్‌పై నుంచి యాసిడ్ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్ దాడితో నగరం ఉలిక్కిపడింది. -
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
రంగారెడ్డి జిల్లా: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్‌దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు.నవనీత్‌దత్త ఐఓసీఎల్ ప్లాంట్‌లో డ్రైవర్‌గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ధనుంజయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్‌కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్‌ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. సక్షమ్‌పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్‌ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్‌ను చంపేసెయ్ అని హిమేశ్‌ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్‌ను చంపేశాక పోలీస్‌స్టేషన్‌కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్‌ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్‌ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
వికారాబాద్ జిల్లాలో దారుణం.. భార్యను చంపిన భర్త
వికారాబాద్ జిల్లా: కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమెపై దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
వాట్సాప్ స్టేటస్‌గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లి, కుమారుడిపై హత్యాయత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కుమారుడు సాంబశివరావు మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.దోసకాయలపల్లిలో దారుణం..తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఎన్నారై భాస్కర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా యాక్టివిస్టు, ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ కేసులో విజయవాడ కోర్టు శనివారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాలపాటి భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. అయితే, జగన్ అభిమాని అయిన భాస్కర్.. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్.. కక్ష సాధింపు చర్యలకు అదను చూసింది. నవంబర్ ఒకటవ తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో.. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డి తన సోదరుడు ఓబుల్ రెడ్డితో కలిసి నవంబర్ 6వ తేదీన ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆపై తప్పుడు పోస్టులు చేశానని ఒప్పుకోవాలంటూ ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే బెదిరింపులకు దిగారు. అంతేకాదు.. తనని తీవ్రంగా కొట్టారంటూ భాస్కర్‌రెడ్డి మీడియా ఎదుట వాపోయారు కూడా. ఇదిలా ఉంటే.. బెయిల్ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
తలుపులు మూసి.. ప్రేమ జంటను దాచి..!
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సినీ ఫక్కీలో హైడ్రామా నడిచింది. వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించగా.. యువతి బంధువులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఆ జంటను కాపాడేందుకు పోలీసులు శాయశక్తుల కృషి చేశారు. స్థానికంగా బాపునగర్‌కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. ఆపై ప్రాణ రక్షణ కోరుతూ నూజివీడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సమాచారం అందుకున్న యువతి తరపు బంధువులు.. పీఎస్ వద్దకు భారీగా చేరుకున్నారు. పట్టరాని కోపంతో పోలీసులు పక్కకు నెట్టేసి ఆ జంటపై దాడికి దిగారు. యువకుడిని చితకబాదుతుండడంతో పోలీసులు బంధువుల్ని అదుపు చేసి ఆ జంటను లోపలికి తీసుకెళ్లారు. స్టేషన్ తలుపులు, గేట్లు మూసేసి వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. గేట్లు ధ్వంసం చేసుకుని మరీ పీఎస్‌లోకి చొరబడేందుకు యువతి బంధువులు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య
బెంగళూరు: తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదగిరికి చెందిన బసవరాజు(28), శరణమ్మలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం బెంగళూరు వచ్చి తిగళరపాళ్యలో నివసిస్తున్నారు. ఈక్రమంలో శరణమ్మకు వీరభద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి బసవరాజు ఎప్పటికైనా అడ్డు వస్తాడని భావించిన శరణమ్మ వీరభద్రతో కలిసి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పడుకున్న బసవరాజు తలపై పెద్ద బండరాయి వేసి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని తీసికెళ్లి గంగొండనహళ్లి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. శరణమ్మతోపాటు ఆమె ప్రియుడు వీరభద్ర, అనిల్ అనే నిందితులను అరెస్టు చేశారు. -
దొంగ పోలీసు..ఇంట్లో రోలెక్స్ వాచ్ కాజేసిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా చెలామణి అయి, వసూళ్లకు పాల్పడిన బత్తిని శశికాంత్ ఇంట్లో సోదాల సమయంలో ఓ వాచీ చోరీ చేసిన పోలీసు ‘దొంగ’ని ఫిల్మ్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశాడు. ఇతడు సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ (సీఏఆర్) విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్.శరణ్ కుమార్‌గా తేలింది. ఇతడు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ ఇన్స్పెక్టర్ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. బిల్డర్లు, బడాబాబులకు టోకరా వేసి భారీగా వసూళ్లు చేసిన శశికాంత్ షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్మెంట్స్లోని ఖరీదైన ఫ్లాట్‌లో నివసించాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు బుధవారం తెల్లవారుజామున శశికాంత్ ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో వీడియో రికార్డింగ్ విధుల్ని శరణ్ నిర్వర్తించాడు. సోదాల సమయంలో ఈ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్‌రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచీపై పడ్డాయి. దీంతో దాన్ని అతగాడు తస్కరించి తన జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం మొత్తం మరో కానిస్టేబుల్ రికార్డు చేసిన వీడియోలో చిక్కింది. అలా ఈ పోలీసు ‘దొంగతనం’ వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ అనంతరం ఫిల్మ్‌నగర్ ఠాణాలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానిస్టేబుల్ శరణ్ కుమార్ ఏ వాచీ అయితే అత్యంత ఖరీదైందని భావించి, చోరీ చేసి, అరెస్టు అయ్యాడో..ఆ వాచీ ఒరిజినల్ రోలెక్స్ కాదని, ఇమిటేటెడ్ కాపీ పీస్ అయి అధికారులు తేల్చడం కొసమెరుపు. -
ఎయిర్‌హోస్టెస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన
శంషాబాద్: విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఏఐ–2204 విమానం తెల్లవారు జామున 4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ప్రయాణ మార్గమధ్యలో సీటు 17సీ సీటులో కూర్చున ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ను పలుమార్లు చేతితో తాకాడు. మద్యం మత్తులో ఉన్న అతను పొరపాటున తాకి ఉండవచ్చని విమానం సిబ్బంది భావించారు. విమానం దిగే సమయంలో తన సీటులో పాస్‌పోర్టును మరిచిపోయినట్లు సదరు ప్రయాణికుడు చెప్పడంతో సిబ్బంది మరోమారు అతడి సీటు వద్దకు వెళ్లగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది గురించి తెల్లకాగితంపై అసభ్యకరంగా రాయడంతో పాటు దూషించినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఎయిర్‌లైన్స్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా ప్రయాణికులు అసభ్య ప్రవర్తించినా.. సిబ్బంది దూషించినా.. ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. -
6ఏళ్ళ ప్రేమ.. మోసం చేసిన ప్రియురాలు
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ వద్ద పోలీసు వాహనంపై శవం ఉన్న ఫ్రీజర్‌ను ఎక్కించి నిరసన తెలిపారు. ఆత్మ హత్యకు పాల్పడిన యువకుని కేసులో.. పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ (29) యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోడానికి ఇటీవలే ఇంటికి వచ్చాడు. తనను వివాహం చేసుకోవాల్సిన అమ్మాయి.. ఆమె తల్లిదండ్రుల సూచనతో ఈనెల 7న మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఒకరోజు ముందే శ్రీకాంత్ పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసి యువకుడిని హైదరాబాద్ తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యు లు.. శుక్రవారం శ్రీకాంత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు దోంచందలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు యువకుని మృతదేహంతో దోంచంద నుంచి ఏర్గట్ల వరకు ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు తాళ్లరాంపూర్ వద్దనే అడ్డుకోవడంతో పోలీసు వాహనంపై శవం ఉన్న ప్రీజర్ను ఎక్కించి నిరసన తెలిపారు. కొద్ది సేపటి తర్వాత మృతదేహంతో ఏర్గట్ల వరకూ చేరుకుని బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
చెడు అలవాట్లు వద్దన్నందుకు సీపీఎం నేత హత్య
నెల్లూరు సిటీ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణహత్య జరిగింది. పిల్లలతో స్కూటీపై వెళుతున్న సీపీఎం నాయకుడు కొట్టివిడి పెంచలయ్య (38)ను కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికులు, డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ ట్రెజరర్‌గా ఉన్న పెంచలయ్య ఎల్రక్టీíÙయన్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సీపీఎం నాయకుడైన అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఆరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇవ్వడం, దొంగతనాలకు పాల్పడేవారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య ఆమెను పద్ధతి మార్చుకోమని మందలించాడు. గంజాయి విక్రయిస్తున్న యువకులను అలా విక్రయించవద్దని చైతన్యవంతం చేసేందుకు ప్రయతి్నంచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్నాడు. తమ వ్యాపారాలకు అడ్డువస్తున్నాడని పెంచలయ్యపై కామాక్షి కక్షపెంచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెంచలయ్య పిల్లలతో స్కూటీపై వెళుతుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద తొమ్మిదిమంది దుండగులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కత్తులు తీసి పెంచలయ్యను వెంటాడి పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వేణు, ఎస్ఐ లక్ష్మణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కామాక్షి తన బంధువులు, చెడునడతగల యువకులతో పెంచలయ్యను హత్య చేయించినట్లు డీఎస్పీ తెలిపారు. -
HYD: గవర్నర్ ప్రోగ్రామ్‌లో ఫేక్ రిపోర్టర్లు!
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా వైఫల్యం బయటపడింది. రిపోర్టర్ల ముసుగులో ఆగంతకులు పోలీసుల కళ్లు గప్పి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ ఆవాస హోటల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఏకంగా 8 నేషనల్ మీడియా చానెల్స్‌కు చెందిన లోగోస్ పట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. అతని వెంట మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఒరిజిల్ నేషనల్ మీడియా ప్రతినిధులు ఆ ఇద్దరి కదలికలపై అనుమానంతో ప్రశ్నించారు. చివరకు నకిలీ రిపోర్టర్లుగా నిర్ధారించుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు.. ఎంక్వైరీ ప్రారంభించారు. -
ఆపరేషన్ ఢిల్లీ.. తెలంగాణ ఈగల్ టీం బిగ్ సక్సెస్
హైదరాబాద్: దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీమ్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో కీలక ఆధారాలను సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తున్న డ్రగ్స్ దందాను గుర్తించిచామన్న అధికారులు.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులను విచారించగా ఈ డ్రగ్స్ మాఫియా బయటపడింది. ఢిల్లీలో 20 ప్రాంతాలతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో తనిఖీలు నిర్వహించాం. ఒక్క ఢిల్లీలోనే 16 విక్రయ కేంద్రాలను గుర్తించాం. యాభై మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లలో చాలామందిని డిపోర్ట్ చేయించే ఉద్దేశంలో ఉన్నాం. నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో ఈ దందా నడిచింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది ఈ నెట్వర్క్. ఇప్పటిదాకా సుమారు 2 వేల మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించాం. ప్రముఖ కొరియర్, పార్శిల్స్ సర్వీసులతోనే ఈ వ్యవహారం నడిచింది. గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూల మధ్యలో ఉంచి పంపిణీ చేశారు.వందలాది మ్యూల్ అకౌంట్లు చేర్పాటు చేసి లావాదేవీలు నడిపారు. సుమారు 2,000సార్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. 59 మ్యూల్ అకౌంట్లు సీజ్ చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్‌కు చెందిన 11 మంది డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించి అరెస్ట్ చేశాం అని ఈ భారీ ఆపరేషన్ వివరాలు మీడియాకు వెల్లడించారు. -
సోదరుని పెళ్లికి హాజరై వస్తుండగా..
ఒడిషా: తన సోదరుడి పెళ్లి చూసి ఎంతో ఉత్సాహంగా ఇంటికి తన స్నేహితులతో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై సోదరి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాత్రికేయులతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సంబల్పూర్ జిల్లాలోని కటర్బాగ్ సమితి పరిధిలోని కుసుందీహి గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ట్రెజరీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న పాత్రికేయుడు గొపినాథ్ గౌడోకు బుధవారం సంబల్పూర్లోని కుచేండ వద్ద వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపినాథ్ సోదరి జోత్స్నరాణి గౌడో (35)తో సహా పాత్రికేయులు సుప్రియా షడంగి, శక్తిదాస్ బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు. వివాహం పూర్తయి తిరిగి ఇంటికి బంధుమిత్రులతో పాటు వధువును తీసుకువస్తున్న సమయంలో బొలేరోలో ప్రయాణం చేస్తున్న జోత్స్నరాణి గౌడో, సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లు ఉన్నారు. సంబల్పూర్కు కొద్ది దూరం చేరేసరికి కుసుం«దీహి గ్రామ సమీపంలో వాహభం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో జోత్స్నరాణి గౌడో సంఘటన స్థలం వద్దే మృతి చెందగా సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బుర్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో సుప్రియ షడంగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. వాహనంలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన జోత్స్నరాణి గౌడో మృతదేహాన్ని గ్యాస్ కటర్లతో తొలగించి పోస్టుమార్టం కోసం సంబల్పూర్కు తరలించారు. అండగా జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘం జరిగిన సంఘటనను తెలుసుకున్న పాత్రికేయుల సంఘం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. మృతదేహాన్ని సంబల్పూర్ నుంచి రాయగడకు తరలించేందుకు జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘానికి చెందిన శివాజీదాస్, సంగ్రామ్ పటా్నయక్, శివనారాయణ గౌడో, ఆశీష్ రంజన్ పండ తదితరులు జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోను గురువారం సంప్రదించారు. అనంతరం ఆయన చొరవతో సంబల్పూర్ కలెక్టర్‌ను సంప్రదించి మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. అలాగే తీవ్రగాయాలకు గురై విశాఖలో చికిత్స పొందుతున్న సుప్రియా షడంగికి ఆర్థికంగా ఆదుకునేందకు సంఘం ముందుకు వచ్చింది. -
బాలిక.. బావిలో శవమైతేలింది..!
అభం శుభం తెలియని అమాయకురాలు.. తల్లిదండ్రుల గారాల పట్టి.. ఆస్తి పాస్తులు లేకపోయినా.. ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నారు. ఎవరితోనూ వారికి గొడవలు లేవు.. ఆస్తి తగాదాలూ లేవు. కానీ, మూడు రోజుల క్రితం (సోమవారం సాయంత్రం) వారి ఏడేళ్ల కూతురు అదృశ్యమైంది. ఆరుబయట ఆడుకుంటుందని తల్లిదండ్రులు భావించారు. 7 గంటల ప్రాంతంలో భోజనం కోసం పిలుద్దామని వెళ్లగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఎక్కడున్నా తమ కూతురు క్షేమంగా వస్తుందని భావించిన ఆ తల్లిదండ్రులకు గురువారం ఉదయం గుండెలు పగిలే సమాచారం అందింది. అదృశ్యం కాస్త విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన కూతురు బావిలో శవమై తేలింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకుంది.ఆదిలాబాద్ జిల్లా: నంబాల గ్రామానికి చెందిన శనిగారపు శేఖర్–రజిత దంపతులు. వారికి కుమారుడు, కూతురు మహన్విత(7) సంతానం. శేఖర్ మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. రజిత కూలీ పనులు చేస్తుంది. ఇద్దరూ తమ ఇద్దరి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న (సోమవారం) మహన్విత ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఆచూకీ కోసం గాలించారు. కూతురు తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. బావిలో శవమై..కానీ అదృశ్యమైన మహన్విత గురువారం నంబాల గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. విషయం తెలిసిన వెంటన గ్రామస్తులతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బారీగా తరలివచ్చారు. బాలిక మృతిపై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను ఎవరో చంపి బావిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహసీనొదీ్దన్, సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. డాగ్‌స్కా్వడ్‌తో తనిఖీలు నిర్వహించారు. క్లూస్‌టీంతో ఘటన స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.గ్రామంలో విషాదం..మహన్విత ప్రాణాలతో కనిపిస్తుందనుకుంటే ఇలా గ్రామసమీపంలో వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో, అక్కడికి వచ్చిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలం వద్ద రోదించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు
కర్ణాటక: భర్త వేధింపులను తట్టుకోలేక భద్రా నీటి కాలువలోకి దూకిందో నవ వివాహిత. జిల్లాలో భద్రావతి తాలూకా సిద్ధాపుర వద్ద ఈ సంఘటన జరిగింది. తన బాధను హృదయవిదారకంగా డెత్‌నోట్‌లో రాసిపెట్టింది. వివరాలు... భద్రావతి తాలూకా డీబీ హళ్లికిచెందిన పరమేశ్వర, రుద్రమ్మ దంపతుల కుమార్తె లత (22). ఈ ఏడాది ఏప్రిల్‌లో శికారిపుర తాలూకా దిండదహళ్లి గ్రామానికి చెందిన గురురాజ్‌తో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లిచేశారు. విద్యుత్ శాఖ (కేపీసీఎల్)లో గురురాజ్ ఏఈఈగా ఉద్యోగం చేస్తాడు. పెద్ద ఉద్యోగి దొరికాడు అని భార్య, అత్తమామలు సంతోషిస్తే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక బుధవారం కాలువ వద్దకు చేరుకుని మొబైల్‌ఫోన్ గట్టున పెట్టి దూకేసింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డెత్‌నోట్‌లో కన్నీటి వరద మెట్టినింట్లో వేధింపుల గురించి లత డెత్‌నోట్‌లో వివరంగా రాసింది. నా చావుకు భర్త గురురాజ్, అత్త నాగరత్నమ్మ, బంధువులు రాజేశ్వరి, శారదమ్మ, కృష్ణప్ప కారణం. ఈ ఐదుగురు నన్ను మానసికంగా వేధించారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని పొంగిపోయాను, కానీ అతడు తల్లిదండ్రుల మాటలు విని నాతో నాటకీయంగా ప్రవర్తించేవాడు. ఎన్నో అవమానాలు అనుభవించాను. ప్రతి మహిళ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి భర్త దొరకడు. ఎన్నో కలలతో అత్తింటిలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ సర్దుకుపోవాలి. భార్యకు కనీసం భర్త అయినా మద్దతుగా ఉండాలి. ఇంట్లోని వారితో పాటు భర్త కూడా ద్వేషం చూపిస్తే ఆ మహిళకు చావుతో సమానం. రోజురోజుకీ చస్తూ బతకడం సాధ్యం కాదు. నా చావుకు న్యాయం చేయాలి అని చివరి కోరిక కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ తన స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. -
నువ్వు అక్కర్లేదు.. అక్కడే చచ్చిపో
ధారూరు: భర్త వేధింపులు భరించలేక, జీవితంపై విరక్తి చెందిన ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారంలో బుధవారం జరిగిన ఈ ఘటనపై ధారూరు సీఐ రఘురామ్ తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన గంజి మల్లమ్మ, సాయప్పల చిన్న కూతురు శిరీష (21)కు పరిగి మండలం మల్లమోనిగూడేనికి చెందిన శివలింగంతో ఐదు నెలల క్రితం వివాహం చేశారు.వంట బాగా చేయడం లేదంటూ, తనకన్నా తక్కువ చదువుకున్నావంటూ శివలింగం ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమెను చితకబాదేవాడు. ఈక్రమంలో మంగళవారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన శివలింగం భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఆమె ఫోన్‌ను సైతం తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లితో శిరీష జరిగిన విషయాన్ని చెప్పగా.. ‘అల్లుడితో ఉదయం మాట్లా డదాంలే’.. అని సర్దిచెప్పింది.బుధవారం కూలి పనులకు వెళ్తూ కూతురికి ఫోన్ ఇచ్చి వెళ్లింది. శిరీష భర్తకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయగా ‘నీవు నాకు అక్కర్లేదు.. అక్కడే చచ్చిపో’.. అంటూ చీదరించుకున్నాడు. ఈ మాటల తో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లికి శిరీష ఉరేసుకుని కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఫోన్లో రికార్డయిన సంభాషణల ఆధారంగా విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘పాదరసం’తో భార్య ప్రాణం తీశాడు
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది. -
ఐబొమ్మ కేసు: ఆధారాలు అడిగి అడ్డంగా దొరికాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోనే ఉంటూ దాదాపు ఆరేళ్ల పాటు ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లను నడిపించిన ఇమంది రవి ఆచూకీ నాటకీయంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులకు చిక్కింది. గేమింగ్ యాప్స్ కంపెనీలతో ముడిపడి ఉన్న ఓ అమెరికన్ కంపెనీ నుంచి దర్యాప్తు అధికారులు వివ రాలు కోరుతూ మెయిల్ పెట్టారు. దాని యజమాని అయిన ఇమంది రవికే ఆ మెయిల్ చేరగా... సమాధానం ఇస్తూ అతడు ఆధారాలు కోరడంతో మొదలైన అనుమానం అత గాడి అరెస్టు వరకు వెళ్లింది. ఈ వివరాలను అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.వారికి వచ్చే ట్రాఫిక్‌ను బట్టే చెల్లింపులు...ఐబొమ్మ (iBomma)) వెబ్సైట్ డొమైన్‌ను రవి ఎన్ జెలా అనే సంస్థలో రిజిస్టర్ చేశాడు. ఆ సమయంలో తన గుర్తింపుకార్డు, ఈ–మెయిల్ ఐడీలు ఇవ్వడంతో పాటు తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడం కోసం ఐపీ వాల్యూమ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్నాళ్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని తన సైట్స్ ద్వారా వారి యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా ప్రోగ్రామింగ్ మార్చాడు. ఈ గేమింగ్/బెట్టింగ్ యాప్స్ రవి వెబ్సైట్ ద్వారా తమకు వచ్చే ట్రాఫిక్ (వినియోగదారులు) ఆధారంగా చెల్లింపులు చేసే వాళ్లు. ఈ చెల్లింపులు తొలుత గేమింగ్ కంపెనీ నుంచి యాడ్ క్యాష్, యాడ్ స్టెరా అనే కంపెనీలకు వెళ్లేవి. వాటి నుంచి రవికి చెందిన యాడ్ బుల్ అనే సంస్థ ద్వారా రవి ఖాతాల్లోకి వచ్చేవి. ఇక్కడి వరకు అంతా యూఎస్‌డీటీగా పిలిచే డిజిటల్ కరెన్సీ రూపంలో జరిగినా.. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి రవి డ్రా చేసుకునే వాడు.డొమైన్ రిజిస్ట్రీ ఇచ్చిన సమాచారంతో...యూఎస్డీటీని సాధారణ కరెన్సీగా మార్చడం కోసం రవి గెటింగ్ అప్ పేరుతో అమెరికాలోనూ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ ద్వారా రీడైరెక్ట్ అవుతున్న గేమింగ్/బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను సంప్రదించిన సైబర్ క్రైమ్ పోలీసులు చెల్లింపుల విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఇలా గెటింగ్ అప్ కంపెనీ పేరు బయటకు వచ్చింది. ఇది రవికి చెందినదని తెలియని సైబర్ క్రైమ్ అధికారులు దీని నుంచి నగదు ఎక్కడికి వెళ్తోందో తెలుసు కోవాలని భావించి అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపారు. దీన్ని అందుకున్న రవి... పోలీసుల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నేరం నిరూపించే బలమైన ఆధారాలు చూపాలంటూ సమాధానం ఇచ్చాడు. సాధారణంగా అమెరి కన్ కంపెనీలు ఆ దేశ పోలీసు, కోర్టు లేదా ఎం–లెట్‌గా పిలిచే ఒప్పందం ద్వారా సంప్రదించాలని అంటాయి.భిన్నంగా స్పందించడంతో ఆరాగెటింగ్ అప్ సంస్థ భిన్నంగా స్పందించడంతో సైబర్ క్రైమ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీ పూర్వాపరాలు, డొమైన్ వివరాలు తదితరాలు సేకరించగా... అవి రవికే చెందిన ఈఆర్ ఇన్ఫోటెక్‌కు దారి తీశాయి. ఇలా తొలిసారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిగా గుర్తించిన పోలీసులు అతడి వివరాలు ఆరా తీయడం మొదలెట్టారు. ఈలోపు పోలీసుల ద్వారా తన సైట్స్ పేరు బయటకు రావడంతో దేశం వదిలేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటికే అతడి ఫోన్ నంబర్ సహా ఇతర వివరాలు సేకరించిన అధికారులు సాంకేతిక నిఘా ఉంచారు. ఇలా అతడి రాకను గుర్తించి అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్లో సినిమా పోస్టర్ తయారీకి రవికి నిఖిల్ అనే స్నేహితుడు సహకరించినట్లు తేలింది. అతడినీ విచారించిన పోలీసులు పాత్ర రూఢీ అయితే అరెస్టు చేయాలని నిర్ణయించారు. రవిలో కష్టపడే తత్వం లేదని, మిగిలిన కేసుల్లోనూ అతడిని అరెస్టు చేసి కస్టడీకి కోరతామని పోలీసులు తెలిపారు. -
ఈ టార్చర్ భరిస్తూ బతకలేను.. మరిది వేధింపులతో..
మంచిర్యాలక్రైం: భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో 2014లో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు రామ్, లక్ష్మణ్(9) ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియాంకను భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ వేధించేవారు. ఈ నెల 9న ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఎల్ఐసీ కాలనీలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణమైన భర్త, మరిది, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. -
దారుణం.. రూమ్‌లో ఎవరు లేని టైం చూసి ప్రియుడు..!
అన్నమయ్య జిల్లా: దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఉంటూ బీబీఎం చదువుతున్న ఏపీలోని అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్యకు గురైంది. నగరంలో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా బిక్కంవారిపల్లి నివాసులైన రెడ్డప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవిశ్రీ (21) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈమె గత మూడేళ్లుగా బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో బీబీఎం చదువుతూ బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఉదయం దేవిశ్రీ... ప్రేమ్‌వర్ధన్ అనే స్నేహితునితో కలిసి తన స్నేహితురాలి రూంకి వెళ్లింది. అక్కడే ఆమెను ప్రేమ్‌వర్ధన్ కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. దేవీశ్రీ పెద్దమ్మ మాట్లాడుతూ ఆదివారం 11 గంటలకు స్నేహితురాలి రూంకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిందని, ఏం జరిగిందో తెలియదని, తమకు న్యాయం చేయాలని విలపించింది. దేవిశ్రీ, ప్రేమవర్ధన్ ప్రేమికులని అనుమానాలున్నాయి. ఎందుకు హత్య చోటుచేసుకుందీ అనేది నిందితుడు దొరికితే గానీ తెలియదని పోలీసులు చెబుతున్నారు. ర్యాగింగ్ చేసేవాడని చెప్పిందిదేవిశ్రీ పెదనాన్న మాట్లాడుతూ కాలేజీలో తనను ఆ యువకుడు ర్యాగింగ్ చేస్తున్నాడని ఆమె చెప్పేదన్నారు. మూడు నెలల క్రితమే తెలిపిందని, కళాశాల వారికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. మూడు నెలల్లో కాలేజీ అయిపోతుందని ఇటీవలే చెప్పిందని, అంతలోనే ఘోరం జరిగిందని వాపోయాడు. -
తాగొచ్చి హింసిస్తున్నాడని.. ఇద్దరు భార్యలు కలిసి!!
కమ్మర్పల్లి (భీమ్‌గల్): వేధింపులు తాళ లేక ఇద్దరు భార్యలు కలిసి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట్‌లో చోటుచేసుకుంది. దేవక్కపేట్ గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ (35)కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కవిత, చిన్న భార్య సంగీత కాగా, వీరికి ఐదుగురు ఆడ సంతానం. మోహన్ బ్యాండ్ మేళం వాయిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన మోహన్ రోజూ ఇద్దరు భార్యలను కొడుతూ, బూతులు తిడుతూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం మద్యం సేవించి ఇంటికి వచి్చన మోహన్ భార్యలను తిడుతూ, వేదనకు గురిచేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్న భార్య సంగీత భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న పెద్ద భార్య కవిత, సంగీతను ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్ల పారాణి ఆరకముందే కాటికి!
సాక్షి, సిద్ధిపేట: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంటను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఘటనలో నవ వధువు మృతి చెందగా.. భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేటకు చెందిన ప్రణతి(24), సాయికుమార్‌లకు ఈ మధ్యే వివాహం జరిగింది. లీవ్స్ ముగిసిపోవడంతో జాబ్ నిమిత్తం సోమవారం హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. అయితే.. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారుకు చేరుకోగానే ఓ ట్రాక్టర్ వీళ్ల బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కాదు.. స్థానికంగానూ తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే అంతిమ సంస్కారాలు -
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు జరిగాయి. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్తో సహా మొత్తం ఎనిమిది సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్, అనుబంధ సంస్థలపై PMLA, 2002 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రీలాంచ్ స్కీమ్ పేరిట గృహ కొనుగోలుదారులను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే.. ఈ స్కాంతో లింకుల నేపథ్యంలో ఎనిమిది రియల్ ఎస్టేట్ సంస్థల్లో తాజాగా తనిఖీలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ నగదు చలామణి.. మనీలాండరింగ్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల సమయంలో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
ఉత్తరఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతం సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. ఈఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన 13 మందికి తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కుంజాపురి ఆలయానికి సమీపంలో ఉంటుంది. కాగా బస్సుప్రమాద ఘటనపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తననుతీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే జిల్లాయంత్రాంగం స్థానిక ఆసుపత్రులకు తరిలించిందని తీవ్రంగా గాయపడ్డవారిని రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. -
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
సూర్యాపేట జిల్లా: మునగాల మండలం బరాఖత్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్‌గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్‌రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్‌రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్‌గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్‌గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్‌రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలపై ఉపేందర్‌రెడ్డి దాడి చేశాడు. అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి కూతురు జంప్..
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి చెందిన ఓ యువకుడిని ఇటీవల మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు నగలతో ఉడాయించింది. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయి 16 సంవత్సరాల కూతురు ఉంది. ఈ క్రమంలో తనకు ఇంకా పెళ్లి కాలేదని, పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయకులను పెళ్లి చేసుకుంటోంది. అనంతరం అందినకాడికి నగదు, నగలతో ఉడాయిస్తోంది. ఇదే క్రమంలో గత నెలలో చౌటపల్లి యువకుడిని పెళ్లి చేసుకుని పదిరోజుల క్రితం ఇంట్లో ఉన్న సుమారు 7 నుంచి 12 తులాల బంగారంతో పరారైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. -
మళ్లీ పెళ్లి కోసం చిన్నారి కిడ్నాప్
గోల్కొండ: విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి పథకం వేసిన ఆ జంట బాలిక కిడ్నాప్‌కు పథకం వేశారు. ఈ వివరాలను సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ ఆదివారం గోల్కొండలోని టోలిచౌకీ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... హకీంపేట్‌కు చెందిన మహ్మద్ ఫయాజ్ (25) గోల్కొండకు చెందిన సల్మాబేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అతి కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ హకీంపేట్‌లో ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరచూ కలుసుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఫయాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే తనకు విడాకుల సమయంలో సల్మాబేగం గర్భవతి అని విడాకుల అనంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టిందని ఫయాజ్ తన తల్లిదండ్రులను నమ్మించి పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. అనంతరం పాపను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం సల్మాబేగం గోల్కొండ సాలేనగర్లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియాబేగం అనే నాలుగేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చింది. ఫయాజ్ సల్మాతో పాటు చిన్నారిని హకీంపేట్‌లోని తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ సమయంలో అతడి రెండవ భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా అదే రోజు సాయంత్రం కిడ్నాప్‌కు గురైన చిన్నారి తల్లిదండ్రులు గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా ఫయాజ్‌తో పాటు సల్మాబేగంలను అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో ఉన్న కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కూడా పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితుల నుంచి ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్లో గోల్కొండ ఇన్స్పెక్టర్ బి.సైదులు, టోలిచౌకీ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పాల్గొన్నారు. -
మైక్రో ఫైనాన్స్ వేదింపులకు మహిళ బలి
సాక్షి, మెదక్: మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు మరో మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి నిర్మాణం కోసం పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.సమాచార ప్రకారం.. వరలక్ష్మి అనే యువతి మేడ్చల్‌లోని ఫైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్ నుండి 4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వడ్డీతో సహా 8 లక్షలకు పైగా చెల్లించినప్పటికీ ఇంకా తమకు బకాయి కట్టాల్సి ఉందని ఏజెంట్లు రోజూ ఇంటికి వచ్చి బాధితురాలిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అదేవిధంగా తూప్రాన్‌లోని క్రిష్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ నుండి తీసుకున్న 70 వేల రుణంలో ఇంకా 20 వేల రూపాయలు బకాయి ఉన్నాయని దీనికిగాను ఏజెంట్లు తరచూ రావడం వల్ల కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైందని సమాచారం.ఇక ఈ నేపద్యంలో ఈరోజు ఉదయం కూడా లోన్ రికవరీ ఏజెంట్లు వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో దురుసుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన వరలక్ష్మి కొద్ది సేపటికే సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న తూప్రాన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరలక్ష్మిని వేధించిన రికవరీ ఏజెంట్లపై కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
గ్యాస్ నొప్పితో ఉద్యోగిని మృతి
తాడేపల్లిగూడెం అర్బన్: గ్యాస్ నొప్పితో శనివారం ప్రైవేట్ ఆసుప్రత్రిలో చేరిన ఓ ఉద్యోగిని సాయంత్రానికి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని ఉద్యోగిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు ఆసుపత్రిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కంచర్ల శ్రావణి (38) సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె శనివారం ఉదయం కార్యాలయానికి విధులకు హాజరైంది. ఆ సమయంలో గ్యాస్ నొప్పి రావడంతో పట్ణణంలోని ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లి చూపించుకోగా అక్కడి వైద్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దాంతో శ్రావణి ప్రైవేటు ఆసుత్రికి ఉదయం 11 గంటల సమయంలో వెళ్లగా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు. విషయం తెలుసుకున్న శ్రావణి బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆమెకు ఆరోగ్యం ఎలా ఉందని సమాచారం కోరగా.. ఇప్పుడు ఆమెను చూసే అవకాశం లేదు, వైద్యం అందిస్తున్నాం వేచి ఉండమని వైద్యులు సర్దిచెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో శ్రావణి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో శ్రావణి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తమను చూడనివ్వకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడు చనిపోయిందని చెప్పడమేంటని కన్నీరుమున్నీరయ్యారు. రూ.45 వేలు విలువైన ఇంజక్షన్ చేశామని ఇప్పటి వరకు అందించిన వైద్యానికి సొమ్ములు చెల్లించకపోతే మృతదేహాన్ని అప్పగించమని వైద్యులు హెచ్చరించారు. దీంతో మృతురాలి బంధువులు తమకు తెలిసిన వారితో సిఫార్సు కోసం ప్రయత్నించగా ఆసుపత్రి యాజమాన్యం కనికరించలేదు. ఆ ఆసుపత్రిలో వైద్యంపై ఆరోపణలు గతంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించిన ఏడాది కాలంలోనే సుమారు వరుసగా ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిని ప్రారంభించిన నాటి నుంచి రెండేళ్లలో రోగులు ఎక్కువగా చనిపోవడంతో యాజమాన్యం ఆసుపత్రిని కొంతకాలం మూసివేశారు. అనంతరం ఇటీవల గతంలో ఆసుపత్రిని నిర్వహించిన వారి బంధువులే తిరిగి పేరు మార్చి ఆసుపత్రిని ప్రారంభించారు. పునఃప్రారంభించిన ఏడాది కాలంలో ఇప్పటికి సుమారు ఆరుగురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వ అ«ధికారులు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడలని స్థానికులు కోరుతున్నారు. -
అంబర్ పేట్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
-
యూనిఫామ్ వేసి బందోబస్తు డ్యూటీ చేసిన యువతి
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డెంటల్ డాక్టర్.. నాకు మెంటల్ ఎక్కిస్తున్నాడు..!
నిజామాబాద్: జిల్లాలో ఇటీవల ఓ డెంటల్ డాక్టర్‌పై మహిళ ఫిర్యాదు చేయడం పెనుదుమారం రేపింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వాట్సాప్‌లో వీడియో, ఆడియో కాల్స్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసులో నిందితుల వేధింపులకు సంబంధించిన సాక్ష్యాలను సైతం చూపించగా, పోలీసులు నిర్భయ కింద కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే, పలుకుబడి ఉన్న ఓ సంఘం నేత మధ్యవర్తిత్వంతో రూ. లక్షలు చేతులు మారడంతో నామమాత్రపు కేసులతో మమ అనిపించారనే చర్చ జరుగుతోంది. బాధితురాలు నేరుగా నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను డెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్ అనే వ్యక్తులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే నాన్‌బెయిల్‌బుల్ కేసు పెడతామని చెప్పినట్లు తెలిసింది. అయితే అటు తర్వాత సదరు డెంటల్ వైద్యుడు అమర్ అందుబాటులో లేడని ఇంటికి నోటీసు ఇచ్చి వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విచారణ పేరుతో సాగదీతడెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌పై మహిళ ఫిర్యాదు తర్వాత నెలకొన్న పరిస్థితులు తారుమారు అయ్యాయి. మొదట్లో సీరియస్‌గా స్పందించిన పోలీసులు అటు తర్వాతా నోటీసు, నామామత్రపు కేసు పేరిట సాగదీసేలా వ్యవహారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ సంఘం నేత సదరు వైద్యుడిపై నాన్‌బెయిలబుల్ కేసు కాకుండా చిన్నపాటి కేసు నమోదు చేయించేలా చక్రం తిప్పాడని చర్చ జరుగుతోంది. సుమారు రూ. 30 లక్షలకు డీల్ కుదిరిందని, అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కేసు నమోదైంది..మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై కేసు నమోదైంది. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. నోటీసులు కూడా ఇచ్చారు. గతంలో ఉన్న సీఐ వద్ద పూర్తి సమాచారం ఉంది. – సతీశ్, సీఐ, నాలుగో టౌన్విచారణ జరుగుతోంది..డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై నమోదైన కేసు విచారణ జరుగుతోంది. నాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయి. – శ్రీనివాస్ రాజ్, సీఐ -
నాన్నా.. అమ్మను బాగా చూసుకో
ఏలూరు జిల్లా: ‘నాన్నా.. అమ్మను బాగా చూసుకో.. ఏమీ అనవద్దు.. ఐ మిస్ యూ.. మావయ్య.. సారీ.. ఐ మిస్ యూ... చెల్లెళ్లిద్దరూ బంగారం.. వా రిని బాగా చదివించండి.. మా ప్రిన్సిపాల్, హౌస్ టీచర్ చాలా మంచివాళ్లు.. ఏమీ అనవద్దు..’ అని సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్థిని బలవన్మరణం చెందింది. పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని పొడవాటి కావ్య (15) శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పిల్లలందరూ భో జనానికి వెళ్లగా తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉ రివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ ఎంవీ సు భా‹Ù, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్ గంగాభవాని, మహిళా టీచ ర్లు, కావ్య స్నేహితులను విచారించారు. సీసీ టీవీ రికార్డులను పరిశీలించారు. కావ్య స్నేహితులు మాట్లాడుతూ కావ్య తల్లి ఉషారాణి కిడ్నీ సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నారని, తరచూ డ యాలసిస్ చేయాల్సి రావడంతో కుటుంబం ఇబ్బంది పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి బాధను చూడలేక చదువు మానేయాలని ఉందని పలుమార్లు తమకు చెప్పిందని అన్నారు. తల్లి అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కావ్యకు ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, పెద్ద చెల్లెలు సౌమ్య ఇదే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తాడువాయి పంచాయతీ జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి గంగాధరరావు, ఉషారాణి పెద్ద కుమార్తె కావ్య. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాఠశాల వద్ద పీడీఎస్‌యూ, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆందోళన చేశారు. -
iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్‌గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్‌కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. -
ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తనువు చాలించారు. వాకింగ్‌కు అని వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన గడ్డమిడి మల్లేష్ (45), సంతోషి (37) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్వగ్రామంలోని రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు అమ్మి బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్ నంబర్–4లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా పెద్దకూతురు మేఘన ఇంటర్, చిన్నకూతురు మౌనిక టెన్త్ క్లాస్ చదువుతుంది. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రోజు మాదిరిగానే మార్నింగ్ వాకింగ్‌కని బయటకు వెళ్లారు. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో 7.30 గంటలకు కుమారుడు శివ తండ్రి సెల్ ఫోన్ నంబర్‌కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మల్లేష్ సెల్‌ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘నాకు రూ.20 లక్షలు, మీ అమ్మకు రూ.20 లక్షలు ఎస్బీఐ బ్యాంక్ నుంచి వస్తాయి’ అని మెసేజ్‌లో ఉంది. తరువాత ఫోన్ స్విచాఫ్ చేసి వుంది. దీంతో ఆందోళన పడ్డ శివ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగోలులో గుర్తింపు... మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మల్లేష్, సంతోషి దంపతుల జాడ వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జీపీఆర్ఎస్ ద్వారా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటి లొకేషన్ ఆధారంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. 100 ఫీట్ల రోడ్డు పక్రన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చూడగా మల్లేష్, సంతోషి అపస్మారక స్థితిలో ఉన్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించగా సంతోషి అప్పటికే మృతిచెంది వున్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న మల్లేష్‌ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కొద్దిసేపటికే మల్లేష్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పైలట్‌పై లైంగిక దాడి కేసు నమోదు
హైదరాబాద్: బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో విమాన పైలట్‌గా పనిచేస్తున్న యువతిపై అదే సంస్థలో పైలట్ అయిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బెంగుళూరులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు బెంగుళూరు హలసూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు బేగంపేటలో ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తో పాటు రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సంస్థకు చెందిన పని నిమిత్తం యువతితో పాటు రోహిత్‌శరణ్ బెంగుళూరుకు వెళ్లారు. అక్కడి హోటల్ గదిలో యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రతిఘటించిన యువతి అక్కడి నుంచి పారిపోయి నగరానికి చేరుకుంది. రోహిత్‌శరణ్ తనతో వ్యవహరించిన తీరు పట్ల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రోహిత్ శరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసును బెంగళూరుకు బదిలీ చేశారు. -
నాకు ధనలక్ష్మి కావాలి.. సరిత వద్దు..!
నెల్లూరు జిల్లా: మండల కేంద్రమైన కలిగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. విష్ణువర్ధన్ అనకాపల్లిలో ఇటుకబట్టీల వద్ద పని చేస్తున్నాడు. అక్కడ ధనలక్ష్మి అనే మహిళ పనిచేసేది. ఆమె భర్త నుంచి విడిపోయింది. విష్ణు, ఆమెకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ధనలక్ష్మిని తీసుకుని విష్ణు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్లాడు. కాగా అనకాపల్లిలో ధనలక్ష్మి అదృశ్యంపై కేసు నమోదైంది. భర్త కనిపించడం లేదని సరిత ఫిర్యాదుతో కలిగిరి పోలీసులు విచారణ చేసి పామూరులోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. వారిని కలిగిరికి తీసుకొచ్చారు. అనకాపల్లి నుంచి వచ్చిన పోలీసులు ధనలక్ష్మిని వాహనంలో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రియురాలిని తన నుంచి దూరం చేస్తున్నారంటూ విష్ణుఫర్టిలైజర్ దుకాణం నుంచి పురుగు మందు తీసుకొచ్చి రోడ్డుపై తాగాడు. వెంటనే సరిత, ఇతర కుటుంబ సభ్యులు అతడిని కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విష్ణు పరిస్థితి నిలకడగా ఉంది. -
శబరిమల గోల్డ్ చోరీ కేసు.. మాజీ మంత్రికి ఉచ్చు?
శబరిమల ఆలయం బంగారం దొంగతనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీపీఎం నేత, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ డైరెక్టర్ పద్మకుమార్ ఈ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో దేవస్వం(దేవాదాయ శాఖ)మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రను విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేరళనాట తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.శబరిమల గర్భగుడి శిల్పాలకు బంగారు పూత వేయడానికి వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారని.. ఈ ప్రతిపాదన ఆనాటి దేవస్వం మంత్రికి కూడా తెలిసిందని.. సురేంద్రన్ కూడా లేఖ ద్వారా ఆసక్తి వ్యక్తం చేశారని పద్మకుమార్ వాంగ్మూలంలో ఉంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సురేంద్రన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. పద్మకుమార్ విచారణ పూర్తైన తర్వాతే ఏదనే నిర్ణయం తీసుకుంటామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. పూజారి నుంచి వ్యాపారవేత్తగా మారిన ఉన్నికృష్ణన్ పొట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 1998లో బంగారు పూత వేసిన ద్వారపాలక శిల్పాలపై తిరిగి పనులు చేయడానికి పొట్టికి అనుమతి ఇచ్చిన సమయంలోనే బంగారం చోరీ జరిగినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పొట్టి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని.. ఆ చొరవ వల్లే ఆయనకు ప్రత్యేక అనుకూలత లభించిందని, చోరీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో ఇప్పటిదాకా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టి తోపాటు మురారి బాబు (మాజీ దేవస్థానం బోర్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), డీ సుధీశ్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఎన్. వాసు (మాజీ దేవస్థానం కమిషనర్, అధ్యక్షుడు) అరెస్ట్ అయ్యారు. వాసు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గురువారం నాలుగు గంటలపాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ను విచారించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. Watch: In the Sabarimala gold theft case, former Travancore Devaswom Board president A. Padmakumar has been arrested by the SIT. The arrest was recorded after he was questioned at the State Police Headquarters. Padmakumar was the Devaswom Board president in 2019, when the gold… pic.twitter.com/4wVDWqrANy— Jist (@jist_news) November 20, 2025అయితే.. విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ అధికార పక్షం నేతల పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. సీపీఎం నేతలైన దేవస్వం కమిషనర్ ఎన్. వాసు, తరువాత ఎ. పద్మకుమార్ అరెస్టు కావడం.. ఇప్పుడు మాజీ మంత్రి పేరు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేతల పాత్రలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం పినరయి విజయన్ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కోరుతున్నారు.పొట్టి వెనుక భారీ శక్తులుండొచ్చు: హైకోర్టుశబరిమల బంగారం దోపిడీ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తంచేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని హైకోర్టు నిర్ణయించింది. -
తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఒస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 25 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. పెళ్లకూరు మండకం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. -
కంచరపాలెం మిస్టరీ.. నరబలి కోణంలో దర్యాప్తు!
సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం కాలువలో పసికందు మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీ కొనసాగుతోంది. తల లేకుండా విడి భాగాలు మాత్రమే లభించడం స్థానికంగా కలకలం రేపింది. ఆ చిన్నారి ఎవరు? ఎందుకు అంత ఘోరంగా చంపారు?.. అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఉదయం కంచరపాలెం పీఎస్ పరిధిలోని.. ఓ కాలువలో పసికందు శరీర విడిభాగాలు కనిపించాయి. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్ళు, చేతులు ముక్కలుగా లభ్యం కాగా.. తల భాగం కోసం పోలీసులు కాలువలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు జరిపారు. మరోవైపు.. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. పసికందు శరీర బాగాల నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశీలనకు తీసుకెళ్లింది. మరోవైపు.. శరీర భాగాలను కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆశా వర్కర్స్ ద్వారా గర్భిణీల వివరాలను పరిశీలిస్తున్నారు. అపహరణ కేసులు ఏమైనా నమోదు అయ్యాయో రికార్డులు పరిశీలిస్తున్నాయి. అమవాస్య కావడంతో నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. -
కోదాడ: రాజేష్ అంత్యక్రియలకు ఒప్పుకున్న దళిత సంఘాలు
కోదాడలో దళిత యువకుడు రాజేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాల చేపట్టిన ధర్నా ముగిసింది. రాజేష్‌ది లాకప్ డెత్ అని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. అతని కుటుంబానికి న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ ఉన్నతాధికారుల హామీతో గురువారం ఉదయం వాళ్లు శాంతించి ఆందోళన విరమించారు.స్థానిక మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్ కొంతమంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల బ్యాంకు ఖాతాల్లో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నరేష్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా చిలుకూరుకు చెందిన కె. రాజేష్ పేరుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కోదాడకు చెందిన కె.(కర్ల) రాజేష్‌కు ఇచ్చి అతని అకౌంట్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు నరేష్ చెప్పాడు. దీంతో.. చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్‌ను అరెస్ట్ చేసి 10న రిమాండ్ విధించడంతో హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్లో రాజేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.హైకోర్టులో విచారణ వాయిదామరోపక్క రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని దున్న అంబేద్కర్ మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం సాయంత్రం మరోసారి విచారణ చేసి కేసును 15 రోజులపాటు వాయిదా వేసింది. ఈలోపు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. -
టక్కులు, టైలతో వచ్చారు.. దర్జాగా రూ.7 కోట్లు దోచుకెళ్లారు
సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించి.. తాము సెంట్రల్ ఏజెన్సీల అధికారలమంటూ సిబ్బంది బోల్తా కొట్టించారు. ఆపై కొంత దూరం తీసుకెళ్లి బెదిరించి నగదును లూటీ చేసి ఉడాయించారు.బుధవారం (నవంబర్ 19న) మధ్యాహ్నం బెంగళూరులో సీఎంఎస్(క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్) వ్యాన్ నుంచి రూ. 7.11 కోట్ల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్ అఫ్తాబ్, డ్రైవర్ బినోద్ కుమార్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్య ఉన్నారు.వ్యాన్ అశోకా పిల్లర్ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్ టయోటా ఇన్నోవా అడ్డగించింది. అందులోంచి ఐదారుగురు బయటికి దిగి.. తాము ఆర్బీఐ అధికారులమంటూ చెప్పారు. వాళ్ల అవతారాలు చూసి సిబ్బంది కూడా నిజమని నమ్మారు. సదరు సంస్థపై ఫిర్యాదు ఉందని.. ఆర్బీఐ విచారణ జరుపుతోందని.. తమ వెంట రావాలని ఒత్తిడి చేశారు. ఆ హఠాత్ పరిణామంతో ఏం చేయాలో పాలుపోక వాళ్లంతా ఆ వాహనంలోకి ఎక్కారు. అటుపై డెయిరీ సర్కిల్ వద్ద వ్యాన్ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి రూ. 7.11 కోట్ల నగదు తీసుకుని పరారయ్యారు.Money Heist in BengaluruRobbers posing as Govt officials intercepted a CMS ATM cash loading vehicle allegedly claiming "verification", transferred about 7 crore into their Innova, left the staff & vehicle near a flyover, and escaped. A citywide search is underway. pic.twitter.com/sGb0IpgcXF— Deepak Bopanna (@dpkBopanna) November 19, 2025ఈ ఘటనపై సీబీఐ కోర్టు పరిధిలోని సిద్ధాపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అవల్లహళ్లి ప్రాంతంలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది, అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటన జరిగిన తీరు నేపథ్యంలో సీఎంఎస్ ఉద్యోగుల హస్తం కూడా ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంత దర్జాగా దోచుకున్నది లోకల్ దొంగలా? ఉత్తరాది ముఠాలా? అసలెవరు?? అనేది ఉత్కంఠగా మారింది.ప్రభుత్వం చచ్చిందా: అశోక్ఈ దోపిడీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ మధ్య, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో దోపిడీ చేశారంటే ఇది కచ్చితంగా బ్రాండ్ బెంగళూరే అని హేళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలకు, టెర్రరిస్టులకు మొబైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టే దోపిడీ దొంగలకు కూడా ఏర్పాట్లు చేశారని అనుమానాలు వస్తున్నాయన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నా చచ్చినట్టే అనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకు డబ్బులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చన్నారు. -
అతడో పిల్ల చేప.. ‘ఆర్గాన్’ స్కాంలో తెలంగాణకు లింకులు!
కేరళ కేంద్రంగా ఇరాన్‌కు నడిచిన అవయవాల అక్రమ రవాణా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు జయకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మధు పిల్ల చేప మాత్రమేనని.. దీని వెనుక పెద్ద చేపలు చాలానే ఉన్నాయని.. త్వరలో ఆ వివరాలు బయటపెడతామని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కొచి కోర్టుకు బుధవారం నివేదించింది. ఈ కేసులో ఇరాన్ నుంచి వచ్చిన ఎర్నాకులం వాసి మధు జయకుమార్‌ను నవంబర్ 8వ తేదీన కొచి ఎయిర్‌పోర్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే.. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యాయని తేలింది. అంతేకాదు ఒక్క మధునే ఇరాన్‌కు భారత్ నుంచి 14 మంది బాధితుల్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 2019 జనవరి నుండి 2024 మే మధ్య.. ఈ చానెల్ ద్వారా కేరళ నుంచి అనేక మందిని అక్రమంగా అవయవదానం కోసం తరలించినట్లు ఎన్ఐఎ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కేసు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ రాకెట్ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అవయవాలు దానం చేసిన వాళ్లకు రూ.50 లక్షల దాకా ఆఫర్ చేసినట్లు బాధితుల వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మరోపక్క.. మధు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసుపత్రులు, బాధితులు తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.కిందటి ఏడాది మే నెలలో త్రిస్సూర్‌కు చెందిన సబిత్ నసర్(30) కొచి ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడ్డాడు. ఇరాన్ నుంచి వయా కువైట్ ద్వారా అతను వచ్చాడని, మానవ అవయవాల రవాణా అక్రమ ముఠాతో అతనికి లింకులు ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. తన ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి కోసం 20 మందిని తీసుకెళ్లానని.. అందులో చాలా మంది ఉత్తర భారతానికి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఎర్నాకులం పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా.. ఆ తర్వాత అది ఎన్ఐఏ చేతికి వెళ్లింది. కిందటి ఏడాది అగష్టులో ఎన్ఐఏ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మెడికల్ టూరిజం పేరిట అవయవాల అక్రమ రవాణా ముఠా నడిపించిన నలుగురు నిందితులు సబిత, సాజిత్ శ్యామ్, బెల్లంకొండ రాం ప్రసాద్, మధు జయకుమార్‌లను గుర్తించింది. ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారమేనని బాధితులను నమ్మించి ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తేలింది. సోషల్ మీడియా, ఏజెన్సీల ద్వారా యువతను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించుకుంది. అయితే అప్పటి నుంచి జయ కుమార్ పరారీలో ఉన్నాడు. అతను ఇరాన్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌పోల్ సాయంతో రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయించారు. చివరకు స్వదేశానికి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయగా.. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ భావిస్తోంది. -
భర్తను కాదని.. ఎల్రక్టీషియన్తో వివాహేతర సంబంధం
మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం పెదపులిపాకలో శంకరరెడ్డి తన భార్య లక్ష్మీపార్వతి (29)తో ఉంటున్నాడు. మిఠాయి కార్కానాలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయిదు నెలల క్రితం మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి లక్ష్మీపార్వతి వచ్చింది. స్థానికంగా ఎల్రక్టీషియన్‌గా పనిచేసే మహేష్‌తో పరిచయం ఏర్పడింది. మంగళగిరి మండలం పరిధిలోని యర్రబాలెంలో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న శంకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. పెద్దగా వాగ్వాదం జరిగింది. లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది. శంకరరెడ్డి కూడా ఆమెను వెంబడించి లోపలికి వెళ్లి గడి పెట్టాడు. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ బ్రహ్మం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు పంపారు. శంకరరెడ్డి పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఇదేం అఘాయిత్యం నాన్నా?
పశ్చిమ గోదావరి జిల్లా: కన్నతండ్రే కూతురిపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం బయటపెడితే తాను పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించాడు. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామంలో ఈ దారుణం జరుగగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్లుగా పెద్ద కుమార్తెను బెదిరిస్తూ అఘాయిత్యం చేస్తుండగా ఇటీవల కుమార్తెలో మార్పు రావటంతో తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది.అక్కడ పరీక్షల్లో కుమార్తె గర్భ నిరోధక మాత్రలు వాడినట్లు తేలటంతో ఇంటికి వచ్చి కుమార్తెను నిలదీయగా తండ్రే ఈ దురాగతానికి పాల్పడినట్లు చెప్పింది. దీనితో భర్తను నిలదీయగా ఈ విషయం బయట చెబితే తాను పురుగు మందు తాగుతానని బెదిరించాడు. నువ్వు చచ్చినా ఫర్వాలేదు అని చెప్పి ఆమె కుమార్తెలతో సహా ఈ నెల 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విషయం ఎక్కడ బయటపడుతోందనని డ్రైవర్ పురుగు మందు తాగాడు. స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతుర్లతో సహా పుట్టింటికి వెళ్లిన నిందితుడి భార్య ఈ నెల 15వ తేదీన పెనుమంట్ర పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్ఆర్ఐ నమోదు చేసి పెరవలి పోలీసు స్టేషన్‌కు 16వ తేదీన పంపించారు. దీంతో ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆసుపత్రి నుంచే పరారీ అయ్యాడని అధికారులు చెబుతున్నారు. భార్య, బాధిత బాలిక, నాన్నమ్మ, చుట్టుపక్కల కుటుంబాలను డీఎస్పీ దేవకుమార్ విచారించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసైన అతను కుటుంబ సభ్యులను రోజూ ఏదో రకంగా బాధపెడుతూ, చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
ఎందుకిలా చేశావు తండ్రీ!
వెన్నలాంటి మనసుండే ‘నాన్న’ కన్నపిల్లల పాలిట ఇంత కర్కశంగా ప్రవర్తించడమేమిటి? వేలు పట్టి నడిపించడానికి బదులు మెడపట్టి నదిలోకి గెంటేయడమేమిటì ? ఒక జీవితకాలం భరోసా ఇవ్వాల్సిన తండ్రే జీవితాన్ని చిదిమేయడమేమిటి? నాన్నతనానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనలు మానవత్వాన్ని ఎగతాళి చేశాయి.మలికిపురం: తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచవలసిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు వారిని ఎందుకు చంపాలను కున్నాడో అర్థంకాక జనం ఆశ్చర్యపోతున్నారు. తాను చని పోవడంతో పాటు అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులను గోదావరిలోకి నెట్టేయడం పలువురిని కలచివేసింది. రెండు గ్రామాల్లో విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి శిరిగినీడి దుర్గాప్రసాద్ (38) తన ఇద్దరు సంతానాన్ని సోమవారం సాయంత్రం దిండి – చించినాడ వంతెన పై నుంచి నదిలోకి తోసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు గాలించగా దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్(14) మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు గ్రామాలలో విషాదం రోజూ పాఠశాలలకు అందరితో కలిసి ఎంతో సరదాగా వెళ్లే ఆ చిన్నారులు గోదావరిలో పడిపోయారనే దుర్వార్త రెండు గ్రామాలలో పెను విషాదం నింపింది. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పక్కనే ఉన్న విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు, బంధువులు చెబుతున్నారు. పక్కపక్క గ్రామాలు కావడంతో అత్తింటి వద్ద, పుట్టింటి వద్ద కూడా భార్యాభర్తలు, పిల్లలు ఉండేవారు. కుమారుడు మోహిత్ తొమ్మిదో తరగతి, కుమార్తె జాహ్నవి నాలుగో తరగతి చదువుతున్నారు.పలు అనుమానాలు దుర్గాప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అతను ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదా? లేక తాను ఎక్కడైనా తెచ్చిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు కూడా అత్త వారింటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. సోమవారం సాయంత్రం ఆధార్ కార్డుల అప్డేట్ అంటూ చిన్నారులను బైక్‌పై తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ దిండి– చించినాడ వంతెనపై బైక్, సెల్‌ఫోన్, పర్సు ఉంచి పిల్లలను నదిలో తోసేసి తాను కూడా దూకేశాడు. కారణాలు తెలియనప్పటికీ ఇద్దరు చిన్నారులను చంపాలనుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై రాజోలు సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ చేశామని, కుటుంబ కలహాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య
తమిళనాడు: కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతానికి చెందిన బిందు (34). ఈమె భర్త పేరు జయకుమార్. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఈ స్థితిలో, జయకుమార్ మరణించడంతో ఆమె కొన్ని నెలల క్రితం మరుదంపారై ప్రాంతానికి చెందిన వివన్‌ను రెండవసారి వివాహం చేసుకుంది. ఆమెకు అన్‌తో ఓ కుమార్తె ఉంది. ఈ స్థితిలో, అభిప్రాయ భేదాల కారణంగా, రెండవ భర్త కూడా విడిపోయారు. తరువాత ఆమె తన కొడుకు, కూతురితో కలిసి పున్నియం ప్రాంతంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. ఇంతలో బిందుకి పక్కింట్లో నివసించే విజితో వివాహేతర సంబంధం ఏర్పడింది.విజికి భార్య, కాలేజీ చదువుతున్న కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం గురించి విజి భార్యకు తెలియగానే, ఆమె అతన్ని ఖండించింది. దీని తరువాత, విజి రెండు నెలల క్రితం బిలాంగ్తోట్టవిలై ఆర్సి చర్చి రోడ్డులో బిందును,ఆమె 5వ తరగతి చదువుతున్న కొడుకు, ఎల్‌కెజి చదువుతున్న కూతురుతో కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. దీని తరువాత, విజి పగటిపూట పనికి వెళ్లి రాత్రి బిందుతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవాడు. ఈ పరిస్థితిలో, విజి ఇంటికి రాకపోవడంతో, అతని భార్య అరుమనై పోలీస్ స్టేష¯న్లో ఫిర్యాదు చేసింది. దీని తరువాత, విజి విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు, పోలీసుల విచారణలో, విజి తన భార్య, పిల్లల వద్దకు వెళ్తున్నానని చెప్పాడు. దీంతో బిందు విషపు మాత్రలు తిని మరణించింది. -
అమ్మా.. నాన్న దగ్గరికి వెళ్లిపోయావా..!
