కర్ణాటక: సరదా ప్రయాణం కాస్తా ప్రాణాంతకంగా మారింది. ఉడుపి నగరం అరేబియా సముద్రంలో డెల్టా బీచ్‌లో పర్యాటకుల పడవ పలీ్టకొట్టిన ప్రమాదంలో నీటమునిగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి దిశ (23) బుధవారం చనిపోయారు. మైసూరుకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగులు 26వ తేదీన రెండు పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవ బోల్తా పడడంతో ఆ రోజే సింధు (23), శంకరప్ప (27) అనే యువతీ యువకులు చనిపోవడం తెలిసిందే. అస్వస్థతకు గురైన దిశ, ధర్మరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దిశ మృతితో మరణాల సంఖ్య 3కు పెరిగింది.
పడవల తనిఖీ: కలెక్టరు
జిల్లా కలెక్టరు స్వరూప మాట్లాడుతూ అక్రమ టూరిస్టు బోట్లను అరికడతామని, బోట్ యజమానులందరూ అధికారులకు డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించారు. అనుమతులు లేని టూరిస్టు పడవలను సీజ్ చేస్తామని చెప్పారు. భద్రతా నిబంధనలను పాటించాలని తెలిపారు.


