breaking news
Kollywood
-
దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్‌తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్‌తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్‌గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ వీడియోను విడుదల చేశారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్‌ను మాస్ గెటప్‌లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్... ఆసక్తిగా ప్రోమో
ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఫస్ట్ సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్లకు!
ముఖానికి ఇంత మేకప్ వేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి అందాల తార కనక. తమిళ సినీ ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించకుండా పోయింది. వివాదాలతో వార్తల్లో..దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్ అని, చనిపోయిందని రూమర్స్ రాగా అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగానూ వార్తల్లో నిలిచింది. కనక మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్ విడిపోయారు. ఫస్ట్ సినిమా హీరోతల్లీకూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టక్కరన్ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది. 37 ఏళ్ల తర్వాత కలయికతాజాగా హీరో రామరాజన్‌ను కలిసింది కనక. వీరివెంట మ్యూజిక్ డైరెక్టర్ దరన్ కుమార్ కూడా ఉన్నాడు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్ ఫోటోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వాటే సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనక.. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, వాలు జడ తోలు బెల్టు సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Dharan Kumar (@dharankumar_c)చదవండి: జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే.. -
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్‌గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్‌స్టార్‌కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే..
తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రోల్స్ చేయనుఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.మూకీ సినిమాతో..కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.చదవండి: మహేశ్‌బాబు గుడ్‌న్యూస్.. ఆరోజే ఓపెనింగ్ -
హీరో నో రెమ్యునరేషన్.. హీరోయిన్ చేయనంది..
ద్రౌపది 2 మూవీలో నటించేందుకు హీరో రిచర్డ్ రిషి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన ద్రౌపది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కిస్తున్నాడు.ఈ నెలలో రిలీజ్నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించాడు. రక్షణ హీరోయిన్గా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.నెల రోజుల్లో షూటింగ్ పూర్తిఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత చోళ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి కథతో సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్ జి ఈ కథతో వచ్చారన్నాడు. సినిమా షూటింగ్‌ను 31 రోజుల్లో పూర్తి చేశారని తెలిపాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నిర్వహించేవారని పేర్కొన్నాడు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదుదర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. ఇది పీరియాడికల్ కథా చిత్రం అని చెప్పాడు. ద్రౌపది సినిమాలాగే ఈ మూవీకి కూడా అంతే సిన్సియర్‌గా పని చేశామన్నాడు. హీరో రిచర్డ్ రిషి లేకపోతే ఈ సినిమా లేదన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని వెల్లడించాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని గుర్తు చేశారు. బడ్జెట్ దాటిపోయిందిముందు అనుకున్న బడ్జెట్‌ను దాటిపోయినా సరే కథపై నమ్మకంతో సపోర్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపాడు. ద్రౌపది మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సీక్వెల్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 25 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరకు రక్షణను ఎంపిక చేశామన్నాడు. ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభ ప్రదర్శించారన్నాడు. రక్షణకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. -
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించింది. అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026 -
'పరాశక్తి' తర్వాత యంగ్ హీరోతో సుధ కొంగర చిత్రం
ఆమె చేసిందే తక్కువ చిత్రాలు.., కానీ, దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కెరీర్ ప్రారంభించింది తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్నత స్థాయికి చేరింది తమిళ పరిశ్రమలో.. ఆంధ్ర అందగాడు చిత్రం ద్వారా 2008లో దర్శకురాలిగా పరిచయం అయిన ఈమె తరువాత ద్రోహి, ఇరుదు చుట్రు, తెలుగులో గురు , సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా అధర్వ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా నటి శ్రీ లీల కథానాయకిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గత 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. దీంతో దసరాలో సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు బదులు కూడా సమాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. యువ నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్న చిత్రానికి సుధాకర్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారంలో సారాంశం. ఈమె ఇంతకుముందే నటుడు ధృవ్ విక్రమ్‌కు కథను చెప్పినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అయితే చిత్రాల విషయంలో నిదానమే ప్రధానం అని భావించే మహిళా దర్శకురాలు సుధా కొంగర తన నూతన చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బైసన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు విక్రమ్ తదుపరి నటించే చిత్రం పైన ఆసక్తి నెలకొంది. -
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. ముందుగా బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్‌తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్లో చూసుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. చివరి నిమిషంలో వాయిదాకానీ సెన్సార్ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్ నిర్మాత వెంకట్ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్ సినిమాను 2025 డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీకి పంపించాం. డిసెంబర్ 22న యూఏ 16+ సర్టిఫికెట్ ఇస్తామంటూ మాకు మెయిల్ చేశారు. సడన్‌గా ఓ ఫిర్యాదుఅలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్‌కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. పరిస్థితి చేయిదాటిందిపైగా రివైజింగ్ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్‌కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.అసలేంటి సమస్య?భగవంత్ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్‌కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంన్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)చదవండి: రాజాసాబ్.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి -
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!) -
విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!
దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్డేట్ ఏంటంటే?సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. -
Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే
-
హీరోయిన్గా రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్..
సినిమా మాధ్యమం చాలా పవర్ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్. ఈమె హీరోయిన్గా నటించిన జస్టీస్ ఫర్ జెనీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. చిన్నతనం నుంచి ఆసక్తిపవర్ ఫుల్ పోలీస్ అధికారిగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు చిన్నతనం నుంచి కళలు, క్రీడలపై ఆసక్తి ఎక్కువ అంది. తాను కబడ్డీ క్రీడలో రాష్ట్ర స్థాయిలో తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. అలా శారీరక వ్యాయామం చేయడం వల్ల నటనపై కూడా ఆత్మవిశ్వాసం కలిగిందని తెలిపింది.నా జీవితాన్ని మలుపు తిప్పిందికోవిడ్ కాలంలో ఒక షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చిందని, అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొంది. తర్వాత జస్టిస్ ఫర్ జెనీలో నటించే అవకాశం వచ్చిందంది. తాజాగా నట్టి నటరాజ్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయంది. స్వయంకృషితో శ్రమించి అగ్ర కథానాయికగా ఎదిగిన నయనతార తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చింది. దర్శకులు వెట్రిమారన్, మారిసెల్వరాజ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. అలాగే కొత్త ఆలోచనతో వస్తున్న యువ దర్శకుల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధమంటోంది. -
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది. స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్ మై షో'(BookMyShow) ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్'(Jana Nayagan) రికార్డ్ క్రియేట్ చేసింది.బుక్ మై షోలో రికార్డ్'జన నాయగన్' వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్ చేసుకోవాలో కూడా మెయిల్ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కోసం 'కమల్‌హాసన్' మేనల్లుడుజన నాయగన్ సెన్సార్ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదిస్తున్నారు. -
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని: శ్రీలీల
అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది హీరోయిన్ శ్రీలీల. ఈ బెంగళూరు బ్యూటీ 'పెళ్లి సందడి' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రవితేజ, మహేశ్‌బాబు వంటి పెద్ద హీరోలతో జత కట్టి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప – 2 చిత్రంలో కిస్సిక్ అనే ప్రత్యేక పాటలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఎన్నో ఆశలుతాజాగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి శివకార్తీకేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంలో నటించింది. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 10న తెరపైకి రానుంది. ఈమె తమిళంలో నేరుగా నటించిన చిత్రం పరాశక్తి కావడంతో శ్రీలీల ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. హీరో అజిత్‌కు వీరాభిమాని అని తెలిపింది. అంతే కాకుండా ఆయన అద్బుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొంది. అజిత్ సినిమాలో..ఈ అమ్మడు ఇటీవల మలేషియాలో కార్ రేస్‌లో పాల్గొన్న అజిత్‌ను కలిసి దిగిన ఫోటోను సామాజిక మాద్యమల్లో పోస్ట్ చేయగా అది నెటింట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కార్ రేస్‌లో పాల్గొంటున్న అజిత్ త్వరలో తన 64వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా శ్రీలీల నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఆమె అజిత్ గురించి గొప్పగా చెబుతున్నారనే ప్రచారం కూడా వైరల్ అవుతోంది. -
జీవీ.ప్రకాశ్ కుమార్ హ్యాపీరాజ్ షూటింగ్ పూర్తి
తమిళసినిమా: శత చిత్ర సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత జీవి.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి హ్యాపీరాజ్. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధన్ నిర్మి స్తున్న ఈ చిత్రానికి మరియా ఇళంచెరియన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో దర్శకుడు తెలుపుతూ ఇది వినోదంతో కూడిన కుటుంబ భావోద్రేకాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు అలరించే ఫీల్ గుడ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటీనటులు, సాంకేతిక వర్గం సహకారంతో చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రం సంతృప్తి కరంగా వచ్చిందని, ఈ చిత్ర షూటింగ్ అనుభవం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర కథలోని భావోద్రేకాలను చక్కగా తన నటనతో ప్రాణం పోశారన్నారు. నటి శ్రీగౌరిప్రియ చాలా బాగా నటించారని చెప్పారు. కాగా చాలా గ్యాప్ తరువాత ఇందులో నటుడు అబ్బాస్ కీలక పాత్రలో నటించినట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసిన సంతోషంతో నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. చిత్ర ప్రోమోన ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, మదన్ కిస్టోఫర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్‌కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్‌గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్‌కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్‌కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?) -
శివకార్తికేయన్‌కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్‌కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్‌కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్ -
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జననాయగన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మంచి డైరెక్షన్ టీమ్ ఉండి ఉంటే తను రాజకీయాల్లోకే వచ్చే వాన్ని కాదని ప్రకటించారు. ఇలా పవన్ ఎలాగైనా తన నాలుకను మడతేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కినా కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజయ్‌కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్‌ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది. విజయ్ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండస్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా పదవి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి. -
'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.(ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్')రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు
ఎప్పుడో ఏదో వివాదంతో చర్చనీయాంశమయ్యే సెలబ్రిటీ అనగానే చిన్మయి గుర్తొస్తుంది. స్వతహాగా సింగర్ అయినప్పటికీ ఫెమినిజం విషయమై నెటిజన్లకు ఈమెకు మధ్య మాటల పంచాయతీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యే శివాజీ వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. అంతకు ముందు ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పడంతోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ సమస్యపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.తమిళంలో ఆరేళ్ల క్రితం 'ద్రౌపది' అనే మూవీ వచ్చింది. దర్శకుడు మోహన్ జీ తీసిన ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా, మహిళలని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లలో సింగర్ చిన్మయి కూడా ఉంది. అప్పట్లో మోహన్ vs చిన్మయి కౌంటర్స్ వేసుకున్నారు. అక్కడితో అది అయిపోయింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీశారు.(ఇదీ చదవండి: 'ఖైదీ' పాప ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?)'ద్రౌపది 2' పేరుతో తీసిన ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులోనే చిన్మయి తనకు తెలియకుండానే ఓ పాట పాడింది. దీని గురించి నెల క్రితం చిన్నపాటి వివాదం నడిచింది. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుడు జిబ్రాన్ అడగడంతో 'ఏమొకే' అనే పాట పాడానని.. అయితే ఏ సినిమా కోసమని అడగలేదని, ఒకవేళ ఈ మూవీ కోసమే అయితే అస్సలు పాడేదాన్ని కాదని అంటూ క్షమాపణ చెప్పింది. దర్శకుడు మోహన్ భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తి వ్యతిరేకం అని ఏకంగా ట్వీట్ చేసింది.దీంతో ఆగ్రహం తెచ్చుకున్న దర్శకుడు మోహన్ జీ.. చిన్మయి, తన సినిమాకు కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుందని అప్పట్లో ఆరోపించారు. థియేటర్లలోకి సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతున్న క్రమంలో సదరు పాటపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్మయి బదులు మరో గాయనితో పాడించిన వెర్షన్ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఈ సమస్య పరిష్కారమైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
ఒక్క సినిమాతో ఫేమస్.. సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోద్దేమో?
గత కొన్నాళ్ల నుంచి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ బాగా కనిపించింది. ఇందులో భాగంగా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ పాపనే తీసుకుంటే అలా ఓ మూవీలో చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోతుందేమోనని సందేహం వస్తోంది. మరి ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనిక. తమిళనాడుకు చెందిన ఈమె.. విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అయితే 'ఖైదీ'లో హీరో కార్తీ కూతురిగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీసిన ఈ మూవీ 2019లో రిలీజైంది. అప్పటికి ఈమె వయసు 11 ఏళ్లు. తర్వాత లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్‌లోనూ కాసేపు అలా కనిపించింది.'ఖైదీ 2'లోనూ ఈ పాప పాత్ర కచ్చితంగా ఉండే అవకాశముంది. చూస్తుంటే పాప పెరిగి పెద్దయిపోయింది. మరి ఖైదీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో రాదో ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. ఒకవేళ తీస్తే మాత్రం ఈ పాపని కాకుండా వెరే వాళ్లని పెట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ ఈ సీక్వెల్ తీసేలోపు ఈ బాలనటి.. హీరోయిన్‌గానూ సినిమాలు చేసేస్తుందేమోనని అనే కౌంటర్స్ పడుతున్నాయి.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ) -
వదంతులను నమ్మొద్దు.. భారతి రాజా కూతురి ప్రకటన
సీనియర్ సినీ దర్శకుడు భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా అంజీకరైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా గురించి గత మూడు రోజులుగా రకరకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో భారతి రాజా గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు జనని స్పందించారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన తండ్రి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పారు. కాగా దర్శకుడు భారతీరాజా ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి రావాలని, గీత రచయిత వైరముత్తు, తదితర సినీ ప్రముఖులతో పాటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్‌కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్‌గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్‌చరణ్‌తో అనిల్ రావిపూడి సినిమా -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' టీజర్ విడుదల
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్‌తో పాటు హైలీ ఎంటర్టైన్ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు. -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
సంక్రాంతికి శివాజీ 2 వచ్చేస్తున్నాడు..!
-
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్‌తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
ద్రౌపది 2 మూవీలో తుగ్లక్ పాత్ర
దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.ద్రౌపది 2 విశేషాలుఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. Terror Wears A Crown 👑Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026 -
శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్ గిఫ్ట్!
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.శత్రువుల్లేరుట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్‌గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగుపర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లుబాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్‌కు యాక్సిడెంట్ -
ప్రదీప్ రంగనాథన్ సరసన టాప్ హీరోయిన్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాడు.ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్.. ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
నర్సు నుంచి హీరోయిన్ రేంజ్‌కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ
మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్‌బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ బిగ్‌బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
యోగిబాబు కెరీర్లో మైల్స్టోన్ సినిమా.. ఫస్ట్‌లుక్ విడుదల
మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన యోగిబాబు ఇప్పుడు బిజీ నటుడు. కమెడియన్ గానే కాకుండా హీరోగాను నటిస్తున్నారు. కోలీవుడ్‌లో యోగిబాబు లేని చిత్రం ప్రస్తుతకాలంలో లేదనే చెప్పవచ్చు. కాగా ఈయన నటిస్తున్న 300వ చిత్రానికి అర్జునన్ పేర్ పత్తు(Arjunan Peru Paththu) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు విజయ్ సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. దేవ్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి తంగపాండి, ఎస్ కృతిక తంగ పాండి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్.రాజమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. ఇది ఇంతకుముందు యోగిబాబు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పాత వాహనాల విక్రయాల్లో జరిగే మోసాలను, తద్వారా గురయ్యే ప్రజల బాధలను ఆశ్రయించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అదేవిధంగా ఇకపై పాత వాహనాల క్రయ విక్రయాలపై అవగాహన కలిగించే విధంగా, వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న చిత్రం అర్జునన్ పేర్ పత్తు అని చెప్పారు. ఇది అన్ని వర్గాలను ప్రేక్షకులను అలరింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా నటి అనామిక మహి నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు కాళీ వెంకట్, అరుళ్ దాస్, అయిలి మదన్ ,ఎస్ సుబ్రహ్మణ్యం శివ, మైనర్ నందిని, సౌందర్య, సెన్ డ్రాయన్ ,హలో కందస్వామి, పావ లక్ష్మణ్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటూ దర్శకుడు లెనిన్ భారతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చిత్ర షూటింగును చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, ప్రదీప్ కాళీరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
స్టార్ హీరోలను కాదని.. కోతితో దర్శకుడి సినిమా!
అజిత్, విజయ్‌కాంత్, సూర్య, ఆమిర్ ఖాన్, విజయ్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. అయితే ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది.వరుస అపజయాలుఅలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ అపజయంపాలైంది. కొంచెం గ్యాప్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా చేసిన మదరాసి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఏఆర్ మురుగదాస్ నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది.ఎప్పుడో అనుకున్నా..అయితే ఈసారి స్టార్ హీరోలను కాకుండా ఒక వానరాన్ని నమ్ముకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ భేటీలో పేర్కొన్నారు. తన నెక్స్ట్ సినిమాలో కోతి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. కాకపోతే ఆ కోతి గ్రాఫిక్స్‌లో రూపొందించనున్నామన్నారు. తాను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఈ కథతో సినిమా చేయాలని భావించానని, ఇది బాలల ఇతివృత్తంతో రూపొందే సినిమాగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నటుడిగా మారిన ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారారు. ఇప్పటివరకు స్టేజీలపై తన గానం, సంగీతంతో అలరించిన ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించారు. గతంలో దర్శకనిర్మాతగానూ పరిచయం చేసుకున్న రెహమాన్ తాజాగా నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మూన్‌వాక్ సినిమాలో డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నారు.యంగ్ డైరెక్టర్గాబిహైండ్వుడ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ ఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పలు ప్రత్యేకతలతో రూపొందుతోందని దర్శకుడు పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనే తనే ప్రత్యేకతను మించి మూన్‌వాక్ మూవీ ద్వారా నటుడిగా రంగప్రవేశం చేస్తున్నాననన్నారు. ఇందులో తాను ఆక్రోశం కలిగిన యంగ్ డైరెక్టర్‌గా కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ 5 పాటలను ఆయనే పాడటం మరో విశేషం.ప్రభుదేవాతో డ్యాన్స్ఒక పాటలో ప్రభుదేవాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా నటించగా, యోగిబాబు త్రిపాత్రాభినయం చేశారని చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను జనవరి 4న చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో అంజు వర్గీస్, అర్జున్ అశోకన్ సాక్షి, సుష్మిత, నిష్మా, స్వామినాధన్, రెడిన్ కింగ్స్టన్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే నెలలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పిల్లల్ని కనాలనే ఆలోచన నాకు లేదు: వరలక్ష్మి శరత్ కుమార్
సామాన్యులైనా సెలబ్రిటీలైనా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడో ఇప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఇప్పుడు నటి వరలక్ష్మి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేసింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మతనం గురించి చెప్పింది.'అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిలల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు. ఎందుకంటే నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను. నా పెంపుడు కుక్కలకు తల్లిగా వ్యవహరిస్తా. నా స్నేహితులని తల్లిలా చూసుకుంటా. సాయం కావాల్సిన వాళ్లకు తల్లిగా తోడుంటా. నా వరకు అమ్మతనం అంటే అర్థమిదే. నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు పెళ్లే వద్దనుకున్నాను. అలానే పిల్లల్ని వద్దనుకునే చాలామంది.. వాళ్లు తీసుకున్న మంచి నిర్ణయం అదే' అని వరలక్ష్మి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి)సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష్మి.. ప్రారంభంలో హీరోయిన్గా చేసింది. పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి మంచి పాత్రలు చేస్తూ అలరిస్తోంది. హీరో విశాల్‌తో ఈమెకు పెళ్లని కొన్నాళ్ల ముందు వార్తలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ గతేడాది నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు యాక్టింగ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌తో వరలక్ష్మి బిజీగా ఉంది.వరలక్ష్మి పిల్లల్ని వద్దని అనుకోవడంపై చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను చిన్నతంలో లైంగిక వేధింపులకు గురయ్యానని గతంలో ఓ షోలో చెప్పింది. ఐదారుగురు తనని ఇబ్బంది పెట్టారనే విషయం బయటపెట్టింది. అలానే ఈమెకు ఊహ తెలిసొచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈమె తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్ కుమార్, నటి రాధికని పెళ్లిచేసుకున్నారు. ఒకవేళ పిల్లల్ని కంటే తనలా ఎక్కడ ఇబ్బంది పడతారోనని వరలక్ష్మి ఆలోచిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ ఎప్పుడంటే?) -
ఆ సినిమా చూసి డిస్టర్బ్ అయ్యా.. ఇది ఊహించలేదు!
'బైసన్' మూవీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్ పెరుమాల్', 'కర్ణన్', 'మామన్నన్', 'వాళై', 'బైసన్' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్.కలత చెందా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్‌డౌన్‌ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది. నా దృక్కోణాన్నే మార్చేసిందిహోంబౌండ్ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్ విషయానికి వస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ గెవాన్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు -
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్‌కు ఛాన్స్!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు. సుందర్.సి అవుట్అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్‌కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్‌కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్‌కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్‌కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్తగా ఆయన పేరు తెరపైకి..అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి! -
హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
హీరో విజయ్‌కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్ నటుడు కబీన్ దుహాన్ సింగ్ మరో విలన్‌గా యాక్ట్ చేశాడు.జనవరి 2న రిలీజ్అభిషేక్, ఇళంగో కమరవెల్, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్, అశోక్ పాండియన్, జాన్సన్ దివాకర్, వినోద్ సాగర్, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.హీరో లేడుసోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని నటించానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి..ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్‌లో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్ నిర్వహించినట్లు చెప్పింది. విజయ్ సరసన నటిస్తావిజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్ హీరోయిన్గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్ హక్కులను రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది. -
మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య
అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్‌కు చెప్పలేదు. సడన్‌గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?) View this post on Instagram A post shared by Aravind & Kajal (@kaadhals_) -
స్టార్ దర్శకుడితో 'కమల్ హాసన్' సినిమా.. జరిగేపనేనా..?
సినిమా రంగంలో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా దర్శకత్వం వహించవచ్చు. అయితే కథే ఇక్కడ ప్రధానాంశం. అది సరిగా సెట్ కాకపోవడంతోనే రజనీకాంత్ హీరోగా సుందర్.సి దర్శకత్వం వహించాల్సిన చిత్రం తెర రూపం దాల్చలేదు. తాజాగా ఒక రేర్ కాంబో గురించి వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే కమలహాసన్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం రూపొందే విషయమై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. కమలహాసన్ ఏ తరహా చిత్రాన్నైనా చేయగలరు. అయితే వెట్రిమారన్‌కు ఒక ముద్ర ఉంది. ఆయన చిత్రాల కథలు వెనుకబడ్డ వర్గాల ఇతి వృత్తం, నేరారోపణలకు బలైన యువత ఇతి వృత్తంతో ఉంటాయి. తాజాగా ఈయన శింబు హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా నటుడు కమలహాసన్ తాజాగా స్టంట్‌మాస్టర్ల ద్వయం అన్బరివ్ల దర్శతకత్వంలో నటిస్తూ, తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతోగానీ, ఇదే గనుక జరిగితే కచ్చితంగా వైవిద్యభరిత కథా చిత్రం అవుతుంది. -
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్‌గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్‌గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్‌కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025 -
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్‌లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్‌కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో? -
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
సాధారణంగా ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా ఓ మంచి హిట్ పడితే వరుసగా అవకాశాలు వరిస్తాయి అంటారు. కానీ హీరోయిన్ కృతీశెట్టి విషయంలో ఇది తారుమారు అవుతుండటం విశేషం. తెలుగులో ఉప్పెన చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీకి ఆ చిత్రం సక్సెస్‌తో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా ఆ తరువాత నటించిన ఒకటి రెండు చిత్రాలు విజయాలను అందించాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో టాలీవుడ్లో మార్కెట్ తగ్గిపోయింది.కోలీవుడ్‌లో వరుస సినిమాలుకృతిశెట్టి నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రాలు ది వారియర్, కస్టడీ ఆశించిన విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈ బ్యూటీకి తమిళంలో వరుసగా మూడు చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ మూడు చిత్రాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టికి కోలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తాజా సమాచారం.శంకర్ కుమారుడు హీరోగా..ప్రముఖ దర్శకుడు శంకర్ వారసుడు అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈయన తాజాగా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అర్జిత్‌కు జంటగా మమిత బైజును నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అర్జిత్‌కు జోడీగా?మళ్లీ ఏమైందో కానీ తాజాగా అర్జిత్ శంకర్‌కు జంటగా కృతీశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్! అదేవిధంగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్‌ను ప్రతినాయకుడి పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ అట్లీ శిష్యుడొకరు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.చదవండి: అభిమానుల అత్సుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్ -
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్" మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్ సెటప్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్ స్టేజీపై స్టెప్పులేశాడు.కిందపడ్డ విజయ్మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అయితే భారత్‌కు తిరిగొచ్చిన విజయ్‌కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమావిజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పాడు.மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR— KAVI (@tamiltechstar) December 29, 2025చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా -
ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.సినిమాభారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్
కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి) -
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
-
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్
కోలీవుడ్ స్టార్ దళపతి తన కెరీర్లో నటిస్తోన్న చివరి సినిమా జన నాయగణ్. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. తన కెరీర్లో ఇదే చివరి సినిమా కానుందని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.తాజాగా మలేసియా నిర్వహించిన ఆడియో లాంఛ్ ఈవెంట్లో విజయ్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే తనకిదే చివరి సినిమా మరోసారి స్పష్టం చేశారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈవెంట్లో అఫీషియల్‌గా ప్రకటించారు. వేలాదిమంది అభిమానుల మధ్య తన నిర్ణయాన్ని వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ..'నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా' అని అన్నారు. -
'కూలీ'పై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: లోకేశ్
లోకేశ్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు గ్యారెంటీ! ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించాడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' సినిమా మిక్స్డ్ టాక్‌తోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.వేలల్లో విమర్శలుఈ విమర్శలు, కలెక్షన్స్‌పై లోకేశ్ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కూలీ సినిమాకు వేలకొద్దీ విమర్శలు వచ్చాయి. ఎక్కడ తప్పు చేశానో గుర్తించి దాన్ని నెక్స్ట్ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకుంటాను. అయితే ఓపక్క విమర్శిస్తూనే రజనీకాంత్ సర్ కోసం మా సినిమా ఆదరించారు. ఈ చిత్రానికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మా నిర్మాత చెప్పారు.గతంలో ఏమన్నాడంటే?అంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. గతంలోనూ కూలీ మూవీకి వచ్చిన మిశ్రమ స్పందన గురించి మాట్లాడుతూ.. జనాల అంచనాలకు తగ్గట్లుగా తాను కథలు రాయలేనన్నాడు. తాను రాసిన కథ వారి అంచనాలను అందుకుంటే మంచిది. లేదంటే వాళ్లు సంతోషపడేవరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.వార్ 2పై కూలీ విజయంకూలీ విషయానికి వస్తే.. ఇందులో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ రచిత రామ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 సినిమాతో పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్‌లో వార్ 2ని దాటేయడం విశేషం!చదవండి: మొన్న ఆమిర్.. ఇప్పుడు షారూఖ్ -
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్‌తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్‌లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. -
కెమికల్ వాటర్‌లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్ అయిందిఅప్పటినుంచే విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు. -
ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చిరంజీవి సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే 'పేట' సినిమా తర్వాత తనకు సైడ్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయని కొందరు అన్నారంటోంది.అదేం అక్కర్లేదుఈ విషయం గురించి తాజాగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని నేను అనుకునేదాన్ని. ఉదాహరణకు దీపికా పదుకొణె ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు.ఏదైనా ప్రేక్షకుల చేతిలోనే..కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల మూవీ అయినా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. బియాండ్ ద క్లౌడ్స్ మూవీ చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ పేట మూవీలో ఆఫర్ ఇచ్చాడు.ఆ తర్వాత మొదలైందిఅది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్‌తో నటించే అదృష్టాన్ని వదిలేసుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేశాక నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకమీదట సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయని కొందరు నిర్మాతలు అన్నారు. యాక్టర్స్‌ను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. ధైర్యంగా ముందుకు సాగాలిఅంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనాలు మన మైండ్‌లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో హీరోయిన్గా మాళవిక మళ్లీ ఫేమ్‌లోకి వచ్చింది. తంగలాన్, హృదయపూర్వం సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'తో పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2' చేస్తోంది.చదవండి: మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక -
'అమ్మ' పేరుతో మోసం.. జీవీ ప్రకాష్‌కు నెటిజన్ల మెసేజ్‌లు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా సాయం చేయమని తనని కోరితే వెంటనే స్పందిస్తారు కూడా.. గతంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆర్థిక సాయం చేయమని కోరితే ఆయన దాతృత్వ వైఖరి చాలాసార్లు చూపించారు. దురదృష్టవశాత్తు, ఆయన చేస్తున్న సాయం ఆన్లైన్ మోసానికి గురి చేసింది. దీంతో ప్రకాష్ రూ. 20 వేలు పోగొట్టుకున్నారు.ఎం జరిగిందంటే..?ఎక్స్ పేజీలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి జీవీ ప్రకాష్‌ను మోసం చేశాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫోటోను షోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని పేర్కొన్నాడు. ఆపై తన తండ్రి కూడా చాలా ఏళ్ల క్రితమే బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని కట్టుకథ అల్లాడు. అయితే, ఆమె కూడా మరణించారని తన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ ఆర్థిక సహాయం చేయాలని జీవీ ప్రకాష్‌ను కోరాడు.ఆ వ్యక్తి చెప్పిన స్టోరీకి చలించిపోయిన జీవీ ప్రకాష్ వెంటనే రూ. 20 వేలు గూగుల్ పే చేశారు. అయితే, కొందరు నెటిజన్లు ఆ ఫోటోను డీకోడ్ చేశారు. గూగుల్ ద్వారా ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో వెంటనే అతని నెంబర్‌కు కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ కాలేదని ప్రకాష్ చెప్పుకొచ్చారు. అమ్మ పేరు చెప్పుకొని సాయం కోరి ఇలా మోసం చేయడం ఏంటి అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. అడిగిన వెంటనే సాయం చేసిన ప్రకాష్‌ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మోసాలు చూసిన తర్వాత సాయం చేసే వ్యక్తులు కూడా మరోసారి ముందుకు రారని గుర్తుచేస్తున్నారు.நானும் தங்கச்சியும் என்ன பண்ணுவது தெரியமால் உல்லோம் எங்களுக்கு இறுதி சடங்கு பண்ணுவதாருக்கு உதவி பண்ணுங்க அண்ணா @gvprakash 🙏🏻🥲 https://t.co/iXJWnwQpR6— Mom Little King.♥️ (@prasannasathis) December 25, 2025pic.twitter.com/TRfgsdw6wA— G.V.Prakash Kumar (@gvprakash) December 25, 2025 -
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్‌కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి! -
స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత
తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈయన నిర్మించిన కొత్త సినిమా 'వా వాతియర్'.. సరిగ్గా రిలీజ్‌కి మరికొన్ని గంటలు ఉందనగా కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తికి ఈయన రూ.20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య ఓవైపు ఉండగానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా జ్ఞానవేల్‌పై చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)శివకార్తికేయన్ హీరోగా జ్ఞానవేల్ నిర్మాతగా 2019లో 'మిస్టర్ లోకల్' అనే సినిమా వచ్చింది. దీనికిగానూ హీరోకి రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పేర్కొన్నాడు.తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు.. విడుదల కాకుండా నిలుపుదల చేయాలని శివకార్తికేయన్, చెన్నై కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే జ్ఞానవేల్ రాజా.. హీరోల సూర్య, కార్తీలకు దగ్గర బంధువే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి. మరి ఈ విషయంలో జ్ఞానవేల్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్) -
పదేళ్ల తర్వాత అబ్బాస్ రీఎంట్రీ.. వీడియో చూశారా?
ఇటీవల ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ ఒకరని చెప్పవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఈయన ఇప్పటికే శత చిత్రాలకు చేరుకున్నారు. పరాశక్తి జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న 100వ చిత్రం. అదేవిధంగా సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్న ఈయన హీరోగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్, బ్యాచిలర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. హ్యాపీరాజ్మూవీఅయితే ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. చివరగా ఈయన నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా హ్యాపీరాజ్మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు ఇళంసెళియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గౌరీప్రియ హీరోయిన్. ఈ చిత్రంలో ప్రేమదేశం హీరో అబ్బాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పదేళ్ల తర్వాత రీఎంట్రీగతంలో హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈయన చాలా కాలం క్రితమే దుబాయిలో సెటిల్ అయ్యారు. తాజాగా హ్యాపీరాజ్ ద్వారా దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రోమో వీడియోను శనివారం విడుదల చేశారు. ఇందులో అబ్బాస్ ఐయామ్ బ్యాక్ అంటూ బరిలోకి దిగాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్‌గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.''ఓ మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.I remember a South film where I was the only woman, they wanted to add more padding on my bum & my breast. They were like, 'Amma, more padding' 😮— #RadhikaApte Which South movie is she referring to❓Kabali, Azhagu Raja or Balayya's Lion❓👀 pic.twitter.com/wm5Ne7Na4R— VCD (@VCDtweets) December 20, 2025 -
పరాశక్తిలో యాక్ట్ చేసేందుకు సంకోచించా: నటుడు
చెన్నై: శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. ఇది ఆయన హీరోగా యాక్ట్ చేసిన 25వ చిత్రం. రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో అధర్వ కీలక పాత్ర పోషించారు. శ్రీలీల కథానాయిక. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2026 జనవరి 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.గురువారం సాయంత్రం చిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలోని వళ్లువర్‌కొట్టంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరాశక్తి సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఇతర వస్తువులతో ఎగ్జిబిషన్‌ను 'వరల్డ్ ఆఫ్ పరాశక్తి' పేరుతో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ నాలుగు రోజులదాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌కు 100వ సినిమా అన్నారు. తన 25వ చిత్రాన్ని వేరే కథతో చేయాలని భావించానన్నారు. అయితే నిర్మాత ఆకాశ్ భాస్కర్ పరాశక్తి కథను చేయండి అని చెప్పారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మనల్ని 1960 కాలానికి తీసుకెళ్తుందన్నారు.తానీ చిత్రం చేయడానికి కారణం దర్శకురాలు సుధా కొంగరనేనన్నారు. ఆమె 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ చిత్రకథ రాశారన్నారు. ఈ సినిమా చేయడమన్నది సవాల్‌తో కూడుకుందన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. పరాశక్తి తనకు చాలా ముఖ్యమైన సినిమా అన్నారు. రవిమోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఊరే మాట్లాడోతుందన్నారు. ఇందులో నటించడానికి ముందు సంకోచించానని, అయితే అందరూ ఎంతో శ్రమ పెట్టి పనిచేశారన్నారు. -
నా కూతురిని హీరోయిన్ చేస్తా: దేవయాని
తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్ సక్సెస్ఫుల్ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్ వారసుడు జెసన్ సంజయ్‌ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు. నటుడు విజయ్‌తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్ అని రాజకుమార్ చెప్పారు. జెసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. -
పిల్లాడికి బంగారు చైన్ బహుమతిచ్చిన సూర్య
అభిమాన హీరో ఆటోగ్రాఫ్ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్‌కు ఇలాంటి సర్ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్ కుమారుడి చర్విక్ మొదటి బర్త్‌డేను వారి కుటుంబానికి లైఫ్‌లాంగ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.బంగారు గొలుసు కానుకపిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్ చైన్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లెజెండరీ యాక్టర్ సూర్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్ ఫస్ట్ బర్త్‌డే పురస్కరించుకుని బంగారు చైన్‌ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్ ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.తెలుగులో సినిమాఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్. రవీనా టండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. సూర్య 47వ మూవీసితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్, ఆవేశం సినిమాల ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. What an incredible surprise from the legendary Actor *Suriya* himself, such a kind gesture — gifted my baby boy *Charvik* a gold chain for his 1st Birthday! Thank you, *Suriya* sir—we’re forever grateful! 🙏✨@SuriyaFansClub #suriya46 @ActorSuriyaoff pic.twitter.com/grbI6DCngR— Charan (@Charanmaveric) December 17, 2025 -
హీరో ప్రదీప్ కాళ్ల దగ్గర.. ఆ పని ఎలా చేశావ్?
ఈ ఏడాది సెంచరీ దాటేసిన సినిమాల్లో డ్యూడ్ కూడా ఉంది. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా, హీరోకి మామగా, రాజకీయ నాయకుడిగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. అయితే అతడి కుల పిచ్చి ఎక్కువ.దేవయాని ఫోన్సినిమా చివర్లో హీరో అతడి కళ్లు తెరిపిస్తాడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో హీరో కాళ్ల దగ్గరపడి ఏడుస్తాడు శరత్ కుమార్. ఈ సీన్ చూసి సీనియర్ నటి దేవయాని ఆశ్చర్యపోయిందట! ఈ విషయాన్ని తాజాగా బిహైండ్వుడ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. డ్యూడ్ సినిమా చూసి దేవయాని నాకు ఫోన్ చేసింది. ఆ సీన్ చూసి షాక్చాలా బాగా చేశానని మెచ్చుకుంది. అలాగే నేను ప్రదీప్ కాళ్ల దగ్గర కూర్చుని చేసిన ఎమోషనల్ సీన్ చూసి షాకైంది. ఆ సన్నివేశం ఎలా చేయగలిగావ్? అని అడిగింది. అప్పుడు నేనొక్కటే చెప్పాను. నేను హీరో ప్రదీప్ దగ్గర కూర్చుని ఏడవలేదు. నా చెల్లెలి కొడుకు దగ్గర కన్నీళ్లుపెట్టుకున్నాను (సినిమాలో ప్రదీప్ తన మేనల్లుడిగా నటించాడు). తప్పేముంది?అందులో తప్పేముంది. ఒక నటుడిగా ఆ సీన్ చేసేటప్పుడు నాకెటువంటి హద్దులు, భయాలు ఉండకూడదు అని చెప్పాను అని వెల్లడించాడు. డ్యూడ్ (Dude Movie) విషయానికి వస్తే.. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూస్‌తోనే అవలీలగా రూ.100 కోట్లు దాటేసింది. -
హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థ సమర్పణలో కే.జే.బి టాకీస్ పతాకంపై నటుడు, నిర్మాత కేజే.బాలమణిమార్బన్ నిర్మిస్తున్న చిత్రం హాట్ స్పాట్ టూమచ్. ఇంతకుముందు వచ్చిన హాట్ స్పాట్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం గమనార్హం. హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో నటుడు ఎమ్మెస్ భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, రాక్షసన్, భవాని శ్రీ, బ్రిగిడా సగా, రంజన తివారి, ఆదిత్య ఖదీర్, విజయ్ టీవీ అమర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ రవి, జోసెఫ్ పాల్ ద్వయం ఛాయాగ్రహణం, సతీష్ రఘునాథన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి నటుడు విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రూపొందించిన హాట్ స్పాట్ చిత్రం నాలుగు కథలతో ఆంథాలజీగా ఉందని, హాట్ స్పాట్ టూమచ్ చిత్రం మూడు వేర్వేరు కథలతో సాగుతుందని చెప్పారు. ఇది అన్ని వర్గాలకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. చిత్ర ఆడియో, టీజర్, ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. Happy to present the stars reveal of #HotSpot2Much!https://t.co/WiuitAv3dfComing soon to cinemas near you ♨️@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @vikikarthick88 @priya_Bshankar @i_amak @AadhityaBaaskar @RakshanVJ @Brigidasagaoffl @BhavaniSre… pic.twitter.com/C0QbtOhURp— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 15, 2025The squad is pakka set 😎Welcome to the World of #HotSpot2Much da boys and girls !Hitting Theatres Sooon 🔥Stars Reveal 🔗 https://t.co/gEHcIbl881@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @thevishnuvishal @vikikarthick88 @priya_Bshankar @i_amak… pic.twitter.com/u7IsPvh0FD— Ramesh Bala (@rameshlaus) December 17, 2025 -
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్‌స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్‌కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు. -
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్‌లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా.. ప్రదీప్ రంగనాథన్‌ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్‌కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్‌లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్‌కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్‌లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్‌ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
సత్యజ్యోతి సంస్థతో పనిచేయడం గర్వకారణం
తమిళసినిమా: నటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మార్క్. నటుడు నవీన్ చంద్ర, విక్రాంత్, యోగిబాబు, దీప్షిక, రోష్నీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నటుడు కిచ్చ సుదీప్ సత్య జ్యోతి ఫిలిమ్స్ తో కలిసి తన కిచ్చా క్రియేషనన్స్ సంస్థపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు విజయ్ కార్తీక్ మాట్లాడుతూ తాను ఈ వేదికపై నిలబడ్డటానికి ముఖ్య కారణం నటుడు కిచ్చా సుదీప్ అని పేర్కొన్నారు. అంత పెద్ద హీరోతో కలిసి రెండో చిత్రం చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఇంతకు ముందు మాక్స్ సినిమా చేశామని, తాజాగా మార్క్ చిత్రం చేసే అవకాశాన్ని కిచ్చ సుదీప్ కల్పించారని చెప్పారు. నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ తాను చాలా సంవత్సరాలుగా తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తున్నానని, అయితే కన్నడ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్ర కోసం ఎదురుచూశానని, మార్క్ చిత్రంలో అలాంటి అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు కిచ సుదీప్ మాట్లాడుతూ సత్యజ్యోతి ఫిలిమ్స్ వంటి గొప్ప సంస్థతో కలిసి మార్క్ వంటి సినిమాను చేయడం ఘనంగా ఉందన్నారు. కథ చెప్పే విధానం, కొత్త సన్నివేశాలు, వ్యాపారం, నటీనటుల ప్రదర్శన వంటి విషయాల్లో ప్రేక్షకులు కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ఆశిస్తారన్నారు. అవన్నీ ఈ చిత్రంలో చేసామని నమ్ముతున్నామన్నారు. దర్శకుడు విజయ్ కార్తికేయన్ దర్శకత్వం అంటే తనకు ఇష్టం అన్నారు అందుకే మళ్లీ ఆయనతో కలిసి ఈ చిత్రం చేశానని చెప్పారు తన చెట్లు అత్యంత బిజీగా ఉండే నటుడు యోగిబాబు అని, ఆయన ఈ చిత్రం కోసం విడతల వారీగా వచ్చి నటించారని చెప్పారు. అదేవిధంగా ఈ చిత్రం కోసం దర్శకుడు, ఛాయాగ్రకుడు రాత్రింబవళ్లు కష్టపడినట్లు తెలిపారు. -
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. నాలుగు సినిమాలకేఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటి?దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది. -
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కారణం లేకపోలేదు. భార్య, దర్శకురాలు గీతాంజలి.. తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఫోటోలన్నీ సడన్‌గా తీసేయడంతో వీళ్ల మధ్య గొడవలు తలెత్తాయని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ఈ కాలంలో విడాకులు తీసుకునేముందు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని ఇలా ఫోటోలు డిలీట్ చేసుకుంటున్నారు. దీంతో ఈ జంట కూడా విడిపోయిందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.రెండు పెళ్లిళ్లుసెల్వరాఘవన్ (Selvaraghavan).. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో సెల్వ తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. సోనియా అగర్వాల్‌ను హీరోయిన్గా బిగ్‌స్క్రీన్‌కు పరిచయం చేశారు. సెల్వ నెక్స్ట్ మూవీ 7/G రెయిన్బో కాలనీ (7/G బృందావనం) మూవీలోనూ సోనియానే హీరోయిన్! ధనుష్- సోనియాను జంటగా పెట్టి మూడో సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో సోనియాతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.కానీ భార్యాభర్తలుగా ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సెల్వ.. దర్శకురాలు గీతాంజలి (Gitanjali Raman)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లుగా ఎంతో బాగా కలిసున్న ఈ దంపతులు ఇప్పుడిలా విడిపోతున్నారన్న వార్త అభిమానులను కలిచివేస్తోంది. అటు సెల్వ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడం గమనార్హం!చదవండి: మ్యాచ్ చూసేందుకు వచ్చి మెస్సీ అంటే ఇష్టం లేదన్న అర్హ -
96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్‌కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్స్లీ, డీఎస్ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్ రిపీట్!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి
బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్ మలర్‌వనమ్.. ఇతర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.నిద్రమాత్రలు మింగి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్‌లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. చికిత్స పొందుతూ మృతితొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్పాక్కమ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్పాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అసలేంటి తలైవా.. ఈ వయసులో కూడా ఇంత సాహసమా?
