భర్తను అంతం చేసిన భార్య
వేధింపులు భరించలేక హత్య
వీడిన మృతి మిస్టరీ
హైదరాబాద్: ఆ దంపతుల మధ్య రోజూ గొడవలే.. పెద్దలు సర్దిచెప్పినా మనస్పర్దలు తగ్గలేదు.. దీంతో భార్య విసిగిపోయింది.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ ని బిగించి ఊపిరి తీసేసింది. ఆ తరువాత మంచంకోడుకు తగిలి చనిపోయాడని బంధువులను నమ్మించింది. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం అందుకు విరుద్ధంగా వచి్చంది. చేసేదిలేక నిందితురాలు నిజం ఒప్పుకుంది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన మేరకు..
నూజివీడుకు చెందిన జగ్గవరపు సు«దీర్‌రెడ్డి (44), బ్రహ్మ జ్ఞాన ప్రసన్న (43) దంపతులు కూకట్‌పల్లిలోని వివినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్, 5వ తరగతి చదివే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధీర్ రెడ్డి ప్రై వేట్ ఉద్యోగం చేస్తుండగా భార్య గృహిణి. ఈ క్రమంలో గతనెల 23న రాత్రి సుదీర్ రెడ్డి మృతి చెందాడు. మంచంకోడుకు తల బలంగా తగలడం వల్ల చనిపోయాడని భార్య.. బంధువులు, పోలీసులకు చెప్పింది. అయితే సు«దీర్‌రెడ్డి అక్క సునీత మాత్రం.. తన సోద రుడి మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోస్టుమార్టం చేయించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
నిజం చెప్పిన పోస్ట్‌మార్టం నివేదిక
ఈ మృతికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆలస్యంగా వచి్చంది. సుధీర్ రెడ్డి గొంతుపై నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. దీంతో పోలీసులు.. మృతుడి భార్య ప్రసన్నను విచారించగా తానే చంపేసినట్లు ఒప్పుకుంది.
వేధింపులు తాళలేకే..
కొన్ని సంవత్సరాలుగా దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్దలు వీరికి సర్దిచెప్పినా పెద్దగా మార్పురాలేదు. నిరంతరం శారీరకంగా, మానసికంగా వేదించటం వల్లే గొడవలు అవుతుండేవని, ఆ రోజు రాత్రి కూడా గొడవ జరిగిందని తెలిపింది. అందుకే మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ వేసి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.