మంచిర్యాల జిల్లా: ‘‘అమ్మా.. నాన్న దగ్గరికి వెళ్లిపోయావా.. మా బాగోగులు చూసేదెవరు.. మా వద్దకు ఎప్పుడొస్తవ్.. పొద్దంతా వరంగల్‌లోని దేవాలయాల వద్దకు తీసుకెళ్లి దర్శనాలు చేయించావు. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలన్నావు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యావు.. ఏ దేవునికి అనిపించలేదా..? మాకు దూరం చేయొద్దని..’’ అంటూ ఆ పిల్లలు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి తండ్రిని దూరం చేయగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తల్లీ దూరమైంది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. వేమనపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. మండల కేంద్రం వేమనపల్లికి చెందిన మద్దెర్ల పుష్పలత, వెంకటేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు నిహాల్, రిషిత్, సహస్ర ఉన్నారు. గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహించే వెంకటేష్ ఆరేళ్ల క్రితం కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి సోదరుడు విక్కీ సహాయంతో కిరాణ దుకాణాన్ని పుష్పలత కొనసాగిస్తూ పిల్లలను చదివిస్తోంది. కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వరంగల్‌కు వెళ్లిన పుష్పలత ఇంటర్, 8వ తరగతి చదువుతున్న కుమారులు నిహాల్, రిషిత్లతో కలిసి అక్కడి వేయి స్తంభాల గుడితోపాటు పలు ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు. అనంతరం పిల్లలను హాస్టళ్లలో అప్పగించి తిరుగు ప్రయాణమైంది. ఆమెను తీసుకెళ్లడానికి ఇందారం చౌరస్తా వరకు కారులో వచ్చినట్లు సోదరుడు విక్కీ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గోదావరిఖని బస్టాండ్ వరకు వచ్చిన ఆమె అక్కడి నుంచి తెలిసిన వ్యక్తి చెన్నూర్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి అరుణ్‌కుమార్ మోటార్‌సైకిల్‌పై బయల్దేరింది. గోదావరి వంతెన వద్ద చీర కొంగు మోటారు సైకిల్ టైరులో చుట్టుకుని కిందపడి పుష్పలత(40) మృతిచెందింది. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని వేమనపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పుష్పలత మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కరోనాతో తండ్రి, ప్రమాదంలో తల్లి మృతిచెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, అరుణ్‌కుమార్‌కు గాయాలైనట్లు తెలిసింది. -
టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచి్చంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు... సుధాకర్ యాదవ్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా గత నెల 10 ఉదయం 7.30 గంటలకు ఓ ఫోన్‌కాల్ వచి్చంది. తాను ముంబై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గౌవర్ శుక్లానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. సుధాకర్ యాదవ్‌కు చెందిన సిమ్‌కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలను వినియోగించిన కొందరు భారీ స్థాయిలో మనీ లాండరింగ్ చేసినట్లు గుర్తించామని, మొత్తం 17 కేసులు నమోదయ్యాయని అగంతకుడు చెప్పాడు. ముంబైలోని బాంద్రాలో కొనుగోలు చేసిన సిమ్‌ను వినియోగించారని చెప్పగా సుధాకర్ యాదవ్ తొలుత పట్టించుకోలేదు. కొంతసేపటికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడు దర్యాప్తు అధికారి విక్రమ్‌నంటూ మాట్లాడాడు. ఘరానా నేరగాడు సదాకత్ ఖాన్ ఫొటో, నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ పేరుతో ఉన్న ఉత్తర్వులు చూపించాడు. దీంతో సుధాకర్ ఆందోళనకు గురయ్యారు. రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని... సుధాకర్ యాదవ్ పేరుతో కెనరా బ్యాంకులో ఉన్న ఖాతాలోకి రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, దాని వివరాలు చెప్పే వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. దీంతో తీవ్రంగా భయపడిన సుధాకర్ యాదవ్ తన నిర్దోíÙత్వం నిరూపించుకోవడానికి సిద్ధయ్యాడు. అయితే తన అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లవద్దని, ఎవరితోనూ ఈ విషయం చెప్పవద్దని నేరగాళ్లు షరతు విధించారు. నిర్దోíÙత్వం నిరూపించుకోవాలంటే తాము సూచించిన ఖాతాల్లోని నిరీ్ణత మొత్తం బదిలీ చేయాలని, కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తం రిఫండ్ చేస్తామని నమ్మబలికారు. దీంతో సుధాకర్ యాదవ్ గత నెల 10–15 తేదీల మధ్య తొమ్మిది విడతల్లో సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి రూ.1.07 కోట్లు జమ చేశారు. అయినప్పటికీ తగ్గని సైబర్ నేరగాళ్లు మరో రూ.60 లక్షలు డిమాండ్ చేశారు. ఆ మొత్తం చెల్లిస్తేనే కోర్టు నుంచి క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇస్తామనడంతో ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు విడతల్లో అరెస్టు...ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి సుధాకర్ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లింది. నిందితులను పోలీసులు గుర్తించి మూడు విడతల్లో అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాలు అందించిన వాళ్లు, ఖాతాలు తెరవడానికి, నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సహకరించిన వాళ్లు ఉన్నారు. నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌కు చెందిన సిటిజన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ హిమాన్షు సింగ్, లక్నోకు చెందిన వ్యాపారి రమేష్ కుమార్, ప్రైవేట్ ఉద్యోగి అభిõÙక్ పాండే, విజయవాడకు చెందిన సమీప బంధువులు కోట శ్రీ సుదీప్, కోట శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌కు చెందిన ఎస్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్íÙప్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, మీరట్‌కు చెందిన వ్యాపారి దీపక్ గెహ్లాట్, న్యూ ఢిల్లీలోని జైత్‌పూర్‌కు చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్షిప్ డిప్యూటీ మేనేజర్ నీరజ్ ఉన్నారు. -
అతడిని వదిలిపెట్టొద్దు.. నా జీవితం నాశనం చేశాడు!
హైదరాబాద్: ఆమె బీటెక్ చదువుతోంది.. ప్రేమించానని ఓ యువకుడు నమ్మబలకడంతో ప్రేమపెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతోపాటు అతని కుటుంబసభ్యులు కట్నం, బంగారం తీసుకురావాలని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం... మాన్సూరాబాద్ వాంబే కాలనీలో నివాసం ఉండే కుంచం సైదులు, దుర్గమ్మ భార్యభర్తలు. వీరికి ఓ కుమారుడు, కూతురు గంగోత్రి(21) ఉంది. గంగోత్రి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ చిన్న రావిరాల గ్రామానికి చెందిన నందినితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నందిని అన్న భానును కొన్నిరోజుల క్రితం గంగోత్రికి ఆమె పరిచయం చేసింది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా భాను కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో రెండు నెలల క్రితం కీసరలో వారు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం భాను గంగోత్రిని చిన్నరావిరాలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కట్నం, బంగారం తీసుకురాలేదని భాను కుటుంబసభ్యులు ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. రూ. 30 లక్షల కట్నం, 10 తులాల బంగారం పెట్టాలని గంగోత్రి కుటుంబసభ్యులను డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె కొన్ని రోజుల క్రితం మాన్సురాబాద్లోని తల్లిదండ్రుల వద్ద వచ్చింది. సోమవారం ఉదయం భాను బంధువులను తీసుకుని ఆమె వద్ద వచ్చాడు. కట్నం విషయంలో మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన గంగోత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన చావుకు భాను కారణమని, అతడిని వదిలిపెట్టొద్దని, జీవితం నాశనం చేశాడని సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జ్యూస్ తాగించి మహిళపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: ఓ మహిళకు జ్యూస్ తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా మడ్లూరు గ్రామానికి చెందిన మహిళ (39)ను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి జ్యూస్ తాగించారు. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు యలబుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన లక్ష్మణ కెంచప్ప, బసవరాజ్ సక్రప్ప, భీమప్ప, శశికుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హొసపేటె నుంచి కొప్పళకు బకాయి డబ్బులిస్తామని చెప్పిన యువకుడి మాటలు నమ్మి బాధిత మహిళ వచ్చింది. ఆమె తనకు పరిచయం ఉన్న లక్ష్మణ్‌కు అప్పు ఇచ్చింది. దానిని పొందడానికి ఆ మహిళను కుష్టిగికి పిలిపించారు. లక్ష్మణ్, మరో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో ఆమెను యలబుర్గా తాలూకా మడ్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు
ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
ఐటీ దాడుల అప్డేట్స్: వర్కర్లే బినామీలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదాయ పన్ను శాఖ(IT) సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు.. వాటి చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్యాక్స్ మోసాలతో పాటు బినామీ ఆస్తులనూ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నగరంలోని పిస్తా హౌజ్, షా గౌస్ హోటల్స్, మెహిఫిల్.. ఇలా పలు బిర్యానీ హోటళ్ల మెయిన్ బ్రాంచ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ,మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే మైహిఫిల్ రెస్టారెంట్లలో.. ఓనర్ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. షేక్‌పేటలోని మెహిఫిల్ రెస్టారెంట్‌పై తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు రికార్డులను పరిశీలించి కంగుతిన్నారు. రెస్టారెంట్లో పని చేసే వర్కర్లే బినామీలని.. వాళ్ళ పేరు మీదే ప్రాపర్టీలు ఉన్నాయని గుర్తించారు.సిటీలోనే కాదు.. బయటి దేశాల్లోనూ ఈ రెస్టారెంట్లకు బ్రాంచిలు ఉన్నాయి. సంవత్సరంలో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. అదే సమయంలో.. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ట్యాక్స్ రికార్డుల్లో చూపిన ఆదాయానికి.. వచ్చిన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ట్యాక్స్ చెల్లింపుల్లోనూ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఇదీ చదవండి: ఐ బొమ్మ జస్ట్ పైరసీ కాదు.. అంతకు మించి! -
నందిగామ వద్ద లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సాక్షి, క్రైమ్: ఎన్డీఆర్ జిల్లా నందిగామ శివారులో గత అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నందిగామ బైపాస్ అనాససాగరం వద్ద ఫ్లై ఓవర్‌పై కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని బస్సు ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. 35 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు వెళ్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు ఎడమ భాగం నుజ్జునుజ్జు అయ్యింది. -
సౌదీ ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీలే!
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతిసౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయింది!
దేశ రాజధానిలో జరిగిన ఒక అనూహ్య సంఘటన. ఐదేళ్ల పసివాడి అమాయకపు చేష్ట అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మహానగరాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న హైరైజ్ బిల్డింగ్ సంస్కృతి ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాలు..ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ సెక్టార్ 62లోని హైరైజ్ అపార్ట్మెంట్లోని 22వ అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తోంది. దంపతులు, ఐదేళ్ల కుర్రాడు ఉంటున్నారు దీంట్లో. శనివారం సాయంత్రం ఈ కుర్రాడు, పని మనిషితో కలిసి పార్కుకు వెళాడు. ఇద్దరూ తిరిగివచ్చారు. అయితే.. ముందుగా ఇంటి లోపలికి వెళ్లిన ఆ కుర్రాడు.. ధబాలున తలుపు మూసేశాడు. అంతే.. అప్పటివరకు తెరుచుకుని ఉన్న డిజిటల్ లాక్ కాస్తా పడిపోయింది. తల్లిదండ్రుల పాస్‌కోడ్‌తో మాత్రమే తెరచుకుని డిజిటల్ లాక్ అది. ఇద్దరూ సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత లాక్ చేసేవారు. మిగిలిన సమయమంతా పూర్తిగా లాక్ కాకుండా ఉంటుంది. దగ్గరగా వేస్తే తలుపు వేసినట్టుగానే ఉంటుంది. గట్టిగా వేయడంతో లాక్ పడిపోయింది. లోపల కుర్రాడు ఒక్కడే ఉండిపోయాడు. పని మనిషి గట్టిగా అరుస్తోంది... పిలుస్తోంది. కానీ పిల్లాడి నుంచి స్పందన నిల్. దీంతో గాభరపడ్డ ఆ పనిమనిషి కుర్రాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఈ లోపు...ఇంట్లో ఉన్న కుర్రాడికి ఏమవుతోందో అర్థం కాలేదు. వెనుకనే పని మనిషి ఇంట్లోకి రాలేదు. ఇల్లంతా ఖాళీ. తీద్దామంటే తలుపు తెరుచుకోవడం లేదు. కాసేపు ఇల్లంతా కలియదిరిగాడు. పక్కింటి వాళ్లను పిలుద్దామనుకున్నాడో ఏమో... బాల్కనీలోకి వచ్చాడు. ఎవరో ఒకరు కనపడకపోతారా అనుకుని రెయిలింగ్‌పైకి ఎక్కాడు. సాయం కోసం అరుద్దామని అనుకున్నాడు. కానీ.. కాలు జారింది. 22వ అంతస్తు నుంచి పడిపోయాడు. క్షణాల్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కుర్రాడిని అటుగా వెళుతున్న ఓ వ్యక్తి గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ.. అప్పటికే ఆ పసివాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణైతే చేస్తున్నారు కానీ.. -
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
-
ఇస్త్రీ పెట్టెలో రూ.1.55 కోట్ల బంగారం
హైదరాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.1.55 కోట్ల బంగారాన్ని పట్టు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 14న షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి గురించి ముందస్తు సమా చారం ఉన్న డీఆర్ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె (ఐరన్ బాక్స్)ను విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆ బంగారం విలువ రూ.1.55 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. క్యారియర్‌గా ఆ బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దానిని ఎవరికోసం తెచ్చాడన్న విషయంపై దర్యాప్తు చేయగా, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆచూకీ కనిపెట్టడం అంత ఈజీ కాదు...
నేపాలీలు మరోసారి పంజా విసిరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్ రాజ్ ఇంట్లో జరిగిన రూ.2 కోట్ల సొత్తు చోరీ కొలిక్కి రాకముందే.. కార్ఖానా ఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున మరో దొంగతన జరిగింది. ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో ఇటీవల పనిలో చేరిన ఇద్దరు నేపాలీలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఇలా.. గడచిన తొమ్మిదేళ్లల్లో, వివిధ ఘటనల్లో నేపాలీలు ఎత్తుకుపోయిన సొత్తు రూ.7 కోట్లకు పైగానే. ఈ కేసుల్లో నిందితులు చిక్కడం, సొత్తు రికవరీ కావడం దుర్లభంగా మారింది.ఆచూకీ కనిపెట్టడం అంత ఈజీ కాదు... నేరాలు చేస్తున్న నేపాలీల ఆచూకీ కనిపెట్టడం కూడా అంత తేలిక కాదని పోలీసులు చెబుతున్నారు. అక్కడ నుంచి వచ్చే వీరికి ఇమ్మిగ్రేషన్ వంటివి ఉండట్లేదు. ఫలితంగా ఎప్పుడు వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? అనేవి వాళ్లు చెప్పే వివరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క ఇలా వచి్చన వాళ్లు నేరం చేసిన తర్వాత ఇక్కడే నివసిస్తున్నా పట్టుకోవడం దుర్లభంగా మారింది. సెల్ఫోన్లు, సెల్ నెంబర్లతో పాటు తమ గుర్తింపులు, పేర్లు కూడా మార్చేస్తుండటమే దీనికి కారణం. 2018లో అబిడ్స్ పరిధిలో నేరం చేయించిన కమల్ ఆ తర్వాత నగరానికి వచ్చి తలదాచుకున్నాడు. తాజాగా మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌లో మరో చోరీ చేయించాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కమల్‌ను పట్టుకున్న పోలీసులు విచారిస్తే 2018 నాటి నేరం బయటపడింది. పోలీసులకు ఎన్నో తలనొప్పులు.. నేపాలీలు నేరాలు చేసినప్పుడల్లా ఆ కేసుల దర్యాప్తు పోలీసులకు పెనుసవాలే. వీరికి ఉద్యోగాలు ఇస్తున్న సెక్యూరిటీ సంస్థలు, ఏజెన్సీలు తమ వద్ద పూర్తి వివరాలు ఉంచుకోకపోవడం, ఉన్న అరకొర వివరాలూ క్షేత్రస్థాయిలో క్రాస్ చెక్ చేసుకోకపోవడం వంటి కారణాలతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. మన పోలీసులు సరిహద్దులు దాటి వెళ్లినా... అక్కడి పోలీసుల సహకారం లేక నిందితులు చిక్కట్లేదు. 2017లో కార్ఖానా ఠాణా పరిధి నుంచి రూ.3 కోట్ల సొత్తు, నగదును నేపాలీలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితులకు సంబంధించి పోలీసులు వద్ద పూర్తి ఆధారాలు, నేరగాళ్ళ చిరునామాలు ఉన్నాయి. అనేక ప్రత్యేక బృందాలు కొన్ని నెలల పాటు నేపాల్ వెళ్లి మకాం వేసి మరీ వచ్చాయి. అయినప్పటికీ స్థానిక పోలీసుల నుంచి సహకారం లేని కారణంగా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అనుమానితుల విచారణలో భాష అనేది మరో ప్రధాన అడ్డంకిగా మారుతోంది. తాజా అరెస్టుల మాదిరిగా దేశ సరిహద్దులు దాటకుండా నేపాలీలు చిక్కితే మాత్రమే కొద్దొగొప్పో రికవరీలకు ఆస్కారం ఉంటోంది. ఆర్మీ మాజీ అధికారిని బంధించి భారీ దోపిడీహైదరాబాద్: ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన భార్యాభర్తలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఆర్మీ అధికారిని తాళ్లతో కట్టివేసి ఇంట్లోని 18 తులాల బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పరారయ్యారు. ఈ ఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్‌లోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో జరిగింది. తిరుమలగిరి ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో కెపె్టన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డీకే గిరి కార్ఖానా గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో భార్య స్మితతో కలిసి ఉంటున్నారు. వీరి ఇంట్లో గత నెల 21న బేగంపేటలోని రాజ్వీర్ సెక్యూరిటీ సంస్థ ద్వారా నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు రాజేందర్, పూజా పని మనుషులుగా చేరారు. ఈ క్రమంలో స్మిత తల్లి శనివారం మరణించడంతో అంత్యక్రియల కోసం గిరి దంపతులు వెళ్లారు. సాయంత్రం గిరి రాత్రి ఇంటికి రాగా స్మిత అక్కడే ఉండిపోయింది. రాత్రి 12.15 గంటలకు ట్యాక్సీలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. గ్రౌండ్ ప్లోర్లో ఉన్న 60 ఏళ్ల మరో పని మనిషి దగ్గరకు వచ్చి మత్తు పానీయాన్ని తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఆరుగురు కలిసి గిరి ఉంటున్న మొదటి అంతస్తులోకి వెళ్లి ఆయనను బెదిరించారు. ఆయనకు మత్తు మందు తాగించేందుకు ప్రయత్నించగా నిందితుల్లో ఒకడి చేతిని కొరకడంతో.. తాళ్లతో ఆయన కాళ్లూ చేతులు కట్టేసి కొట్టారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆయన స్పృహ తప్పినట్లు చేసి కింద పడిపోయాడు. నిందితులు బీరువాలోని బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పాటు బాధితుడి ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, గొలుసును లాక్కుని పరారయ్యారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో గిరి గట్టిగా కేకలు వేయడంతో పక్కన నివస్తున్నవారు వచ్చి గిరి కట్లు తొలగించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకునేందుకు ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
కుప్పంలో దారుణం.. హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చి..
