తమన్నా అలాంటి ఇంజెక్షన్లు ఉపయోగిస్తుందా..? | Tamannaah Clarifies Weight Gain Rumors: Says Her Look Is 100% Natural | Sakshi
Sakshi News home page

ప్రతి స్త్రీ శరీరంలో వచ్చే మార్పులే నాలో కూడా వచ్చాయి: తమన్నా

Nov 11 2025 7:56 AM | Updated on Nov 11 2025 11:15 AM

Tamannaah Bhatia Will Using Weight Loss Medication

సౌత్‌ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో కూడా తమన్నాకు ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి తాను సుమారు 20 ఏళ్లు అవుతుంది. కెరీర్‌ ఆరంభంలో తన శరీరాకృతి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా వెండితెరపై అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసుకు చేరుకున్న ఈ మిల్కీ బ్యూటీ   ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు రాజీ పడదు. షూట్స్‌ ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం.. ఆహారం విషయంలోనూ సరైన డైట్‌ ఫాలో అవుతుంది. అందుకే తనలో ఎలాంటి మార్పులు లేవు.

కానీ, రీసెంట్‌గా తమన్నా కాస్త బరువు పెరిగారని, బెల్లీ ఫ్యాట్‌ కూడా వచ్చేసిందని బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. దానిని కంట్రోలో చేసుకునేందుకు ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఉపయోగిస్తుండవచ్చని నెటిజన్లు ఊహించగా, మరికొందరు ఆమె రిఫ్రెష్, మెరిసే రూపాన్ని చూసి మెచ్చుకున్నారు. అయితే, ఈ రూమర్స్‌పై తమన్నా నేరుగా ప్రస్తావిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో నిజాన్ని తెలిపింది.

తన రూపం పూర్తిగా సహజమైనదని చెప్పని తమన్నా తన బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి ఇంజెక్షన్లు ఉపయోగించలేదని ఇలా చెప్పింది.  'నాకు 15 సంవత్సరాల వయస్సు నుండి కెమెరా ముందు కనిపిస్తున్నాను. మొదట్లో నేను ఎలా ఉండేదానినో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నా ఎదుగుదలను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. నాకు 20 ఏళ్ల వయసప్పుడు సన్నని శరీరంతోనే ఉన్నాను. ఇప్పుడూ అలాగే ఉన్నాను. నేను సహజంగానే అలా ఉన్నాను. నేను ఇలాగే పెరిగాను. నాలో ఎలాంటి మార్పులు లేవు.'అని ఆమె చెప్పింది.

వాల్ల దృష్టిలో బరువు పెరిగాను
'నేను నటించిన హిందీ చిత్రాలను మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయని కాస్త ఆశ్చర్యకరంగా భావిస్తారు. అందులో వారి తప్పులేదు.. ఎందుకంటే.., వారు నా సినీ ప్రయాణాన్ని రీసెంట్‌గా చూస్తున్నారు. నా తొలి దశలో వచ్చిన సినిమాలు చూడలేదు. కాబట్టి హిందీ ప్రేక్షకులకు నేను బరువు పెరిగినట్లు కొత్తగా అనిపిస్తుంది. కానీ, నేను 100 సినిమాలకు దగ్గరగా ఉన్నాననే విషయం వారందరికీ తెలయికపోవచ్చు. ప్రజలు నన్ను చాలా విభిన్న పాత్రలలో  నా శరీరంలో వచ్చిన మార్పులు వివిధ దశలలో చూశారు.' అని ఆమె వివరించారు.

స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది
'ఒక స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు కొన్ని మార్పులు కనిపిస్తాయి. మనం మనలోని విభిన్న వెర్షన్‌ను చూస్తాము. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నా శరీరం చాలా దెబ్బతింది. నా 20 ఏళ్లలో ఉన్నట్లే నా శరీరాన్ని ఉంచుకోవడం ఆ సమయంలో చాలా కష్టమైంది. కాస్త బరువు పెరిగాను. దాంతో  నా శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చాయి.  బరువు పెరిగి  నా కడుపు కనిపిస్తోందా..? అని నేను అనుకునే సందర్భాలు చాలు ఉన్నాయి. ఆ సమయంలో చాలా బాధపడ్డాను.  కానీ, ప్రతి స్త్రీ తన చక్రంలో తన శరీరం మారడాన్ని గుర్తిస్తుంది. దానికి నేను ఏమీ మినహాయింపు కాదు.' అని ఆమె చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement