సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే విజయ్ సేతుపతి, ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇక్కడ సేతుపతి.. ఆమె గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. ఏదైతేనేం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్)
తమిళంలో తొలుత హీరోయిన్‌గా సినిమాలు చేసిన ఆండ్రియా.. తెలుగులోనూ 'తడాఖా'తో పాటు వెంకటేశ్ 'సైంధవ్'లో నటించింది. అంతకంటే ముందు సింగర్‌గా అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ తదితర సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లేటెస్ట్ తమిళ మూవీ 'మాస్క్'. కవిన్ హీరోగా నటిస్తుండగా ఈమె విలన్‌గా చేసింది. రెండురోజుల క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి అతిథిగా వచ్చిన విజయ్ సేతుపతి, ఆండ్రియా గ్లామర్ గురించి ఫన్నీ కామెంట్ చేశాడు.
'నా చిన్నతంలో బీచ్ ఒడ్డున ఓ విగ్రహాన్ని చూశాను. అలానే నిన్ను కూడా చూశాను. అప్పటినుంచి మీ ఇద్దరూ అలానే ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం నువ్వు నటించిన యాడ్‌లో ఉన్నట్లే ఇప్పుడు అలానే ఉన్నావ్. నేనే కాదు నా కొడుకు కూడా నిన్ను ఆశ్చర్యంగానే చూస్తాడు. ఇంతకీ నువ్వు మంచంపైనే నిద్రపోతున్నావా లేదంటే ఫ్రిజ్‌లో పడుకుంటున్నావో అర్థం కావట్లేదు' అని విజయ్ సేతుపతి తనదైన స్టైల్లో మాట్లాడాడు. సేతుపతి మాట్లాడుతున్నంతసేపు ఎదురుగా కూర్చున్న ఆండ్రియా పడిపడి నవ్వుతూ కనిపించింది. దిగువ వీడియోలో మీరు ఇదంతా చూడొచ్చు.
(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)
#VijaySethupathi about #Andrea..😅
"I saw a statue in beach in childhood.. Then i saw Andrea.. Both look same even now..😄 You still look like from an Ad u did years back.. After me, my son will look u in awe.. Are u sleeping on bed or refrigerator..😁" pic.twitter.com/kamqJ9w7LZ— Laxmi Kanth (@iammoviebuff007) November 9, 2025


