breaking news
Social Media
-
ఇలాంటి ఉడుతను ఎపుడూ చూసి ఉండరు.. పగబట్టిందా?
మన చుట్టూ ఉంటూ మనతో పాటు జీవాల్లో కుక్కలు, పిల్లలు, ఆవు, గేదె, ఎద్దు, మేకలు గొర్రెలు, ఇతర పక్షులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మన ఇంటిపెరటిలో, మొక్కల్లో ఎపుడూ చెంగు చెంగున తిరిగే బుల్లి ప్రాణి గురించి మనం ఇపుడు మాట్లాడుకోబోతున్నాం. అదేనండి... శ్రీరాముడి చేతిముద్రను వీపు మోస్తూ తిరిగే ఉడుత. దీనికి సంబంధిచి ఒక వీడియో ఒకటి నెట్టింట సందడిగామారింది.ఉడుతలు కూడా పగబడతాయా అన్నట్టు ఉన్న వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ వీకెండ్ మూడ్‌లో సరదాగా మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే.. ఉడుతను తిట్టుకోకండి.. పాపం. బుజ్జి ఉడుత నవ్వుకోండి. ఎందుకంటే ఈ వీడియో ముందు కుక్క అక్కడ తిరుగుతున్న ఉడుతపై ఎగబడింది. దాంతో ఉడుతు ఏమనుకుందో ఏమోగానీ, అక్కడున్న మనిషిపై ఒక్కసారిగా దూకి నానా హంగామా చేసింది. ఆ తరువాత వదల బొమ్మాళి అన్నట్టు కుక్కను కాసేపు కంగారు పెట్టింది. డోర్ బెల్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో దాదాప 12 మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకుంది అదంతా భయపడేతప్ప, ఉడుత తప్పేమీ లేదంటున్నారు నెటిజన్లు.Doorbell camera catches man getting attacked by a squirrel. Have you ever seen a squirrel like this? pic.twitter.com/l2eISJYdQC— AmericanPapaBear (@AmericaPapaBear) July 2, 2025 > ప్రకృతిలో చాలా ప్రాణులు మనతోపాటు జీవనం సాగిస్తుంటాయి.కొన్ని మనకు కనిపించనంత సూక్ష్మంతో ప్రకృతిలో మమేకమై ఉంటాయి. మరికొన్ని మనతోపాటే, మన చుట్టూనే ఉంటాయి.మనతో స్నేహంగా ఉంటాయి. మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. పర్యావరణ సమతుల్యతో తమవంతు పాత్ర వహిస్తుంటాయి. సాధారణంగా మనుషులు తప్ప ఏ ప్రాణీ అకారణంగా ఎవరిమీదా దాడి చేయదు. ఆహారం కోసం, తమకు హాని కలుగుతుందని భావించినపుడు, తమ మీద దాడి చేస్తున్నారని భయపడినపుడు మాత్రమే మనుషులను మీదికి ఎగబడతాయి. ఇందులో పాములకు కూడా మినహింపేమీ కాదు. నిజానికి పాములు చాలా పిరికివట. -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్‌లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.వివరాల ప్రకారం.. భోపాల్‌లోని సుభాష్‌నగర్‌లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A speeding car lost control and overturned on the Subhash Nagar Bridge in Bhopal, leaving two passengers injured.The vehicle hit the divider with such force that its front tyres detached.A live video of the dramatic accident has surfaced, highlighting the dangers of reckless… pic.twitter.com/jd1tnuBiD9— The Sentinel (@Sentinel_Assam) July 2, 2025ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్‌లో ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్‌ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. #WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e— ANI (@ANI) June 12, 2025 -
ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..
మనం పిల్లలకు విలువలు నేర్పించాలే గానీ సౌకర్యవంతంగా జీవించడం కాదు. ఎందుకంటే అన్ని వేళ్లల కంఫర్ట్ జోన్లో ఉండలేం. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అన్నింటిని అలవాటు చేయాలి. విలాసవంతమైన జీవితం కంటే.. మిడిల్‌క్లాస్ లైఫ్‌లోనే జీవితం విలువేంటో తెలుస్తుంది. అందులో ఉండే ఆనందమే వేరు. అదే పిల్లలకు బెస్ట్ అని చెబుతున్నాడు ఇక్కడొక సీఈవో కూడా. అతడి పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారడమే గాక తల్లిదండ్రలందరిని ఆలోచింప చేసేలా ఆకర్షిస్తోంది.నొయిడాకు చెందిన యెస్ మేడమ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మయాంక్ ఆర్య ఇటీవల బిజినెస్ క్లాస్‌లో ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు. పైగా ఆ తాలుకా ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేసుకున్నారు కూడా. అయితే ఆ ఫ్యామిలీ ట్రిప్‌లో అంత ఎంజాయ్ చేసిన ఫీల్ రాలేదని అందుకే మళ్లీ బిజినెస్ క్లాస్‌లో ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేయనని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆ బిజినెస్ క్లాస్‌లో సీట్లు విశాలం, సర్వీస్ కూడా బాగా ఉన్నప్పటికీ.. అందరితో కలిసి ఉండటం మిస్ అవుతోంది. ఏదో తెలియని వెలితి ఉంటుందని అన్నారు. అందరితో కలిసి ట్రావెల్ చేస్తే ఆ జోషే వేరు, పైగా అందులోనే ఓ కిక్కు ఉంటుందని రాశారు. ఎందుకంటే అందిరితోపాటు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తే ఫ్యామిలీ అంతా ఒక దగ్గరగా కూర్చొంటుంది, అలాగే పిల్లలు కూడా ఇతరులతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. పైగా విలవలు గురించి నేర్పించగలుగుతాం అని పోస్ట్‌లో వెల్లడించారు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. మంచి పేరెంటింగ్ అని, పిల్లలకు నేర్పాల్సిందే ఇవేనంటూ సదరు సీఈవోపై ప్రశంసల వర్షం కురింపించారు.(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
వాట్ ఏ టైమింగ్..? ఓ పక్క గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ మరోవైపు..
ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేసి మరి ప్రపోజ్ చేస్తుంటారు. ఎలాంటి డిస్టబెన్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరి అందుకోసం ప్లాన్ చేసుకుంటారు. కాస్త ధనవంతులైతే..వారి రేంజ్‌కి తగ్గట్లుగా ఏ ఫ్లైట్ లేదా అత్యుద్భుతమైన పర్యాటక ప్రదేశంలోనో ప్లాన్ చేస్తారు. కానీ ఈ జంట ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుందో చూస్తే నోరెళ్లబెడతారు. అమెరికాకు చెందిన బ్రైస్ షెల్టన్, పైజ్ బెర్డోమాస్లకు ప్రకృతి వైపరిత్యాలను నిలయమైన ప్రదేశాలంటే అమితా ఆసక్తి. ఆ ఇష్టంతోనే విభిన్న వాతావరణ ప్రాంతాలున్న చోటులను అన్వేషిస్తూ టూర్లు చుట్టొస్తారిద్దరు. ఇద్దరు అభిరుచులు ఒక్కటే. మంచి స్నేహితులు కూడా. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఓ మంచి టైంలో తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్కు ఆ విషయం తెలిపేలా ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.అందుకోసం 18 వారాలుగా నిరీక్షించి మరీ షెల్టన్ తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్ని సౌత్ డకోటాకు తీసుకువస్తాడు. అక్కడ షెల్టన్ సరిగ్గా ప్రపోజ్ చేస్తుండగా..తను కోరుకున్నట్లుగా హఠాత్తుగా టోర్నోడో వస్తుంది. పైగా ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు షెల్టన్. అలాంటి భయంకర ప్రకృతి వైపరిత్యం టైంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా..కానీ సరిగ్గా ఆ టైంకి ఇలా జరుగుతుందా లేదా అని చాలా భయపడ్డానని చెబుతున్నాడు షెల్టన్. ఇక్కడ షెల్టన్ చెప్పే సమయానికే ఆ టోర్నడో(సుడిగాలి) వారిని సమీపించేస్తోంది కూడా. కానీ ప్రేమకు అవేమి కనిపించవు అన్నట్లుగా మునిగిపోయారు ఇద్దరు. అతడి గర్ల్‌ప్రెండ్ సైతం ఈ సర్‌ప్రైజ్‌కి ఆశ్చర్యంతో ఉబితబ్బిబైంది.How on earth could this day ever be topped. Experienced this in South Dakota with the love of my life and now FIANCE as he proposed in the most epic way imaginable. Cannot wait to spend the rest of my life with you @BryceShelton01 ❤️😭 pic.twitter.com/YwaaLF9tMm— Paige Berdomas🌪 (@tornadopaigeyy) June 29, 2025 (చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె!
-రోబోలిప్పుడు క్షవర కళ్యాణానికీ ఎసరు పెట్టేశాయి!-ఇప్పటికైతే ఒక ట్రెండు చోట్ల మాత్రమే కానీ...-ఇంకొన్నేళ్లు పోతే మాత్రం సందు గొందులన్నింట్లోనూ-‘రోబో హెయిర్ కటింగ్ సెలూన్’లు వెలియడమైతే ఖాయం!!!రోబోలొస్తే ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతూనే ఉన్నారు. కానీ, పరిస్థితి మరీ క్షురకుల స్థాయికి చేరుతుందని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు. విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటివరకూ ఏదో హాబీ కొద్ది ఒకరిద్దరు రోబోలతో వెంట్రుకలు కత్తిరించుకునేందుకు, షేవింగ్ చేయించుకునేందుకు ప్రయత్నించేవారేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఇవి వాణిజ్యస్థాయిలో అంటే మన వీధి చివరి సెలూన్ల మాదిరిగా దుకాణాలు తెరవడం మొదలైంది. ఈ ట్రెండ్ ఊపందుకుందీ అనుకోండి.. క్షురకులు గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు!షేన్ వైటన్.. అమెరికా యూట్యూబర్ ఇతడు. ఇంజినీర్ కూడా. ఐదేళ్ల క్రితం ‘స్టఫ్ మేడ్ హియర్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. తన బుర్రకొచ్చిన ఆలోచనలను యంత్రాలుగా మారుస్తుంటాడు. ఉదాహరణకు ఇతడు సృష్టించిన బాస్కెట్‌బాల్ హూప్ (కోర్టుకు ఇరువైపులా ఉండే బోర్డు)! బాల్ ఎలా విసిరినా సరే.. బోర్డు తనను తాను అడ్జెస్ట్ చేసుకుంటుంది. బాల్ కచ్చితంగా రంధ్రంలోకే పడుతుంది! అలాగే.. స్నూకర్ ఆడుతున్నప్పుడు బాల్స్ కచ్చితంగా బాల్స్‌ను రంధ్రాల్లో పడేలా స్పెషల్ ‘క్యూ’ను తయారు చేశాడు. This Video shows a real robotic barber.Similar tech exists, like Shane Wighton's project reported by Popular Mechanics and CNET. It aligns with demos from startups like Snips AI. pic.twitter.com/2sRHIYGUQI— The Artificial Intelligence Techie (@TheAItechie) July 2, 2025ఈ క్రమంలోనే ఈ యువ ఇంజినీర్‌కు హెయిర్ కట్కూ ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి దిగిపోయాడు. బోలెడన్ని విఫల ప్రయత్నాల తరువాత ఓ సక్సెస్ఫుల్ రోబో తయారైంది. వాక్యూమ్ క్లీనర్ వంటిదాన్ని ఉపయోగించి వెంట్రుకలన్నీ పైకి లేచేలా చేసి.. రోబో ద్వారా వెంట్రుకలు కత్తిరించేలా చేశాడు. తల మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్ చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు తల కదలికలను కూడా నమోదు చేసుకుంటూ కదులుతుందీ రోబో బార్బర్!.Basketball hoop that doesn't let you miss by Shane Wighton. pic.twitter.com/WP9tYoVLOP— MachinePix (@MachinePix) May 11, 2020ఇదొక్కటే కాదండోయ్.. స్టూడియో రెడ్ అనే కంపెనీ కెమెరాలు, ప్రెషర్ సెన్సర్ల సాయంతో వాణిజ్యస్థాయి రోబో బార్బర్‌ను రూపొందించే క్రమంలో ఉంది. నేడో రేపో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇది. ఇక ఆటోమెటిక్ హెయిర్ కట్టర్ రోబో గురించి.. త్రీడీ మోడలింగ్, వాక్యూమ్ సక్షన్తోపాటు మొబైల్ ఆప్ ద్వారా అవసరమైన ‘స్టైల్’ను సెలెక్ట్ చేసుకునేలా ఒక రోబోటిక్ వ్యవస్థను సిద్ధం చేసింది. దీనికి పేటెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి నమూనా యంత్రాల తయారీ, పరీక్షలు జరుగుతున్నాయి! ఇవన్నీ ఆటోమెటిక్ రోబో బార్బర్లైతే.. రోబోకట్, ఫ్లోబీ సిస్టమ్స్ వంటివి సెమీ ఆటోమెటిక్ పద్ధతిలో ఇంట్లోనే కటింగ్, షేవింగ్ చేసుకునే యంత్రాలను రూపొందించే పనిలో ఉన్నాయి!.స్టూడియోరెడ్, షేన్ వైటన్ వంటివారు తాము తయారు చేసిన రోబో బార్బర్లను సెలూన్లలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ విషయంలో కృత్రిమ మేధ కూడా అడుగుపెట్టేసింది. బార్బర్ జీపీటీ మన ఫొటోలను వాడుకుని ఏ స్టైల్లో ఎలా కనిపిస్తామో చూపిస్తుంది. నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే చాలు! క్ష... వ... రం... మొదలైపోతుంది!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
ఇంటర్నెట్ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్‌లో గత ఆదివారం తన నివాసంలో లలిత్ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లలిత్ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్ గతంలో ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్ సైతం తన మాజీ బాస్‌లు లలిత్ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. -
హ్యాట్సాప్ బామ్మ.. ఆ వయసులో ఎంతటి స్థైర్యం..!
మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్మాన్ అనే డచ్ మహిళ కశ్మీర్ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్‌లోని దాల్ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్‌తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట. దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్‌లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా.ఆ వీడియోలో ఎల్లిస్ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె. స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి, లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. Kudos to Dutch national Ellis Hubertina Spaanderman for her selfless efforts in cleaning Srinagar's Dal Lake for past 5 years. This dedication serves as an inspiration to preserve Kashmir's natural beauty. Let's join hands to keep our paradise clean & pristine. @ddprsrinagar pic.twitter.com/YINLbm3X1z— Kashmir Rights Forum🍁 (@kashmir_right) June 29, 2025 (చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..) -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్‌ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్‌లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్‌తో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్‌తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు. -
ఆ టీచర్ కోసం యావత్తు గ్రామమే కన్నీళ్లు పెట్టుకుంది!
గురువు అన్న పదమే ఎంతో గౌవరనీయమైనది. ఇక ఆ స్థానాన్ని అలకంరించి.. ఎందరో విద్యార్థులను మేధావులగా తీర్చిదిద్దే వాళ్ల సేవ అజరామరం. అలాంటి వ్యక్తులు బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పుతున్నంత బాధ కలగడం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులెందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలిపై వెళ్తుతన్న ఓ మహిళా టీచర్‌కి విద్యార్థుల తోపాటు యావత్తు గ్రామం కన్నీటి వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో రేఖ అనే టీచర్ 22 ఏళ్లుగా టీచర్ పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులను మంచి విద్యను బోధించడమే గాక ఆ గ్రామంలోని గ్రామస్తులుకు విద్య ప్రాముఖ్యత అవగాహన కల్పించేవారామె. గత 22 ఏళ్లుగా ఆ గ్రామంలో తన బోధన సేవతో గ్రామస్తులు, విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు బదిలిపై స్కూల్‌ని వీడక తప్పని పరిస్థితి. అయితే ఆమె లాస్ట్ వర్కింగ్ డే రోజున విద్యార్థుల తోపాటు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు కూడా వచ్చి కన్నటి సంద్రంతో భారంగా వీడ్కోలు పలికారు. అంతేగాదు ఆ రోజు ఫంగ్షన్ ఏర్పాటు చేసి..గ్రామస్తులంతా ఆమె సేవలను కొనియాడుతూ సన్మానించడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు. ఇక వీడ్కోలు సమయానికి అంత ఆమె చుట్టుచేరి ఐ మిస్ యూ రేఖ మేడమ అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. మొత్తం గామ్రమే ఆమె వెళ్లిపోతుంటే కన్నీటి సంద్రంలో మునిగిపోయి నిట్టూర్చింది. ఆ ఘటన మొత్తం కంటెంట్ క్రియేటర్ రీకార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా అవసరం లేదు మన సేవాతత్పరత మనల్ని అందరికి చేరవయ్యేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుపెడుతుందంటూ సదరు టీచర్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై) -
170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్‌ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్‌తో కలసి జిమ్‌కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్‌లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్‌కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్‌లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్‌బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్‌కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్‌కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా?ఈ వీడియో చూడండి!
