ఇండస్ట్రీలో ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తే ఆ సినిమా గ్యారెంటీ హిట్టే అన్నంతగా టాక్ ఉంది. తమిళంలో ఈమె నటించిన 'అమరన్' గతేడాది రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సాయిపల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈమె.. ప్రస్తుతం హిందీలో తీస్తున్న 'రామాయణ' అనే భారీ పాన్ ఇండియా మూవీలో సీతగా చేస్తోంది. దీంతో ఇప్పటికైతే దక్షిణాదిలో కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. కానీ త్వరలో తమిళంలో కమ్ బ్యాక్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుంది.
(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)
సాయిపల్లవి గతంలో ధనుష్‌కు జోడీగా 'మారి 2' అనే సినిమా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇదే యావరేజ్ అనిపించింది. ఈ హీరో ప్రస్తుతం 'అమరన్' దర్శకుడు తీస్తున్న కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షిచౌదరి, పూజాహెగ్డే పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఫైనల్‌గా సాయిపల్లవి అని ఫిక్సయ్యారట. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి
ప్రస్తుతం ధనుష్ 'పోర్ తొళిల్' సినిమా ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇంతలో తర్వాత మూవీలో సాయిపల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు.
(ఇదీ చదవండి: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్ రిలీజ్)


