హీరో సిద్ధార్థ్ (Siddharth) చివరగా 3 బీహెచ్‌కే సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. పనిలో పనిగా తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోనే సిద్దార్థ్ గతంలో టక్కర్ సినిమా చేశాడు. ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా రెండోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీనికి రౌడీ అండ్ కో అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ అధినేత సుదన్ సుదర్శన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అయిలి వెబ్ సిరీస్ ఫేమ్ రేవా సంగీతాన్ని అందించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
— KARTHIK G KRISH (@Karthik_G_Krish) November 8, 2025