స్మార్ట్‌ఫోన్‌కు పిల్లా పెద్దా అంతా బందీ. నిద్ర లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా స్మార్ట్‌ఫోన్ చేతిలో లేందే క్షణం గడవదు అన్నట్టుగా స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ అనడంలో ఎలాంటి సందేహహంలేదు. ఏ పనిచేస్తున్నా, తింటున్నా.. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుంటున్నా సరే ‘సెల్’ చేతిలో ఉండాల్సిందే. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మోజులో పడి కొట్టుకుపోతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండటం లేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో చూద్దాం.చదవండి: ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!పొద్దున్న లేచింది మొదలు స్మార్ట్‌ఫోన్‌ను ఇడ్సిపెడ్తలేరు.. ఇక వేరే పనేలేదు ఇది ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట్లోనే ఉండే తంతే. తల్లిదండ్రులు చివాట్లు పెట్టడంతో ఆ కాసేపు జాగ్రత్తగా ఉండటం, తరువాత షరా మామూలే. అలాగే ఒక టీనేజ్ అమ్మాయి భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూనే ఉంటుంది. సెల్ఫీ తీసుకుంటోందో ఏమో గానీ అసలు ఏం తింటున్నా అనే సోయ లేకుండా ఉంటుంది. దీంతో చిర్రొత్తు కొచ్చిన ఒక పెద్దావిడ (బహుశా ఆ యువతి తల్లి కావచ్చు) పరుగెత్తుకొచ్చి, ఫోన్‌తో కలిపి ఒక పెద్ద ప్లాస్టర్ చుట్టేసింది. ఆమె ఎంత విసిగెత్తిపోయిందీ ఆ ప్లాస్టర్‌ను చుట్టిన తీరును బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!😂 I laughed too hard at this. pic.twitter.com/1FQ0b0D7AG— Catturd ™ (@catturd2) July 1, 2025ఎక్స్‌లో షేర్అయిన ఈ వీడియో 50 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. వీడియోలో చైనీస్ టెక్స్ట్ ను మనం గమనించవచ్చు. ‘లగెత్తరా ఆజామూ’ అంటూ నెటజన్లు ఛలోక్తులు విసురుతున్నరాఉ. ఇది ప్రాంక్ వీడియో కావచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తోంది. -
సోషల్ మీడియా వరమా? శాపమా? బాధితులెవరు? ఏం చేయాలి?
విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా (Social Media) ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికైంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకుంటే ‘ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీ«థింగ్’ అంటూ ఫొటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యావిులీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్‌లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్ బాక్స్‌ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లలో అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు. తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునే వారితోనే సమస్యంతా. మంచికి వాడుకుందాం.. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు...సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్‌లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్‌ను తీసుకోవడం, మెస్సేజ్‌లను చూడడం.ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం.సెల్ఫీల మోజు బాగా పెరిగింది..సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. -వై.సతీష్ కుమార్, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం తల్లిదండ్రులు నియంత్రించాలి..అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి.– ప్రశాంత్ కుమార్ ఎంఎస్సీ సైకాలజీ, విజయనగరం -
పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు. ‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్‌చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు. Civilized people in America don’t eat like this.If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్‌లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్‌లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు. తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. -
'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...
ఎన్నో విలాసవంతమైన భవనాలను చూసి ఉంటారు. ానీకానీ ఇలాంటి విలాసవంతమైన ఇంటిని మాత్రం చూసుండరు. మహా అయితే ఇన్ని అంతస్థుల భవనం, కట్టిపడేసే లగ్జరీయస్ ఫర్నీచర్లు తదితర విశేషాలతో ఉన్న బంగ్లాలనే ూచూశాం. కానీ ఈ ఇల్లు వాటన్నింటిని తలదన్నేలా అత్యంత విలాసవంతంగా అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆ ఇంటిని తిలకిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కంటెంట్ క్రియేటర్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక విలాసవంతమైన బంగారంతో అలకరించి ఉన్న లగ్జరీయస్ ఇంటిని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ ఇంటి లోపల ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డుల వరకు ప్రతీది స్వచ్ఛమైన బంగారంలా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవే అట. కంటెంట్ క్రియేటర్ సరస్వత్ అంతటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ భవనంలో మొత్తం పది బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో గోశాల నుంచి మొదలై.. ఎంట్రన్స్‌లో 1936 వింటేజ్ మెర్సిడెస్ కారు నుంచి పలు విలాసవంతమైన కార్ల సేకరణ కనిపిస్తుంది. అంతేగాదు ఆ ధనవంతుడి సక్సెస్ జర్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమ కుటుంబంలో మొత్తం 20 మంది సభ్యులం ఉండేవాళ్లమని, అందరికీ ఒకే ఒక పెట్రోల్ బంక్ ఆధామని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ ధనవంతుడికి అర్థమైపోయిందట ఏదోరకంగా కష్టపడకపోతే తన మనుగడ ప్రశ్నార్థకమై పోతుందని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్షిప్లోకి ప్రవేశించారట. అలా ప్రభుత్వ రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించే తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 300 గదుల హోటల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన వీడియోకి "భారతదేశంలోని ఇండోర్‌లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు కంటెంట్ క్రియేటర్ సరస్వత్. నెటిజన్లు అంతటి విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరూ లక్ష్మీపుత్రుడు, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) (చదవండి: 'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..
చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్‌రాజ్ కె తీసిన ఈ మూవీ టైటిల్ లీడ్ రోల్లో చార్లీగా లాబ్రాడర్ కుక్క, హీరోగా రక్షిత్ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్‌ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్ శెట్టి బైక్‌పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్‌గా సాగే ఈ మూవీలో హైలెట్‌గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్‌పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. బిహార్‌కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్ చేసినట్లుగా తెలిపాడు. అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు 11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ మార్గంలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్ చేశాడు సోను. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sonu and Charlie 🐶( Bihar 🚴) (@safarmeinrahi) (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్‌ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్‌లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్‌లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్‌లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్‌కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్‌స్టా యాప్‌ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్‌ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్‌కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్‌లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్‌ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
‘సొంతిల్లా.. నో వే..!’ బోట్లో బతికేస్తా.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
‘కూడు, గూడు గుడ్డ’ ఇవి సామాన్య జీవితానికి కావల్సిన కనీస అవసరాలు. కానీ ప్రస్తుత సమాజంలో మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అందులోనూ భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సొంతిల్లు కాదు గదా కనీసం అద్దె భారాన్ని భరించడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ పోస్ట్ వైరల్‌గా మారింది. మరో విధంగా చెప్పాలంటే తీవ్ర చర్చకు దారి తీసింది.మెట్రో నగరాల్లో ఒక చిన్న అపార్ట్ మెంట్ కొన్నాలన్నా లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది చాలా మంది మధ్యతరగతి కొనుగోలుదారుల ఆందళన. దీనిపైనే స్పందిస్తా.. సొంతిల్లు,లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ నా వల్ల కాదుగానీమన దేశంలో హౌస్‌బోట్‌లో జీవితాన్ని లాగించేయడం చట్టబద్ధమేనా? దయ చేసి ఎవరైనా చెప్పండి బ్రో అంటూ సోషల్‌మీడియాలో పెద్ద చర్చకే తెర లేపాడు. బెంగళూరు, చెన్నై లేదా హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనలేని,గృహ రుణం కోసం వయస్సు, ఆదాయ పరిమితులు సహకరించని వ్యక్తి ఒక చిన్న పడవను కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా అంటూ ఆవేదనగా ప్రశ్నించాడు. అందులో వంటగది, బాత్రూమ్ రెండు గదులు వంటి మినిమం సౌకర్యాలతో నివసించదగిన స్థలంగా మార్చాలా? ఏం చేయాలి? అంటూ పోస్ట్ చేశాడు.ఇండియాలో భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ఏ నగరంలోనూ ఫ్లాట్ కొన లేను నాకు ఇప్పటికే వయస్సు మీద పడింది, కాబట్టి నేను EMIల కట్టేంత కాలమూ పని చేయలేను ఒక బోట్ కొనుక్కొని, నదులు, సముద్ర తీరంలో పార్క్ చేసుకుంటా.. వానొచ్చినా, వరదొచ్చినా పరవాలేదు మహా అయితే హౌస్ బోట్ ధర 15 నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ’’ అంటూ రాసుకొచ్చాడు. సోషల్ మీడియా స్పందనదీనిపై నెటిజనలు విభిన్న రీతుల్లో స్పందించారు. ఇళ్లు చవకగా కొనే కొన్ని ఏరియాలు, సూచనలతో పాటు పడవలో ఉండకూడదని కొందరు అతని ఆలోచనకు బ్రేక్‌లు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కొనమని కొందరు సూచించారు. అంతేకాదు బోట్ జీవితం ఒకే కానీ... అడ్రస్ ప్రూఫ్, పర్మినెంట్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఇలాంటి వన్నీ ఉంటాయిగా అన్నారు. -
భూకంపం.. బుల్లి బకాసురుడు
ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్యువాన్లో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు. ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..Nothing comes between this kid and his meal not even an earthquake.pic.twitter.com/eWs218JHUH— Science girl (@gunsnrosesgirl3) June 25, 2025 -
మనం చేసే పని 80 శాతం నాన్ కోర్ వర్కే!!
పని గంటలు.. వర్క్‌కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్ బ్యూరోక్రట్, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్ వెబ్సైట్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది. జైపూర్: రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ.. అయితే.. ప్రతీ IAS పోస్టింగ్‌ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్‌వర్క్‌లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన. అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్ ఐఏఎస్‌ల వర్క్‌కల్చర్(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్ విమర్శించారు. అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్ అనే మాజీ ఐపీఎస్.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్‌కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అజితాభ్ శర్మ గురించి..1996 రాజస్తాన్ కేడర్‌కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇన్వెస్ట్మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. -
ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!
తనను తల్లి హగ్ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్‌గా మార్చి షేర్ చేశాడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘రెడిట్’ కో–ఫౌండర్ ఎలెక్సిస్ ఒహానియన్. సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. Damn, I wasn't ready for how this would feel. We didn't have a camcorder, so there's no video of me with my mom. I dropped one of my favorite photos of us in midjourney as 'starting frame for an AI video' and wow... This is how she hugged me. I've rewatched it 50 times. pic.twitter.com/n2jNwdCkxF— Alexis Ohanian 🗽 (@alexisohanian) June 22, 2025 (చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)ఈ వీడియో క్లిప్‌ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్. ఈ వీడియో క్లిప్‌కు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్‌ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్’ అంటున్నారు. (చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్‌స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
Vande Bharat: ఏసీ కోచ్‌లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!
న్యూఢిల్లీ: వందే భారత్ ట్రైన్లో ఏసీ కోచ్‌లో నీళ్లు లీకైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి వెళ్ళ్లే ఓ వందే భారత్ ట్రైన్లో ఏసీ పని చేయకపోవడంతో వాటర్ లీకేజ్ ఏర్పడింది. తాను వందే భారత్ ట్రైన్లో ప్రయాణించిన సమయంలో ఏసీ నుంచి నీళ్లు ధారలా తన సీటపైకి వచ్చాయన్నాడు ధర్శిల్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.ఇలా లీకేజ్ జరుగుతూనే ఉందని, ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి రిపోర్ట్ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి వీడియోను షేర్ చేస్తూ.. ఇది నా కోచ్‌లో జరిగిందంటూ పేర్కొన్నాడు. అత్యధిక ఖరీదుతో కొనుగోలు చేసిన వందే భారత్ ట్రైన్లో ఇలా జరగడంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రయాణంలో సుఖం లేదు. అంతా అసౌకర్యమే. రైల్వే సిబ్బందికి పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు నేను టికెట్ కొన్న డబ్బులు తిరిగి చెల్లించండి’ అంటూ పేర్కొన్నాడు. pic.twitter.com/SJlnRbUsHe— Darshil Mishra (@MishraDarshil) June 23, 2025 -
52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్‌గా..
అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. దాన్ని క్లియర్‌గా స్కాన్ చేయగా టూత్ బ్రష్ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్ యంగ్‌ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్ బ్రెష్ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్ బ్రష్‌ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్. అది విని వైద్యులే కంగుతిన్నారు. ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్ బ్రష్ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్ బ్రష్ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్ విషయంలో అదృష్టవశాత్తు టూత్ బ్రష్ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్ బ్రష్‌ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్బ్రష్తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
అది బైకా.. లేక ఇంకేమన్నానా! మారండిరా బాబూ!!
ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వీరి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒక వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అనేక సామాజిక అంశాలపై సోషల్‌మీడియాలో స్పందించే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Vishwanath Channappa Sajjanar) కూడా ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జనార్ ట్వీట్లో ఎమన్నారంటే..అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి. జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్‌మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి? మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని మరికొందరు సూచిస్తున్నారు. చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్ -
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహం
కెనడియన్ ర్యాపర్,మోడల్ టామీ జెనెసిస్ అత్యుత్సాహంపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. తన తాజా మ్యూజిక్ వీడియో 'ట్రూ బ్లూ'లో ఆమె అవతారం కాళీ మాతను పోలి ఉండటం వివాదానికి దారి తీసింది. అసలేంటీ వివాదం? ఎవరీ టామీ జెనెసిస్ తెలుసుకుందామా.భారతీయ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ టామీ తన రాబోయే ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా ట్రూ బ్లూ మ్యూజిక్ వీడియో క్లిప్పింగ్స్తోపాటు, కొన్ని చిత్రాలను శనివారం పోస్ట్ చేసింది. ట్రూ బ్లూ ప్రోమోలో నీలిరంగు బాడీ పెయింట్, బంగారు ఆభరణాలు, నుదుటిన ఎర్రటి బొట్టు, శిలువ పట్టుకుని వీడియోను పోస్ట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. బికినీ, హై హీల్స్ ధరించి, సాంప్రదాయ భారతీయ శైలి బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. అసభ్యకరంగా రెచ్చగొట్టే విజువల్స్, అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటు హిందూవులు, ఇటు క్రైస్తవులను అవమానించి, వారి మనోభావాల్ని అగౌరవపరిచే చర్య అని పేర్కొన్నారు.తమిళ్-స్వీడిష్ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ అసలు పేరు జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్. ఈమె తాజా మ్యూజిక్ వీడియోలోకాళీమాతను అభ్యంతరకరంగా చిత్రీకరించిడంతో పాటు, క్రైస్తవ శిలువను అవమానించిందంటూ వివాదం రాజుకుంది. లైక్‌లు,వ్యూస్‌కోసం దైవాన్ని దూషించడం, మనోభావాల్ని దెబ్బతీయడం ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ నెటిజన్లు మండి పడుతున్నారు."ఇది కేవలం మతాలను మాత్రమే కాదు భారతీయ సంస్కృతిని కూడా అపహాస్యం చేసిందంటూ సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు -
ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!
ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. Arrowhead (T-84) రాజస్థాన్‌లోని రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్ క్యాన్సర్‌తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్ రిజర్వ్‌కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. ఈలోపు.. ఆరోహెడ్ చివరి క్షణాలను సచిన్ రాయ్ అనే నేచర్ ఫొటోగ్రాఫర్ బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఆరోహెడ్ వీడియోను షేర్ చేసింది. ‘‘అది జూన్ 17వ తేదీ. పదమ్ తలాబ్ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తున్నా. View this post on Instagram A post shared by Sachin Rai (@sachin_rai_photography)దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్‌థాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది. అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. T-84కు ఆరోహెడ్ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. -
‘ నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ : స్వీట్ కపుల్ జాయ్ రైడ్ వీడియో వైరల్
ఒక స్వీట్ కపుల్ అండ్ ఓల్డ్ కపుల్ (Elderly Couple) గాల్లో తేలినట్టుందే..అంటూ దర్జాగా రాయల్ ఎన్ఫీల్డ్ (టైటానిక్) బుల్లెట్ మీద రయ్య్‌మని దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత వైరల్ అంటే 3.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయంటే ఈ వీడియో క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.కమలాక్షి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు: " అందమైన వృద్ధ జంట అందమైన వింటేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చూశాను. సూపర్.. పొగడ్త తరువాత తాతగారి నవ్వు చూడాలి.. అమూల్యం’’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతూ తాతగారి నవ్విన నవ్వు ఈ వీడియోకే హైలైట్ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kamalakshi (@the_green_bonneville)> ఈ వీడియోలో,బామ్మగార్ని వెనుక కూర్చోబెట్టుకున్న తాతగారు బామ్మగారు ‘నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ అంటూ దూసుకుపోతున్నారు. ఇది చూసి కమలాక్షి వారిని పొగడ్తల్లో ముంచెత్తింది. దీంతో పబ్లిక్షాక్డ్ , చాచా రాక్డ్ అంటూ కమెంట్ చేశారునెటిజన్లు.అంతేకాదు టైటానిక్ జాక్ అండ్ రోజ్ అని కొందరు, అర్జున్ రెడ్డి, ప్రీతి అంటూ మరికొందరు ఈ వీడియోను ఎంజాయ్ చేయడం విశేషం. -
ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
నో బ్రా.. నో ఎగ్జామ్!!
ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్ రూల్‌ను కఠినంగా అమలు చేయించింది. 📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. ⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. “No bra. No entry” is not a new policy in Olabisi Onabanjo University.OOU promotes a dress code policy aimed at maintaining a respectful and distraction-free environment, encouraging students to dress modestly and in line with the institution's values. https://t.co/xO70cBiabG pic.twitter.com/pTWjpABFmT— ART&SCIENCE (@MAO_of_Africa) June 17, 2025👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు -
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్‌తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి -
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్‌హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్‌ను వైట్‌హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్‌లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్‌ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్‌లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్‌లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్‌తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!. -
బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్‌కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!) -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్‌ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్‌ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025 -
నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!
ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్ స్కూల్లో ఈ ఏడాది జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్, సైకిల్ సీట్ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్ ఎగ్జామ్ లాంటి వాటి కోసం కోచింగ్ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్ గ్రామంలోనే నీట్ కోచింగ్ 2024 చిన్నగా ప్రారంభమైంది. అది వారికి వరమైన ఆ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్‌లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్ పోందగా వారిలో 25 మంది నీట్కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్‌కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు. (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్ మీడియాను మేనేజ్ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది. -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్ ఉదయ్‌రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచి ఎందరికో కనువిప్పుకలిగించారు. మలిసంధ్యలో ఉన్న ఆ దంపతులు మధ్య అనురాగానికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో సాంప్రదాయ తెల్లటి ధోతి కుర్తా టోపి ధరించి 93 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఒక ఆభరణాల దుకాణం వద్దకు వచ్చాడు. సిబ్బంది అతడి ఆహార్యాన్ని చూసి ఏదో డబ్బు సాయం అడగడానికి వచ్చాడేమో అనుకున్నారు. అయితే అతడు తన భార్య కోసం మంగళసూత్రం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పడంతో దుకాణ యజామని ఆశ్చర్యపోయాడు. అతడిని సాదరంగా ఆహ్వానించి తనకు నచ్చిన మంగళ సూత్రాన్ని అతి తక్కువ ధరకే ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు ఆ ఆభరణాల యజమాని. ఆ వృద్ధుడికి తన భార్యపై ఉన్న ప్రేమ అనురాగానికి వెలకట్టకూడదనే ఇలా చేశానంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నిజానికి ఆ వృద్ధుడు ఆ మంగళ సూత్రం కోసం దుకాణం యజమానికి రూ. 1,120 ఇచ్చాడు. అయితే తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఆ వృద్ధుడి తాపత్రయం ఆ దుకాణం యజామనిని మంత్రముగ్దుడిని చేసింది. దాంతో ఆ యజమాని కేవలం రూ.20లకే ఆ ఆభరణాన్ని ఆ దంపతలుకు ఇచ్చేశాడు. కాగా, ఆ వృద్ధ దంపతుల పేర్లు నివృత్తి షిండే, శాంతబాయిలు. ఆ జంట జల్నా జిల్లా, అంభోరా జహాగీర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం..ఇద్దరు ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పంఢర్‌పూర్‌కు తీర్థయాత్ర చేస్తున్నారట. అలాగే ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయితే ఆ వృద్ధ దంపతులు అతడిపై ఆధారపడకుండా జీవిస్తాని, తరుచుగా తీర్థయాత్రలు చేస్తుంటారని చెబుతున్నారు గ్రామస్థులు. నెటిజన్లు సైతం వారి మధ్య ఉన్న అనురాగానికి ఫిదా అవ్వుతూ.. మలిసంధ్యాలో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gopika Jewellery Sambhajinagar (@gopika_jewellery_sambhajinagar) (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
సమానత్వం అంటే ఇదేనా?
ఖాన్ సర్.. యూట్యూబ్‌లో చాలా ఫేమస్. ఆయన పాఠాలు బాగా చెబుతారు. అంతేకాదు చాలా విషయాల గురించి సాధికారికంగా వివరిస్తారు. ఆయన చెప్పే పాఠాలు వినేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపిస్తారు. ఆయన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. యూట్యూబ్ ఖాన్ సర్ చానల్‌కు కోట్లలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. పుట్టింది యూపీ అయినప్పటికీ పేరు తెచ్చుకుంది మాత్రం బిహార్‌లో. ఆన్లైన్ పాఠాలతో ఇప్పుడు ఆయన దేశంలోని విద్యార్థులందరికీ సుపరిచితులయ్యారు. సడన్‌గా ఇప్పుడు ఖాన్ సర్ ప్రస్తావన ఎందుకొచ్చిందానేగా మీ డౌటు.తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఖాన్ సర్ ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన భార్య గురించి ఆయన వెల్లడించిన విషయాలు చర్చకు దారి తీశాయి. కొంత మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే, మరికొందరు విమర్శలకు దిగారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తమ పెళ్లి రిసెప్షన్లో ఖాన్ సార్ భార్య ముఖాన్ని కవర్ చేస్తూ తల పైనుంచి చీర కొంగు కప్పుకోవడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజా పాడ్‌కాస్ట్‌లో దీని గురించి వివరణయిచ్చారు ఖాన్ సర్.రహస్యంగా పెళ్లిగత నెలలో ఖాన్ సర్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. పెళ్లి సింపుల్ జరిగిపోవడంతో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల కోసం కొద్ది రోజుల క్రితం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఖాన్ సర్ భార్య ముసుగు (ఘూంఘాట్) ధరించడం పట్ల చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. వధువు ముఖం కప్పుకోవడాన్ని ప్రశ్నించారు. తన పాఠాల్లో సమానత్వం, మహిళల హక్కుల గురించి బోధించే ఖాన్ సర్.. చేతల్లో మాత్రం చతికిలపడ్డారని నెటిజనులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. భార్య ఇష్టాన్ని గౌరవించారని కొంతమంది ఆయనకు మద్దతుగా కామెంట్లు పెట్టారు.ముసుగు వద్దన్నా వినలేదు..తాజాగా ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో దీని గురించి ఖాన్ సర్ వివరణయిచ్చారు. తన భార్య ఆమె ఇష్టప్రకారమే ఘూంఘాట్ ధరించిందని, తానేమి బలవంత పెట్టలేదని వెల్లడించారు. ముసుగు ధరించవద్దని వారించినా ఆమె వినిపించుకోలేదన్నారు. "వివాహ రిసెప్షన్లో ఘూంఘాట్ ధరించడం నా భార్య నిర్ణయం. ఇది తన చిన్ననాటి కల అని, ప్రతి అమ్మాయి ఘూంఘాట్ ధరించి వధువు కావాలని కలలు కంటుందని ఆమె నాతో చెప్పింది. అలా చేస్తే ప్రజలు నన్ను నిందిస్తారని ఆమెతో అన్నాను. ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆమె నా మాట వినలేద''ని వివరించారు.తక్కువ టైంలోనే ఫేమస్కాగా, ఖాన్ సర్ (Khan Sir) అసలు పేరు పైజల్ ఖాన్. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత అలహాబాద్ యూనివర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీతో పాటు జియోగ్రఫీలో ఎంఏ పూర్తి చేశారు. చదువు పూర్తైన తర్వాత బిహార్ రాజధాని పట్నాలో కోచింగ్ సెంటర్లో టీచింగ్ కెరీర్ మొదలు పెట్టారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఆయన బోధించేవారు. తక్కువ టైంలోనే తనదైన టీచింగ్ శైలితో విద్యార్థులను ఆకట్టుకున్నారు. చదవండి: మూడు సంస్థానాలు.. 46 జాగీర్లుపేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో 2019లో ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్ పేరుతో పట్నాలో సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. అయితే కోవిడ్-19 కారణంగా అది మూత పడింది. తన కోచింగ్ సెంటర్ పేరుతోనే యూట్యూబ్‌లో చానల్ ప్రారంభించి, ఆన్లైన్లో పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. ఆదరణ పెరగడంతో 2021లో యాప్ కూడా ప్రారంభించారు. ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ యూట్యూబ్ చానల్‌కు 24 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 400 వీడియోలు ఉన్నాయి. -
కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో
రైల్వేస్టేషన్లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే. ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.రైల్వే స్టేషన్ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో చాలా లైట్ తీసుకుంటారు. అలా రైలు పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఏ మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే అటువైపు వేగంగా రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది. దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ వైరల్‌గా మారింది. లక్షల మంది షేర్ చేశారు. దాదాపు కోటి (9.7 మిలియన్లు) వ్యూస్ దక్కించుకుంది.Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8— Interesting things (@awkwardgoogle) June 16, 2025కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను చూసి సూపర్ డాడ్ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్ చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడుఅసలు విషయం ఏమిటంటే..అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్‌లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
ఆ 16 అమ్మాయి డ్యాన్స్‌కు.. నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..
రాత్రికి రాత్రికే స్టార్ డమ్ తెచ్చుకుంది ఓ యువతి. ఎలాంటి శిక్షణ లేకుండానే లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేసి అందర్నీ ఆశ్యర్యపరిచింది. సెలబ్రిటీల మన్ననలను అందుకుని ఒక్కసారిగా సోష్ల్ మీడియా స్టార్డమ్ హోదాను అందుకుంది. ఎవరామె అంటే..చత్తీగఢ్‌లోని జగదల్పూర్కి లావణ్యదాస్ (Lavanya Das) స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కుమార్తె. ఈ 16 ఏళ్ల అమ్మాయి ఆశా భోంస్లే ఆజాకు పియా తు అబ్ పాట లయబద్ధంగా బెల్లీడ్యాన్స్ చేసింది. ఆ వీడియోని జూన్ 4న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతే ఒక్కసారిగా ఆ వీడియో ఆమెకు ఎంతమంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టిందంటే.. సాక్షాత్రు బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. ఆమె నృత్య ప్రతిభకు ముగ్దురాలైంది. ఆ జబల్పూర్ పట్టణంలోని సక్సెస్ కాన్వెంట్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్న లావణ్య తన వీడియో ప్రియాంక చోప్రాను ఆకర్షిస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో సరదాగా పోస్ట్ చేసిన వీడియో ఇంత మంచి ఫేమ్ తెచ్చిపెట్టినందుకు ఆనదంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది. నిజానికి లావణ్య నటుల కుటుంబ నుంచి వచ్చిన నేపథ్యమే ఆమెది. బహుశా అదే ఆమెకు వారసత్వంగా వచ్చి.. ఇలా నృత్యకారిణిగా పేరుతెచ్చుకునేందుకు కారణమై ఉండొచ్చు. ఆమె తల్లి నీలిమా దాస్ మాణిక్పూరి, హల్బీ మాండలికంపై మంచి పట్టు ఉన్న తాతయ్య భాగీరథి దాస్ మహానంది ఇద్దరూ ధియేటర్ నటులు. ఇక లావణ్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. ఆమె ఇప్పటికే ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ సంగీత వీడియోలలో నటించింది. అలాగే దూరదర్శన్ కార్యక్రమాల్లో బాల కళాకారణి కూడా. నిజానికి ఆమె నృత్యం లేదా నటనలో ఎటువంటి శిక్షణ పొందలేదు. ఆమె స్వయం శిక్షిత నృత్యకారిణి. అయితే ఆమె తల్లి నీలిమ శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి, పైగా ట్యూటర్‌గా పనిచేస్తున్నారామె. ప్రస్తుతం లావణ్య తన పన్నెండో తరగతి పరీక్షలు పూర్తి అయ్యిన వెంటనే ఢిల్లీ లేదా హైదరాబాద్ నగరంలో యాక్టింగ్ కోర్సులో చేరాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ఆమె తండ్రి 2019లో మరణానంతరం ఈ తల్లి కూతుళ్లిద్దరూ తమ కుటుంబ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు. చదవండి: ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్ ఇవే..! -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్‌లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్‌ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్‌తో పాటు 25 క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!
తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించింది. యంగ్‌గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్‌లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్‌గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్లు, 100 సిట్-అప్ల మిస్అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్‌ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్టెన్ టీచర్‌గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్‌గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: UK: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..) -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్‌లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్‌ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్‌ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
హాటెస్ట్ కర్రీ చాలెంజ్.. ఈ బ్రో తిప్పలు చూడండి!
ఫుడ్ ఛాలెంజెస్లో ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు. అప్పుడప్పుడూ ఊహించని దుష్పరిణామాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. లండన్‌లోని ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్లో హాటెస్ట్ కర్రీ తిని ఓ కంటెస్టెంట్ నానా ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.లండన్ లోని హాటెస్ట్ కర్రీ..బెంగాల్ విలేజ్ (Bengal Village) లో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 72 ఘాటైన మసాలా దినుసులతో అత్యంత కారంగా ఈ కర్రీని వండి వారుస్తారు బెంగాల్ విలేజ్ వంటగాళ్లు. ముఖ్యంగా కారోలినా రీపర్, స్కాచ్ బోనెట్, నాగ, బర్డ్స్ ఐ,స్నేక్ చిల్లి వంటివి ఉపయోగిస్తారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర మొదలైన వాటితో వండుతారు. గ్రేవీని నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయలు, మసాలా దినుసులు కొన్ని టమోటాలతో తయారు చేస్తారు. మధ్యలో పసుపు మిరపకాయను పైకి తిప్పి, తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డిస్తారు. తమిళ ప్రిన్స్, గనపతి , బాలుచి వంటివి కూడా ఉన్నాయి. ఇది వండేటపుడు చెఫ్‌లు గ్లౌజెస్ తప్పకుండా ధరిస్తారు. ఇదీ చదవండి: చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బెంగాల్ విలేజ్ అనేది UKలోని లండన్‌లోని బ్రిక్ లేన్‌లో ఉన్న ఒక భారతీయ వంటకాల రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అనేక ఆహార సవాళ్లకు ప్రసిద్ధి చెందింది, చాలా ధైర్యవంతులే హాటెస్ట్ కర్రీ ఛాలెంజ్‌లో పాల్గొంటారు. ఈ రెస్టారెంట్ అధికారిక X హ్యాండిల్లో ఇటీవల పోస్ట్ చేసిన వీడియోలో వారి "హాటెస్ట్ కర్రీ" ప్రయత్నించిన వ్యక్తి దయనీయ స్థితిలో ఉన్న కస్టమర్‌ను చూడవచ్చు. రెస్టారెంట్ యజమాని చేతిలో ఒక గ్లాసు నీరు పట్టుకుని బ్రో. కాసిన్ని నీళ్లు తాగు బ్రో.. ఒక్క సిప్ చాలు" అని రెస్టారెంట్ బతిమలాడుతున్నాడు. చివరికి ఒక గుక్క నీళ్లు తాగి అతగాడు తెప్పరిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. (Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?)After math of the #Londonshottestcurry pic.twitter.com/0SrpWWLTfH— Bengal Village - Best of Brick Lane (@Bengal_Village) June 14, 2025 -
ఫోన్ పౌచులు అమ్మి.. నీట్ విజేతగా..
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్‌ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.జార్ఖండ్‌కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్‌గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్‌గా ఆ వైట్ కోట్‌ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితుల సంఖ్య రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా తన భర్త, చిత్ర నిర్మాత కనిపించడంలేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా సందేహాల మధ్య కుటుంబం DNA నమూనాలను సమర్పించింది . మరోవైపు అతని మొబైల్ ఫోన్ చివరిగా భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.నరోడా-నివాసి మహేష్ కలవాడియా, మహేష్ జిరావాలా (Mahesh Jirawala) అని కూడా పిలుస్తారు. సంగీత ఆల్బమ్‌లకు దర్శకత్వం వహిస్తాడు. లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి, అదృశ్యమైనాడని అతని భార్య హేతల్ ఫిర్యాదు చేసింది."నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేసి తన సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, నేను అతని ఫోన్‌కు కాల్ చేసాను కానీ అది స్విచ్ ఆఫ్ అయింది. అతని స్కూటర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, అతని మొబైల్ ఫోన్ చివరిగా అతను క్రాష్ సైట్ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించింది" అని ఆమె ఆందోళన చెందుతోంది. సాధారణంగా తన భర్త ఈ మార్గంలో ఎపుడూ రాడని, ఏమైందో అర్థం కావడంలేదని హేతల్ తెలిపింది.కాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్లోసర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్‌లోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలోకి విమానం కూలిపోయింది. AI-171 విషాదకరమైన ప్రమాదం జరిగి మూడు రోజుల తరువాత, ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆసుపత్రి అధికారులు ఆదివారం DNA మ్యాచింగ్ ద్వారా 47 మంది బాధితులను గుర్తించినట్లు నిర్ధారించారు. అధికారులు 24 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. భయంకరమైన విషాదంలో బాధితుల గుర్తించేందుకు ధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
ఆ కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..!
ఇటీవల కాలంలో బ్రూణ హత్యలు ప్రభలంగా జరుతున్నాయి. ఆడపిల్ల అనగానే ఎక్కడలేని అక్కసు చూపిస్తూ..భూమ్మీద పడకుండానే చూస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఎంతలా ఐఏ వంటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఆడపిల్ల అనే విషయంలో వివక్ష మాత్రం ఉంటూనే ఉంది. ఎందుకనో గానీ మగబిడ్డ అనగానే సంబరాలు చేసుకోగలిగినంతగా ఆడపిల్ల పుట్టింది అనంగానే ఆ ఊసే రాదు. పైగా ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చేస్తుంది కొందరికి. కానీ ఇక్కడ అలాంటి వాటన్నింటికి భిన్నంగా ఓ ఆడశిశువుకు మహారాణి రేంజ్లో స్వాగతం పలికి అందర్నీ ఆశ్చర్యపరించింది ఓ కుటుంబం. ఈ ఘటన ఆడపిల్లలు ఎన్నటికీ మహారాణులు..వాళ్లు నట్టింట తిరుగాడితే..మహాలక్ష్మీ ఇంటికి వచ్చినంత వేడుక అనే చాటిచెప్పేలా ఈ కుటుంబం సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కుటుంబం తమ ఇంటిలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన తొలి ఆడ శిశువు జననం అని ఎంతలా గ్రాండ్‌గా స్వాగతం పలికారో చూస్తే..రెండు కళ్లు చాలవు. ఓ వీఐపీ మాదిరికి భారీ వాహనాల కాన్వాయితో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వద్ద పింక్ కలర్ బెలూన్లు, అందమైన పూలతో ఆ చిట్టిపాపాయికి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ వీడియోకి మా కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా కూమార్తెను స్వాగతించడంలో ఓ గర్వం, మాటల్లో చెప్పలేని ఆనందం ఆ కుంటుంబంలో ప్రతిబించిందని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Chahat Rawal (@dr.chahatrawal) (చదవండి: ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..) -
బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్‌కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్‌పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
రాయ్‌పూర్: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్‌పై కూర్చుని కేక్ కట్ చేస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్‌పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్ కటింగ్ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్‌తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్‌పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్‌పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india) -
ఆ భగవద్గీత ఈమెదే!
అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు. విమాన ప్రయాణికులు సజీవ దహనమైపోవటంతో పాటు విమానం కూలిన భవనంలోని వాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే..ఈ దుర్ఘటనలో కన్నీటి కథలు.. ఎన్నో భావోద్వేగ గాథలు వెలుగుచూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని.. విమానం మొత్తం కాలిబూడిదైనా ఆ పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . అయితే.. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే.. భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే.. మరోవైపు, అసలు ఆ భగవద్గీత ఎవరిదీ..? ఫ్లైట్‌లో ఎందుకుంది..? అని ప్రశ్నలు మొదలయ్యాయి.సాగర్ అమీన్ అనే వలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. ఈలోపు.. ఆ గ్రంథం ఎవరనేదానిపై రకరకాల కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత జయశ్రీ పటేల్(27)కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ కథన సారాంశం. అందులోని వివరాల ప్రకారం..గుజరాత్ ఆరావళి జిల్లా కంభిసర్‌కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం, భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలో ఆమెకు వివాహం అయ్యింది. భర్త లండన్‌లో ఉద్యోగం. దీంతో ఆమె అక్కడికి బయల్దేరింది. అలా వివాహం అయిన మొదటిసారి.. ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్‌హోస్టెస్‌దంటూ మరో కథనం వైరల్ అవుతోంది. Bhagavad Gita was found from the debris of the plane crash. The surprising thing is that the book did not burn even in the midst of such a fierce fire. Jai Shree Krishna 🙏🌸Om Shanti#Ahmedabad | #Planecrash | #AirIndia | #BlackBox #planecrashahmedabad #bhagavadgita pic.twitter.com/ypdrm2JP2i— DivineDiva ❤️ (@potus021) June 13, 2025 -
‘మై లవ్..’గర్ల్‌ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో
Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా రోదిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావద్దేశాన్ని దిగ్భ్రాతిలో ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన వారు రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు, ‘మై లవ్ అంటూ సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ జర్నలిస్ట్ వీడియోను షేర్ చేశారు. జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు. At hospital waiting room, we found this young man. The body was yet to be handed over. He quietly sat there and wept on his own. He lost his girlfriend. No one by his side but a whole bundle of memories that he has to live with for the rest of his life. “Who are you waiting… pic.twitter.com/pdxsZhBPPN— Tamal Saha (@Tamal0401) June 13, 2025 -
తాజ్‌మహల్‌ను మైమరిపించే ఇల్లు.. ఆ మాటలకు ఫిదా కావాల్సిందే!
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్ కమ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్‌ను మోడల్‌గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో తాజ్ మహల్‌ను తలపించేలా నాలుగు బెడ్రూమ్లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్రూమ్లు, ఓ కిచెన్, ఓ మీడియేషన్ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్ గురుకుల్ కూడా ఉంది. తాజ్‌మహల్ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.👉మా తాజ్ మహల్.. నాలుగు బెడ్రూమ్ల ఇల్లు. అసలైన తాజ్ మహల్ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది👉నా భార్య మెడిసిన్ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్ హైటెక్ గురుకుల్‌ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) -
ఉన్నత చదువులకు ఫస్ట్ ఫ్లైట్ అదే లాస్ట్..: ఆటో డ్రైవర్ కుమార్తె విషాదాంతం
Air India Plane Crash : అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో విసాదం. ఉన్నత చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకోవాలని కోటి ఆశలతో తొలిసారి విమానం ఎక్కిన ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందిగుజరాత్లోని హిమత్‌నగర్‌కు చెందిన పాయల్ ఖాతిక్ (Payal Khatik) తొలిసారి విమానం ఎక్కింది. భవిష్యత్ కలలతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా బయలుదేరింది. కానీ అదే అదే చివరికి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఆమె తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతాడు. MTech చదవడానికి లండన్ వెళ్లేందుకు గురువారం ఉదయం ఉత్సాహంగా బయలుదేరింది. నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో విమానం ఎక్కిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని బాగా చూసుకోవాలని, పేదరికం నుండి విముక్తి చేయాలని ఎన్నో కలలు కంది. కానీ ఆ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.ఉదయపూర్‌లో బిటెక్ పూర్తి చేసిన ఆమె ఇంజనీరింగ్ , టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి యునైటెడ్ కింగ్డమ్కు పయనమైంది.ఉదయం తమ ప్రియమైన కుమార్తెకు హృదయపూర్వక వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది, ఆమె లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఆమె చదువులో రాణిస్తుందని కొండంత నమ్మకం వాళ్లకి. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విమానంతో పాటు, వీరి ఆశలు కూడా గల్లంతైపోయాయి."ఆమె కళాశాల పూర్తి చేసిన తర్వాత, మాతోనే ఉంది ...లండన్‌లో పై చదువులు చదువు కోవాలనుకుంది. ఇందుకోసం మేం రుణం తీసుకుసి పంపాం.." అంటూ ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ దుఃఖంతో చెప్పారు.#WATCH | Sabarkantha, Gujarat | Relative of a deceased passenger of AI-171 plane crash, Suresh Khatik says, "...After completing her college, she used to stay with us. Then she wanted to study in London. We took out loans to support her education there...My DNA sample has been… pic.twitter.com/G35tZaWJha— ANI (@ANI) June 13, 2025పాయిల్ చాలా మంచి అమ్మాయి అని ఆమె స్నేహితులు తెలిపారు. బీటెక్ పూర్తైన తరువాత ట్యూషన్లు చెప్పి, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండేదని బంధువు పాయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం పాయల్ ఖాతిక్‌ను చివరిసారిగా కలిశానని, గత ఆరేళ్లుగా తన కుమారుడికి ట్యూషన్ చెబుతోందనీ, పాఠక్ దంపతులు తెలిపారు. -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
25 మందికి ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది. 25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే! 2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా! -
వా.. నర ప్రేమ!
విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
మోస్ట్ వ్యూడ్ వీడియో.. 460 కోట్లు
స్థానిక కళాకారులతో కలిసి పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్‌లో( Youtube) ‘మోస్ట్ వ్యూడ్ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్.జీమ్యూజిక్కు రెడ్ డైమండ్ ప్లే బటన్మన దేశంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్‌లో ‘జీ మ్యూజిక్ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్‌లో 100 మిలియన్ సబ్స్క్రైబర్లతో ‘వావ్’ అనిపించింది. యూట్యూబ్ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్ డైమండ్ ప్లే బటన్’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్ లేబుల్... జీ మ్యూజిక్. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్ వ్యూడ్ వీడియో.ఇవీ చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్‌కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్‌కు బిగ్ షాక్ తగిలింది. -
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
విజయ్ మాల్యా 4 గంటల ఇంటర్వ్యూ.. 'సోషల్' హల్చల్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ లైమ్ లైటులోకి వచ్చారు. మాల్యాపై సోషల్ మీడియా మీడియాలో తాజాగా చర్చోప చర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ రాజ్ షమానీ (Raj Shamani)కి ఇటీవల పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలు మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపించినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించానని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యానని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీయిస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా దీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వడ్డీల లెక్కలతో ఆయనకు బదులిచ్చాయి.కాగా, విజయ్ మాల్యా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్‌లో మాల్యా స్పందిస్తూ.. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. 'ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పడం, నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @rajshamani తో నా 4 గంటల పాడ్‌కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క YouTubeలోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక' అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను మాత్రం కాదువిజయ్ మాల్యా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాల్యాకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన అబద్దాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది మీమ్స్, వీడియోలతో సైటర్లు పేలుస్తూ హాస్యచతురత ప్రదర్శిస్తున్నారు.Indians after watching Vijay Mallya's podcast#VijayMallya विजय माल्या 🙂 pic.twitter.com/NVyDWLPC5N— Sourabh (@vellasrv) June 7, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025 -
ప్రేమ లోతును చూపించింది.. వైరలవుతోంది.. సిద్ శ్రీరామ్ పాట
సాక్షి, సిటీబ్యూరో: తన స్వరంలో ఏదో మాయ ఉంటుంది, ఆ గళంలో ప్రతి నాదం మనసును మెలిపెట్టేస్తుంది. ఆ స్వర మాధూర్యం మరెవరో కాదు.. సిద్ శ్రీరామ్. ఆయన స్వర సందడిలో భాగంగా సరికొత్త గీతం ‘కన్నె’లో మాటలకందని భావాలను పలికించారు. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడానని తెలిపారు. ఒక ప్రేమ గీతంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటను వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్‌లో భక్తిగీతం ‘శివనార్’ విడుదల తనంతరం ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా అలరిస్తోంది. చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్ View this post on Instagram A post shared by Sid Sriram (@sidsriram)ప్రేమ లోతును చూపిస్తుంది.. ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్ మ్యూజిక్ ఇండియాతో ఇది నా రెండో రెండో పాట. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న పాట. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ పాట గుర్తుకుతెస్తుంది. గతంలో ‘శ్రీవల్లి’ (పుష్ప : ది రైజ్), ‘కుంకుమాలా’ (బ్రహ్మాస్త్ర), ‘అదియే’ (కదల్), ‘కన్నానా కన్నే’ (విశ్వాసం) హిట్ సాంగ్స్ వరుసలో ఈ ఏడాది మరి కొన్ని రానున్నాయి. గతేడాది ప్రపంచ ప్రఖ్యాత కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారతీయ కళాకారుడిగా నిలవడం సంతోషాన్నిచ్చింది. – సిద్ శ్రీరామ్. ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ -
అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్‌శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం. -
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు : ఫోన్‌పై స్మార్ట్‌చెక్
పద్నాలుగేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాప్‌ల వాడకంపై, పరిమితులు విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆన్లైన్ భద్రతా చట్టాల విషయంలో వివిధ దేశాలు కచ్చితమైన విధానాలనూ అమలు పరుస్తున్నాయి. కానీ, సోషల్ మీడియా మంచి చెడులు పిల్లల విషయంలో ఎప్పుడూ ప్రశ్నార్థకమే. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, తల్లితండ్రులే తప్పనిసరి జాగ్రత్తలు తీసు కోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు సోషల్ మీడియాలో గడపగల సమయాన్ని పరిమితం చేయడానికి, కఠినమైన ఆన్లైన్ భద్రతాచ ర్యలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయనే వార్తలు కొంత ఊరటనిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా యాప్‌ల వాడకంపై రోజుకు రెండు గంటల పరిమితి విధించి, ఇరవై రెండు గంటలపాటు బంద్ విధించాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు నివేదికలూ సూచిస్తున్నాయి.స్మార్ట్ వ్యసనంపై టాక్ షోబీబీసీ నిర్వహించిన సండే విత్ లారా కుయెన్స్‌బర్గ్ నిర్వహించిన టాక్‌షోలో పాల్గొన్న యూకే టెక్నాలజీ కార్యదర్శి పీటర్ కైల్‌ను ‘సోషల్ మీడియా పిల్లల సమయ పరిమితుల గురించి అడిగినప్పుడు, కైల్ స్పందిస్తూ ‘కొన్ని యాప్‌లు పిల్లలను స్మార్ట్‌ఫోన్‌కు అంటిపెట్టుకుని, ఫోన్ వ్యసన పరులయేలా చేస్తున్నాయి. వాటి బారి నుంచి పిల్లలను రక్షించడానికి ఆన్లైన్ భద్రత చట్టాల అమలుకు కృషి జరుగుతోంది’ అన్నారు. ఆన్లైన్లో హానికరమైన కంటెంట్‌ను చూసి, తన 14 ఏళ్ల కూతురు మోలీ ఆత్మహత్య చేసుకుందని, ఆన్ లైన్ భద్రతా చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సరైన నియంత్రణ లేకపోవడం, సాంకేతికత దుర్వినియోగం వల్ల ఎక్కువమంది యువత ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆరోగ్యాలు దెబ్బ తినడాన్ని చూశాం‘ అని ఇయాన్ రస్సెల్ అనే వ్యక్తి వేదనతో తెలిపారు. దీనికి కైల్ స్పందిస్తూ– ‘పిల్లలు ఆన్లైన్లో ఎదుర్కొంటున్న హాని సునామీని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని చూసి దేశంలోని తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ స్మార్ట్ ఫోన్లకు ప్లాస్టర్లను అతికించలేం. పరిమితులను విధించడం వల్ల మేలు జరగదు. ఆరోగ్యకరమైన ఆన్లైన్ జీవితం ఎలా ఉంటుందో పిల్లలు అర్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలి’ అంటూ అనిత ఈ షోలో తెలిపారు. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్మనం పరిమితులను ఎంచుకోవచ్చుయాప్స్కి, డిజిటల్ పరికరాలను నియంత్రించేందుకు ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. టిక్‌టాక్ 2023లో 18 ఏళ్లలోపు వారికి డిఫాల్ట్‌గా 60 నిమిషాల స్క్రీన్ సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇన్స్టాగ్రామ్ అన్ని వయసుల వినియోగదారులను వారి స్వంత పరిమితిని సెట్ చేసుకోమంటుంది. ఎంత సమయం బ్లాక్ చేయవచ్చో కూడా ఎంచుకోవచ్చు. 2021లో, చైనా ఆన్లైన్ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో మాత్రమే 18 ఏళ్లలోపు గేమర్స్‌ను రోజుకు ఒక గంటకు పరిమితం చేసింది. సెలవు దినాల్లో మూడు గంటలకు పెంచింది. యువతపై గేమింగ్ ప్రభావం గురించి తన ఆందోళనలను ఉదహరించి, మరీ ఈ నిబంధనలను విధించింది కేంద్రం. కానీ గత సంవత్సరం డ్రాఫ్ట్ అప్డేట్ ప్రభుత్వ వెబ్సైట్ నుండి అదృశ్యమైంది. ప్రభుత్వాలు అమలు చేయాలనే కఠిన నిబంధనలకన్నా ముందు కౌమారదశలో ఉన్న పిల్లలకు డిజిటల్ సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించడం ముఖ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి: 230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్‌కాదు,వాక్యూమ్ క్లీనర్’ తల్లిదండ్రులూ ఇవి అమల్లో పెట్టండిటెక్నాలజీని బ్లాక్ చేయవద్దు. పిల్లలకు సురక్షితంగా సాంకేతికతను ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్లు గురించి ఆసక్తి చూపుతూనే, వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటూ ఉండాలి..పేరెంట్స్ స్మార్ట్‌ఫోన్ వాడకంలో పరిమితులు నిర్దేశించాలి. ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్ వాడేలా జాగ్రత్తపడాలి.కుటుంబ మీడియా ఒప్పందం అంటే.. ప్రయాణం, భోజనం, పడక సమయాలు వంటి ప్రదేశాలను టెక్నాలజీ ఫ్రీ జోన్లుగా మార్చాలి. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం గురించి ఏమాత్రమూ వెల్లడించకూడదు అనే విషయాన్ని బోధించాలి. ఆన్లైన్ లో సమాచారాన్ని ఫిల్టర్ చేయడం, నిజం – అబద్ధం మధ్య తేడా తెలుసుకోవడంలో సహాయపడాలి. ఆరుబయట పచ్చదనం, స్క్రీన్ టైమ్ మధ్య సమతుల్యతను పాటించాలి. వారి శారీరక అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి.14 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ సైన్ అప్ చేయడంలో సహాయం చేయవద్దు.సోషల్‌మీడియాలో నమ్మదగిన వనరులను అన్వేషించి, వాటిని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీచాలా సైట్లు, వెబ్ టూల్స్ 13 ఏళ్ల పై వయసున్న యూజర్ల కోసం ఉంటాయి. ఇవి ఆన్లైన్ కాపీరైట్‌తో భద్రపరిచి ఉంటాయిఆన్లైన్లో చేస్తున్న వర్క్ గురించి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాలి. తాము చూస్తున్న సైట్లో తప్పుగా ఏమైనా అనిపించినప్పుడు, ఉపయోగించడంలో మెళకువలు తెలియనప్పుడూ టెక్నాలజీ తెలిసిన పెద్దవారిని అడగాలి.ఆన్లైన్లో స్నేహితులను తల్లిదండ్రుల అనుమతి లేకుండా యాడ్ చేయవద్దు. అవతలి వారు చెప్పిన ప్రతిదాన్నీ నమ్మవద్దువ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ΄ాస్వర్డ్లు, ప్లానింగ్‌లు, పుట్టినరోజు.. వంటివి షేర్ చేయవద్దు. ఏది బడితే అది పోస్ట్ చేయకూడదు. అది ఒక్కోసారి భవిష్యత్తుకు ప్రమాదంగా మారవచ్చు.మీరు లేదా మీకు తెలిసినవారు బుల్లీయింగ్‌కు గురైనట్లయితే వెంటనే ఆ విషయాన్ని పెద్దవాళ్లకు తెలియజేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్,ఎండ్ నౌ ఫౌండేషన్ -
Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?
‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్‌మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్‌ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.అసలేంటీ డస్టింగ్ డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్ చాలెంజ్ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్‌లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్‌మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది?క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయంనిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. -
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్‌పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్‌కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021 -
ఇదో దిక్కుమాలిన ఛాలెంజ్.. బైకర్పై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చేస్తున్న పనులపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్ చేశారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి. pic.twitter.com/G3FNIDfzjh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 8, 2025 -
అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్‌లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్‌టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్‌గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్‌గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. -
180 మీటర్ల రైడ్‌కు ఓలా!