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణ ఘటన జరిగింది. వ్యక్తిని హత్యచేసి ఇంట్లోనే పూడ్చేశారు. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్‌గా గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ హత్యకు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.కర్ణాటక రాష్ట్రం అత్తిబెలె సమీపంలో గత నెల 27న శ్రీనాథ్ అదృశ్యమయ్యాడు. కుప్పంలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ను రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ హత్య చేసినట్లు సమాచారం. ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ప్రభాకర్‌పై హత్య కేసు నమోదైంది. మృతుడు శ్రీనాథ్ కుప్పం వాసి కాగా, కర్ణాటకలోని అత్తిబెలెలో స్థిరపడ్డాడు. -
డంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి..
కరీంనగర్ జిల్లా: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు కోర్టులో రూ.5వేల జరిమానా కట్టాల్సి వస్తుందన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) స్థానికంగా కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ప్రియాంక, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుపడ్డాడు. ఈ నెల 14న పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. మేజి్రస్టేట్ లేకపోవడంతో కేసు వాయిదా పడింది. రూ.5వేల జరిమానా కట్టాల్సి ఉందని, ఎక్కడ నుంచి తేవాలని శనివారం భార్య ప్రియాంకకు చెప్పి బాధపడ్డాడు. మధ్యాహ్నం బెడ్రూంలో పడుకుంటానని, పిల్లలను ఇంటి ఎదుట ఆడించాలని భార్యకు చెప్పి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి సూర నాగమ్మ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. -
యజమాని కారు ఢీకొని యువకుడి మృతి
అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్‌కుమార్‌రాజు(25) కలికిరి క్రాస్ రోడ్డులోని అబు మొబైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహితులైన వినీత్‌కుమార్‌రాజు, నౌషాద్ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్ వెళ్లారు. అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్ రోడ్డులోని మొబైల్ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్‌కుమార్‌రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరేష్‌ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్‌కుమార్‌రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్‌కుమార్‌రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్‌కు తెలియజేశాడు. వెంటనే అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మద్ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్‌కుమార్‌రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్‌కుమార్‌రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివారం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్‌కుమార్.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్ బబ్లూ(నౌషాద్ బాషా), నరే‹Ù, అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లిళ్లు కావడం లేదని.. కర్మలు తొలగిపోవాలని..!
మూఢ నమ్మకాలు.. పిచ్చి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి. దోష నివృత్తి పేరుతో సాటి మనుషుల ప్రాణాలే తీస్తున్న ఘటనలు ఎక్కువై పోయాయి. తమకు ఏదో దోషం ఉందని భావించి 16 రోజుల పసికందును నలుగురు మహిళలు పొట్టన పెట్టుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని జోథాపూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పెళ్లిళ్లు కావడం లేదని..నలుగురు మహిళలు.. ఒక మేనల్లుడు. అయితే సదరు మహిళలకు పెళ్లిళ్లు కావడం లేదు. పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అంతే తమలో ఏదో దోషం ఉందని, అందుచేత ఆ దోష నివృత్తి అనే మూఢ నమ్మకంతో సొంత మేనల్లుడైన 16 రోజుల పసిప్రాయాన్ని తొక్కి చంపేశారు. వారంతా కలిసి తమ కాళ్లతో ఆ పసికందును తొక్కి హత్యచేశారు.ఇదంతా ఒక వీడియోలో రికార్డ్ అయ్యింది. ఒక మహిళ పూనకం వచ్చి ఏదో చెబుతున్నట్లు ఉండగా, చుట్టూ మహిళలు కూర్చొని ఉంటారు. ఆ మహిళా ఏదో చెబుతూ ఉంటుంది. వీరంతా ఆమె చెప్పేది ఆసక్తిగా వింటూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక మహిళ తన ఒడిలో పసికందుతో కూర్చొని ఉంటుంది. ఇలా పూనకం వచ్చిన ఆమె ఆదేశానుసారం ఆ పసికందును అక్కడ కూర్చొన్న మహిళలు తొక్కి చంపేశారు. భ్రూణ హత్యలపైనే నిషేధం విధించిన ఈ కాలంలో.. ఇలా పుట్టిన ఒక బిడ్డను అతిపాశవికంగా చంపేయడం వారి ఆటవిక నాగరికతకు అద్దం పడుతోంది. వారికి వేసే శిక్ష ఘోరంగా ఉండాలి: యువకుడి తండ్రిఇదంతా వరుసకు వదినలు అయ్యేవారు చేసిన పనే అని ఆ పసికందు తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. వారి పెళ్లిళ్ల కోసం ఇలా చేశారంటూ బోరమంటున్నాడు, వారికి పడేశిక్ష అత్యంత కఠినంగా ఉండాలని తండ్రి పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నాడు. ఈ కేసులో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. -
‘ఐ బొమ్మ’ రవి ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
పైరసీ భూతంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఐ-బొమ్మ(ibomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని.. సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. ఇమ్మడి రవికి, అతని భార్యకి కొంత కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులోనూ నడుస్తోంది కూడా. ఈ క్రమంలో.. విడాకుల కేసు కోసమే రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు తెలుస్తోంది. అలా.. భార్య అందించిన టిప్పుతో రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. చంచల్‌గూడ జైలుకు రవి.. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో రవిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. I BOMMA , BAPPAM వెబ్ సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. పైరసీ కంటెంట్‌తో బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేశాడని తెలుస్తోంది.కంటెంట్‌ను ఆపేసి..ఇక విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లనూ కూడా గుర్తించారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ ఉదయం నుంచి సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. అతని స్నేహితులనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది. గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో గతంలో పోలీసులకి, సినీ పెద్దలకి ఐ-బొమ్మ ఓ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ దాకా వస్తే.. పోలీసుల సంగతి చూడాల్సి వస్తుందంటూ ఓ బహిరంగ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ వ్యవహారంలోనూ రవి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య
-
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు. -
సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. విభిన్న కథనాలెన్నో.. కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్‌లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజన్‌ను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్‌ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. ఐదుగురితో పోలీస్ పికెట్ మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
కిటికీలోంచి చెయ్యి పెట్టి.. తలుపు గడియ తీసి..
రాజేంద్రనగర్: కిటికీ పక్కనే ఇంటి ప్రధాన ద్వారం ఉండటం దొంగ వరంగా మారింది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా 31 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిస్మత్పూర్ ఓంనగర్ ఎస్ఎం ఎన్‌క్లేవ్‌లో కిరణ్ గౌడ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. కిరణ్ బంధువుల ఇంట్లో గురువారం వివాహం జరగాల్సి ఉంది. లాకర్ నుంచి 31 తులాల బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. మంగళవారం కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో ఇంటి వెనకాలే ఉన్న పిట్ట గోడ దూకి లోనికి వచి్చన దొంగ.. ప్రధాన ద్వారం పక్కనే తెరిచి ఉన్న కిటికీలోంచి చెయ్యిపెట్టి గడియ తీసి లోపలికి వెళ్లాడు. బీరువాలోని బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అంతకుముందు ఇదే ఎన్‌క్లేవ్‌లోని రెడ్డి విజయ్ ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లాడు. బీరువా కప్ బోర్డు అన్ని వెతకగా ఏమీ దొరకలేదు. దీంతో కప్ బోర్డు తలుపులను విరగ్గొట్టి బయట పడేశాడు. కిరణ్ గౌడ్ ఇంట్లో చోరీ అనంతరం మరో ఇంటి ప్రహరీ దూకి లోపలికి వెళ్లా డు. అçప్పుడే నిద్ర లేచిన యజమాని ఎవరు అని ప్రశ్నించే లోపు గోడ దూకి పరారయ్యాడు. ఎంఎస్ ఎన్క్లేవ్ వాచ్‌మన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ఏడు నెలల గర్భిణి మృతి
మంచిర్యాల జిల్లా: వారిది ఒక అందమైన గిరిజన కుటుం బం. భర్త బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తుండగా, భార్య బీఎడ్ పూర్తి చేసి అంగన్వాడీ ఆయాగా పని చేస్తోంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉండగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మరో రెండు నెలలు గడిస్తే వారి కుటుంబంలో మరొకరు చేరుతారనే ఆనందంలో ఉండగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రసవానికి ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణీతో పాటు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమటిచేను గ్రామపంచాయతీ సాముగూడకు చెందిన అనురాధ(35)కు సోనాపూర్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కుడిమేత లక్ష్మణ్‌తో వివాహం జరిగింది. భర్త ఢిల్లీలో విధులు నిర్వహిస్తుండగా, అనురాధ తన తల్లి ఇంటివద్ద ఉంటుంది. ఏడు నెలల గర్భిణి అయిన అనురాధకు బుధవారం ఉదయం కడుపునొప్పి, ఫిట్స్ రావడంతో 108 అంబులెన్స్‌లో మంచిర్యాలలోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడ మరోసారి ఫిట్స్ రావడంతో వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో అనురాధ మృతిచెందింది. కాగా పుట్టిన మగశిశువును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో ఫిట్స్ రావడంతో గర్భిణి మృతిచెందిందని, కొద్ది సేపటికి శిశువు సైతం మృతిచెందినట్లు మండల పీహెచ్సీ వైద్యురాలు దివ్య తెలిపారు. ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రాక కోసం మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరుపలేదు. -
భార్య బెడ్ రూమ్‌లో సీసీ కెమెరాతో నిఘా పెట్టిన సాఫ్ట్వేర్ భర్త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెళ్లయి ఆరు నెలలు నిండకముందే వరకట్న వేధింపులకు ఓ అబల బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు కుమార్తె అంజలి (19)ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి ఉపేందర్–ఉమ దంపతుల కుమారుడు సాయికుమార్‌కు ఇచ్చి ఈ ఏడాది మే 14న వివాహం జరిపించారు. రెండెకరాల పొలం, ఐదు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు వరకట్నంగా అందజేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్ డెకరేషన్ పని చేస్తున్న సాయికుమార్ భార్యను స్వగ్రామంలోనే ఉంచి తరచూ వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో మరికొంత కట్నం తేవాలని భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిరంజని, ఆమె భర్త మోహన్‌ప్రసాద్ వేధించసాగారు. దీంతో వెంకటేశ్వర్లు కుల పెద్దల వద్ద మాట్లాడగా.. ఇకపై మంచిగా చూసుకుంటానని సాయికుమార్ చెప్పినా ఆ రోజు నుంచి అంజలికి వేధింపులు మరింత పెరిగాయి. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేయగా అంజలి మానసిక క్షోభకు గురైంది. సాయికుమార్ ఆదివారం మరోసారి ఘర్షణ పడడంతో మనస్తాపానికి గురైన అంజలి ఇంట్లోనే పురుగులమందు తాగింది. వెంటనే సాయికుమార్ ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కానీ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అంజలి మృతి చెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సాయికుమార్, అతడి కుటుంబసభ్యులు ఇల్లెందుకు చేరుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అత్తింటివారిపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు. -
పెళ్లికి ఒకరోజు ముందు వరుడి ఆత్మహత్య
నిజామాబాదు జిల్లా: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్ కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతాప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయి తే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికి నా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
ట్రాన్స్‌జెండర్ రాజేశ్వరి ఆత్మహత్య
వరంగల్ జిల్లా: కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్‌లోని రామగోపాలపూర్‌లో చోటు చేసుకుంది. మామునూరు ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మడిసిలేరు గ్రామానికి చెందిన సోది కృష్ణ కుమారుడు శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి (20) నాలుగు సంవత్సరాల నుంచి బంధువు శ్యామల అక్షరతో కలిసి రామగోపాలపూర్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం శివప్రసాద్ ట్రాన్స్ జెండర్‌గా సర్జరీ చేయించుని రాజేశ్వరిగా పేరుమార్చకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామగోపాలపూర్‌లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
యువతి సజీవ దహనం కేసు కీలక మలుపు
పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు మండలం ముద్దాపురంలో నిద్రిస్తున్న యువతి సజీవదహన మైన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా తాజాగా కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లుగా సమాచారం. 2022లో జరిగిన ఈ ఘటనలో ముళ్లపూడి శ్రీను, రూప దంపతుల కుమార్తె నాగహారిక (19) తన గదిలోని మంచంపై సజీవదహనమైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని అప్పట్లో అనుమానాస్పద మృతిగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాగహారిక అమ్మమ్మ, మేనమామలు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనంటూ అప్పట్లో ఆరోపణలు చేయడంతోపాటు పోరాటం చేశారు. ఇటీవల కేసుకు సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలకమైన ఆధారాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోలుపోసి నిప్పంటించి హత్యచేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. నాగహారిక తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా సెలవులకు ఇంటికి వచ్చి మృతిచెందడం అప్పట్లో సంచలనంగా మారింది.పోలీసుల అదుపులో నిందితులు?యువతి సజీవ దహనం ఘటనకు సంబంధించి తాజాగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ముళ్లపూడి శ్రీనివాస్ మొదటి భార్య వసంత 2003లో మృతిచెందగా రూపను రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కుమార్తె అయిన నాగహారిక విషయంలో అప్పట్లో ఆస్తి వ్యవహారంలో తగాదాలు రావడంతోనే హత్య చేసి ఉంటారనే ఆరోపణలు ఏర్పడ్డాయి. ప్రధానంగా యువతి తండ్రి శ్రీనివాస్‌తోపాటు సవతి తల్లి రూపపై కూడా అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నది వారినేనని, సూత్రదారులు, పాత్రధారులు కూడా వారేనని అని పలువురు అనుమానిస్తున్నారు. -
ఒక్కటిగా మెలిగి.. ఒక్కటిగానే మృత్యు ఒడికి చేరిన స్నేహితులు
