సినిమాల్లో కథానాయకిగా నటించడానికి కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతలను కలిగిన వర్ధమాన నటి జోషిణ. ఈమె భరతనాట్యంతో పాటు, డాన్సులోనూ శిక్షణ పొందారు. అదే విధంగా బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్, గుర్రపు స్వారి, కర్రసాము వంటి వాటిలో శిక్షణ పొందారు. అదేవిధంగా కూత్తుపట్టరై కలైరాణి వద్ద డబ్బింగ్ చెప్పడంలోనూ శిక్షణ పొందారు. తెలుగులో నటించాలన్న ఆసక్తితో తెలుగు భాషను నేర్చుకున్నట్లు చెప్పిన నటి జోషిణ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈమె తన గురించి,నటనపై ఆసక్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘ మా కుటుంబానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు . అదే విధంగా సినిమా రంగంలో తనకు తెలిసిన వారు ఎవరు లేరు. ఒక దశలో సినిమాపై నాకు ఆసక్తి ఏర్పడింది. దీంతో వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అలా స్వయంకృతోనే నటిగా ప్రకాశించాలని భావించాను. అదృష్టం అనేది పరిచయం వరకే పని చేస్తుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే , ప్రతిభ, నిరంతర శ్రమ అవసరం అవుతుంది. అందుకు తగిన శిక్షణ అవసరం అవుతుంది’’ అని నటి జోషిణ పేర్కొన్నారు.
ఈమె ప్రస్తుతం కిషోర్ మత్తురామలింగం దర్శకత్వంలో నటించిన మిడిల్ క్లాస్ చిత్రం ఈనెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో నటుడు రాధా రవికి కూతురుగా నటించారు. అదేవిధంగా వెట్రి మహాలింగం దర్శకత్వంలో సూట్ కేస్ చిత్రంలోను నటిస్తున్నారు. ఇక నటుడు సెమ్మలర్ అన్నం దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ తాను కథానాయకిగా నటించబోతున్నట్లు జోషిణ చెప్పారు.