రద్దీ ట్రాఫిక్‌లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్‌మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్‌లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్‌ను బుక్ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘రోహిత్ వ్లోగ్స్టర్’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకు పూర్తి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్‌కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్‌లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘ View this post on Instagram A post shared by ROHIT VLOGSTER (@rohitvlogster) 180 మీటర్లకు కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది’’ అని రైడర్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్‌కు డాగేశ్ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్‌గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్‌పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం) -
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్‌క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్‌ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. -
వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా వారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ablu Rajesh Kumar (@ablurajesh_) (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
ఆటోడ్రైవర్‌ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్‌ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్‌తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్‌గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్‌కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..
గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టారు. పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం..ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే కంగుతింటారు. అలా ఏకంగా 20 ఏళ్ల నుంచి చాలా శ్రమ ఓర్చి.. తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పైగా ఆయన డ్యూటీ పరంగా చాలా సిన్సియర్, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖాలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టార్ని పొందిన ఆ విద్యార్థులు కూడా ఎంతో అదృష్టవంతులు కదూ..!.ఆ మాస్టార్ పేరు అబ్దుల్ మాలిక్. కేరళకు చెందని ఆయన మల్లాపురంలోని పదింజత్మురిలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్లో లెక్కల మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఆ స్కూల్‌ని చేరాలంటే.. ప్రతిరోజూ సాహసం చేయాల్సిందే. నడుంకి ఓ ట్యూబ్ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తుంటారు. ఇలా ట్యూబ్ తగిలించుకోవడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ముద్దుగా ‘ట్యూబ్ మాస్టర్’ అనిపిలుస్తుంటారు. అయితే ఇలా నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడూ.. కాలానుగుణంగా వచ్చే భారీ వర్షాలు, పాములు వంటి ఇతర భయంకరమైన సరీసృపాలు తదితర సవాళ్లు చాలానే ఎదుర్కొంటుంటారాయన. అయినా అవేమి ఆయన్ను తన విద్యార్థుల దగ్గరకు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి. ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోకపోవడం విశేషం. ఇలానే ఎందుకంటే..మాలిక్‌కి ఇలా నదిలో ఈదుకుంటూ కాకుండా మరొక మార్గం ఉంది. కానీ మరింత వ్యయప్రయాసలతో కూడినది. ఎందుకుంటే సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ స్కూల్‌కి చేరుకోవాలంటే మూడు బస్సులు మారాల్సిందే. పైగా మూడుగంటలకు పైగా జర్నీ చేయాలి. దాంతో మాలిక్ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్‌కి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పడవల సాయంతో వెళ్దామంటే.. ఆ నది నీటి ఉద్ధృతిలోని హెచ్చు తగ్గుల రీత్యా అది అస్సలు సాధ్యం కానీ పని అంటున్నారు మాలిక్. ఇక ఆయన క్లాస్‌లు ఉదయం 10.30తో మొదలవ్వుతాయి. ఆయన గణితాన్ని బోధించడం తోపాటు పర్యావరణం గురించి తెలుసుకునేలా ఆయన రోజు ఈతకొట్టి వచ్చే నది వద్దకు కూడా విద్యార్థులను తీసుకువెళ్తారు మాలిక్. ప్రకృతిని కాపాడుకోవడం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా తీసుకువెళ్తుంటానని చెబుతున్నారు మాలిక్. కాగా, 2013 నుంచి ఆ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు మాలిక్. అలా ఈ ఏడాది 2025 పూర్తి అయ్యే నాటికి.. ఆయన ఆ స్కూల్‌కి వెళ్లి తిరిగి రావడానికి.. దాదాపు 700 కిలోమీటర్లక పైనే ఈత కొట్టినట్లు అంచనా.!. నిజంగా ఈ మాస్టారు మాములు గ్రేట్ కాదు కదా..!. (చదవండి: పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..! ఆ ఎవర్గ్రీన్ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..) -
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్? ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి? -
Social Media లైక్.. కామెంట్.. షేర్.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లే!
‘కరీంనగర్‌కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ ఇంట్లో మారాం చేశాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు కొనిస్తామంటే వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పారిపోయిన కొడుకు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తెచ్చి ఫోన్ఇచ్చారు. చాలా కుటుంబాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తప్పుతోందని చెబుతున్నారు’రీల్స్‌పై తాపత్రయం.. ప్రాణాపాయం‘జిల్లాలోని ఓ పట్టణప్రాంతానికి చెందిన తొమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవల క్లాస్‌రూమ్‌లో పరీక్ష రాస్తూ నిద్ర పోయాడు. ఉపాధ్యాయుడు గమనించి అతడి ముఖంపై నీళ్లు చల్లినా.. స్పందన కరువైంది. సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్య సమస్య తలెత్తినట్టు డాక్టర్లు తెలిపారు. రెండురోజులు మిత్రులతో కలిసి రీల్స్ చేసేందుకు ఇతర ప్రాంతానికెళ్లడమే కారణమని తేలింది. చదువుకునే వయసులో ఎందుకీ పనులని టీచర్లు ప్రశ్నించగా.. తనకు నెలకు రూ.10 వేలు వస్తాయని బదులివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.’ప్రస్తుత ప్రపంచమంతా ‘లైక్’, ‘కామెంట్’, ‘షేర్’ రూపంలో మారిపోయింది. ఈ వర్చువల్ ప్రపంచపు చిరునవ్వుల కోసం యువత, విద్యార్థులు అనర్థాల బాట పడుతున్నారు. ఒక్క చిన్న రీల్, కొద్ది సెకన్ల వీడియో, ఒక్క ఫేమ్ కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల కో సం అందించిన ఫోన్లు, ఇప్పుడు వారి జీవితాన్ని ని యంత్రించే ఆయుధాలుగా మారాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, రీల్స్ యువతకు ఆత్మలుగా మారిపోయాయి. ఇటీవల కరీంనగర్ మానేరు వాగులో ఓ యువకుడు రీల్స్ కోసం వెళ్లి మునిగిపోయాడు. మరో యువకుడు రైలుపై రీల్ తీయడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇలా రోజురోజుకు రీల్స్ పిచ్చి అనార్థాలకు దారీతీస్తోంది.యువత మారాలి..రీల్స్‌ను కట్టడి చేయాలంటే యువత ముందుగా పద్ధతి మార్చుకోవాలని, ప్రాణాంతక రీల్స్‌తో జీవితాలే కోల్పోతామని గుర్తుంచుకోవాలని సైక్రియాటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే రీల్స్ వెనక దాగి ఉన్న ప్రమాదాలు ఊహించకుండా వీడియోలు చూస్తున్నవారు అనేక రకాల యాడ్స్ రూపంలో మోసాలకు గురువుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ద్వారా ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్వయోభేదం లేకుండా..సామాజిక మాధ్యమాలు బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయోభేదం లేకుండా పావులారిటీ కోసం ఫొటోలు, వీడియోలు, ప్రదర్శనలకు వాటిని వేదికగా మలచుకుంటున్నారు. వారించాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపకరిస్తున్నా, చదువుపై నిర్లక్ష్యం పెరుగుతోందని కన్నవారు గుర్తించలేకపోతున్నారు.రీల్స్‌తో అనర్థాలురీల్స్ కోసం చేసే బైక్ విన్యాసాలతో చాలా మంది యువతకు అనర్థాలు జరిగాయి. కరీంనగర్ మానేరు, బైపాస్, మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట తదితర ప్రాంతాల్లో యువత బైకులు తిప్పుతూ, రోడ్లపై హుషారుగా రీల్స్ తీసే ప్రయత్నాల్లో బలవుతున్నారు. డివైడర్లకు తగిలి, ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రీల్స్ వెనక నిజజీవితంలో జరుగుతున్న విషాదాలు ఎవరిదృష్టిలో పడడం లేదు. కరీంనగర్ జిల్లాలో రీల్స్ తీసే యత్నంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండగా తాజాగా అర్బాజ్ అనే యువకుడు మానేరువాగులో రీల్ తీసేక్రమంలో నీటమునిగి మృతిచెందాడు. అతడితో ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా కాపాడలేకపోయారు. ఇదే జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుపై రీల్ తీయబోతూ కరెంట్‌షాక్‌కు గురై మృత్యువాతపడ్డాడు.చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దురీల్స్కు యువత ఆకర్షితులవడంతో అది వ్యసనంగా మారడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస లోపంతోనే సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా వీటి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యువత భవిష్యత్తు మీద దృష్టి పెట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.– డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైక్రియాటిస్టు -
ట్రాన్స్ఫార్మర్కు ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
మట్టి, గట్టు, చెట్టు, పుట్ట.. మన దేశంలో ప్రతీది పూజలకు అర్హత ఉన్నవే. అయితే ఇక్కడ ఓ ఊరు కరెంట్ ట్రాన్స్ఫార్మర్(Electricity Transformer)కు ప్రత్యేక పూజలు చేసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పూజలు ఎందుకో తెలుసా?మధ్యప్రదేశ్ భింద్ గ్రామంలోని(Madhya Pradesh Bhind Village) గాంధీనగర్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ గత 15 సంవత్సరాలుగా సేవలందించి.. ఈ మధ్యే కాలిపోయింది. విద్యుత్ విభాగం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అసలే వేసవి కావడంతో రోజుల తరబడి ప్రజలు కరెంట్ లేక అల్లలాడిపోయారు. చివరకు.. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుష్వాహను ఈ విషయమై సంప్రదించారు.ఎమ్మెల్యే చొరవతో రెండే రెండు గంటల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ను అధికారులు బిగించేశారు. దీంతో వాళ్లు సంబురం చేసుకున్నారు. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి ట్రాన్స్ఫార్మర్కు పూజలు(Puja To Transformer) చేశారు. ఆపై స్వీట్లు పంచుకున్నారు. ఎందుకిలా చేశారని ఆరా తీస్తే..ఆ గ్రామస్తులు మరోసారి అధికారులను నమ్ముకోవాలనుకోవడం లేదు. అలా నమ్ముకుంటే ఏం జరుగుతుందో వాళ్లను అనుభవం అయ్యింది కదా. ‘‘అధికారులు ఎలాగూ సక్రమంగా పని చేయరు. అందుకే చాలాఏండ్లు పని చేయాలని ఈ కొత్త ట్రాన్స్‌ఫార్మరే కోరుకుంటూ పూజలు చేశారంట. హా.. షాకయ్యారా! అదన్నమాట అసలు సంగతి. ఇదీ చదవండి: పులిని పుట్టుకుని సెల్ఫీకి యత్నించి.. -
బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్
భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికన్ యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోల్‌కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్‌కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్ తన యూట్యూబ్ (Youtube) ఛానల్లో అప్లోడ్ చేయగా ఇది వైరల్‌గా మారింది.ఆనందనగరం కోల్‌కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్‌కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్ హోటల్‌కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్ చేసుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్‌కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు చార్జీరూ.700 బదులుగా రూ.900 డిమాండ్ చేశాడు.ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఇక్కడితో అయిపోలేదు....మరో వ్యక్తి (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్కోసం మరో టాక్సీని బుక్ చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్‌కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్‌పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, మ“నేను వీడియో లింక్‌తో కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. -
ఏరా పులి..!
రేయ్.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే రిస్క్‌లో పడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్టు.ఈ భూమ్మీద పులులకు స్వర్గధామంగా థాయ్‌లాండ్ ఫుకెట్(Phuket)కు పేరుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు.. ఫొటోలు దిగొచ్చు.. అతిదగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది.తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి.. దాని శిక్షకుడి సూచన మేరకు దానిని పట్టుకుని ఫొటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది(Tiger Attack Viral Video). కట్ చేస్తే..సిద్ధార్థ శుక్లా(Sidharth Shukla) అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటన తాలుకా వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్ సెక్షన్లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్ చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపాడు.Apparently an Indian man attacked by a tiger in Thailand.This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినవస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్ నిర్వాహకులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వివేక్ రామస్వామి భార్యకు చేదు అనుభవం -
అపార్ట్మెంట్ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం.. ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్..
భువనేశ్వర్: ఒక ప్రభుత్వ ఇంజినీర్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్‌కు చిక్కింది. విజిలెన్స్ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని సదరు అధికారి.. ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేశాడు. ఆ కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. సోదాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరిలోని పిపిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.Odisha Vigilance Raids Chief Engineer of RW Division in DA Case, ₹2.1 Crore Cash Seized@odisha_police pic.twitter.com/fNqSsIveqT— Dr.Somesh Patel🇮🇳 (@SomeshPatel_) May 30, 2025 ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు పడేశాడు. కింద వెళ్తున్న వారు కిటికిలో నుంచి పడుతున్న నోట్లను చూసి ఖంగుతున్నారు. అనంతరం, నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా రూ.రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.#WATCH | Bhubaneswar: Odisha Vigilance Department conducted searches at 7 locations of Odisha Rural Works Division Chief Engineer, Baikuntha Nath SarangiAbout Rs 1 crore has been recovered from his flat in Bhubaneswar, while about Rs 1.1 crore has been recovered from his… pic.twitter.com/n8MQxYfU0L— ANI (@ANI) May 30, 2025 Odisha Vigilance Raids on Chief Engineer Baikuntha Nath Sarangi working in RW Dept over disproportionate assetsVigilance recovered approximately Rs. 2.1 crore cash Sarangi threw several bundles of Rs. 500 notes from his Bhubaneswar flat window upon seeing vigilance officers pic.twitter.com/CO3dnWWv8K— S U F F I A N (@iamsuffian) May 30, 2025 -
పర్యాటకులపై రైనో దాడియత్నం.. వీడియో వైరల్
దిబ్రూగఢ్: సరదాగా నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లిన పర్యాటకలకు ఊహించని పరిణామం ఎదురైంది. పర్యాటకులు పార్కులో సంచరిస్తున్న సమయంలో ఓ ఖడ్గమృగం వారి వాహనంపైకి దూసుకెళ్లింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో, అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అసోంలోని మానస్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకచోట ఆగిన పర్యాటకులు.. అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఖడ్గమృగం.. పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా.. పర్యాటకులు ఉన్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు, వెనక్కు లాగుతూ.. వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం ఇలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అనంతరం, కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. In Manas National Park in Assam, this furious rhino has attacked a tourist vehicle no less than five times.Each day, rhino charges at the mere sight of humans.The reason behind its anger toward people remains a mystery. pic.twitter.com/mE3V6TT04z— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) May 29, 2025 -
అంతా చూస్తున్నారు.. అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం... సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతోంది’ఇదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్నిబట్టి చూస్తే సోషల్ మీడియా ప్రొఫైలింగ్‌కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతోంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు.. స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్ మీడియా ప్రొఫైలింగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించే భావాలు.. పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తి త్వం ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తు న్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి–అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్లలో వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. అందుకే సోషల్ మీడియాలో అంతాచూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.ఫన్ పేరిట కించపర్చేలా వ్యాఖ్యలు సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతేస్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వాడటం పరిపాటిగా మారింది. గంటల తరబడి చాటింగ్‌లు, మీటింగ్‌ల్లో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్ పేరిట ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. ఈ వ్యాఖ్యలే వారిపాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారి తీస్తున్నాయి. ఎంబసీల్లోని అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రొఫైలింగ్. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు.. సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఉన్నతంగా ఉండాలని చెబుతున్నారు. మన చేతుల్లోనే.. మన భవిష్యత్తు» కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయంలోనే కాదు.. అన్ని వయస్సుల వారి అవకాశాలకు ప్రతిబంధకంగా ఈ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ మారుతోందని మరవొద్దు. » పెళ్లి సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతోందని మరవొద్దు. » ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా యాప్‌లలో, వాట్సాప్ వంటి గ్రూప్‌ల్లో సంయమనంతో ఉండకపోతే చిక్కులు తప్పవు. » అనసవర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. » మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్ ఎవరు, తరచూ ఎక్కడికి వెళుతుంటాం.. వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయొచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా సమాచారం అనవసరం.. సోషల్ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు. కానీ, అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారమూ సోషల్ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్సైట్లో, సెర్చ్ ఇంజిన్‌లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్‌సైట్‌ను కోరాలని వారు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ఖాతాలున్న వారు.. వాటిల్లో షేర్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనావేసే పద్ధతినే సోషల్ మీడియా ప్రొఫైలింగ్అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు. -
గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!
సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కంటెంట్ క్రియేటర్ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్‌గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్‌తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్ లాగా మీరు మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్‌గా షేవ్ చేసుకుంటే బెటర్’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్ టూర్ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
Podcast: యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్ - ట్రెండింగ్ పాడ్‌కాస్టింగ్!