మృత్యువు మింగేసింది.. నిశీధి వేళలో నలుగురు స్నేహితులను కర్కశంగా కబళించేసింది.. వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.. నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది.. మృతదేహాల్ని మూటగట్టింది.. సరదాగా కారులో బయలుదేరిన వారికదే ఆఖరి మజిలీ అయ్యింది. ఆశల్ని,ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది.. కన్నవారికి, తోబుట్టువులకు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ముగ్గురు మొగల్రాజపురానికి చెందిన వారు కాగా, మరొకరు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన యువకుడు. ఘటనపై ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నప్పటి నుంచీ మిత్రులే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేష్ బాబు(24), ఈటె ప్రిన్స్బాబు(22), గొరిపర్తి పాపారావు అలియాస్ పాపయ్య(23) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. పదో తరగతి వరకూ కలిసే చదివి, ఆ తరువాత కూడా స్నేహం కొనసాగించారు. మొగల్రాజపురం బందులదొడ్డి సెంటర్ సమీపంలో నివాసం ఉండే రాకేష బాబు తండ్రి చక్రపాణి దస్తావేజు లేఖరి. చక్రపాణికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడైన రాకేష్ తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. ఇటీవలే స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ఐజీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో అటెండరుగా చేరాడు. కుమారుడి మర ణ వార్తతో చక్రపాణి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలోని గిరిపురంలో ఉండే ఈటే ప్రిన్స్బాబు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రిన్స్ తండ్రి రామయ్య రాడ్ బెండింగ్ కార్మికుడు. పాపారావు అలియాస్ పాపయ్య మొగల్రాజపురంలోని బాలభాస్కర నగర్ కనకదుర్గ మ్మ గుడి రోడ్డులో కొండపైన నివాసం ఉండే గొరిపర్తి శివయ్య, యశోదకు రెండో కుమారుడు. ఈయన మెడికల్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పాపయ్య తండ్రి శివ య్య ట్రాక్టరు డ్రైవరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపయ్య మాట్లాడుతుండటంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పాపయ్య చికిత్స పొందుతూ మరణించారు. కొణతం చింతయ్య(19)ది కంకిపాడు మండలం కుందేరు స్వగ్రామం. చింతయ్య వ్యవసాయ కూలీ. చింతయ్య తండ్రి బాలకృష్ణ పాల వ్యాపారం చేస్తుంటాడు. అటు వ్యవసాయం, ఇటు పశుపోషణ సాగిస్తూ చింత య్య కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. మృతుల్లో ఒకరైన పాపారావుది కూడా కుందేరు గ్రామమే. అయితే కొన్నాళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డారు. తల్లడిల్లి.. సొమ్మసిల్లి.. బయటకు వెళ్లిన బిడ్డలు ఇంటికి వస్తారని ఆశగా చూస్తున్న ఆ కుటుంబాలకు విషాదమే మిగిలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వచ్చిన ఫోన్‌తో గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాలను శోకంలో ముంచెత్తింది. స్నేహితుడి కోసం వెళ్తున్నామని చెప్పి, పుట్టినరోజు వేడుక అని చెప్పి బయటకు వెళ్లి శవమై తిరిగి వచ్చారంటూ మృతుల తల్లిదండ్రులు, రక్తసంబం«దీకులు పెట్టిన రోధనలు ప్రతి ఒక్కరినీ కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. బిడ్డల మృతదేహాలను చూస్తూ తల్లిడిల్లి సొమ్మసిల్లి పడ్డ కుటుంబ సభ్యులను చూసి అందరి మనసూ చలించింది. విజయవాడ నుంచి ఎందుకు వచ్చారు? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ఉయ్యూరు వైపు ఎందుకు వస్తున్నారు? రావాల్సిన అవసరం ఏముంది? అర్థం కాని స్థితిలో రోడ్డు ప్రమాదం తమ బిడ్డలను తీసుకెళ్లిపోయిందంటూ మృతుల బంధువుల రోదనలు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటాయి. తోడుగా ఉంటారనుకున్న కొడుకులకు తల కొరివి పెట్టే శిక్ష ఎందుకు వేశావంటూ గుండెలు బాదుకుంటూ రోధించారు.కలిసే మృత్యు ఒడికి.. చాట్రగడ్డ రాకేష్ బాబు స్నేహితుడిని రైల్వేస్టేషన్లో దింపుతానని సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి కారు తీసుకుని బయలుదేరి వెళ్లాడు. స్నేహితులు ప్రిన్స్బాబు, పాపయ్యను ఎక్కించుకున్న రాకేష్‌బాబు కుందేరులో ఉంటున్న పాపయ్య బంధువు వరుసకు తమ్ముడు కొణతం చింతయ్య వద్దకు వచ్చారు. తమ స్నేహితుడి పుట్టినరోజు అని చెప్పి చింతయ్యను కూడా కారులో ఎక్కించుకుని వెళ్లారు. రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోయే సరికి రాకేష్‌బాబు తండ్రి చక్రపాణి అర్ధరాత్రి 12, ఒంటి గంట మధ్యలో ఫోన్ చేయగా తాను పాతపాడు చర్చికి వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే వీరంతా కుందేరులో చింతయ్యను ఎక్కించుకుని విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి మీదుగా ఉయ్యూరు వైపు ప్రయాణం సాగించారు. వీరు ప్రయాణిస్తున్న కారు గండిగుంట సమీపంలోని పెట్రోలు బంకు 1.32 గంటలకు క్రాస్ అయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం 1.34 గంటల సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి, సర్వసు రోడ్డుకు మధ్యన ఉన్న బోదెలోకి దూసుకెళ్లి మూడుకు పైగా పల్టీలు కొట్టింది. ఈ పల్టీలు కొట్టే క్రమంలో కారు పూర్తిగా ధ్వంసమై కారు అద్దాలలో నుంచి ఒక్కరొక్కరుగా రోడ్డుపై పడ్డారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని ఊహించని వారు తీవ్ర గాయాలపాలై తనువు చాలించారు. ఘటనాస్థలంలోనే ఈటే ప్రిన్స్బాబు, చాట్రగడ్డ రాకేష్‌బాబు, కొణతం చింతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన గొరిపర్తి పాపారావును 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు. అతివేగం, మద్యం మత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారిపై డేంజర్ బెల్స్ జాతీయ రహదారి మార్గంపై డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని భయానక పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు, ప్రజలు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, ఈడుపుగల్లు, గోసాల సెంటర్, కంకిపాడు బైపాస్, ప్రొద్దుటూరు, దావులూరు టోల్గేట్, నెప్పల్లి సెంటరు, పెద ఓగిరాల, చిన ఓగిరాల, గండిగుంట, గురజాడ, తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, నిడుమోలు జంక్షన్, మొదలైన ప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి నిర్మాణంలో లోపాలు, సర్వసు రోడ్డు జంక్షన్లు, రాత్రిళ్లు హైవేపై లైట్లు వెలగకపోవటం వంటి అనేక సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. దీనికి తోడు వాహనాల మితిమీరిన వేగం కూడా ప్రమాదాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ఎన్‌హెచ్ అధికారులు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు నివారణ, వీధి దీపాలు నిర్వహణ తదితర అంశాలపై సామాజిక కార్యకర్తలు ఇటీవల స్వయంగా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవటం గమనార్హం. -
కొత్త బట్టలు వేసుకుందువు లెయ్యి రా!
నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్‌డే ఉండటంతో సోమవారం కార్తీక్‌ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్‌డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నా తల్లి, తమ్ముడు దెయ్యాలు.. అందుకే చంపేశా..!
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తల్లి, సోదరుడిని చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. సోమవారం తెల్లవారుజామున గునుపూటి మహాలక్ష్మి (60), గునుపూటి రవితేజ(33) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోయడానికి ఉపయోగించే చాకుతో నిందితుడు గునుపూటి శ్రీనివాస్ వారిని కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఒకటో పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి, పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు రవితేజతో కలిసి నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. మృతురాలి భర్త కోవిడ్ సమయంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పెద్ద కొడుకు శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడని, అప్పుడప్పుడూ మాత్రమే బయటకు వస్తుంటాడని చెబుతున్నారు. శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసి.. 112కు ఫోన్ హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ నేరుగా డయల్ 112కు ఫోన్ చేసి హత్య వివరాలు తెలిపాడు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా.. వారిద్దరినీ తానే చంపానని, వాళ్లు దెయ్యాలని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో తనను బంధించారని, తన మనసులో ఏం మాట్లాడుకుంటున్నా అది వాళ్లిద్దరికీ తెలిసిపోతోందని, ఎంత పొడిచినా వాళ్లిద్దరూ రక్తపు మడుగులో కొట్టుకోవడం చూస్తే బతికి వచ్చి మళ్లీ తనను ఇబ్బంది పెట్టేలా ఉన్నారని చెప్పాడు. అతని మాట తీరు, చెప్పిన సమాధానాలను బట్టి అతనికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
నంద్యాల జిల్లా: దైవదర్శనానికి వెళ్తుండగా రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామం వద్ద 40వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా జెర్నీ గ్రామానికి చెందిన మహేష్ రుద్రయ్యమాట్‌పతి(51), సంజయ్జాదవ్, కన్‌హబ్‌రాంరావు స్కార్పియో వాహనంలో తిరుపతి దర్శనానికి ఆదివారం సాయంత్రం బయలుదేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో బలపనూరు వద్ద కానుగల వాగుపై ఉన్న కల్వర్టును ఢీకొంది. కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహేష్ రుద్రయ్యమాట్‌పతి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దరికి వైద్య సేవలు అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి ప్రమాద వివరాలపై ఆరా తీశారు. హైవే సిబ్బంది ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాన్ని తొలగించి స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్న ట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కన్‌హబ్‌రాంరావు నిరంతరంగా దాదాపు 12 గంటల పాటు వాహనం నడుపుతూ అలసిపోయి నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో మిగతా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. -
మృత్యువుతో పోరాడి.. తుది శ్వాస విడిచి
కాకినాడ క్రైం / జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరం జాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్‌లో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీనితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదానికి గురైన చైతన్యకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటికే కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, ఆమెను తొలుత అత్యవసర విభాగంలో ఉన్న సీఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆర్ఐసీయూ–2లో చేర్చారు. కాళ్లు రెండూ ఛిద్రమవడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో కాలి నుంచి ఇన్ఫెక్షన్ శరీరానికి వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆదివారం దుర్గాచైతన్య ఎడమ కాలిని తొలగించారు. ఎమర్జెన్సీ ఓటీలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి పూర్తయ్యింది. అనంతరం ఆమెను ఆర్ఐసీయూ–1కి తరలించి పరిశీలనలో ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో దుర్గాచైతన్య ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చైతన్య చివరికి ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని వయసులో చేయని తప్పుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన బాలిక దయనీయ స్థితి వైద్య సిబ్బందితో కన్నీళ్లు పెట్టించింది.ఇర్రిపాకలో విషాదంనిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాచైతన్యది జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. ఆమె తండ్రి సన్యాసిరావు, తల్లి కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాచైతన్య పెద్ద కుమార్తె. సన్యాసిరావు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను తనలా కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని ఎంతో ఆశపడేవాడు. అందుకే కాకినాడలో పెద్ద కుమార్తెను నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. ఆమె ఉద్యోగంలో స్థిరపడితే తన కాళ్లపై తాను నిలబడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి దుర్గాచైతన్య మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
అల్లుడు కాదమ్మో యముడు
పశ్చిమ గోదావరి జిల్లా: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను, అడ్డు వచ్చిన మామ, బావమరిదిని నరికిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లలకోడేరు శివారు తుమ్మలగుంట పాలెంకు చెందిన కడలి సత్యనారాయణ తన కూతురు శ్రీలక్ష్మిని 17 ఏళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలికి చెందిన వీరవల్లి రామచంద్రరావు అలియాస్ చందుకు ఇచ్చి పెళ్లి చేశారు. చందు తరచూ ఖతర్ వెళ్ళి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు సార్లు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకున్నారు. మూడేళ్ల నుంచి తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. కూతురు మహేశ్వరికి కత్తి చూపి మీ అమ్మను చంపేస్తాను అని బెదిరించేవాడు. ఆ విషయం తాత సత్యనారాయణకు చెప్పింది. భయపడ్డ అతను శీలక్ష్మని తన ఇంటికి తీసుకొచ్చాడు. పాలకోడేరు, అత్తిలి పోలీసులు చందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నెల 9న రాత్రి చందు కత్తితో వచ్చి బయట ఉన్న శ్రీలక్ష్మీ భుజంపై నరికాడు. అడ్డు వచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ ను కూడా నరికాడు. చుట్టుపక్కల వారు వచ్చి ముగ్గురిని భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై రవివర్మ తెలిపారు. మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
విశాఖపట్నం జిల్లా: వివాహమై ఏడాది కాకముందే దేశంశెట్టి విజయ శ్యామల (25) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. శారీరకంగానే కాదు.. మానసికంగానూ భర్త పెట్టిన వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన విజయ శ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, ఎకరా భూమి, రూ. 1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం రూ.లక్ష, సారె ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఎల్లో ఆర్కిటెక్చర్ డిజైనర్‌గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్త దిలీప్ శివకుమార్ తరచుగా ఆమెకు దూరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుతూ ద్వేషిస్తూ మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఆమె ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్లి చూడగా, శ్యామల ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి, తన అన్నావదినలకు సమాచారం అందించాడు. వారు వచ్చిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానంపై ఆరా తీశారు. సోమవారం ఉదయం ఏసీపీ పృధ్వీతేజ ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలను బట్టి, భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, శారీరకంగా, మానసికంగా దూరం పెడుతున్న కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అల్లుడే చంపేశాడు మృతురాలి తల్లిదండ్రులు దేశంశెట్టి రోజారమణి మాట్లాడుతూ తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపించారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండా, అన్నావదినలకు సమాచారమందించడం, వారు వచ్చిన తరువాత పోలీసులకు చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి ఆరోపించారు. తమ కూతురిని వారే పొట్టన పెట్టుకున్నారని, వారికి తగిన శిక్ష వేయాలని రోదించారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ, ఎస్ఐ అప్పలనాయుడు ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. తల్లి రోజారమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త నుంచి హెచ్ఐవీ.. కొడుకును చంపి భార్య ఆత్మహత్య
తమిళనాడు: సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో భర్త వల్ల చిచ్చు చెలరేగింది. అతనికి హెచ్ఐవీ రావడం భార్య, కొడుకు ప్రాణాలను బలిగొంది. కొడుకును హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సిఫ్‌కాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి, హోసూరు పట్టణంలో ఓ వ్యక్తి (44) ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాడు, ఇతనికి భార్య (40), కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అతనికి అనారోగ్యం రావడంతో ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు, హెచ్ఐవి వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. అవాక్కైన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకొన్నారు. వీరిలో బాలిక బాగానే ఉంది, తల్లి కొడుక్కి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆమెకు పిడుగుపడినట్ల అయ్యింది. ఇకపై తాము సమాజంలో జీవించలేమని భయాందోళనకు గురై, శనివారం అర్ధరాత్రి నిద్రపోతున్న కుమారున్ని తలదిండుతో నొక్కి హత్య చేసి, తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం నిద్రలేచిన కుమార్తె చూసి కేకలు వేసింది. స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సిప్కాట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చేరుకొని మృతదేహాలను స్వా«దీనపరుచుకొని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. హెచ్ఐవీకి భయపడవద్దు ఆమెది తొందరపాటు నిర్ణయమని, ఇంకా పలు రకాల పరీక్షలు చేసిన తరువాతే హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్నది లేనిదీ నిర్ధారించాలని జిల్లా ఎయిడ్స్ విభాగం అధికారులు తెలిపారు. హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన భయపడవద్దని, మంచి మందులు వాడుతూ ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. -
ఒక్క రోజులో 12 చోరీలు చేసిన ‘భీమవరం బుల్లోళ్లు’