సూపర్ స్టార్ రజినీకాంత్..ఈ పేరు వింటే చాలు అభిమానులకు ఆ డైలాగ్ తప్పకుండా గుర్తుకొస్తుంది. 'ఆడదంటే అణకువగా ఉండాలి.. తొందర పడకూడదు. చదువు ఉండాలి సంస్కారం మరిచి పోకూడదు. అధికారం ఉండాలి.. అహంకారం ఉండకూడదు.. క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు.. భయభక్తులు ఉండాలి.. బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు' అంటూ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ఎప్పటికీ అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది.1999లో వచ్చిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇవాళ తలైవా బర్త్ డే కావడంతో మరోసారి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేటితో రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తలైవాకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది కూలీతో అభిమానులను అలరించిన సూపర్ స్టార్.. జైలర్ సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం డేరింగ్ స్టంట్స్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.జైలర్-2లో సాహసం చేస్తోన్న తలైవా..ప్రస్తుతం రజినీకాంత్ జైలర్-2తో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 75 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తోన్న తలైవా.. ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం రజినీకాంత్ సాహసం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ వయసులో ఫైట్ సీన్ కోసం..ఇటీవలే జైలర్-2 షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రజినీకాంత్‌తో ఓ ఫైట్ సీన్ కోసం బరువైన వస్తువులు ఎత్తాల్సి ఉంది. ఈ ఫైట్ సీన్ కోసం తలైవా బరువైన వస్తువును ఎత్తి తలకిందులుగా పెట్టాలి. ఈ కష్టమైన సీన్‌కు డూప్‌ను ఏర్పాటు చేశారు దర్శకుడు నెల్సన్. కానీ రజినీకాంత్ వద్దని చెప్పారట. ఆయనే డూప్ లేకుండా ఆ బరువును ఎత్తడానికి ప్రయత్నించారట. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ వయసులో ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వయసులో ఇంత సాహసం చేయడం తలైవాకే సాధ్యమంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. కాగా.. జైలర్-2 చిత్రంలో ఎస్జే సూర్య, యోగిబాబు, రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్ హీరోయిన్భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్‌బాబు జీవిత రథం, ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్లో, హిందీ సిరియల్స్‌లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్‌లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది. -
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్‌తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్ రిజెక్ట్దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్‌కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎలా మారిపోయిందో!
సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్‌కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంఅలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు. అలా కనిపించి ఇలా కనుమరుగురాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు. బొద్దుగా తులసితాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine ) Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025 -
మన సినిమా ప్రాంతీయం కాదు... జాతీయం!.. అగ్ర నటుడు కమల్ హాసన్
అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.“ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!దక్షిణాది వినోద మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్‌తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.“ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు. -
అజిత్ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్‌కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్ హీరోను కలిసిన శింబుఅజిత్ సినిమాలతోపాటు కార్ రేస్‌లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్‌ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్‌కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్‌తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్‌తో వన్స్ మోర్అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025 -
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.మరి కోలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్ తనకు రిస్కీ సబ్జెక్ట్ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు."I always think that Telugu makers are doing big films & Malayalam makers are doing different films.. What's the identity of Tamil films..? We can't do new things if we are scared to try.. We need to break the barriers.."- #Karthi at #VaaVaathiyaar Event pic.twitter.com/5QIyqfr14L— Laxmi Kanth (@iammoviebuff007) December 8, 2025 -
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్‌న్యూస్ చెప్పింది.బ్రేకప్కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమానివేదా పేతురాజ్.. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేసింది. ఒకానొక సమయంలో కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ చేజార్చుకుంది.చదవండి: పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు -
బయోపిక్‌లో తమన్నా.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా తమన్నా భాటియా సత్తా చాటుతుంది. తాజాగా ఆమె ఒక బయోపిక్‌లో హీరోయిన్గా ఎంపికైంది. ఈమేరకు ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్‌తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ బయోపిక్‌లో తమన్నా భాగమైంది.అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. వి.శాంతారామ్ సతీమణి జయశ్రీ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన శాంతారామ్ మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించగా.. సుమారు 90 సినిమాలు నిర్మించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించారు.The star of an era ✨The strength behind a legacy 🎞️A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025 -
గాయపడిన సినీ నటుడు రాజశేఖర్
ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మూవీ షూటింగ్లో గాయపడ్డారు. నవంబర్ 25న కొత్త సినిమా సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన ప్రమాధానికి గురయ్యారు. మేడ్చల్ దగ్గరలో యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయన కాలికి గాయలయ్యాయి. తన కుడి కాలి మడమ దగ్గర గాయమయినట్లు తెలిసింది. అయితే, వెంటనే రాజశేఖర్‌ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేయించినట్లు తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స విజయవంతమైందని సినీ యూనిట్ వెల్లడించింది.రాజశేఖర్ కు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో భాగంగానే రాజశేఖర్ గాయపడినట్టు సమాచారం. శర్వానంద్ బైకర్ మూవీలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
క్లిష్ట పరిస్థితుల్లో తమిళ సినిమా .. అలాంటి నిర్మాతలే లేరు
పెద్ద చిత్రాలు ఆడడం లేదు, చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని, నిర్మాతలకు పెట్టుబడి కూడా రావడం లేదని, ఓటీటీ సంస్థలు చిత్రాలను కొనుగోలు చేయకపోవడంతో తమిళసినిమా చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. ఈయన సినిమాల వసూళ్లు, నిర్మాతల పరిస్థితి, థియేటర్ల కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల భారం తదితర విషయాలపై వాస్తవాలను చెప్పగలిగిన అనుభజ్ఞుడు. ఆయన ఆదివారం తమిళసినిమా పరిస్థతులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ల విషయంలో గత రెండు నెలలుగా సినిమా పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో కొన్ని పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయని, ఆ తరువాత శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఆపై భారీ చిత్రాలు లేవని, ముఖ్యంగా చిత్ర నిర్మాణ సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఇందుకు కారణం నిర్మాతలు తమ చిత్రాలను వెంటనే ఓటీటీకి ఇవ్వడమేనన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం బాధింపులకు గురవుతోందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందన్నారు. ఒక చిత్రం విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చూడండని ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదన్నారు. యాక్టివ్ నిర్మాతల సంఘంలోని కొందరి మొండితనం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నలుగురైదుగురి కారణంగానే సినిమా పరిస్థితి క్లిష్టంగా మారుతోందన్నారు. అయితే ఇప్పుడు వారి చిత్రాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఇతర చిత్ర పరిశ్రమల కంటే తమిళసినిమా పరిస్థితి చాలా దారుణంగా మారుతోందని, ప్రముఖ నటులకు భారీ పారితోషకాలు ఇచ్చే నిర్మాతలు లేరని తెలిపారు. ఎదుగుతున్న నటీనటులు అధిక పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది నిర్మాతలు ముఖ్య నగరాల్లోనే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారని తెలిపారు. చిన్న గ్రామాలకు సినిమాలు రావడం లేదని, థియేటర్లు మూత బడుతున్న పరిస్థితి ఉందన్నారు. అధిక ప్రింట్స్ వేస్తే అధిక ఖర్చు, ఆదాయం రావడం లేదని నిర్మాతలు అంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై చర్చించడానికి మంగళవారం ఆన్లైన్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నామని డి్రస్టిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. -
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
అలనాటి సినీ నటి కాంచన(86) అసలు పేరు వసుంధర.. చాలారోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్‌గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ… ఒక్కతే తిరుగు పయణమయ్యారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.బ్రహ్మచారిణిగా..60, 70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కాంచన. ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతారం , ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే.. కానీ, పుట్టింది చెన్నైలో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు.ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిని ఆమె ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.తల్లిదండ్రులే శత్రువులయ్యారుతన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పారు.. 'జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్థి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు, దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983లోనో 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు.అర్జున్‌రెడ్డి కోసం 40 ఏళ్ల తర్వాత..సుమారు 40 ఏళ్లతర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఒకరోజు తనను చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్రెడ్డివలో నానమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు.తిరుమల శ్రీనివాసుడికి రూ. 100 కోట్లుజీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కాంచన.. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన అస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కుకున్నారు. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో రూ. 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు?కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు, మరిది వాళ్లంతా అండగా ఉన్నారని చెప్పారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ.. నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు. View this post on Instagram A post shared by Thirumala_thirupathi (@thirumalahills_thirupathi) -
నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు
నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోల్లో శింబు ఒకరు. ఈ తమిళ హీరో గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ ప్రేమ పెళ్లి పట్టాలెక్కకముందే బ్రేకప్ అయింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ హీరో ప్రేమ, పెళ్లిని కాస్త సైడ్‌కు నెట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్లోనూ కాస్త ఫన్నీగా చెప్పాడు.అందరి నోటా ఒకటే ప్రశ్నమలేషియాలో ఓ కార్యక్రమానికి హాజరైన శింబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలమాలతో సాదరంగా ఆహ్వానించారు. తర్వాత అక్కడే ఉన్న ఓ యాంకర్.. సర్, అందరూ ఒకటే అడుగుతున్నారు.. అదే మీ పెళ్లెప్పుడు? అని మెల్లిగా కూపీ లాగింది. ఆల్రెడీ అయిపోయిందిగా!అందుకు శింబు నవ్వుతూ.. అదేంటి, నాకు ఆల్రెడీ 120 సార్లు పెళ్లయిపోయిందిగా! అని జోక్ చేస్తూనే జీవితంలో ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అని బదులిచ్చాడు. లైఫ్‌లో ఒంటరిగా ఉన్నామా? ఒకరితో బంధాన్ని కలుపుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. మనం మంచిగా ఉంటే అంతే చాలు అన్నాడు. అరసన్ మూవీతర్వాత అభిమానుల కోరిక మేరకు ఓ తమిళ పాటను ఆలపించాడు. ఇకపోతే ప్రస్తుతం శింబు 'అరసన్' (తెలుగులో సామ్రాజ్యం) సినిమా చేస్తున్నాడు. వేట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపోమాపో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ సేతుపతి, సముద్రఖని, కిషోర్, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.చదవండి: రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! -
వైకల్యం, అవమానాలు అధిగమించి గీత రచయితగా..
ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్. ఆత్మస్థైర్యం ఎక్కువఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్‌చైర్‌లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్‌కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం. ఈయన పాటలు ఏం రాస్తారులే?అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు. అలా సినీ ఎంట్రీఅలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. వల్లభ ఫస్ట్ మూవీదివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు. మంచి పేరుఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు. -
25 ఏళ్ల తరువాత మళ్లీ తెరపైకి పడయప్పా
తమిళసినిమా: గతంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. అలా తాజాగా నటుడు రజినీకాంత్ నటించిన పడియప్పా చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 12వ తేదీన రీ రిలీజ్ కానుంది. దివంగత నటుడు శివాజీ గణేషన్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ, సెంథిల్ , మణివన్నన్, అబ్బాస్ తదితరులు పోషించారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 1999 ఏప్రిల్ పదవ తేదీన విడుదలైన ఈ చిత్రం రజనీకాంత్ వజ్రోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 12వ తేదీన 4కె సౌండ్ ట్రాక్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ కానుంది. కాగా ఇంతకుముందు సంచలన విజయాలు సాధించిన కమలహాసన్ హీరోగా నటించిన నాయకన్, చేరన్ నటించిన ఆటోగ్రాఫ్, విజయ్ సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ వంటి కొన్ని చిత్రాలు రీ రిలీజ్ అయ్యి పెద్దగా వసూళ్లను సాధించలేకపోయాయి. కాగా కోలీవుడ్‌లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ నటించిన చిత్రాల రీ రిలీజ్ కే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ నటించిన పడయప్పా చిత్రం రీ రిలీజ్ ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
మనస్సాక్షి లేదా? ప్రజలంటే అంత చులకనా?
ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో కరూర్ తొక్కిసలాట ఒకటి. హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ విషాదంపై సినీనటులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్‌తో కలిసి జిల్లా మూవీలో యాక్ట్ చేసిన వినోదిని.. విజయ్‌కు నటుడిగా సపోర్ట్ చేస్తానని, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించింది.జనాలను పట్టించుకోవడం దండగఈమధ్య ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జనాలను పట్టించుకోవడం దండగ అని ఈ మధ్యే అర్థమైంది. వాళ్లకోసం మాట్లాడి ఉపయోగం లేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ విషయం నాకు మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఉదాహరణకు కరూర్ తొక్కిసలాటనే తీసుకోండి.. 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలు కూడా అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నారు. అలాంటివారి కోసం నేనెందుకు నిలబడాలి? అని మాట్లాడింది. నటి ఆగ్రహంఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనం శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాధను ఎందుకని అవమానిస్తున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? మీరేమైనా కరూర్ బాధితులను నేరుగా కలిశారా? మాట్లాడారా? వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారా? సమస్యను అర్థం చేసుకోవడం పక్కనపెట్టి విజయ్ సర్‌ను అరెస్ట్ చేయలేదని ఎక్కువ ఫీలవుతున్నట్లున్నారు.బీపీ వచ్చిందిజయలలిత లాంటి నాయకురాలు రాజకీయాల్లో మళ్లీ కనిపించరా? అని అడుగుతుంటారు కదా! ఇదే దానికి సమాధానం. ప్రజలకు విలువ ఇవ్వని నాయకులు ఎక్కడ ఎదుగుతారు? ఆమె మాటలు విన్నాక నాకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను కరూర్ బాధితులను నేరుగా కలిశాను. నేను మీలా రాజకీయ నాయకురాలిని కాదు. ఏ పార్టీని సపోర్ట్ చేయను. అయినా వారి బాధ నేను అర్థం చేసుకోగలను. జనం పనికిరానివాళ్లా?వాళ్లకోసం నేను పెద్దగా ఏమీ చేయకపోవచ్చేమో! కానీ, అండగా నిలబడటం నా బాధ్యత. జరిగినదాంట్లో విజయ్ సర్ తప్పు లేదని బాధితులే స్వయంగా చెప్పారు. కానీ, మీరు మాత్రం దాన్ని ఒప్పుకోరు. పైగా అలా అన్నందుకు మీ దృష్టిలో ఆ అమాయక జనం పనికిరానివాళ్లుగా మారిపోయారు. మీరు పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేశారు. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. మీ సేవలు మాకు అక్కర్లేదు అని మండిపడింది. కాగా వినోదిని.. మక్కల్ నీది మయ్యం పార్టీకి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసింది. తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న సనం శెట్టి.. తెలుగులో శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాల్లో నటించింది.చదవండి: తనూజకు క్లాస్ పీకిన నాగ్.. ఆ ముగ్గురికే ట్రోఫీ గెలిచే అర్హత -
15 ఏళ్లుగా పోరాటం.. గ్లామర్ ఉన్నా నో లక్!
పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్‌తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.సీన్స్ కట్ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్‌లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.వివాదంవాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది. కోరికసెంగళం అనే వెబ్ సిరీస్‌లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్‌లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
సినిమాలో అన్ని పాటలు పాడిన రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్‌లో అన్ని పాటలు పాడటం రెహమాన్‌కు ఇదే మొదటిసారి!అది రిపీట్ అవాలని..ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు. రెండు వారాల రిహార్సల్స్ఇందులో సంగీతానికి, డ్యాన్స్‌కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.చదవండి: అప్పుడే తెలిసిపోయింది -
కేథరిన్ థ్రెసాతో స్టార్ హీరో వారసుడు స్టెప్పులు
నటుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్ సంజయ్ సౌత్ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కేథరిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్ సంజయ్ కూడా స్టెప్స్ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథరిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్ సంజయ్ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ.. వివాదంలో సినిమా..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్‌లాల్ సుందర్‌దాస్ చెన్నై హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Interim Ban on ‘#VaaVaathiyaar’The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025 -
సింగర్ తల్లి నోట పాట.. వీడియో వైరల్
హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్‌రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్‌ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్‌ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. -
హీరోయిన్‌తో విడాకులు.. రూ.100 కోట్ల ఆస్తి ఎవరికంటే?
దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 30) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి కాలంలో మాత్రం కనిపించకుండా పోయారు. చాలాకాలంగా ఒంటరిగానే బతుకీడుస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఈ ప్రత్యేక కథనం..పెళ్లి చేసుకోమని బలవంతంసినీ నిర్మాత ఎస్ఎంఎస్ సుందరరామన్ కుమారుల్లో దేవదాస్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్ చేశారు. దేవదాస్.. వేగుళి పెన్, మని కోయ కురుప్, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించారు. వేగుళి పెన్ మూవీ సమయంలో హీరోయిన్ దేవిక ఆయనతో ప్రేమలో పడింది. దేవిక, దేవదాస్పెళ్లితో జీవితం తలకిందులుఅయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట! పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది! దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక.. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. కానీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని దేవదాస్‌కు నెమ్మదిగా అర్థమైంది. ఆయన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది. దశాబ్దాల తరబడి కోర్టులోఅందుకు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు తాళి బొట్టు ఆయన మొహాన విసిరికొట్టింది. అంతేకాదు, భర్తను చంపించాలని ప్రయత్నించిందట. ఈ విషయంపై దేవదాస్ పోలీసులను ఆశ్రయించగా దాదాపు 32 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. పెళ్లయిన మూడేళ్లకే దంపతులిద్దరూ విడిపోయారు. కోర్టు కూతురును తల్లికే అప్పగిస్తుంది. అలా కనక తండ్రికి దూరమైంది. కూతురి కోసం ఇంటికెళ్తే...కాదు, దేవికయే కూతుర్ని తనకు దూరం చేసిందంటారు దేవదాస్.. ఆమె వేసిన నిందలకు అందరూ తనను శత్రువులా చూశారని బాధపడ్డారు. కనక మానసిక స్థితి సరిగా ఉండదని, ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వస్తే ఇంటికి వెళ్లి చూశారు. కనక బతికే ఉండటంతో అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. కనక ఇంటి బయట అంతా శుభ్రం చేశారు. అయినా తండ్రిని ఆమె లోనికి రానివ్వలేదు. చారిటీకి ఆస్తిఅలా భార్య, కూతురి ప్రవర్తన వల్ల జీవితాంతం నరకం అనుభవించారు దేవదాసు. దేవికను పెళ్లి చేసుకోవడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపపడ్డారు. తన గురించి పట్టించుకోనివారి కోసం ఆలోచించి సమయం వృథా చేయాలనుకోలేదు. అందుకే తన మరణానంతరం రూ.100 కోట్ల ఆస్తి ట్రస్టుకు చెందాలని వీలునామా రాశారు. ఇప్పుడిక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవిక తెలుగులో పెండ్లి పిలుపు, అన్నా చెల్లెలు, గాలిమేడలు, రక్త సంబంధం, మంగళసూత్రం, నిండు మనసులు, గండికోట రహస్యం, పాపం పసివాడు, శ్రృ కృష్ణాంజనేయ యుద్ధం, నిప్పులాంటి మనిషి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.చదవండి: సాయిపల్లవి వల్ల నా జీవితమే మారిపోయింది: మ్యూజిక్ డైరెక్టర్ -
నన్ను కాదు, వాళ్లను ఆరాధించండి: హీరో
కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవాలు మాత్రమే ప్రచారంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్‌లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటివారే ఇష్టంతనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్‌ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
విజయ్‌కు సలహాలివ్వను: కమల్ హాసన్
హీరో విజయ్‌కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే నా శత్రువుతమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్‌కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.అదే గొప్ప గురువు2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్‌కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు. సినిమాఅనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్‌తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.చదవండి: నేడు సమంత పెళ్లి? బరి తెగించారంటూ ఆమె పోస్ట్ -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
బన్నీ కోలీవుడ్ ఎంట్రీతో మార్కెట్ షేక్ అవుతుందా?
-
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్‌లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్‌తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్‌నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్‌కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్‌లో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్‌కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్‌హాసన్(Kamal Haasan) తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కొడుకు సమక్షంలో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి
ప్రముఖ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్‌తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్‌గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్లోనూ చేసింది. తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్)అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్లానే క్రికెట్‌ని కెరీర్‌లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Samyuktha Shanmughanathan (@samyuktha_shan) -
కలిసిరాని సినిమాలు.. స్టార్ హీరోయిన్ అయ్యేదెప్పుడో?
కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్‌కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.బ్రేక్అయినా ప్రియాంక మోహన్‌ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. ఉపయోగపడని ఓజీపవన్కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఈ సినిమాలపైనే ఆశలుకాగా ప్రస్తుతం కెవిన్‌కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది. -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మధ్య తరగతి అమ్మాయినిఅలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్‌ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అవమానంచిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు. -
కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు
స్వతహాగా తమిళ అమ్మాయి అయిన నివేదా పేతురాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. వాటిలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో ఉన్నాయి. ఈ ఏడాది తన ప్రియుడి గురించి బయటపెట్టింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేనట్లు ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే వీధి కుక్కల గురించి మాట్లాడుతూ నివేదా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.చెన్నైలో సోమవారం.. వీధి కుక్కల సంరక్షణ కోసం కొందరు ర్యాలీ చేశారు. దీనిలో నివేదా పేతురాజ్ కూడా పాల్గొంది. తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే కుక్క కాటుని అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అదేమంత పెద్ద విషయం కాదని చెప్పింది. దీంతో కొందరు ఈమెని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈమెని దారుణంగా విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)'కుక్క కాటుని మనం పెద్దదిగా చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించకూడదు. మన కళ్లముందే చాలా క్రూరమైన ఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఒక్కరూ మాట్లాడరు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ చాలా ప్రమాదకర వ్యాధి అనేది నిజం. కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు.. పరిష్కారం ఏంటో ప్రజలకు నేర్పించాలి. వీధి కుక్కల్ని చంపడం పరిష్కారం కాదు' అని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.అయితే నివేదా.. కుక్క కాటుని చాలా తక్కువగా చేస్తోందని, ఓసారి వీధి కుక్కలు ఉండేచోట కారులో కాకుండా నడుచుకుని తిరిగితే అప్పుడు సమస్య ఏంటో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె త్వరలో దుబాయికి చెందిన బిజినెన్మ్యాన్ని పెళ్లి చేసుకోనుంది. తర్వాత ఈమె మన దేశంలో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఈ విషయాన్ని కూడా గుర్తుచేస్తున్న పలువురు నెటిజన్లు.. ఈమెని ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)If a dog bites you, don't make a big deal out of it and create fear. — #NivethaPethurajpic.twitter.com/OFFw5YpQT2— Filmy Bowl (@FilmyBowl) November 24, 2025 -
వీరిద్దరి కాంబో సూపర్ హిట్.. మరోసారి గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.చెన్నైలో ఓ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.కాగా.. అజిత్ కుమార్ ఈ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది. -
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్ -
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.లవ్ ఫెయిల్యూర్సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్‌తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు -
పోయి ముఖం కడుక్కుపో.. కమల్ వ్యాఖ్యలతో షాక్!
గోవాలో ఇఫీ (అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఖుష్బూ (Kushboo).. గతంలో కమల్ హాసన్‌తో తనకు ఎదురైన ఓ సంఘటనను గురించి చెప్పుకొచ్చింది. వీరిద్దరూ మైకేల్ మదన కామరాజు (Michael Madana Kama Rajan Movie) అనే క్లాసిక్ మూవీలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను ఖుష్బూ తాజాగా గుర్తు చేసుకుంది.బాగా రెడీ అయి వెళ్తే..'మైకేల్ మదన కామరాజు సినిమా సెట్‌కు నేను బాగా రెడీ అయి వెళ్లాను. హెయిర్ స్టైల్ చేసుకుని, ఐ షాడో పెట్టుకుని.. ఫుల్ మేకప్‌తో వెళ్లా.. నేను సెట్లో అడుగుపెట్టానో లేదో.. నన్ను చూడగానే కమల్ హాసన్ (Kamal Haasan) ఓ మాటన్నాడు. వెనకాల వాష్‌రూమ్ ఉంది. వెళ్లి ముఖం కడుక్కుని రాపో అన్నాడు. ఆ మాట విని షాకయ్యా.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అనిపించింది. అర్థం చేన్నా..అంతలోనే కమల్.. నీ ముఖంపై కొంచెం కూడా మేకప్ ఉండకూడదు. నా షాలిని (మైకేల్ మదన కామరాజు మూవీలో హీరోయిన్ పాత్ర) సినిమాలో మేకప్ లేకుండానే ఉంటుంది అన్నాడు. ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వెంటనే ముఖం కడుక్కుని మేకప్ తీసేశాను. ఆ తర్వాతే మాపై సీన్లు చిత్రీకరించారు. ఇక్కడ కమల్ సినిమాలో సహజత్వం కోరుకున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి' అని చెప్పుకొచ్చింది.కమల్ సినిమాలో ఐటం సాంగ్?ఇకపోతే ఇటీవల రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని ప్రకటించారు. ఈ మల్టీస్టారర్‌కు ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. కానీ, రెండురోజులకే ఆ మూవీ తాను డైరెక్ట్ చేయడం లేదన్నాడు సుందర్. ఖుష్బూను ఐటం సాంగ్ చేయమని డిమాండ్ చేశారని, అందుకే ఆమె భర్త సినిమా నుంచి తప్పుకున్నాడంటూ ట్రోలింగ్ జరిగింది. ఖుష్బూ కౌంటర్అలాంటి ఓ పోస్ట్‌కు ఖుష్బూ స్పందిస్తూ.. నన్ను ఐటం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో! అని కౌంటరిచ్చింది. సుందర్ మంచి కథ ఇవ్వకపోవడం వల్లే ఆయన పక్కకు తప్పుకున్నారన్న ప్రచారమూ జరిగింది. దాన్ని కూడా ఖుష్బూ తోసిపుచ్చింది. ఈ నిరాధారమైన వార్తలు బయటకు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇకపోతే కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీ-కమల్ మూవీ రానుంది.చదవండి: 23 ఏళ్లుగా సహజీవనం.. 47 ఏళ్ల వయసులో పెళ్లి -
సిక్స్‌ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్కు తయారయ్యారు. ఫుల్ వర్కవుట్స్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Raghavendra Mahat (@mahatofficial) -
నా శేష జీవితం వారితోనే: అజిత్
సినీ రంగంలో అజిత్ జీవన విధానమే ప్రత్యేకమని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. సినిమాలతో పాటు తన కుటుంబం అంటూ సాగుతున్న ఈయన జీవితంలోకి కొత్తగా క్రీడా పయనం వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు దానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి రైఫిల్ షూట్లోను, బైక్ రేసులు, కార్ రేసుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. అలా బెల్జియం, దుబాయి దేశాల్లో జరిగిన పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా సొంతంగా కార్ రేస్ పోటీల సంస్థ ప్రారంభించారు. తాజాగా అజిత్ కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్–2025 అనే బిరుదును ఎస్ఆర్ఓ మోటార్ స్పోర్ట్స్ సంస్థ ప్రధానం చేసి సత్కరించింది. బిరుదు ప్రధానోత్సవంలో అజిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇకపోతే అజిత్ తన శేష జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాను ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో చిత్రం చేస్తానన్నారు. అదేవిధంగా నెలలో 15 రోజులు సినిమాకు, 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. 'నా విరామ జీవితం అంతా నా స్వీట్ హార్ట్ (శాలిని)కి, జూనియర్ అజిత్, శాలినిలకే. మంచి తండ్రిగా, మంచి ఉపాధ్యాయుడిగా, నిజమైన సేవకుడిగా సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.' అని పేర్కన్నారు. -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్‌ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్‌లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్‌సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్‌తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్ -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
ఈ సినిమా హిట్టయితేనే పిశాచి 2 రిలీజ్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్ గో ఆన్ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్. బ్లాక్ మెడ్రాస్ ఫిలింస్ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్ తిలక్, కల్లూరి వినో, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మాస్క్ రిలీజ్వెట్రిమారన్ మార్గదర్శకత్వంలో వికర్ణన్ అశోక్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్ కథానాయకుడిగా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్ 21న) తెరపైకి వచ్చింది. అది హిట్టయితేనే..ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్ చిత్ర హిట్‌పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట! -
కుటుంబం రోడ్డుమీదకు.. నాన్న గుండె ఆగిపోయింది!
సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్ రెహమాన్ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే! ఎన్నో అవమానాలుఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్‌ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు. కోలుకోవడానికి చాలా ఏళ్లువిశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్-కృతీ సనన్ల 'తేరే ఇష్క్ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ 'పెద్ది' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.చదవండి: అమల అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? -
రాహేలు వీడియో సాంగ్.. గ్లామర్‌గా 'హనీ రోజ్'
మలయాళ నటి హనీరోజ్(Honey Rose) నటిస్తున్న కొత్త సినిమా ‘రాహేలు’.. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా రోమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు ఆనందిని బాలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ ప్రముఖ నటులు రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్ కీలక పాత్రలో నటించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయిన హనీరోజ్ .. చాలారోజుల తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించగా తాజాగా విడుదలైన సాంగ్ హనీ గ్లామర్‌తో హీట్ పెంచేసింది. -
పక్కా ప్లాన్‌తో స్క్రిప్టు రాస్తున్నాను: కీర్తి సురేష్
ప్రస్తుతం దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో కీర్తి సురేష్( Keerthy Suresh) ఒకరు. మలయాళం చిత్ర పరిశ్రమలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయకిగా ఎదిగి మలయాళం, తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఆ మధ్య మేరిజాన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈఅమ్మడు నటిగా పుష్కరకాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది వివాహ జీవితంలోకి కూడా అడుగు పెట్టారు. కీర్తిసురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం రివాల్వర్ రీటా ఈనెల 28న తెరపైకి రానుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. వివాహానంతరం తాను నటించిన రివాల్వర్ రీటా చిత్రం విడుదల కానుందని పేర్కొన్నారు. తన భర్తతో కలిసి నటిస్తారని చాలామంది అడుగుతున్నారని ఆయనతో నటించే ఆలోచన లేదని చెప్పారు. అసలు ఆయన సినిమా అంటేనే పారిపోతున్నారని అన్నారు. కాగా రివాల్వర్ రీటా చిత్రాన్ని ఆయన తనతో కలిసి చూశారని చెప్పారు. అప్పుడు ఇకపై ఇలా చిత్రాలను ప్రత్యేకంగా చూడనని, థియేటర్లోనే చూస్తానని చెప్పారన్నారు. ఇది కోలమావు కోకిల(కోకో కోకిల) చిత్రానికి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. తమిళ చిత్రం తొడరిలో తన నటన గురించి ఎగతాళి కూడా చేశారన్నారు. అయితే ఆ చిత్రం చూసిన తర్వాతే మహానటి చిత్రంలో తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చిందన్నారు. ఒక ప్రమాదకరమైన వీడియోలో తాను సమంత కలిసి ఉన్నట్లు సృష్టించారన్నారు. దాన్ని చూసి తాను భయపడ్డాను అన్నారు. విదేశాల్లో మహిళలకు కొంత వరకు రక్షణ ఉంటుందని, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని, అందుకోసం చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని అందుకోసం స్క్రిప్టును రాస్తున్నట్లు కీర్తిసురేష్ చెప్పారు. జీవితంలో ఒక్క సినిమాకు అయినా సరే దర్శకత్వం వహించాలనే కోరిక ఉందన్నారు. -
నేరుగా ఓటీటీకి సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలైనా ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మలయాళ క్రైమ్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సినిమాలతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.తాజాగా ఓ సీరియల్ కిల్లర్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. స్టీఫెన్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ సరికొత్త సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని రివీల్ చేసింది. ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం వహించగా.. జేఎం ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు. If we have a serial killer on our hands, namma keka vendiya kelvi yaaru nu ah illa yen nu ah?Watch Stephen, out 5 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix! #StephenOnNetflix pic.twitter.com/KHUg70WCrS— Netflix India South (@Netflix_INSouth) November 20, 2025 -
హీరో అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం
బేబీ సినిమాతో టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత ఎస్కేఎన్ (SKN).. సినిమా వేదికలపై తను చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉంటారు. అయితే, తాజాగా ఆయన ఒక కుటుంబాన్ని ఆదుకున్నారు. సినీ హీరో మహేష్ బాబు అభిమాని రాజేష్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయారు. ఇదే విషయాన్ని చెబుతూ రమేష్ నాయక్ అనే నెటిజన్ వివరాలతో సహా ట్వీట్ చేశాడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎస్కేఎన్ కంట ఆ పోస్ట్ పడింది. దీంతో ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు.ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్‌ను తాను అర్థం చేసుకోగలుగుతానని ఎస్కేఎన్ అన్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన రాజేష్ ఇంటికి వెళ్లిన ఆయన ఆ కుటుంబానికి రూ. 2లక్షలు సాయిం చేశారు. రాజేష్‌కు 10 సంవత్సరాల కుమారుడు, ఆరు సంవత్సరాలు కూతురు ఉండటంతో వారి చదువుల కోసం ఈ డబ్బు ఉపయోగించాలని కోరారు. రాజేష్ ఇంటికి వెళ్లి అతని కుమారుడికి రెండు లక్షల చెక్‌ను ఎస్కేఎన్ అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎస్కేఎన్ను అభినందిస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PRO Sreenu Suresh (@pro_sreenusuresh) -
‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో వెబ్సైట్.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్
సినిమా పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ‘ఐబొమ్మ’ (Ibomma), ‘బప్పంటీవీ’ (Bappamtv) పూర్తిగా క్లోజ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, సినీ నటులు సీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సీ కల్యాణ్ కామెంట్ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్’ వెబ్సైట్ తెరపైకి వచ్చింది.గతంలో ఉన్న ఐబొమ్మ మాదిరిగానే కొత్త సినిమాలు అందులో ఉన్నాయి. సినిమాను చూసేందుకు క్లిక్ చేస్తే ‘మూవీరూల్స్’కు కనెక్ట్ కావడం గమనార్హం. అలా మళ్లీ తెరపైకి ఐబొమ్మ పేరు వచ్చేసింది. ఈ రకంగా పైరసీ ద్వారా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఇండస్ట్రీ, పోలీసులు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఐబొమ్మ వన్ తెరపైకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. -
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
ఇండస్ట్రీలో ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్గా చేస్తే ఆ సినిమా గ్యారెంటీ హిట్టే అన్నంతగా టాక్ ఉంది. తమిళంలో ఈమె నటించిన 'అమరన్' గతేడాది రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సాయిపల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈమె.. ప్రస్తుతం హిందీలో తీస్తున్న 'రామాయణ' అనే భారీ పాన్ ఇండియా మూవీలో సీతగా చేస్తోంది. దీంతో ఇప్పటికైతే దక్షిణాదిలో కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. కానీ త్వరలో తమిళంలో కమ్ బ్యాక్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)సాయిపల్లవి గతంలో ధనుష్‌కు జోడీగా 'మారి 2' అనే సినిమా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇదే యావరేజ్ అనిపించింది. ఈ హీరో ప్రస్తుతం 'అమరన్' దర్శకుడు తీస్తున్న కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో హీరోయిన్గా మీనాక్షిచౌదరి, పూజాహెగ్డే పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఫైనల్‌గా సాయిపల్లవి అని ఫిక్సయ్యారట. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయిప్రస్తుతం ధనుష్ 'పోర్ తొళిల్' సినిమా ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇంతలో తర్వాత మూవీలో సాయిపల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్ రిలీజ్) -
రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత
ఎన్నో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి (92) మరణించారు. వయసు రీత్యా గత కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేశారు.ఈయన పేరు నారాయణ స్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్‌గానూ పనిచేశారు. రజనీకాంత్‌కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్‌కి రజనీని పరిచయం చేసింది ఈయనే. అలా రజనీ-బాలచందర్ కాంబోలో 'అపూర్వ రాగంగళ్' సినిమా వచ్చింది. దీంతో రజనీ కెరీర్ మారిపోయింది. అలాంటి నారాయణస్వామి ఇప్పుడు చనిపోవడంతో ఆయన సేవలు స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ త్రిషకు అనర్హం
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. అలా ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో హాబీ ఉంటుంది. వీటిలో ఎక్కువగా పెట్ లవర్స్ ఉంటారు. అలా నటి త్రిష కృష్ణన్ కూడా సునక ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఈమె ఇంటిలో పెట్ డాగ్స్ ఎక్కువగానే ఉంటాయి. అంతే కాకుండా తను ట్రావెలింగ్ చేస్తున్న దారిలో ఏదైనా కుక్క బాధింపులకు గురైతే దాన్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. ఇలా పెట్ అభిమాని అయిన త్రిష పెటా సమాఖ్యకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరించారు. ఇక తన పెట్ డాగ్ మరణిస్తే మనిషి మరణించినంతగా బాధ పడతారు. తాజాగా తన పెట్ కుక్క పిల్ల (ఐజీ కృష్ణన్) పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తన పెంపుడు కుక్క మొదటి ఏడాది పుట్టిన రోజును నిర్వహించిన త్రిష, తన ఇంటిపెరట్లో కాగితపు తోరణాలు, బెలూన్లతో సుందరంగా డెకరేషన్ చేసి, తన కుక్కపిల్లకు ఇష్టమైన రకరకాల ఆహారాన్ని కేక్ చుట్టు ఏర్పాటు చేశారు. ఆ కుక్క పిల్ల తనకు చాలా ప్రత్యేకం. డాగ్ ఫుడ్‌కు సంబంధించి ప్రముఖ కంపెనీకి బ్రాండ్అంబాసిడర్గా ఆ కుక్క పిల్ల ఉన్నడం విశేషం. త్రిషకు ఎంతో ప్రత్యేకమైన తన డాగ్‌కు నూతన వ్రస్తాలు ధరింపజేసి ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దాడి, దానికి బదులు తనే కేక్ కట్ చేసి ,తినిపించి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన కుక్క పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా ఆమె ప్రారంభించడం విశేషం.ఇదంతా చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ రాసిన కుక్కపిల్ల.. సబ్బుబిళ్ళ... అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్న అంశం గుర్తుకొస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నటి త్రిషకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం ఆమె నటించిన విడాముయర్చి, థగ్స్ లైఫ్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపడటమే కావచ్చు. కాగా ప్రస్తుతం తమిళంలో ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర ఆపై మలయాళంలో రామ్ అనే చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉన్నాయి. అయితే కొత్త అవకాశాలేవీ లేవన్నది గమనార్హం. -