శ్రీనగర్‌కాలనీ: ఓ వ్యక్తి అనుభవాలు.. ఎదుర్కొన్న కష్టాలు.. సాధించిన విజయాలు.. పలువురికి ఉపయోగ పడే సంఘటనలు.. ఇలా ఎన్నో అంశాలను తెలుసుకోవడానికి పేపర్ చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడటం చేసేవాళ్లం. ఆయా అంశాల గురించి తెలుసుకునేవారం.. ఇప్పుడంతా ఫోనే.. తింటున్నా.. నడుస్తున్నా.. జర్నీ చేస్తున్నా.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫోన్.. ఒక్కసారి యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర యాప్స్ ఓపెన్ చేస్తే చాలు వేలు, లక్షల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్(Podcast) ట్రెండ్ కొనసాగుతోంది. ఇది కొన్నేళ్ల క్రితమే మొదలైనా ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్ అంటే అందరికీ తెలుస్తోంది. ఇంటర్వ్యూ ట్రెండ్ అవ్వాలంటే పాడ్కాస్టింగ్తోనే అన్నట్లుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడాది కాలంగా మరింత ట్రెండింగ్‌గా మారి సెలెబ్రిటీస్‌తో పాడ్‌కాస్టింగ్ కోట్లలో వ్యూస్‌ని తెచ్చిపెడుతోంది. యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్.. భారత్‌లో పాడ్కాస్టింగ్కు డిమాండ్ పెరిగింది. ఫుడ్, బిజినెస్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, సైన్స్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో రాణించిన వారు తమ అనుభవాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడిస్తున్నారు. ఇందులో వీడియో పాడ్‌కాస్టింగ్ చాలా పాపులర్ అయ్యింది. ఒక యూట్యూబర్ లేక ఒక వ్యక్తి ఫేమస్ పర్సన్‌ను వారి అనుభవాలను విశ్లేషణాత్మకంగా, పూర్తిగా వారి అనుభవాలను నెటిజన్లను తెలియజేయడం ట్రెండింగ్‌గా మారింది. ఫేమస్ పర్సనాలిటీస్ వారి జీవిత విషయాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడించడంతో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల్లో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా చానల్స్‌కి కూడా రూ.లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇదీ చదవండి: చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగాపాడ్కాస్టింగ్.. పాడ్‌కాస్టింగ్ అంటే ఒక వ్యక్తి తన విజ్ఞానాన్ని, పలు విషయాలను పూర్తిగా వివరించే పక్రియే పాడ్‌కాస్టింగ్.. ఆడియో, వీడియో, మోనో, గ్రూప్ పాడ్‌కాస్టింగ్ చాలా రూపాల్లో ఉంటుంది. ఒకప్పుడు రేడియోలో ఒక వ్యక్తి తన రంగానికి సంబందించిన విషయాలను వెల్లడించడమే ఇప్పుడు రికార్డింగ్ రూపంలో ఒక క్లారిటీ ఆడియో, వీడియోను చేయడమే.. ఆడియో పాడ్‌కాస్టింగ్ చాలా తక్కువ టైంలో అవుతుంది. అదే గ్రూప్, ఇద్దరు వ్యక్తుల పాడ్‌కాస్టింగ్ వీడియో పాడ్‌కాస్టింగ్ చేయాలంటే మైక్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఖచ్చితంగా చేయాలి. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్ -
Comment X: పబ్లిక్ రోడ్లు కాస్త..
నడిరోడ్డులో.. పగలురాత్రి తేడాల్లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా అవి వైరలూ అవుతున్నాయి. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్‌లో ఓ నేత రోడ్డు మీదే ఓ మహిళతో నగ్నంగా శృంగారం జరిపి కటకటాల పాలయ్యాడు. తాజాగా కర్ణాటకలో కదిలే కారులో రెచ్చిపోయింది ఓ జంట.బెంగళూరుకు చెందిన ఓ జంట మే 27వ తేదీన కోరమంగళలో డిన్నర్ చేసింది. ఆపై కారులో వెళ్తూ.. సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయసాగింది. దారినపోయే వాహనదారులు ఆ తతంగం అంతా రికార్డు చేశారు. అయితే.. Karnataka Portfolio అనే ఎక్స్ పేజీ ఆ వీడియోను హైలైట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి జుగుప్సాకరమైన చేష్టలు ప్రజలకు ఇబ్బందికరమైనవని, కారులో ఉన్నవాళ్లతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ఇబ్బందుల్లోకి నెడతాయని పేర్కొంది. వీడియో బాగా వైరల్ కావడంతో నగర పోలీసులు స్పందించారు. వీడియోలో నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసి ఓనర్‌ను పట్టుకున్నారు. ప్రమాదకరీతిలో వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద మొత్తం రూ.1,500 జరిమానా చేతిలో పెట్టి ఈసారికి వార్నింగ్‌తో వదిలిపెట్టారు. మొన్నీమధ్యే.. ఏప్రిల్‌లో నగరంలోని మాదవర మెట్రో స్టేషన్లో ఓ జంట అభ్యంతరకర చేష్టలకు దిగడం.. ఈ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవ్వడం తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పబ్లిక్ రోడ్లు కాస్త ప్రైవేట్ బెడ్రూంలుగా మారిపోయాయంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అయ్యింది.ఇదీ చదవండి: మెట్రోలో వెళ్లే అమ్మాయిలను సీక్రెట్‌గా ఫొటో తీసి.. -
పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్‌ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్‌కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్‌స్ట్రీట్‌లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్‌స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్‌స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్‌లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్‌స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
‘వహ్ సీఎం సాబ్’.. పహల్గాంలో కేబినెట్ భేటీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అరుదైన పని చేశారు. ఉగ్రవాదంతో దెబ్బ తిన్న పహల్గాం పట్టణ పర్యాటకాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఏకంగా పహల్గాంలోనే మంగళవారం ప్రత్యేక కేబినెట్ భేటీ (Pahalgam Cabinet Meeting) నిర్వహించి దేశానికి బలమైన సందేశం పంపించారు.అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఈ దాడి ప్రభావం జమ్ము కశ్మీర్ పర్యాటకంపై తీవ్రంగా పడింది. ఘటన జరిగిన సాయంత్రం నుంచే పర్యాటకులు తిరుగు ముఖం పట్టడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తాకిడి మాత్రం పెద్దగా ఉండడం లేదు. దీంతో పర్యాటకాన్నే నమ్ముకున్న వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. పర్యాటకులను ఆహ్వానిస్తూ ఇవాళ ఆయన పహల్గాంలోనే కేబినెట్ భేటీ నిర్వహించారు. ‘‘ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వాళ్లను అభినందించడానికే ఈ సమావేశం. ప్రభుత్వంలో ఉన్నామని ఏదో మొక్కుబడిగా ఇక్కడికి మేం రాలేదు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలకు.. కశ్మీర్ పర్యాటకం, అభివృద్ధి రెండూ ఆగిపోవని చెప్పడానికే వచ్చాం’’ అని అన్నారాయన. అంతకు ముందు.. పహల్గాంలోని టూరిస్టు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఆ ఫొటోలు వైరల్‌కాగా.. వహ్ సీఎం సాబ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సారీ మేడమ్.. ఏదో ఏమోషన్లో అనేశా! -
స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు
బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.చైనా సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province)లోని యిలాంగ్ మిడిల్ స్కూల్ విద్యార్థి రెన్(15). ప్రాణాంతక క్యాన్సర్‌తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్ ఇయర్ ముగియనుంది. ఈలోపు.. రెన్కు చదువు చెప్పిన టీచర్‌కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్మేట్స్, రెన్ తల్లిదండ్రులు అంగీకరించారు.మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్ (Ren) ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. గ్రూప్ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా? -
గ్రేట్ సీఎం సార్!.. మాటల్లేవ్ అంతే!
ఎంత పెద్ద హోదాలో ఉన్నా..ఆ దర్పం చూపించకుండా ప్రవర్తించడం కొందరికే చెల్లుతుంది. అలాంటి వాళ్లు కచ్చితంగా ప్రజల మన్ననలను అందుకుంటారు. బహుశా ఆ తీరే వారిని గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేస్తుందనడానికి ఈ సీఎంనే ఉదాహారణవివరాల్లోకెళ్తే..మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మాకి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సంగ్మా జిరాంగ్ నియోజకవర్గంలోని నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్థానికి పాఠశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఒక విద్యార్థి గిటార్ ప్లే చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తారు. వెంటనే ఆ విద్యార్థి వద్దకు వచ్చి..కోప్పడకుండా ఓపికతో ఎలా ప్లే చేయాలో చెబుతున్నట్లు కనిపిస్తుంది వీడియోలో. ఆయన ఒక సాధారణ టీచర్ మాదిరిగా ఎలా గిటార్ పట్టుకుని ఆలపించాలో చాలా వివరణాత్మకంగా చెబుతూ విద్యార్థిని గైడ్ చేస్తారు. అందుకు సంబంధించిన వీడయోని నెటిజన్లతో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు సంగ్మా. నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్కూల్‌ని సందర్శించి..ఆ విద్యార్థులతో కాసేపు మచ్చుటించారు. అక్కడ ఒక విద్యార్థికి గిటార్ ప్లే చేయడం పట్ల అపారమైన ఆసక్తి ఉంది కానీ వాయించడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతానికి ఆ విద్యార్థికి అందులో అంత ప్రావీణ్యం లేకపోయినా..అతని పాఠశాల కొత్త భవనం ప్రారంభోత్సవ వేళకు గిటార్లో మంచి పట్టు సాధిస్తాడని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం గ్రేట్ సీఎం, మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంగీతాన్ని అమితంగా ఇష్టపడే మేఘాలయ సీఎం తరుచుగా మ్యూజిక్‌కి సంబంధించిన వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. View this post on Instagram A post shared by Conrad Sangma (@conrad_k_sangma) (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్‌కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన లాలూ కొడుకు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) అందరినీ సర్ప్రైజ్ చేశారు. సింగిల్ స్టేటస్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను, తన ప్రేమను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేయడం గమనార్హం.అనుష్క యాదవ్(Anushka Yadav) అనే అమ్మాయితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని, తాము గతకొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నామని తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశానని, అంతా తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారాయన. ఈ పోస్ట్ బీహార్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరు తేజ్ ప్రతాప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్ నేపథ్యం కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ఈ యువనేత.. తాను అక్కడ సింగిల్‌గా లేననే విషయాన్ని తాజా పోస్టుతో స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్-రబ్రీదేవి జంటకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కూతుళ్ల తర్వాత ఏడో సంతానంగా తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించాడు. చిన్న కొడుకు, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ చివరి సంతానం. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు గతంలో వివాహం జరిగింది.బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య(Tej Pratap Yadav Wife Aishwarya)తో 2018లో తేజ్ ప్రతాప్ వివాహం అయ్యింది. అయితే ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని తేజ్ ప్రతాప్, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య ఐదు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా.. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
అర్ధరాత్రి.. అదీ బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో ఒక్కడో రాజకీయ నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్(Dirty Picture) వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భోపాల్: మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లా బని గ్రామానికి బీజేపీ నేత మనోహర్‌లాల్ ధాకడ్(Manoharlal Dhakad) తీరుపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదమరిచి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ వైట్ కలర్ కార్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన వచ్చి ఆగింది. అందులోంచి నగ్నంగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఆపై కిందకు దిగిన మనోహర్‌లాల్ ఆమెతో అభ్యంతరకర భంగిమలో రెచ్చిపోయాడు. మే 13వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో మనోహర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మనోహర్ బీజేపీ లోకల్ లీడర్ కాగా, ఆయన భార్య మంద్సౌర్ జిల్లా పంచాయితీ సభ్యురాలు.ఈ గలీజు వీడియోపై ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్ రాజేష్ దీక్షిత్ స్పందించారు. మనోహర్‌లాల్‌కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్లైన్ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎట్టిపరిస్థితుల్లో చోటు ఉండబోదని స్పష్టం చేశారు. -
ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్ వైరల్
200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్ జెట్ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! -
మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్‌లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!) -
'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్‌లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్‌ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్‌లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది. -
అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..!
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో లండన్‌లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్‌లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు. అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!. View this post on Instagram A post shared by UB1UB2: Southall, West London (@ub1ub2) (చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..) -
వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే నుజ్జు.. నుజ్జేగా!
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई। ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు! -
బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
బీర్ బాటిళ్ల లోడుతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. దీంతో బీర్ బాటిళ్లను దక్కించుకునేందుకు జనాలు ప ఓటీలుపడ్డారు. డ్రైవర్‌ను, క్లీనర్ ట్రక్కులో చిక్కుకుపోయారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి సహాయం చేయడానికి బదులుగా అయితే, బాటసారులు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకుని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీ బీర్ పిచ్చి తగలడ, కాస్త మారండిరా బాబూఅంటూ నెటిజన్లు కమెంట్లతో మండిపడుతున్నారు.మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ ఘటనచోటుచేసుకుంది. కట్ని జిల్లా చాపారా గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సవందలాది మద్యం కార్టన్లతో నిండిన ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కు లోపల చిక్కుకున్న డ్రైవర్ , క్లీనర్‌కు సహాయం చేయడానికి కొంతమంది మొదట ముందుకు వచ్చారు. కానీ బీరు బాటిళ్లను మర్చి మానవత్వాన్ని మర్చిపోయారు. దొరికింది దొరికినట్టు మందు సీసాలను దొరకబుచ్చుకొని కాళ్లకు పనిచెప్పారు.ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన డ్రైవర్గురించి గానీ క్లీనర్ గురించి గానీ ఏ మాత్రం పట్టించుకోకుండా పట్టించుకోలేదు నెటిజన్టు కమెంట్స్ చేశారు.People Rush To Loot Beer Bottles As Loaded Truck Overturns In MP's Jabalpur #people #Jabalpur #BearBottles #loot #MadhyaPradesh pic.twitter.com/EUoJkaEtER— Free Press Madhya Pradesh (@FreePressMP) May 19, 2025 p; కొందరు బీరును సంచులలో మోసుకెళ్లగా, మరికొందరు తమ భుజాలపై డబ్బాలను ఎత్తుకుని పారిపోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు సీసాలను దోచుకుంటున్న సంఘటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారి తీసింది. ఈ ట్రక్కు జబల్పూర్ నుండి భోపాల్‌లోని హజారిబాగ్‌కు వెళుతోంది. ఒక గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువును కాపాడే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో ట్రక్కు బోల్తా పడింది. లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనాపోలీసులకు సమాచారం అందిన వెంటనే, సలీమ్నాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్ , క్లీనర్‌ను చికిత్స కోసం కట్ని జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు మిగిలిన మద్యంను భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు భారీ మొత్తంలో వాటిని ఎత్తుకుపోయారు.ప్రమాదం, జనాల కక్కుర్తి వల్ల నష్టం లక్షల రూపాయలలో ఉందని మద్యం కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన అధికారులు వైరల్ వీడియోల ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలుతీసుకునేందుకు ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నివ్య ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్, ఇతర నగలతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్...కూల్‌గా గాగుల్స్ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p> -
'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయించి విజయ ఢంకా మోగించి స్ఫూర్తిగా నిలుస్తారు కొందరు. అదికూడా యంగ్ ఏజ్‌లో కాకుండా వృద్ధాప్యంలో సాధించడం అంటే మాటలు కాదు. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలనుకున్న వారికే ఇదంతా సాధ్యం అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందింది ఈ అమ్మమ్మ. ఈ అమ్మమ్మ అందుకున్న గెలుపు వింటే..సూపర్ బామ్మ అని అనుకుండా ఉండలేరు. ఆ ఏజ్‌లో చదవాలనుకోవడమే గొప్ప..కానీ ఈ బామ్మ తనున్న వైకల్యానికి చదవాలనే నిర్ణయమే అత్యంత సవాలు. పైగా అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయం అందుకోవడం మరింత విశేషం. ఆ అమ్మమ్మ ఎవరు ఏంటా కథ సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలోని టేనస్స్ రాష్ట్రానికి చెందిన 47 ఏళ్ల అమండా జుయెట్టెన్కి ఉన్నత విద్యపూర్తి అయిన వెంటనే వివాహం అయిపోయింది. ఆ తర్వాత పిల్లల బాధ్యతలు, కుటుబ పోషణార్థం ఉద్యోగం చేయడం తదితరాలతో జీవితం గడిచిపోయింది. అమ్మమ్మగా మారే నాటికి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే పరిస్థితి కారణంగా కనుచూపు పోగొట్టుకుంది. కనీసం ఈ చరమాంకంలో అయినా ..ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామనుకుంటే..కంటి చూపే కరువైపోయింది అని విలవిలలాడింది. కనీకనబడకుండా ఉన్న ఆ కొద్దిపాటి కంటి చూపుతోనే ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడింది. ఆ క్రమంలోనే కొలరాడో సెంటర్ ఫర్ ది బ్లైండ్‌లో ఎనిమిది నెలల గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యింది. 30 ఏళ్లక్రితం వదిలేసిన చదువుని తిరిగి బుర్రకు ఎక్కించుకోవడం..పట్టు సాధించడం తదితరాలను తన ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా ఆమె ప్రగాఢమైన కోరిక ఆ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసింది. తన సంరక్షకుడు, గైడ్ అయిన తన పెంపుడు కుక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. తాను అందురాలిగా ఆ స్కిల్ నేర్చుకోకుండా మిగిలిపోకూడదనుకున్నా అని సగర్వంగా చెబుతోంది. అంతేగాదు అంధులకు స్వరం కావాలి. అందుకోసం మంచి ఉన్నత చదువులు చదవాలి..అప్పుడే వారు తమ గళాన్ని వినిపించగలరు అంటుందామె. వారిలో స్ఫూర్తి నింపేందుకే తన ఎడ్యుకేషన్ జర్నీని ఆపనంటోంది. డాక్టరేట్ కూడా సాధించాలనుకుంటోంది. మరీ ఆ అమ్మమ్మకి ఆల్ ద బెస్ట్ చెప్పి..విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..!.(చదవండి: భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు ) -
టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో
టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవరంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరిచేందుకు, వారికి భరోసా కల్పించేందు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ జరిగిందంటే..బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచి పోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ బుల్డోజర్లో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని జెసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశా,నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జెసిబిలను ఉపయోగిస్తున్నారు #Bengaluru continued to #experience #heavyrains, leading to #water entering homes in several parts and #flooding in #low-#lying #areas of the #city. As of 8 a.m., the #city received 105 mm of #rainfall in the past 24 hours, according to the (IMD). pic.twitter.com/iKYkdqk9xM— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 19, 2025మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, తుమకూరు, మండ్య, మైసూరు, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరె మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్ ,హోరామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్కర్ణాటక తీరప్రాంతంలో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది, ఉత్తర , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అతి భారీ వర్షాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, గడగ్, హవేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. -
ఆపరేషన్ సిందూర్ తడాఖా.. దేశ భక్తిపై భారత్‌లో నయా ట్రెండ్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు సైతం దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం జరగడంతో పాక్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన టీషర్టులపై సైనిక నినాదాలు, వాయుసేన ఫొటోలు ముద్రించి దేశభక్తిని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక, ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్ బయటకు వచ్చాయి. ఇవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి."Our job is to hit the target, not to count the body bags!"#OperationSindoor was conceptualised with a clear military aim — to punish the perpetrators and planners of terror, and to destroy their terror infrastructure. - Command pic.twitter.com/oEY3cBXwEP— Ramraje Shinde (@ramraje_shinde) May 12, 2025ఈ టీషర్ట్స్‌పై ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’ లాంటి నినాదాలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇలాంటి టీషర్ట్స్‌ను విడుదల చేశాయి. దీంతో, ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.@IAF_MCC Proud to wear this. 💕💘🥰😍---@major_madhan In your operation sindoor video, explaining the sequence of events, there was a special series on Airmarshal AK Bharti., in which you spoke of his statement being printed on T-shirt. I got one today. pic.twitter.com/tA8qAmWRCZ— pandurangavittal.vn (@vittal_vn) May 17, 2025 Overnight this statement has become a rage and T shirts are getting printed now.Think and brood over it … why..!~Air Marshal AK Bharati~architect behind #OperationSindoor pic.twitter.com/StLqSazaX9— Braj Mohan Singh (@brajjourno) May 12, 2025 New India. New rules. No mercy.This is Bharat’s new normal: Strike first, strike hard.#OperationSindoor pic.twitter.com/FadCVJVRil— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2025 -
ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం
టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.‼️ The Prime Minister of Albania greeted Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni with a deep bow and genuflectionA rare display of respect, elegance, and old-world chivalry pic.twitter.com/lKyoNXL8zN— Mambo Italiano (@mamboitaliano__) May 16, 2025ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్ సిస్టర్’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Bend it like Albanian PM not like #Bekcham. Grand welcome with respect for Italian PM #GiorgiaMeloni, truly commands the utmost respect of world leaders. pic.twitter.com/a4zSQFelwn— Vinay Kumar (@vinatanycost) May 16, 2025 -
వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్‌నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. -
70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్‌నాథ్‌కు..! వీడియో వైరల్
మనిషి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. అలాంటి ఉదంతాలు ఎన్నో కోకొల్లలుగా జరిగాయి. వాటన్నింటిని తలదన్నేలా అంతకు మించి..అనే అజేయమైన సాహాసానికి తెరతీశాడు ఈ 70 ఏళ్ల వృద్ధుడు. అతడి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే.. ఇదేలా సాధ్యం అనే ఆశ్చర్యం కలగకమానదు. కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌కు కాలినడకన వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి మరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారాయన. ఆ వృద్ధ భక్తుడు తన తోటి యాత్రికుల బృందంతో కలబురగి నుంచి ఈ యాత్ర చేసినట్లు తెలిపారు. తాము మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని అన్నారు. అంటే దాదాపు రెండు నెలల్లో వివిధ మైదానాలు, అడవులు, పర్వత మార్గాల గుండా సుమారు 2,200 కిలోమీటర్ల అసాధారణ యాత్రను చేశారు వారంతా. అంతేగాదు ఆ వృద్ధుడు ఇదంతా మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని అంటున్నారాయన. దైవం ఆశీస్సులు ఉంటే ఎంత కఠినతరమైన ప్రయాణమైనే చిటికెలో సాధ్యమైపోతుందని ధీమాగా చెబుతున్నాడు ఆ వృద్ధుడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల మనసును కదిలించింది. ధృడ సంకల్పం, అజేయమైన భక్తి..అనితరసాధ్యమైన ఓర్పుని అందిస్తాయనడానికి ఆ వృద్ధుడే ఉదహారణ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 12000 km Padyatra from Karnataka to KedarnathHindu Dharma is Sanatan because of the Bhakts like him Har Har Mahadev 🔥 pic.twitter.com/bNphehFL8t— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 15, 2025 (చదవండి: పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు..! పట్టరాని ఆనందంలో స్వలింగ జంట) -
వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025 -
పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు.!
ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.భారత సంతతికి చెందిన క్వీర్ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె. నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్ష్లలకు పైగా లైక్‌లు వచ్చాయి.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!) -
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్‌ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంతకీ ఎవరా ఆ రష్యన్ మహిళ అంటే..రష్యన్ బనియాగా పిలిచే పోలినా అగర్వాల్ ఇన్‌స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ..హృదయపూర్వక సందశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివాసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్‌లోని ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించిందని అన్నారు. అందుకు తానే ఏమని బదులిచ్చిందో వివరించింది. పోలినా ఏం చెప్పారంటే..భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగా సురక్షితమైనదని చెప్పానని అన్నారు వీడియోలో. రష్యా అందించిన ఆయుధ సంపత్తి తోపాటు భారత్ మిలటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనికుల నిస్వార్థ సేవ , అంకితభావం తదతరాలు అంతకమించిన వజ్రాయుధాలని పేర్కొంది. వాళ్లంత తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధ జరుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీరసైనికులు. అందుకు నేను వారికి ఎంతగానే కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్‌ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలనని పోలినా నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆ వీడియోకి " ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటామని" క్యాప్షన్ కూడా ఇచ్చారామె. ఆ వీడియోకి ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు సైతం ప్రతిరోజూ మమ్మల్ని రక్షించే మా సైనికుల అంకితభావం, ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలుగా మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Polina Agrawal (@pol.explorer) (చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!) -
అలా రిటైర్మెంట్ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్!
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ,తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగామారాయి. సతీ సమేతంగా తమ అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌తో కొన్ని సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు.🥹❤️ An emotional moment for all fans!Just a day after announcing his retirement from Test cricket, Virat Kohli visited Vrindavan with Anushka Sharma to seek blessings from Premanand Ji Maharaj. 🙏This moment is more than just spiritual—it's the beginning of a new chapter for… pic.twitter.com/FRRkl2vkHo— Abhishek Bhardwaj (@abhibhardwaj14) May 13, 2025 కెల్లీ కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానెల్లో వీరి వీడియో అప్లోడ్ అయింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ కోరుకున్నది జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ, అది పూర్తిగా సాధించదగినదని సాంఖ్య యోగం, అష్టాంగ యోగం , కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవమని చెప్పుకొచ్చారు. అయితే, వ్యక్తిఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆయన(దేవుడు) కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని వెల్లడించారు. "ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది... దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి."అనుష్క బ్లాక్ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్-సెట్ ధరించగా, విరాట్ ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
'వై-ఫై' పెట్టిన చిచ్చు..! నిర్థాక్షిణ్యంగా ప్రియురాలిని..
ఒక్కోసారి ఇంటర్నెట్ సాంకేతికత కూడా జంటల మధ్య గొడవలకు కారణమవుతుంటుంది. ప్రమాదవశాత్తు కనెక్ట్ అయిన వైఫై ఓ జంట విడిపోయేందుకు దారితీసింది. నిజానికి ఆమె తప్పు చేయపోయినా మోసం చేసిన వ్యక్తిగా నిలబడాల్సి వచ్చింది. అసలు విషయం తెలుసుకుని..తన నిజాయితీని నిరూపిద్దామన్నా..విధి ఆ అవకాశమే లేకుండా చేసింది ఆ అమ్మాయికి. అసలేం జరిగిందంటే.. నైరుతి చైనాలోని చాంగ్కింగ్లోని ఒక హోటల్‌కు లీ అనే మహిళ తన ప్రియుడితో కలిసి సరదాగా సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని ఓ హోటల్‌కి వస్తారు. అక్కడ హాయిగా షికార్లు తిరిగి ఎంజాయ్ చేసి..ఇంటికి వెళ్లిపోదామనుకుంటారు. ఆ క్రమంలో హోటల్ని ఖాళీ చేస్తుండగా.. ఆమె ఐడీ కార్డు కనిపించదు. దాంతో ఆమె ఐడీ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుందామనుకుంటుంది. ఆ నేపథ్యంలో అనుకోకుండా ఆ హోటల్ వై-ఫైకి తన మొబైల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. అంతే ఒక్కసారిగా.. ఆమె ప్రియుడికి గతంలో ఆమె వేరే ఎవరితోనే ఇక్కడకి వచ్చిందనే అనుమానం కలిగింది. అయితే లీ మాత్రం ఇదే మొదటిసారి ఈ హోటలకి రావడం అని మొత్తుకున్నా వినడు ప్రియుడు. మరీ వైఫై ఎలా కనెక్ట్ అయ్యిందో వివరణ ఇమ్మంటే..చెప్పలేకపోతుంది ప్రియుడికి. అంతే బ్రేకప్ అంటూ ఆమెను నిర్థాక్షణ్యంగా వదిలేస్తాడు. ఇక దీంతో లీకి అసలు ఈ హోటల్ వైఫైకి తన ఫోన్ ఎలా కనెక్ట్ అయ్యిందో కనుక్కోవాలని భావించి..ఆ విషయమై క్షణ్ణంగా విచారిస్తుంది. లీ తాను గతంలో పనిచేసిన చాంగ్కింగ్లోని మరొక హోటల్‌కి అదే యూజర్‌నేమ్, పాస్వర్డ్లు ఉండటాన్ని గుర్తిస్తుంది. వెంటనే రీజన్ చెప్పేందుకు తన ప్రియుడిని సంప్రదించగా అతడు వినే స్థితిలో ఉండడు, పైగా చాట్ యాప్‌లో కూడా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆమె అకౌంట్‌ని కూడా డిలీట్ చేశాడు. దాంతో ఆమె తన కథను ఒక స్థానిక వార్తా ఛానెల్లో వివరిస్తుంది. అలాగే మునపటి పని ప్రదేశంలో ఆ వైఫై--అలాగే ఈ హోటల్ వైఫ్‌కి ఎలా కనెక్ట్ అయ్యిందో రిపోర్టర్ సాయంతో సవివరంగా చెబుతుంది. ఇక ఇదంతా తనని నమ్మని వ్యక్తిన కలిసేందుకు ఈ వివరణ ఇవ్వడం లేదని, తనలా మరొకరు అపార్థాలకి బలవ్వకూడదని ఇలా చేశానని ఆమె బాధగా వివరించింది. (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్) -
తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినపుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమే అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినపుడు భర్త రెండోపెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతోపాటు, మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తాం.కానీ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన రెండేళ్ల కూతురిని చూసుకుంటూ డెలివరీలు చేస్తున్న కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది.గురుగ్రామ్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్. భార్య చనిపోయిన తరువాత తన తన రెండేళ్ల కుమార్తె టున్ టున్ తల్లిలేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. టున్‌టున్‌ను వెంటబెట్టుకుని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకుసాయంత్రం తరగతులకు హాజరుకావడంతో పంకజ్‌కు మరే మార్గం కనిపించలేదు. ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగురుగ్రామ్కు చెందిన సీఈవో మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు.మయాంక్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ పంకజ్‌కు కాల్ చేయగా.. అవతలినుంచి ఒక చిన్నారి వాయిస్ కూడా వినిపించడంతో, పైకి రమ్మని చెబుతామని కూడా ఆగిపోయి, స్వయంగా తానే కిందికి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాపాపయి కూడా. దీంతో పంకజ్‌ను ఆరా తీసి, అసలు సంగతి తెసుకుని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు.తన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటేడెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ టున్ టున్ పుట్టగానే భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి అన్నీ తానై అయ్యి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతోపాటే తీసుకెళ్లి, బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ విధులను నిర్వరిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ కానీ పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి. చాలా రిస్క్ బాస్ అంటూ కొందరు విమర్శిస్తుండగా, శభాష్, హాట్సాఫ్ పంకజ్ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కనిపించని కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.చదవండి: పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..! -
కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో
సోషల్ మీడియా మోజు అనేక ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ సోషల్‌మీడియాపై క్రేజ్ పోవడం లేదు. కొంతమంది యువతీ యువకులు సోషల్ మీడియా లైక్స్, కమెంట్స్ కోసం ఎంతటికైనా దిగజారడానికి సిద్ధపడిపోతున్నారు. తాజాగా కదులుతున్న కారుపై వధువు,వరుడు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఏమైందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..జీవితంలో అంత్యం సంతోషకరమైన క్షణాలను పదిలంగా దాచుకోవాల్సిందే. తమసంతోషాన్ని నలుగురితో పంచుకోవడంలో తప్పులేదు. కానీ లేనిపోని, పిచ్చి పిచ్చి సాహసాల వలన స్వయంగా కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే కాదు, ఒక్కోసారి సహచరులకు ముప్పుగా పరిణమిస్తుంది. సరదా పేరుతో తెలివితక్కువతో చేసే పనులపై ఇటీవలి కాలంలో చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.వివాహ వేడుక తరువాత ఒక నూతన జంట ప్రమాదకరంగా డ్యాన్స్ చేసి వైరల్‌గా మారారు. ఆ తరువాత చిక్కుల్లో పడ్డారు.చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో In Gwalior, a bride and groom violated traffic rules in order to go viral. A video of the groom doing stunts with a sword on the car and the bride dancing on the bonnet is becoming increasingly viral on social media#MadhyaPradesh #MetGala #MetGala2025 #MetGala2025xFREEN #Stunt pic.twitter.com/JrBfc58JTB— TodaysVoice ImranSayyed (@todaysvoice24nz) May 6, 2025గ్వాలియర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరుడు గర్వంగా కారు పైకప్పుపై నృత్యం చేశాడు. అక్కడితో ఆగలేదు.. కత్తిని గాలిలో తిప్పుతూ దర్పాన్ని ప్రదర్శించాడు. ఇక నేనేం తక్కువ అన్నట్టు, పెళ్లిదుస్తుల్లోనే వధువు కూడా బోనెట్ మీద కూర్చుని స్టెప్పులేయడం మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ బాలీవుడ్ చిత్రంలోని ‘ఇష్క్ కి గలి విచ్ నో ఎంట్రీ’ పాటకుఉత్సాహంగా గెంతులేశారు. కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఉదందాన్ని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కామన్ సెన్స్ లేదంటూ తిట్టిపోస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు కారును ట్రాక్ చేసి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చలానా జారీ చేశారు. గోలా కా మందిర్ ట్రాఫిక్ స్టేషన్‌కు చెందిన సుబేదార్ అభిషేక్ రఘువంశీ దీన్ని ధృవీకరించారు. దంపతులకు, ఇతర ప్రయాణికులకు ప్రమాదం ఉందని , విచారణ అనంతరం మరిన్ని జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర -
విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. తిప్పి కొట్టిన ప్రముఖులు
పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, మన సైన్యం చేపట్టిన చర్యల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. భారత్- పాక్ కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారత్ తరపున విక్రమ్ మిస్రీ దీన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారు. ఆ మరుక్షణం నుంచే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులను కూడా పరుష పదజాలంతో దూషిస్తూ పోస్ట్‌లు పెట్టారు. కుట్రదారు, దేశద్రోహి అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. మిస్రీ కుమార్తె పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది పోస్ట్‌లు పెట్టారు.మిస్రీ బాసటగా ఒవైసీవిక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌ను ఖండిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు బాసటగా నిలిచారు. విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) ఖండించారు. ఆయన నిజాయితీపరుడైన మంచి అధికారి అని, దేశంలో కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారని, ప్రభుత్వ నిర్ణయాలకు అధికారులను నిందించడం తగదని హితవు చెప్పారు.చర్యలు తీసుకోరా?మిస్రీకి కేంద్ర సర్కారు బాసటగా నిలబడలేదని, ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) నిందించారు. మిస్రీపై ట్రోలింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బీజేపీ సర్కారు ఆసక్తి చూపించడం లేదని ఆరోపించారు. అధికారులు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరే సంధానకర్తలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత, అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేరని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, సల్మాన్ అనీస్ సోజ్ కూడా మిస్రీపై ట్రోలింగ్‌ను ఖండించారు. ట్రోలింగ్ సిగ్గుచేటువిదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు కూడా మిస్రీకి అండగా నిలిచారు. మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అంకితభావం కలిగిన దౌత్యవేత్త అయిన మిస్రీ.. మన దేశానికి వృత్తి నైపుణ్యం, దృఢ సంకల్పంతో సేవ చేశారని ప్రశంసించారు. ఆయన దూషించడానికి ఎటువంటి కారణం లేదన్నారు. హద్దులు దాటి దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. ద్వేషంతో విషపూరితంగా చేసే వ్యాఖ్యలు ఆగిపోవాలి. మన దౌత్యవేత్తలకు భరోసా కల్పించేందుకు వారికి మనమంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.బాధ్యతారహిత చర్యమిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో విషం కక్కడాన్ని జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. మిస్రీ కుమార్తెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై ఎన్సీడబ్ల్యూ చీఫ్ విజయ రహత్కర్ ఫైర్ అయ్యారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బాధ్యతారహిత చర్య అని పేర్కొన్నారు. ట్రోలింగ్ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాను లాక్ చేశారు విక్రమ్ మిస్రీ. తన పోస్ట్‌లను ఎవరూ చూడకుండా నియంత్రణ విధించారు. చదవండి: విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. కాంగ్రెస్ నేత శశి థరూర్ కౌంటర్ -
ఇదేమైనా ఘనకార్యమా.. పిచ్చి వేషాలు ఆపండి: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు పిచ్చి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇలాంటి వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? అని ప్రశ్నించారు.సజ్జనార్ ట్విట్టర్ వేదికగా.. ‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?. ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇక, ఈ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఓవరాక్షన్ చేశాడు. రైలు వస్తున్న సమయంలో పట్టాలపై పడుకుని.. రైలు వెళ్లేంత వరకు అలాగే ఉన్నాడు. అనంతరం, పైకి లేచి ఏదో సాధించిన వ్యక్తిలాగా కేకలు వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025 -
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty) -
వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ఎక్కువ వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్‌గా వేయిస్తున్న వాటికి అంటుకుని చూడ్డానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్‌కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం.పిండి వంటలు, స్నాక్స్ చేసినపుడు వండినపుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్, మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా, అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం,నూనెను ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్‌తో వడ కట్టినా, పల్చటి బట్టతో వడపోసినా పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.तेल से गंदगी/अवशेष साफ करने का ये सबसे सही जुगाड़ है। pic.twitter.com/ieS62WWQaM— Dr. Sheetal yadav (@Sheetal2242) May 7, 2025 "> కార్న్‌ఫ్లోర్ చిట్కాముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి, నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను ఎట్రాక్ట్ చేస్తుంది. మొక్క జొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతం లాగా పని చేస్తుంది. డస్ట్ అంతా పిండిముద్దకు అతుక్కుని పోయి.. నూనె పూర్తిగా శుభ్రపడి , తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది.జపాన్‌లో, టెంపురా చెఫ్‌లు 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెలో మళ్లీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి కేన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్‌స్టార్చ్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్‌స్టార్చ్ ఫ్రైస్‌తో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేయని నూనెతో పోలిస్తే 25 శాతం తక్కువ తడిగా ఉంటుందట.ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!నోట్ : ఆయిలీ ఫుడ్స్, వేపుళ్లు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒకసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువ సార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్‌ను ఉపయోగించక పోవడమే మంచిది. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్తపడాలి. -
నిండుగర్భిణి జోష్‌ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా డ్యాన్స్‌లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్‌గా తన కొరియోగ్రాఫర్‌ని బీట్చేసేలా నృత్యం చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్‌లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Artist_Dance_Community (@artist_dance_community_) (చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..) -
హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్ నైట్ సన్‌రైజ్.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది చనిపోయినట్టు సమాచారం. ఇక, భారత దళాల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో అర్ధరాత్రి కూడా సూర్యోదయంలా కనిపించింది. భారత మెరుపు దాడుల కారణంగా వెలుగులు బయటకు వచ్చాయి.భారత్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. పహల్గాంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు కూడా కేంద్రం నిర్ణయం, ఈ ఆపరేషన్ పట్ల ధన్యవాదాలు చెబుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరిన్ని దాడులు చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. Sunrise in Pakistaan at 2am.Credits to INDIAN ARMED FORCES🇮🇳.#OperationSindhoor pic.twitter.com/CecgCPHNrD— BJP Karnataka (@BJP4Karnataka) May 7, 2025ఇదిలా ఉండగా.. భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్లో పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.📍Bahawalpur, #Pakistan after #IndianAirStrikes #OperationSindoor #Indi pic.twitter.com/slfSIUuNRo— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) May 7, 2025 Sunrise 2Am in pakistan #OperationSindhoor pic.twitter.com/4CX0VAsS11— ashvani_says (@AshtabThe37483) May 7, 2025 🇮🇳 Indian Govt scheduled a mock drill, but #IndianArmy conducted the drill in Pakistan! #OperationSindoor hits terror camps hard! Jai Hind! Jai Bharat Mata! We are not in danger—WE ARE THE DANGER! 💪 #IndiaPakistanWar #IndianAirForce #Airstrike #OperationSindhoor pic.twitter.com/cle936dCsE— United_Hindu (@Laxmi_Tweets_9) May 7, 2025“So many Nations have Suffered due to terrorism . Terrorism is not a Challenge to a nation , it’s a challenge to humanity” 🇮🇳❤️#OperationSindoor #JaiHind #mockdrills pic.twitter.com/iSLiIQ09de— Tanay (@tanay_chawda1) May 6, 2025Happy Diwali, Pakistan Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025Is anyone asking for proof of #OperationSindoor?pic.twitter.com/DJi849T4Ah— Vijay Patel (@vijaygajera) May 7, 2025पहलगाम पर भारत का पैग़ाम - छेड़ोगे तो छोड़ेंगे नहीं।प्रधानमंत्री मोदी जी ने कहा भारत की आत्मा पर हमला करने वालो को कड़ी सज़ा मिलेगी।भारत आतंकवाद को उसकी जड़ से उखाड़ फेकने में सक्षम भी है और संकल्प बद्ध भी है।मिटा देंगे आतंकवाद का नासूर - #OperationSindoor pic.twitter.com/JcMHuVBUgY— PANKAJ THAKKAR (Modi Ka Parivar) (@pankajthakkarr) May 7, 2025 -
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. -
కొడుకు బాధను అర్థం చేసుకునేది తల్లిదండ్రులేగా!
బెంగళూరు: పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీలైపోయి ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూసుంటాం. లేదంటే.. ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే.. దండించే పేరెంట్స్‌ను చూసుంటాం. కానీ, పరీక్ష తప్పితే ఇంటా.. బయటా అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే.. ఎవరేం అనుకుంటే ఏమి అనుకుంటూ ఇలా కేక్ కట్ చేయించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే.. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్ తెప్పించి కట్ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. In a heartwarming gesture, the parents of Abhishek, a student at Basaveshwara English Medium High School in Bagalkot, chose to celebrate his effort rather than scold him for failing his exams. Despite scoring just 200 out of 625 marks and not clearing any subject, the family held… pic.twitter.com/RxnlTwrcHp— The Siasat Daily (@TheSiasatDaily) May 4, 2025టెన్త్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు అభిషేక్. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక.. ఇదేం పని అని తిట్టుకున్న వాళ్లు ఉన్నారు ఈ ఫొటోలు, వీడియో చూశాక. కానీ, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా!. మరోసారి రాసి పాసవుదులేరా అని వెన్నుతట్టి ప్రొత్సహించారు. పరీక్షలలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్. అఫ్కోర్స్.. అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చనివాళ్లు కూడా ఉంటారనుకోండి. అది వేరే విషయం. -
వైరల్ వీడియో.. షాపులో ఆ బాలిక చేసిన పనికి అంతా షాక్!
హాపూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్‌లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.ఆ బాలిక బ్లేడ్‌తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #हापुड़♦नाबालिग ने दुकानदार पर ब्लेड से हमला किया♦सामान वापस न करने पर नाबालिका हुई आक्रोशित♦दुकानदार गंभीर हालत में अस्पताल में भर्ती♦सीसीटीवी में कैद हुई पूरी घटना♦पिलखुवा कोतवाली क्षेत्र का मामला@hapurpolice pic.twitter.com/H9LkuAJsJp— Knews (@Knewsindia) May 4, 2025 -
ట్రంప్ సుంకాలకు..బ్రష్ దెబ్బ..!
అమెరికా–చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు టాయిలెట్‌కి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖంతో తయారు చేసిన పసుపు కుచ్చు టాయిలెట్ బ్రష్ చైనాలో వైరల్‌గా మారింది. ఈ బ్రష్ కుచ్చు అచ్చం ట్రంప్ జుట్టు మాదిరిగానే ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా చైనీయులు ‘యివు కౌంటర్టాక్’ అంటూ ఇలా టాయిలెట్ బ్రష్‌లతో వ్యంగ్యంగా బదులిస్తున్నారు. వీటిని మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. ట్రంప్ మీద చైనా ప్రజల కోపతాపాలు పెరిగినట్లుగానే, ప్రస్తుతం వీటికి గిరాకీ భారీగా పెరిగింది. చాలా స్టోర్స్‌లలో వీటికి ‘ఔటాఫ్ స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ‘బ్రష్ ట్రంప్’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరెంతోమంది ఈ ట్రంప్ బ్రష్‌లను ఉపయోగించి, వివిధ ఫన్నీ మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఏదీ ఏమైనా, మొత్తానికి చిన్నదైనా ఈ టాయిలెట్ బ్రష్ విసిరిన పొలిటికల్ పంచ్ భారీగానే ఉంది కదూ!(చదవండి: Canadian vlogger: ‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!
సోషల్ మీడియా (Social media) విశేషాల పుట్ట. తాజాగా ఒకవిచిత్రమైన వీడియో తెగ సందడి చేస్తోంది. ‘‘రిమ్జిమ్.. రిమ్జిమ్.. స్కూటీ వాలా జిందాబాద్ అంటూ ఒక ఎద్దు (bull) స్కూటీని ఎంచక్కా రైడ్ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దేంటి, స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోన్న వీడియో చూసి తీరాల్సిందే.ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వీధిలో తిరిగే ఎద్దు స్కూటీని నడుపుతున్న దృశ్యం CCTV ఫుటేజీలో రికార్డైంది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్గారి జాయ్‌రైడ్ వీడియో ఆరు లక్షలకు పైగా వీక్షణలను, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.శుక్రవారం (మే 2) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, రిషికేశ్‌లో ఒక వీధిలో తిరిగే ఎద్దు కన్ను పార్క్ చేసిన తెల్లటి స్కూటర్‌పై పడింది. అంతే.. చలో టెస్ట్ రైడ్’ అంటూ రంగంలోకి దిగిపోయింది. ఎద్దు స్కూటర్ సీటుపై ముందు కాళ్లు, వెనుక కాళ్లను నేలపై ఉంచగానే అది జర్రున ముందుకు దూకింది. ఎక్కాక ఆగేదే లే అన్నట్టు ముందుకు సాగింది. అలా వెడుతూ.. వెడతూ.. మొత్తానికి ఒకచోట ఆగిపోయింది. దీంతో ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆనక.. తప్పుకోండి రా బాబోయ్.. అక్కడినుంచి పరుగు తీశారు. స్కూల్ యూనిఫాంలో, చిన్న పిల్లవాడితో నడుస్తున్న సమీపంలోని ఒక మహిళ వెంటనే ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని పరుగుదీసింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను 'భూపి పన్వర్' అనే ఎక్స్ యూజర్ "మీరు స్కూటీలను దొంగిలించే వ్యక్తులను చూసి ఉంటారు..కానీ రిషికేశ్‌లో వెరైటీగా స్కూటీ దొంగతనం జరిగింది. ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న విచ్చలవిడి ఎద్దులు కూడా బైక్‌లు , స్కూటీలపై మనసు పడుతున్నాయ’’ అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్ చేశారు. దీంతో నెటిజనుల చమక్కులు, కామెడీకామెంట్ల్స్ వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!ఒక వినియోగదారు, "cctv లేకుండా దీన్ని బీమా కంపెనీలకు ఎలా వివరించాలి" అని, మరొక వినియోగదారు, భాయ్ ఆజ్ మే భీ సవారీ కర్ హీ లేతా హూన్” (“బ్రో, ఈ రోజు నేను కూడా రైడ్‌కి వెళ్తాను.”).” అంటూ హాస్యంగా కామెంట్ చేశారు.అలాగే పాపం, స్కూటర్‌పై ముచ్చట పడ్డాక దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చని, దాంతో అది విడిపించుకునేందుకు ప్రయత్నంలో అలా ముందుకు కదిలి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్‌మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
అయ్యో అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు, ఫ్యామిలీలో విషాదం!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసంలో విషాదం అలుముకుంది. అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ (Anant Ambani)కి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క, హ్యాపీ ఇక లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అనంత్ అంబానీ తోపాటు కుటుంబ సభ్యులు తమ కుక్కకు భావోద్వేగ నివాళులర్పించారు.ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్టు ప్రకారం అనంత్ అంబానీ పెంపుడు కుక్క ‘హ్యాపీ’ ఏప్రిల్ 30, బుధవారం కన్నుమూసింది. ‘హ్యాపీ’ మృతితో అంబానీ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అంబానీ అప్డేట్ పేజ్ కూడా ‘ఆర్ఐపీ హ్యాపీ’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.ప్రియమైన హ్యాపీ జ్ఞాపకార్థం, మా ప్రియమైన డాగ్ హ్యాపీ మరణించిన విషాదాన్ని బరువైన హృదయంతో ఈ వార్తను పంచుకుంటున్నాం. పెట్ కంటే ఎక్కువగా, కుటుంబంలో మనిషి. చాలా విశ్వాసమైన నమ్మకమైన సహచరుడు, హ్యాపీ మా జీవితాల్లోకి తెచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేము. హ్యాపీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి. మిస్‌యూ’’ అంటూ అంబానీ కుటుంబం తమ ప్రియమైన నేస్తానికి వీడ్కోలు పలికింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)హ్యాపీ మరణంపై నటుడు వీర్ పహారియా కూడా విచారం ప్రకటించారు. హ్యాపీ జ్ఞాపకార్థం అంబానీ కుటుంబం ఒక స్మారక ఫోటోను పోస్ట్ చేశాడు. కుటుంబంలో అత్యంత ప్రియమైన సభ్యులలో ఒకరిగా పరిగణించబడే ఆ కుక్కకు తమ హృదయ పూర్వక నివాళి అర్పించారన్నాడు. అనంత్ అంబానీకి ఈ పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం వేడుకల్లో హ్యాపీ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఫోటోలకు ఫోజులిస్తూ హ్యాపీ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టు కున్నాయి. -
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
దొడ్డబళ్లాపురం: అభిమానం పుట్టిందంటే కోతి కూడా ఇంటి సభ్యురాలు అవుతుంది. ప్రేమ కరువైతే ఇంటివారు కూడా పరాయి వారవుతారు. అలాంటిదే ఈ ఉదంతం. పెంపుడు కోతికి ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు చేయించాడో వ్యక్తి. హావేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకా కాకోళ గ్రామంలో చోటుచేసుకుంది.కొత్త బట్టలు, కేక్ కటింగ్గ్రామ నివాసి ప్రభుగౌడకు నాలుగేళ్ల క్రితం మగ కోతి పిల్ల దొరికింది. దాన్ని చేరదీసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పిల్లవాని మాదిరిగా అంగీ, నిక్కర్ తొడిగిస్తారు. కోతిపిల్ల దొరికిన ఏప్రిల్ 29 తేదీని దాని పుట్టినరోజుగా వేడుకలు చేస్తున్నారు.కోతికి హనుమంతగౌడ అని పేరు కూడా పెట్టాడు. బర్త్ డే వేడుకలో హనుమంతగౌడకు కొత్త దుస్తులు వేశారు. పెద్ద కేక్‌ను తెప్పించి కట్ చేయించారు. చుట్టుపక్కలవారిని పిలిచి కేక్, మిఠాయిలు పంచిపెట్టారు. చూసినవారందరూ వానరానిదే వైభవమని ఆశ్చర్య పోయారు. ఈ కోతిపిల్ల ఇంటికి వచ్చాక ఆర్థికంగా బాగా కలిసి వచ్చినట్టు ప్రభుగౌడ చెబుతున్నాడు. గ్రామంలో ఈ కోతి సెలబ్రిటీగా మారింది. పెళ్లి పేరంటాలకు ప్రభుగౌడ తీసుకెళ్తాడు. జనం దాంతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్ -
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్‌ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ralph Leng (Blue) 💙🇬🇧 (@ralphleng) (చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు) -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆధునికయుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు. అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లామహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది. ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.I am shocked to see this happening in 2025.These kinds of people don't deserve to be parents!. pic.twitter.com/0kHYhbZHTf— Anushka Gupta (@Anushqq) April 27, 2025సోషల్ మీడియాలో డాక్టర్ భావోద్వేగ విజ్ఞప్తి21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు స్పందించారు. ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం! -
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
ఇటీవల ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్ చేసే సర్వీస్లకే పరిమితం కావడం లేదు. వాళ్లు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా..అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఉబర్ ఆటోలు, క్యాబ్లే నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కారుని సెట్ చేశాడు ఈ డ్రైవర్. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఒక మహిళ తన ఉబర్ రైడ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారు లోపలి విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్ బెడ్రూం ఫ్లాట్లా ఉంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెటప్ చేసి ఉన్నట్లు కనిపిస్తోంది. కూల్‌డ్రింక్స్,వాటర్ బాటిల్స్, చిప్స్ వంటి స్నాక్స్, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటిన్నంటి తోపాటు డస్ట్‌బిన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విశేషం అంటే..ఫీడ్‌బ్యాక్ డైరీ తోపాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ..ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ కూడా సీటుపై అతికించాడు. నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖధీర్ క్రియేటివిటీ అదుర్స్ అనే చెప్పాలి. నెటిజన్లను సైతం ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంది. ఆతిథ్య బ్రాండ్‌కి పేరుగాంచిన క్యాబ్ అని, ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరూ మాత్రం అకస్తాత్తుగా బ్రేక్ వేస్తే..వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ఆ సెటప్ గాయలపాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. Literally traveling in a 1bhk today. Hands down the coolest Uber ride ever! pic.twitter.com/O3cHSF30o2— Akaanksha Shenoy (@shennoying) April 25, 2025(చదవండి: ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..) -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్‌లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్‌పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
పెహల్గావ్లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహల్గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.రాత్రి 9 తర్వాత వార్ వద్దుభారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బర్త్‌డే రెండు రోజులనగా ఇన్ఫ్లూయెన్సర్,హెయిర్ బ్రాండ్ సీఈవో ఆత్మహత్య
ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.కామెడీ స్కిట్లు, వీకెండ్ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్‌తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్లైన్లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.ఎవరీ మిషా అగర్వాల్2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీహెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్ కూడా డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది. చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్‌కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్‌ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్‌ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది.