తమిళనాడు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న క్రమంలో తన ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులు విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తూ ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి వద్ద కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా అగరం గ్రామానికి చెందిన రవి. ఇతని కుమార్తే అరుణ(27).
ఈమె పొన్నేరి సమీపంలోని కీరపాక్కం వీఏఓ. అరుణకు తన సహచర వీఏఓ శివభారతి మూడేళ్లుగా సాగిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. కులాలు కావడంతో అరుణ ఇంట్లో వివాహానికి అంగీకరించలేదు. ఈక్రమంలో గత 29న అరుణ విషం సేవించి ఆత్మహత్యకు యత్నించిందని, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు శివభారతికి సమాచారం అందింది. చికిత్స పొందుతూ అరుణ తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న శివభారతి, అరుణ మృతిలో అనుమానం వుందని ఆరోపిస్తూ తిరుపాళ్యవ నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ పెళ్లికి అరుణ తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో పాటు గతంలో తనపై, అరుణపై దాడి చేశారని పోలీసులకు వివరించారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న అరుణ, 30న రాత్రి తననూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించానని, పెళ్లి విషయాన్ని ఇంట్లో చెప్పడంతో బలవంతంగా తన నోట్లో విషం పోసినట్టు తన వద్ద వాపోయిందని పోలీసులకు వివరించాడు. వారిపై చర్య లు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