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తమిళ చిత్రం ఆన్‌పావం పొల్లాదదు (Aan Paavam Pollathathu Movie). ఆర్జే విగ్నేష్కాంత్, షీలా, జెన్సన్ దివాకర్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయమయ్యారు. డ్రమస్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి టీకేటీ నందకుమార్, ఎంఎస్కే ఆనంద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. బ్లాక్‌షిప్ ఫైండింగ్స్ సంస్థ సహకారంతో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జే విఘ్నేశ్‌కాంత్ మాట్లాడుతూ.. నిన్నటి జ్ఞాపకాలను మధురంగానూ, నేటి జ్ఞాపకాలను అనుభవాలుగానూ, రేపటి కలలను నిజం చేసేలా తాము నాటిన ఈ విత్తనానికి ఆదరణ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు కలైయరసన్ తంగవేల్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కథా రచయిత శివకుమార్ మురుగేశన్‌తో కలిసి పంచుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అందరూ ఒక కుటుంబం మాదిరి పని చేశారన్నారు. తాము ఇంతకుముందు నిర్మించిన కొన్ని చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నా, కమర్షియల్‌గా హిట్ అయ్యాయన్నారు. అయితే ఆన్‌పావం పొల్లాదదు చిత్రం లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు తమ గౌరవాన్ని పెంచిందన్నారు. రియోరాజ్ మాట్లాడుతూ ఇకపై కూడా మీకు నచ్చే కథా చిత్రాలనే చేస్తానని అన్నారు. -
చిత్రపరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు వి.శేఖర్ (72) శుక్రవారం సాయంత్రం చైన్నెలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన స్వగ్రామం తిరువణ్ణామలై సమీపంలోని నెయ్ వానత్తం. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వి.శేఖర్ సినిమాలపై ఆసక్తితో ఎడిటర్ లెనిన్ వద్ద కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్ శిష్యుడు గోవిందరాజ్ వద్ద చేరి కన్ను తొలక్కనుమ్ సామి చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. సినిమా1990లో నిళల్గళ్ రవి హీరోగా నటించిన 'నీంగళుమ్ హీరోదాన్' అనే మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత అదే నిళల్గళ్ రవిని హీరోగా పెట్టి నాన్ పుడిచ్చ మాప్పిళై మూవీ తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మామగారు పేరుతో రీమేక్ అయింది. దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు.అవయవదానంనిర్మాతగానూ కొన్ని హిట్ చిత్రాలను నిర్మించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వీ.శేఖర్ స్థానిక పోరూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. స్థానిక కోడంబాక్కమ్, సుబ్బరాయన్ నగర్‌లోని సామియార్ మఠంలో నివసిస్తున్న ఈయనకు భార్య తమిళ్ సెల్వి, కూతురు మలర్కొడి, కొడుకు కారల్ మార్క్స్ ఉన్నారు. దర్శకుడు వి.శేఖర్ అవయవ దానం చేశారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఇంటికి తీసుకు వచ్చారు. వి.శేఖర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.చదవండి: కోర్టు హీరోయిన్‌కు తమిళ్లో మరో ఛాన్స్ -
'కోర్టు' నటి శ్రీదేవికి తమిళ్ మరో ఛాన్స్
టాలీవుడ్లో'కోర్ట్' సినిమాతో నటి శ్రీదేవి పాపులర్ అయిపోయింది. అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. తమిళంలో కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభుదేవా సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు మన శ్రీదేవి తమిళ్లో రెండో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.కోలీవుడ్‌లో వైవిధ్య భరిత కథాచిత్రాలను నిర్మిస్తున్న సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ అధినేతలు డాక్టర్ అరుళానందు, మ్యాథ్యు అరుళానందు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ప్రోత్సహించే విధంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవికి వారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఇదే బ్యానర్ నుంచి నిర్మించిన జో చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నటుడు 'ఏగన్'(Aegan)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శీను రామస్వామి దర్శకత్వంలో కోళి పన్నై చెల్లదురై అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించి సక్సెస్ తో పాటు ప్రశంసలను అందుకున్నారు.తాజాగా తమ మూడో చిత్రాన్ని నిర్మించడానికి వారు సిద్ధమయ్యారు. ఇందులో జో, కోళిపన్నై చెల్లదురై చిత్రాలతో పాపులర్ అయిన నటుడు ఏకన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇందులో కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, మలయాళ చిత్రం బ్రూస్ లీ బిజీ ఫెమ్ ఫెమినా జార్జ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆహా కళ్యాణం చిత్రం ఫేమ్ యువరాజ్ చిన్నస్వామి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
రజనీకి నచ్చలేదు అందుకే.. మరెందుకు తొందర?
సినిమా తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. లాంచింగ్ దగ్గర నుంచి థియేటర్లలో రిలీజ్ చేసేంత వరకు ఏదో టెన్షన్ ఉండనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మూవీ మొదలవకుండానే ఆగిపోయిన సందర్భాలు, లేదంటే దర్శకులు, హీరోలు మారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటాయి. రీసెంట్ టైంలో అయితే రజనీకాంత్-కమల్ హాసన్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.'కూలీ' తర్వాత రజనీ.. కొత్తగా ఏ సినిమా చేస్తారా అని అభిమానులు అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా, సుందర్.సి దర్శకుడిగా మూవీ అనౌన్స్ చేశారు. ఇది జరిగి వారం పదిరోజులు కూడా కాలేదు. సుందర్.. ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు అధికారిక నోట్ కూడా రిలీజ్ చేశారు. అనివార్య కారణాల వల్లే ఇదంతా అని సుందర్ చెప్పారు. కానీ ఇప్పుడు అసలు కారణం ఏంటో కమల్ బయటపెట్టారు.(ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!)తాజాగా మీడియాతో మాట్లాడిన కమల్.. స్టోరీ నచ్చకపోవడం వల్ల ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చేశారు. తాను నిర్మాత అని, తన మూవీలో హీరోకు స్టోరీ నచ్చేంతవరకు వెతుకుతూనే ఉంటామని కూడా అన్నారు. అయితే ఇదేదో ప్రాజెక్ట్ ప్రకటించకముందే చేసుంటే బాగుండేది కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకు అంత తొందరపడ్డారో అని మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాతో పాటు రజనీతో తాను నటించే మరో మూవీ కోసం కూడా స్టోరీ వెతుకుతున్నామని చెప్పి కమల్ హాసన్ చెప్పారు. మరి సుందర్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి వచ్చే దర్శకుడు ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ సాగుతోంది. టాలీవుడ్ వైపు కూడా కమల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు యంగ్, సీనియర్ డైరెక్టర్స్ ఆయా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి రజనీ-కమల్ కాంబో మూవీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్)I’m an investor in this film and I will look for a story which my star will love. We’ll keep searching until we find it. - Kamal Haasan about #Thalaivar173 pic.twitter.com/4gjw3Q27MZ— LetsCinema (@letscinema) November 15, 2025 -
చాలామంది హీరోయిన్లు నన్ను రిజెక్ట్ చేశారు: హీరో
‘‘నేను హీరోగా నటిస్తున్న మూడవ చిత్రం రజనీ గ్యాంగ్. స్టార్ హీరో కావాలన్నది నా డ్రీమ్. అందుకోసం చాలా కథలు విన్నాను. అలాంటి సమయంలో దర్శకుడు రమేష్ భారతి మూడు కథలు చెప్పారు. రజనీ గ్యాంగ్ కథలో నటించమని ఆయనే సూచించారు. వినోదభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని చెప్పారు. మొదట్లో ఈ చిత్రాన్ని నేను నిర్మించకూడదని భావించాను, అయితే ఆ తర్వాత నేనే నిర్మించడానికి సిద్ధమయ్యా.. చాలామంది రిజెక్ట్ఇందులో ప్రముఖ నటీనటులను ఎంపిక చేశాం. నాకు మాత్రం హీరోయిన్ సెట్ కాలేదు. నా సరసన నటించడానికి చాలామంది ప్రముఖ హీరోయిన్లు నిరాకరించారు. చివరిగా నటి దివిక వచ్చారు. నాకు జంటగా నటించడానికి అంగీకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు. ఇందులో నటుడు మొట్టై రాజేంద్రన్, మునీష్ కాంత్, కూల్ సురేష్, కల్కీరాజా వదలకు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. బబ్లూ అనే ఒక కుక్క కీలక పాత్రను పోషించింది. నవంబర్లోనే..చిత్రంలో మూడు పాటలున్నాయి. వాటిని సంగీత దర్శకుడు ఎంఎస్ జోన్స్ రూబర్ట్స్ జనరంజకంగా రూపొందించారు. ఎన్ఎస్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ‘‘ అని తమిళ హీరో, నిర్మాత రజిని కిషన్ పేర్కొన్నారు. మిశ్రీ ఎంటర్ ప్రైజస్ పతాకంపై ప్రముఖ దివంగత ఫైనాన్షియర్ ఎస్.సెయిన్ రాజ్ జైన్ దివ్య ఆశీస్సులతో రజనీ కిషన్ నిర్మించారు. -
స్వయంకృషితోనే ఛాన్స్ దక్కించికున్నా: జోషిణ
సినిమాల్లో కథానాయకిగా నటించడానికి కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతలను కలిగిన వర్ధమాన నటి జోషిణ. ఈమె భరతనాట్యంతో పాటు, డాన్సులోనూ శిక్షణ పొందారు. అదే విధంగా బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్, గుర్రపు స్వారి, కర్రసాము వంటి వాటిలో శిక్షణ పొందారు. అదేవిధంగా కూత్తుపట్టరై కలైరాణి వద్ద డబ్బింగ్ చెప్పడంలోనూ శిక్షణ పొందారు. తెలుగులో నటించాలన్న ఆసక్తితో తెలుగు భాషను నేర్చుకున్నట్లు చెప్పిన నటి జోషిణ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తన గురించి,నటనపై ఆసక్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘ మా కుటుంబానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు . అదే విధంగా సినిమా రంగంలో తనకు తెలిసిన వారు ఎవరు లేరు. ఒక దశలో సినిమాపై నాకు ఆసక్తి ఏర్పడింది. దీంతో వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అలా స్వయంకృతోనే నటిగా ప్రకాశించాలని భావించాను. అదృష్టం అనేది పరిచయం వరకే పని చేస్తుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే , ప్రతిభ, నిరంతర శ్రమ అవసరం అవుతుంది. అందుకు తగిన శిక్షణ అవసరం అవుతుంది’’ అని నటి జోషిణ పేర్కొన్నారు. ఈమె ప్రస్తుతం కిషోర్ మత్తురామలింగం దర్శకత్వంలో నటించిన మిడిల్ క్లాస్ చిత్రం ఈనెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో నటుడు రాధా రవికి కూతురుగా నటించారు. అదేవిధంగా వెట్రి మహాలింగం దర్శకత్వంలో సూట్ కేస్ చిత్రంలోను నటిస్తున్నారు. ఇక నటుడు సెమ్మలర్ అన్నం దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ తాను కథానాయకిగా నటించబోతున్నట్లు జోషిణ చెప్పారు. -
రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు
ఈ ఏడాది 'కూలీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన రజనీకాంత్ నుంచి వారం క్రితం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు సుందర్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుని హీరో కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అకస్మాత్తుగా ఈ మూవీ నుంచి సుందర్ తప్పుకొన్నారు. ఈ విషయమై ఇప్పుడు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు.'అనుకోని పరిస్థితుల కారణంగా #తలైవర్173 నుంచి తప్పుకొంటున్నాను. అయినా సరే రజనీకాంత్, కమల్ హాసన్‌లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అని సుందర్.సి తన నోట్లో రాసుకొచ్చారు. కానీ ఎందుకు బయటకొచ్చేయాల్సి వచ్చింది? ఏమైంది? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)ఇకపోతే రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అనగానే చాలామంది కలిసి నటిస్తారని అనుకున్నారు. కానీ రజనీ హీరోగా, కమల్ నిర్మాత అనేసరికి కాస్త సంబరపడ్డారు. కానీ దర్శకుడిగా సుందర్ అనేసరికి చాలామంది అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీనికి కారణముంది. గతంలో రజనీకాంత్‌కి 'అరుణాచలం' లాంటి హిట్ చిత్రాన్ని సుందర్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ టైంలో అయితే దెయ్యాల సినిమాలు తీస్తున్నాడు. వీటికి డబ్బులొస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.ఇలాంటి దర్శకుడిగా రజనీకాంత్-కమల్ హాసన్.. అసలు ఎలా అవకాశమిచ్చారా అని.. అనౌన్స్మెంట్ వచ్చిన టైంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, ఈయన స్థానంలోకి వచ్చే కొత్త దర్శకుడు ఎవరా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే సుందర్ నోట్‌ని, ఇతడి భార్య, నటి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏమైందో ఏమో గానీ వెంటనే డిలీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!) -
న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళ వాడే అయినప్పటికీ అడపాదడపా మన దగ్గర కూడా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ టైంలో అయితే 'కింగ్డమ్'తో వచ్చాడు. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న అనిరుధ్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా అనే సందేహం వస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఈ పుకార్లు నిజమేనేమో అనే హింట్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనిరుధ్.. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నాడు. గతంలో హీరోయిన్ ఆండ్రియాతో రూమర్స్ వినిపించాయి. కానీ గత కొన్నేళ్ల మాత్రం ఇతడి పాటలు మాత్రమే వినిపించాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో మాత్రం అనిరుధ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ని పెళ్లి చేసుకోనున్నాడనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందించిన అనిరుధ్.. చిల్ గాయ్స్ అలాంటిదేం లేదని ట్వీట్‌తో క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు కావ్యతోనే కనిపించడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.యూకేకి చెందిన ఓ యూట్యూబర్.. న్యూయార్క్‌లో వ్లాగ్స్ తీశాడు. అయితే ఓ వీడియోలో అనిరుధ్-కావ్య జంటగా నడుస్తూ కనిపించారు. అంటే ఇద్దరూ కలిసి ట్రిప్ వేశారని నెటిజన్లు అంటున్నారు. దీంతో పెళ్లి వార్తలు నిజమేనా అని రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. త్వరలోనే అనిరుధ్.. కళానిధి మారన్‌కి అల్లుడు కాబోతున్నాడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి అటు అనిరుధ్, ఇటు కావ్య సింగిల్‌గానే ఉన్నారు. కెరీర్ పరంగా ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. ఒకవేళ రూమర్స్ నిజమైతే మాత్రం పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?)👋🏻 pic.twitter.com/kBrOCbivDQ— ranjii.in (@Ranjiiin) November 12, 2025 -
ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్
సాధారణంగా వయసు పెరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. చాలామంది విషయంలో ఇలా జరిగింది కూడా. కానీ కొందరు మాత్రం పెద్దవాళ్లు అవుతున్నా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు అయితే 50 ఏళ్లు దాటిపోయాయి. కానీ మొన్నీమధ్యే వచ్చిన 'థామా'లో ఐటమ్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా)అసలు విషయానికొస్తే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సరసన నటించిన శ్రియ.. 2018లో ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఈమెకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతానికైతే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్గా చేస్తోంది. రీసెంట్ టైంలో అయితే హిట్ మూవీ 'మిరాయ్'లో తల్లి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఓ తమిళ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆశ్చర్యపరిచింది.'నాన్ వయలెన్స్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో 'కనకం' అంటూ సాగే ఐటమ్ పాటలో శ్రియ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ ఏడాది రిలీజైన సూర్య 'రెట్రో'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది గానీ ఎందుకనో అది పెద్దగా వైరల్ కాలేదు. ఇప్పుడొచ్చిన పాట మాత్రం శ్రియ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ ఈ రేంజ్ అందం మెంటైన్ చేస్తోందని నెటిజన్లు, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?) -
రెండో పెళ్లి తర్వాత రీఎంట్రీ.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
అమలాపాల్(Amala Paul).. ఆ పేరే ఒక సంచలనం అని చెప్పవచ్పు. వివాదాలకు కేరాఫ్ అనే చెప్పాలి. ఆదిలోనే చర్చనీయాంశమైన కథా పాత్రల్లో నటించిన అమలాపాల్.. 'మైనా' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించడంతో స్టార్ హీరోయిన్గా రాణించారు. అలా విక్రమ్ హీరోగా నటించిన దైవతిరుమగళ్ (నాన్న).. విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తమిళ్లోనే కనిపించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు విజయ్‌తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బందం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత చిత్రాల్లో నటించడం మొదలెట్టిన అమలాపాల్ నిర్మాతగానూ అవతారమెత్తి మలయాళంలో ఒక చిత్రం చేశారు. ఆ తరువాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరికి ఇళయ్ అనే మగబిడ్డ ఉన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ.., కేరళ చికిత్స సాయంతో తన అందాలకు మెరుగు పెడుతున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా నటించడానికి కథలను వింటున్నట్లు తెలిసింది. దీంతో అమలాపాల్ సెకెండ్ ఇన్నింగ్ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. కాగా సమాచారంతో ఆమె అభిమానులను ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) -
తమన్నా అలాంటి ఇంజెక్షన్లు ఉపయోగిస్తుందా..?
సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో కూడా తమన్నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి తాను సుమారు 20 ఏళ్లు అవుతుంది. కెరీర్ ఆరంభంలో తన శరీరాకృతి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా వెండితెరపై అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసుకు చేరుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదు. షూట్స్ ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం.. ఆహారం విషయంలోనూ సరైన డైట్ ఫాలో అవుతుంది. అందుకే తనలో ఎలాంటి మార్పులు లేవు.కానీ, రీసెంట్గా తమన్నా కాస్త బరువు పెరిగారని, బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చేసిందని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. దానిని కంట్రోలో చేసుకునేందుకు ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఉపయోగిస్తుండవచ్చని నెటిజన్లు ఊహించగా, మరికొందరు ఆమె రిఫ్రెష్, మెరిసే రూపాన్ని చూసి మెచ్చుకున్నారు. అయితే, ఈ రూమర్స్‌పై తమన్నా నేరుగా ప్రస్తావిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో నిజాన్ని తెలిపింది.తన రూపం పూర్తిగా సహజమైనదని చెప్పని తమన్నా తన బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి ఇంజెక్షన్లు ఉపయోగించలేదని ఇలా చెప్పింది. 'నాకు 15 సంవత్సరాల వయస్సు నుండి కెమెరా ముందు కనిపిస్తున్నాను. మొదట్లో నేను ఎలా ఉండేదానినో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నా ఎదుగుదలను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. నాకు 20 ఏళ్ల వయసప్పుడు సన్నని శరీరంతోనే ఉన్నాను. ఇప్పుడూ అలాగే ఉన్నాను. నేను సహజంగానే అలా ఉన్నాను. నేను ఇలాగే పెరిగాను. నాలో ఎలాంటి మార్పులు లేవు.'అని ఆమె చెప్పింది.వాల్ల దృష్టిలో బరువు పెరిగాను'నేను నటించిన హిందీ చిత్రాలను మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయని కాస్త ఆశ్చర్యకరంగా భావిస్తారు. అందులో వారి తప్పులేదు.. ఎందుకంటే.., వారు నా సినీ ప్రయాణాన్ని రీసెంట్గా చూస్తున్నారు. నా తొలి దశలో వచ్చిన సినిమాలు చూడలేదు. కాబట్టి హిందీ ప్రేక్షకులకు నేను బరువు పెరిగినట్లు కొత్తగా అనిపిస్తుంది. కానీ, నేను 100 సినిమాలకు దగ్గరగా ఉన్నాననే విషయం వారందరికీ తెలయికపోవచ్చు. ప్రజలు నన్ను చాలా విభిన్న పాత్రలలో నా శరీరంలో వచ్చిన మార్పులు వివిధ దశలలో చూశారు.' అని ఆమె వివరించారు.స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది'ఒక స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు కొన్ని మార్పులు కనిపిస్తాయి. మనం మనలోని విభిన్న వెర్షన్‌ను చూస్తాము. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నా శరీరం చాలా దెబ్బతింది. నా 20 ఏళ్లలో ఉన్నట్లే నా శరీరాన్ని ఉంచుకోవడం ఆ సమయంలో చాలా కష్టమైంది. కాస్త బరువు పెరిగాను. దాంతో నా శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి నా కడుపు కనిపిస్తోందా..? అని నేను అనుకునే సందర్భాలు చాలు ఉన్నాయి. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కానీ, ప్రతి స్త్రీ తన చక్రంలో తన శరీరం మారడాన్ని గుర్తిస్తుంది. దానికి నేను ఏమీ మినహాయింపు కాదు.' అని ఆమె చెప్పింది. -
మంచంపైనే నిద్రపోతున్నావా లేదా ఫ్రిజ్‌లో.. హీరోయిన్‌పై కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే విజయ్ సేతుపతి, ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇక్కడ సేతుపతి.. ఆమె గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. ఏదైతేనేం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్)తమిళంలో తొలుత హీరోయిన్గా సినిమాలు చేసిన ఆండ్రియా.. తెలుగులోనూ 'తడాఖా'తో పాటు వెంకటేశ్ 'సైంధవ్'లో నటించింది. అంతకంటే ముందు సింగర్‌గా అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ తదితర సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లేటెస్ట్ తమిళ మూవీ 'మాస్క్'. కవిన్ హీరోగా నటిస్తుండగా ఈమె విలన్‌గా చేసింది. రెండురోజుల క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి అతిథిగా వచ్చిన విజయ్ సేతుపతి, ఆండ్రియా గ్లామర్ గురించి ఫన్నీ కామెంట్ చేశాడు.'నా చిన్నతంలో బీచ్ ఒడ్డున ఓ విగ్రహాన్ని చూశాను. అలానే నిన్ను కూడా చూశాను. అప్పటినుంచి మీ ఇద్దరూ అలానే ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం నువ్వు నటించిన యాడ్‌లో ఉన్నట్లే ఇప్పుడు అలానే ఉన్నావ్. నేనే కాదు నా కొడుకు కూడా నిన్ను ఆశ్చర్యంగానే చూస్తాడు. ఇంతకీ నువ్వు మంచంపైనే నిద్రపోతున్నావా లేదంటే ఫ్రిజ్‌లో పడుకుంటున్నావో అర్థం కావట్లేదు' అని విజయ్ సేతుపతి తనదైన స్టైల్లో మాట్లాడాడు. సేతుపతి మాట్లాడుతున్నంతసేపు ఎదురుగా కూర్చున్న ఆండ్రియా పడిపడి నవ్వుతూ కనిపించింది. దిగువ వీడియోలో మీరు ఇదంతా చూడొచ్చు.(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)#VijaySethupathi about #Andrea..😅"I saw a statue in beach in childhood.. Then i saw Andrea.. Both look same even now..😄 You still look like from an Ad u did years back.. After me, my son will look u in awe.. Are u sleeping on bed or refrigerator..😁" pic.twitter.com/kamqJ9w7LZ— Laxmi Kanth (@iammoviebuff007) November 9, 2025 -
బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని హీరోయిన్
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్‌ని 'మీ బరువెంత?' అని ఓ యూట్యూబర్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ వివాదం జరగ్గా.. గౌరీ ఓ నోట్ రిలీజ్ చేయడం, దీనికి ప్రతిగా సదరు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేయడంతో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని గౌరీ ఇంకా వదలట్లేదు. తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. మరీ ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు' లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు' అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే సదరు యూట్యూబర్‌పై మూవీ అసోసియేషన్ ఏదైనా చర్య తీసుకునే వరకు గౌరీ విచిచిపెట్టదేమో అనిపిస్తుంది.గౌరీ కిషన్ విషయానికొస్తే.. '96' సినిమాలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ 'జాను'లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు మూవీస్‌లో హీరోయిన్గా చేస్తోంది. ఈ బాడీ షేమింగ్ వివాదం కూడా గౌరీ లేటెస్ట్ మూవీ 'అదర్స్' ప్రెస్ మీట్ సందర్భంగానే జరిగింది. (ఇదీ చదవండి: డైరెక్టర్‌గా తళపతి విజయ్ కొడుకు.. టైటిల్ పోస్టర్ రిలీజ్)An apology without accountability isn’t an apology at all.Especially when it’s brushed off with “she misunderstood the question — it was just a fun one,” or worse — “I didn’t body-shame anyone.”Let me be clear. I won’t accept performative remorse or hollow words. Do better, RS… https://t.co/OsIOegL9Hr— Gouri G Kishan (@Gourayy) November 10, 2025 -
మరణాన్ని ముందే ఊహించిన హీరో..
తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!ఎవరీ అభినయ్?ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్‌మెన్‌గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే? -
ఫ్లాప్ డైరెక్టర్‌తో సిద్దార్థ్ కొత్త సినిమా
హీరో సిద్ధార్థ్ (Siddharth) చివరగా 3 బీహెచ్‌కే సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. పనిలో పనిగా తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోనే సిద్దార్థ్ గతంలో టక్కర్ సినిమా చేశాడు. ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా రెండోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీనికి రౌడీ అండ్ కో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ అధినేత సుదన్ సుదర్శన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అయిలి వెబ్ సిరీస్ ఫేమ్ రేవా సంగీతాన్ని అందించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.pic.twitter.com/XQzUi0Ll9p— KARTHIK G KRISH (@Karthik_G_Krish) November 8, 2025 -
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తమిళ నిర్మాతలు ఎట్టకేలకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లపాటు సినిమాపై లాభమొచ్చినా నష్టమొచ్చినా దాన్ని నిర్మాత మాత్రమే భరించేవాడు. కానీ ఇకపై అలా కుదరదని, స్టార్ హీరోలందరూ పూర్తి రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా నిర్మాతతో పాటు లాభనష్టాల్ని భరించాల్సి ఉంటుందని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో తమిళ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు.తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ రకంగా స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య లాంటి వాళ్లకు నిజంగానే షాకింగ్. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి పారితోషికం తీసుకునేవారు. లాభాలు వస్తే నిర్మాత ఇష్టం కొద్దీ కారు లాంటి బహమతులు ఇచ్చేవారు. అదే నష్టమొస్తే మాత్రం హీరోలు, నిర్మాతల్ని అస్సలు పట్టించుకోని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఓ రకంగా నిర్మాతలకు మంచిదే. కానీ హీరోలు దీనికి ఒప్పుకొంటారా అనేది చూడాలి. ఇలాంటిది తెలుగులో ఇండస్ట్రీలోనూ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)ఇదే సమావేశంలో ఓటీటీ డీల్స్ గురించి నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోలైతే 6 వారాలు, చిన్న బడ్జెట్ చిత్రాలతే 4 వారాల రూల్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తమిళంలో రిలీజయ్యే 250 చిత్రాలకు థియేటర్ల కేటాయింపు కోసం ప్రత్యేక పద్ధతి తీసుకురానున్నట్లు తెలిపారు.తమిళ నటీనటులు అందరూ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటే థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్మాతల మండలి కోరింది. ఇండస్ట్రీ బాగు కోసమే ఇలా చేయాలని పేర్కొంది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి గానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి) -
20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు
ఇటీవల బైసన్, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రెండింగ్‌లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి తన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన కుటుంబం గురించి అనుచితమైన పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. 'కొద్దిరోజులుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నా గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి సర్వసాధారణమేనని మొదట పట్టించుకోలేదు. అయితే, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహ నటీనటులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమైంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఫైనల్‌గా తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఫేక్ అకౌంట్ల నుంచి తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. దీంతో వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను.' అని అనుపమ తెలిపింది.యువతి వివరాలు గోప్యంగా ఉంచండిసైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆశ్యర్యపోయే విషయం వెలుగులోకి వచ్చిందని అనుపమ ఇలా చెప్పింది. ' ఇదంతా చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమె వయసులో చాలా చిన్నది. తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఐడెంటిటీని బయటి ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ ఘటన గురించి చెప్పాలని నాకు లేదు. కానీ, యువత మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ఇతరులను ద్వేషిస్తూ ఆన్లైన్లో మేరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రానా మాకు కూడా సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి. చట్టం అందరికీ సమానమే.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)