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముఠా...నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 12 నేరాలు చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా ‘పని’ ముగించింది. వీరి కోసం రంగంలోకి దిగిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ చోరుడు ధరించిన పసు పు రంగు చెప్పులే కీలక ఆధారంగా అధికారులు ముందుకు వెళ్లారు. ఈ గ్యాంగ్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు డీసీపీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, కె.శ్రీకాంత్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. మేలో అరెస్టు... అక్టోబర్‌లో బెయిల్... భీమవరానికి చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉన్నాడు. కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్న ఇతడిపై ఏపీలోని వివిధ ఠాణాల్లో 41 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మేలో పి.గన్నవరం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి అక్టోబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆపై తమ ప్రాంతానికే చెందిన పాత నేరగాళ్లు దాగారపు ఎల్యజూర్ (గతంలో 30 కేసులు), మారుబోయిన మావుళ్లు (గతంలో 6 కేసులు), గండ్రెడ్డి లోకే‹Ùలతో (గతంలో 16 కేసులు) కలిసి ముఠా కట్టాడు. హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుని వచ్చిన వీళ్లు నాదర్గుల్ సమీపంలోని కమ్మగూడలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 5న నందిగామ వెళ్లిన వీళ్లు అక్కడ బైక్ చోరీ చేశారు. దానిపై ఇద్దరు, బస్సులో ఇద్దరు చొప్పున నగరానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి వరుస పెట్టి చోరీలు చేయడానికి నిర్ణయించుకున్నారు. నాలుగున్నర గంటల్లో పది చోట్ల... ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కమ్మగూడ నుంచి ఒకే బైక్‌పై బయలుదేరిన ఈ నలుగురూ హయత్‌నగర్ వెళ్లారు. అక్కడ మరో బైక్ తస్కరించి ఒక్కో దానిపై ఇద్దరు చొప్పున మొదలయ్యారు. తెల్లవారుజామున 1.20–1.40 గంటల మధ్యలో సరూర్‌నగర్‌లోని మూడు దుకాణాల్లో, అట్నుంచి సైదాబాద్ వెళ్లి 1.50–2.15 గంటల మధ్య రెండు దుకాణాల్లో, ఆపై బేగంబజార్ చేరుకుని 3.01–3.15 గంటల మధ్య ఓ దేవాలయంలో, అక్కడ నుంచి సుల్తాన్‌బజార్ వెళ్లి 3.45–4 గంటల మధ్య మరో దేవాలయంలో, చివరకు ఐఎస్ సదన్ వచ్చి 4.15–4.30 గంటల మధ్య దేవాలయం, దుకాణంలో చోరీలు చేశారు. ఆపై తమ షెల్టర్‌కు వెళ్లి మిన్నకుండిపోయారు. వీరికి ప్రతి చోరీలో చిల్లర నాణాలు, కొద్దిపాటి కరెన్సీ నోట్లు మాత్రమే దక్కాయి. ఐఎస్ సదన్‌లోని దేవాలయంలో జరిగిన చోరీని సీరియస్‌గా తీసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. లైట్ల వెలుగులో విభిన్నంగా కనిపించి... ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మధు తమ బృందాలతో రంగంలోకి దిగారు. ఘటనాస్థలాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేశారు. అయితే ఎక్కడా నేరగాళ్లు ముఖాలు, వాహనాల నెంబర్లు స్పష్టంగా నమోదు కాలేదు. ఓ నేరగాడు ధరించిన పసుపు రంగు చెప్పులు మాత్రం రాత్రి వేళ లైటింగ్‌కు విభిన్నంగా కనిపించాయి. దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ వీరి వాహనం వెనుక మరో వాహనం నడిచింది. ఈ ఆ«ధారంగా ముందుకు వెళ్లిన టాస్‌్కఫోర్స్ బృందం సోమవారం నాదర్గుల్ వరకు వెళ్లి కాపుకాసింది. అక్కడ ఓ మద్యం దుకాణం వద్దకు పసుపు చెప్పులు వేసుకున్న నేరగాడే రావడంతో గుర్తించి పట్టుకుంది. ఇతడిచి్చన సమాచారంతో అద్దె ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు నేరగాళ్లుతో పాటు వీరికి సహకరిస్తున్న మహిళ కె.రజ్జి, ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సొమ్ముతో పాటు వాహనాలు, స్రూ్కడ్రైవర్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. -
స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది. అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యారి్థని మృతదేహాన్ని తరలించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచి్చనా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్‌రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్‌చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రాణం తీసిన గుప్తనిధుల తవ్వకాలు
జగిత్యాల జిల్లా: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బీర్పూర్ ఎస్సై రాజు వివరాలు తెలిపారు. కండ్లపల్లికి చెందిన శ్రీరాముల నవత తన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తీయడానికి ముగ్గురు వ్యక్తులను సంప్రదించింది. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నారవేణి మొగిలి, గోవిందుపల్లెకు చెందిన వరికొప్పుల సోమయ్య, ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన భైరవేణి రాజుతో గుప్తనిధులు వెలికితీయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అనుకున్న ప్రకారం శనివారం రాత్రి సమయంలో ఇంట్లో కరెంట్ లేకుండా ఫ్యూజ్‌లు తొలగించి చీకట్లోనే తవ్వకాలు ప్రారంభించారు. 8 ఫీట్ల లోతు గుంత తవి్వనప్పటికీ ఏమీ లభించకపోవడంతో నారవేణి మొగిలి పైకి ఎక్కాడు. అయితే అప్పటికే తొలగించిన ఫ్యూజ్‌లో మొగిలి చేయి తగలడంతో షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య నారవేణి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజుతో కలిసి పరిశీలించారు. -
అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త
హైదరాబాద్: భార్యపై అనుమానంతో భర్త ఆమెను బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి అమీన్పూర్ కేఎస్ఆర్నగర్ కాలనీలోని విష్ణుప్రియ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గుంటూరు నుంచి వచ్చాక తొలుత వీరు హైదరాబాద్‌లో నివాసం ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసం ఉంటున్నారు.కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కోహిర్ బ్రాంచ్‌లో పని చేస్తోంది. వెంకట బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, భార్యపై బ్రహ్మయ్య కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వెంకట బ్రహ్మయ్య బ్యాట్‌తో భార్యను కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.∙ ∙ సంగారెడ్డి జిల్లాలో ఘటన -
హత్య కేసులో ట్విస్ట్.. వాట్సాప్‌లో పర్సనల్ ఫోటోలు, వీడియోలు..
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత అమానుషంగా హత మార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు మహిళల సంబంధం గురించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్, వేదవతి(పేరు మార్చడం జరిగింది)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఐదు నెలల బాబు ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ పసివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తల్లి మాత్రం.. పాలు ఇస్తుండగా ఊపిరాడక పిల్లాడు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె మాటను నమ్మి.. బాబుది సహజ మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు.ఫొటోలు, వీడియోలు.. ఇదిలా ఉండగా.. బాబు చనిపోయిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పును సురేష్ గమనించాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ చెక్ చేయగా, అందులో ఉన్న ఫొటోలు చూసి షాక్ అయ్యాడు. ఆమె మరో మహిళ అయిన సుమిత్రతో ప్రేమలో ఉందని, వీరిద్దరి మధ్య స్వలింగ సంబంధం కొనసాగుతోందని సురేష్ గుర్తించాడు. వారిద్దరికి సంబంధించిన వీడియోలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు.భర్త సురేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించారు. దీంతో, ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. అయితే, అంతకుముందు సురేష్, తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అనంతరం, ఆమె కొంతకాలం తన పుట్టింట్లో ఉంది. కుటుంబ పెద్దల పంచాయతీ తర్వాత తిరిగి భర్త ఇంటికి వచ్చింది. కానీ, రెండు రోజుల క్రితం భర్త, కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో భారతి తన పసివాడికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇది సుమిత్ర సూచన మేరకే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బాలికపై అత్యాచారం
ఇబ్రహీంపట్నం రూరల్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఆదిబట్ల పీఎస్‌లో శనివారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాదర్గుల్లో నివాసం ఉండే బాలిక(17) తల్లిదండ్రులతో కలిసి ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తోంది. ఇదే ఫంక్షన్ హాల్లో చంపాపేట్‌కు చెందిన నేనావత్ శ్రీకాంత్ (19) సైతం పని చేస్తున్నాడు. బాలికను పరిచయం చేసుకొని స్నేహంగా మెలిగేవాడు. ఈక్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై పోక్సో కేసు..మొయినాబాద్: ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బాలుడిపై ఠాణాలో కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నారాయణపేట్ జిల్లాకు చెందిన దంతపతులు బతుకుదెరువుకోసం మొయినాబాద్‌కు వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఆరేళ్ల కూతురు ఒకటో తరగతి చదువుతుంది. రెండో శనివారం సెలకు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల ఇదే ప్రాంతంలో ఉండే బాలుడు(15) అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బాలున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ఇంటి ఓనర్‌తో వివాహేతర సంబంధం.. కొడుకు ముందే..
హైదరాబాద్: కన్న కొడుకు ముందే తల్లి గొంతు కోస్తుంటే ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి(28)కి రమేశ్‌తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. సంవత్సరన్నర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్దలు ఏర్పడ్డాయి. రమేశ్ తన పెద్ద కుమారుడితో వేరుగా ఉంటుండగా స్వాతి తన చిన్న కొడుకు(8)తో కలిసి బహదూర్‌పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కాగా స్వాతికి ఇంటి యజమాని అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్‌తో వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న కిషన్‌ను తనను రెండవ వివాహం చేసుకోవాలని స్వాతి ఒత్తిడి తీసుకు వచి్చంది. దీంతో కిషన్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. స్వాతి కారణంగానే గొడవలు జరగడడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి హత్యకు పథకం రచించాడు కిషన్. ఇందులో భాగంగా బౌరంపేటలోని కేఎల్ యూనివర్సిటీ వద్ద ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్న తన అల్లుడు రాజేష్, తన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేసే వంశీని పురమాయించాడు. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో రాజేష్, వంశీలు గ్రీన్ హిల్స్ కాలనీలోని స్వాతి ఇంటికి వచ్చి ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తన కుమారుడి కళ్ల ముందే తల్లిని అతి కిరాతకంగా హత్య మార్చారు. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్య చేసిన నిందితులు నేరుగా దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్‌పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బైక్ డ్రైవర్‌తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్‌కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్‌ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్‌ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్‌ట్యాప్‌లు కావాలా? -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఎన్టీఆర్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాతుపాటి సాయికుమార్ భార్య సాతుపాటి జ్యోతి (20) గా గుర్తించారు. భార్య భర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భార్య కాలిన గాయాలతో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. -
మొక్కజొన్న తోటలో బాలుడి మృతదేహం
ప్రకాశం జిల్లా: మండల పరిధిలోని చిలకచర్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆర్తి నాగన్న(16) మృతదేహాన్ని పాతి పెట్టి ఉండటం కలకలం రేపింది. ఈ సంఘటన కొద్ది రోజుల ముందు చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్, తహసీల్దార్ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పంచనామా అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి మృతదేహం మొక్కజొన్న తోటలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజులుగా కనబడకుండా పోయిన తమ కుమారుడు ఇలా మొక్కజొన్న తోటలో శవమై తేలడంతో మృతుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించటం అందరినీ కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టనున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అమ్మా.. అంకుల్ చేతులతో తాకుతున్నాడు..
పల్నాడు జిల్లా: తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కుమార్తైపె కన్నేసినప్పటికీ తల్లి నివారించకపోగా కుమార్తె ఫిర్యాదు చేసినా కూడా సహకరించాలంటూ ప్రోత్సహించేందుకు యత్నించిన ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీనగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె భర్తతో వివాదం కారణంగా తొమ్మిదేళ్ల కిందట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సత్తెనపల్లిలో నివసిస్తూ పట్టణానికి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి తులసీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతడు నిత్యం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తైపె కూడా ఎక్కడబడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగంతో ఆమె తల్లికి చెప్పి విలపించింది. అయినప్పటికీ తల్లి నివారించే ప్రయత్నం చేయకపోగా సహకరించాలంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని బంధువైన వృద్ధురాలు ఇటీవల శివాజీనగర్‌లోని మహిళా పోలీస్ తిరుమల లక్ష్మి దృష్టికి తీసుకు రావడంతో వ్యవహారం బట్టబయలైంది. మహిళా పోలీస్ ఈనెల 5న డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జయరాజుకు సమాచారం అందించింది. ఆయన ఈనెల 6న సత్తెనపల్లి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల నేతృత్వంలో ఆ విద్యార్థిని పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చి, జరిగిన ఘటనను వివరించారు. ఆ విద్యార్థిని కనిపించకుండా చేసేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నించగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తొలుత ఆమెను గురువారం నరసరావుపేట వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. శుక్రవారం మంగళగిరి లోని వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తులసీకృష్ణను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో సత్తెనపల్లి సబ్‌జైలుకు తరలించారు. -
విశాఖ: వృద్ధురాలి మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ పక్కిలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.కోడలు, మనవరాలు ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించారు. కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి.. దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.అనంతరం కోడలు.. అగ్ని ప్రమాదం జరిగిందంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అనవసరంగా చిరాకు పెడుతుందనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నారు. -
అయ్యా.. కాపాడండయ్యా..!
అయ్యా.. బస్సు ఢీకొంది.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి... కాపాడండయ్యా.. కాసిన్ని నీళ్లు తేండయ్యా.. శ్రీలత లే... ఒక్కసారి కళ్లు తెరచి చూడు.. అంటూ భార్యను ఒడిలో ఉంచి భర్త చేసిన ఆర్తనాదాలు అక్కడివారిని కన్నీరుపెట్టించాయి. కళ్లముందే భార్య చనిపోవడంతో భర్త చేసిన రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది. విజయనగరం జిల్లా: గరివిడి మండలం గదబవలస పంచాయ తీ పరిధిలోని ఐతాంవలస సమీపంలోని రోడ్డు మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరగంజి శ్రీలత(46) అనే మహిళ దుర్మరణం చెందగా, భర్త సంగంనాయుడికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... తెర్లాం మండలం పెరుమాళి గ్రామానికి చెందిన సంగంనాయుడు, శ్రీలత దంపతులు చీపురుపల్లి మండలంలో ఉన్న మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించుకునేందుకు స్కూటీపై బయలు దేరారు. పెరుమాళి నుంచి చీపురుపల్లి వైపు వెళ్తుండగా ఐతాంవలస గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి.. చీపురుపల్లి వైపు నుంచి ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ వెనుకవైపున కూర్చున్న శ్రీలత వెనుకకు పడిపోగా బస్సు టైరు ఆమె తలమీదుగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడవగా భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఆనందంగా ఉన్నామన్న సమయంలో... వీరిది మధ్యతరగతి కుటుండం. సంగంనాయు డు రాజాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపల్లలు. పెద్దమ్మాయి శ్రావణి శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, చిన్నమ్మాయి సంధ్య నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. కష్టపడి చదివించి న ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారు.. ఆనందంగా ఉందామన్న సమయంలో విధి కన్నెర్రచేసింది. భర్తకు, పిల్లలకు పెద్దదిక్కును బస్సు ప్రమాదం రూపంలో మృత్యుఒడిలోకి చేర్చింది. శ్రీలత మరణంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అతి వేగం, ఘోర ప్రమాదం : హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్
స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అని ఎంత ప్రచారం చేసినా యువత పెడచెవిన పెడుతోంది. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకుల్ని చూసి, ముసలి తనంలో ఆదుకుంటారనే వారి ఆశల్ని అడియాశలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, అతివేగం ,నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణంగా ఎన్నో జీవితాలు అంధకారంలోకి జారిపోతున్నాయి. జీవితాలు, కుటుంబాలు వారి భవిష్యత్తు కూడా విచ్ఛిన్నమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ⚠️ Speed thrills, but kills! Overspeeding and reckless driving don’t just break traffic rules — they break lives, families, and futures.ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.#FallowTrafficRules pic.twitter.com/HWT3Gl3Cz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 6, 2025 యుక్తవయసులోనేకన్నకొడుకుల్నికోల్పోతున్న వారి కడుపుకోతను తీర్చేదెవరు? ఇలాంటి ప్రమాదాలను చూసినపుడైనా యువత ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు రావాలి. వస్తుందని ఆశిద్దాం. ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం


