ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్‌కు చెందిన బస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ ముగ్గురూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సు క్లీనర్ అప్రమత్తంగా ప్రయాణికులను హెచ్చరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.


