అమలాపాల్(Amala Paul).. ఆ పేరే ఒక సంచలనం అని చెప్పవచ్పు. వివాదాలకు కేరాఫ్ అనే చెప్పాలి. ఆదిలోనే చర్చనీయాంశమైన కథా పాత్రల్లో నటించిన అమలాపాల్.. 'మైనా' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించడంతో స్టార్ హీరోయిన్‌గా రాణించారు. అలా విక్రమ్ హీరోగా నటించిన దైవతిరుమగళ్ (నాన్న).. విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తమిళ్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే, కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు విజయ్‌తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బందం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత చిత్రాల్లో నటించడం మొదలెట్టిన అమలాపాల్ నిర్మాతగానూ అవతారమెత్తి మలయాళంలో ఒక చిత్రం చేశారు. ఆ తరువాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరికి ఇళయ్ అనే మగబిడ్డ ఉన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం.
అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ.., కేరళ చికిత్స సాయంతో తన అందాలకు మెరుగు పెడుతున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా నటించడానికి కథలను వింటున్నట్లు తెలిసింది. దీంతో అమలాపాల్ సెకెండ్ ఇన్నింగ్ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. కాగా సమాచారంతో ఆమె అభిమానులను ఖుషీ అవుతున్నారు.


