రామన్నపేట: వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వైద్యురాలు మృతి చెందారు. మృతురాలి భర్త డాక్టర్ సాలు రాఘవేంద్ర తెలిపిన వివరాలివి. డాక్టర్ రాఘవేంద్ర వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఫైనలియర్ చదువుతున్నారు. ఆయన భార్య డాక్టర్ మమతారాణి (33) ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగిసిన తర్వాత మమతారాణిని.. రాఘవేంద్ర స్కూటీపై ఇంటికి తీసుకొస్తున్నారు.
హంటర్‌రోడ్డులోని జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన మమతారాణికి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అన్సారీ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు 9 నెలల గర్భిణి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది


