తమిళనాడు: రెండవ భార్య కుమార్తెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన వ్యవహరంలో తాపీ మేస్త్రీకి మూడు జీవితఖైదులతో పాటూ 45 వేల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. దీంతో పాటూ భాదితుడిౖపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కడలూరు జిల్లాకు చెందిన రాజేంద్రన్. ఇతను కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన హంసవల్లితో వివాహమైంది. వీరికి సంగీత(18) సహా ఇద్దరు పిల్లలు వున్నారు.
ఈ నేపథ్యంలో హంసవల్లికి భర్తతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు. అనంతరం హంసవల్లి విల్లుపురం జిల్లా ఉలుందూరుపేటలోని బందువుల ఇంటికి వచ్చి కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగించడం ప్రారంబించింది. ఈ సమయంలోనే ఉలుందూరుపేటకు చెందిన తాపీమేస్త్రీ రాజూమణి(40)తో ఏర్పడిన పరిచయం రెండవ పెళ్లికి దారితీసింది. దీంతో ఇద్దరు కలిసి 2022లో వివాహం చేసుకున్న తరువాత తన కుమార్తె సంగీతను తనతో పాటూ వుంచుకున్నారు. ఆరు నెలల తరువాత తాపీమేస్త్రీ రాజామణి వరుసకు కుమార్తె అయిన సంగీతపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి హంసవల్లి పూందమల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కేసు విచారణలో తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు రాజామణికి మూడు జీవితఖైదు శిక్షతో పాటూ 45 వేల రూపాయల అపరాధం విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్ పుష్ప తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించిన న్యాయమూర్తి, బాధితులు ఎస్సీ కులాలనికి చెందిన వారు కావడంతో నిందితుడిపై అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా జైలు శిక్ష పడ్డ అనంతరం నిందితుడ్ని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు.


