breaking news
Karimnagar District News
-
సర్‌కు సహకరించాలి
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్‌కల్చరల్: ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని నరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందన్నారు. నగరవ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల ప్రకారం ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు 80శాతం పూర్తయ్యిందన్నారు. ఫారాల పంపిణీ వందశాతం పూర్తయిన బీఎల్వోలు పూర్తిస్థాయిలో పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫీల్డ్ లెవల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరై ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారు బూత్ లెవల్ అధికారులను కలిసేలా ఓటర్లకు సూచనలు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల విషయంలో ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్కులను సందర్శించి, సమస్యను పరిష్కరించేలా పార్టీల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్, డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు. మరణించిన వారి వివరాలను బూత్ లెవల్ అధికారుల సహకారంతో తొలగించేలా సహకరించాలని సూచించారు. సైన్స్ మ్యూజియం చారిత్రాత్మకమైంది నగరంలోని సైన్స్ మ్యూజియం చారిత్రాత్మకమైందని కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా సైన్స్ మ్యూజియాన్ని సందర్శించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాలు, గ్యాలరీలను పరిశీలించారు. అధునీకరించిన మ్యూజియాన్ని సందర్శకులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. -
రిజిస్ట్రేషన్‌శాఖలో అధికారుల బదిలీలు
కరీంనగర్‌క్రైం: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్– స్టాంపులశాఖలో పరిపాలనా కారణాలతో చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్లో జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రార్ (మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ఎంవీ)గా పనిచేస్తున్న జి.స్థితప్రజ్ఞను అదే హోదాలో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించింది. ప్రస్తుతం సంగారెడ్డి– మెదక్ జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్నవల్లి సుబ్బలక్ష్మికి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ (ఎంవీ అండ్ ఏ) బాధ్యతలను అదనపునంగా అప్పగించింది. కరీంనగర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రవీణ్ కుమార్‌ను మేడ్చల్–మల్కాజిగిరి డీఐజీగా బదిలీ చేస్తూ, వరంగల్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. రంగారెడ్డి డీఐజీగా ఉన్న ఎస్.డి.ట్వింకిల్ జాన్‌ను నిజామాబాద్ డీఐజీగా బదిలీ చేయడంతో పాటు కరీంనగర్ డీఐజీ బాధ్యతలను అదనపు బాధ్యతలుగా (ఎఫ్ఏసీ) నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్ చేసి, కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా జె.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఘ నంగా స్వాగతం పలికారు. రవికుమార్ మాట్లాడుతూ పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నియంత్రణకు పాటుపడతామని తెలిపారు. డీటీఎఫ్ సీఐ నాగేశ్వర్రావు, హుజూరాబాద్ సీఐ శ్రీనివాస్, తిమ్మాపూర్ సీఐ బాబా, జమ్మికుంట సీఐ మాధవీలత, కరీంనగర్ రూరల్ ఇన్చార్జి సీఐ విజయ్ భాస్కర్, హెచ్‌సీ/ఈసీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి నగేశ్గౌడ్తో పాటు పలువురు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన డిప్యూటీ కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. గన్నేరువరం: గన్నేరువరం నుంచి కరీంనగర్ వరకు మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గన్నేరువరంలో సాయి టెస్టు పనులను ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ వసంత నాయక్ బుధవారం పరిశీలించారు. వారం రోజుల్లో బ్రిడ్జి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏ ర్పాట్లు పరిశీలించారు. ఈఈ చారి, డీఈ రాజశేఖర్‌రెడ్డి, ఏఈ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కటకం తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్: వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసై టీ సహకారంతో బుధవారం ఐఎంఏ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలు వురు డాక్టర్లు మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక యూనిట్ రక్తదానం ద్వారా మూడు నుంచి నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. రెడ్‌క్రాస్ బాధ్యులు ఎం. ఎల్.ఎన్.రెడ్డి, కేశవ్‌రెడ్డి, ఐఎంఏ బాధ్యులు ఆకుల శైలజ, వి.నీలిమ, కాసం శివకుమార్, సంతోష్ కుమార్, నరేశ్, రాజేశ్వర్, రామణాచారి, మోహన్‌రెడ్డి, మల్లికార్జున్, విజయలక్ష్మి, సర్దారున్నిసా, జ్యోతి,మానస పాల్గొన్నారు. కరీంనగర్ సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జర్మనీలోని గోట్టింగెన్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుందని శాతవాహన యూని వర్సిటీ అధికారులు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ జర్మనీ పర్యటనలో భాగంగా ఈ భాగస్వామ్యం సాధ్యమైందన్నారు. హుజూరాబాద్: హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి ఓ వైద్యుడు మద్యంమత్తులో వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అత్యవసర విభాగాని కి వచ్చిన రోగులు, అక్కడ విధుల్లో ఉన్న రేడియాలజిస్ట్ మద్యంమత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది బ్రీత్ అనలైజర్‌తో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షకు సహకరించలేదు. తన కారులో పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడా బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించలేదు. ఈ ఘటనపై హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్‌ను వివరణ కోసం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● తిమ్మాపూర్‌లో ఘటన ● ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● తృటిలో తప్పిన పెను ప్రమాదం తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటన తిమ్మాపూర్‌లోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు మధ్యాహ్నం హైదరాబాద్ వైపు వెళ్తోంది. దాని ముందుగా వెళ్తున్న నూతన లారీ ఫిట్నెస్ పరీక్ష కోసం ఆర్టీవో ఆఫీస్ వైపు డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటోంది. వెనకాలే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆటో డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు కలిసి బస్సులో ఉన్న 47 మందిని ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి దింపేశారు. తిమ్మాపూర్ సీఐ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
రేవంత్‌వి బురద రాజకీయాలు
కరీంనగర్‌టౌన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేశాడని, రెండున్నరేళ్లలో మరమ్మతు చేయకుండా వదిలిపెట్టి బురద రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు గేట్లను మరమ్మతు చేసి ఉంటే హైదరాబాద్‌కు, రాష్ట్రానికి తాగునీరు, 50వేల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చేసి మిడ్‌మానేరు, ఎల్ఎండీ, ఎస్సారెస్పీ నింపి వరదకాలువల ద్వారా అనంతగిరి వరకు సాగు, తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, బోనస్ ఇవ్వనందుకు, యూరియా కోసం గోస పెడుతున్నందుకు కాగడాలతో రైతులు తరుముతారని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటర్ల పేర్లను తొలగించే అవకాశాలున్నందున బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు, ప్రతి డివిజన్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సర్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయించాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎల్ఎండీ, మిడ్‌మానేరు ఎండిపోయాయని, సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్‌సింగ్, కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌టౌన్/కరీంనగర్ అర్బన్: వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సత్వర న్యాయం అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. కొత్తపల్లిలోని భరోసా సెంటర్లో సీపీ గౌస్ ఆలం అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే బాధితులకు తక్షణ సాయం అందించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ భరో సా సెంటర్ బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికపై పోలీసు, వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవలను అందించే సమగ్ర వ్యవస్థ అ న్నారు. ప్రతి కేసును మానవీయ కోణంలో పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పనిచేస్తామన్నారు. జూలై 1 నుంచి 31వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సప్తగిరికాలనీలోని సఖి సెంటర్‌ను కలెక్టర్, సీపీ సందర్శించారు. కేంద్రంలో బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసు ల నిర్వహణ, అత్యవసర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ బాధితురాలికి ధైర్యం చెప్పి, వారి సమస్యలను పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సెంటర్లోని రికార్డ్స్ విభాగం, అడ్మినిస్ట్రేటర్ గది, షెల్టర్ గదులను పరిశీలించి, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికతో మాట్లాడారు. శిక్షణ కలెక్టర్ హరిప్రసాద్, డీసీపీ వెంకటరమణ, సంక్షేమ అఽ దికారి సరస్వతి, డీఎంహెచ్‌వో శ్రీరామ్ ఉన్నారు. మార్కెట్ యార్డును ఆధునీకరిస్తాం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. యార్డు పరిశుభ్రతతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సన్న ఉన్నారు. -
మొలకెత్తని ఆశలు
సాక్షి, పెద్దపల్లి: కార్తెలు కరిగిపోతున్నా వానాకాలం సాగు ముందుకు సాగడంలేదు. జూన్ తొలివారంలోనే వర్షాలు విస్తారంగా కురిసి వివిధ పంటలతో పొలాలు పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి జల్లులు పడగానే పత్తి విత్తనాలు వేసినా ఇంకా మొలకలు రాలేదు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వరి నాట్లు వేయాల్సిన సమయం దాటిపోతుండగా పొలాలు నీళ్లులేక ఎండిపోవడంతో రైతులు తమ ఆశలన్నీ భారీవర్షాలపైనే పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఎండల తీవ్రత, వర్షాల ఆలస్యంతో బావులు, బోర్లు నీరందించడం లేదు. చెరువులు, కుంటల్లో నీరులేక ఆయకట్టులోనూ సాగు ప్రారంభం కాలేదు. వర్షాధారం సాగుపైనే ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పదిరోజులే వర్షం.. లోటు వర్షపాతం జూన్ ఒకటి నుంచి జూలై ఒకటో తేదీ వరకు జిల్లాలో కేవలం పదిరోజులే వర్షం నమోదైంది. జూన్ 5న చిరుజల్లులు ప్రారంభమైనా.. అన్ని మండలాలను తడపలేదు. ఇప్పటివరకు సాధారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 588.1 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 95.8 మి.మీ. లోటు ఏర్పడింది. ఈసారి మోస్తరు కాకుండా చిరుజల్లులే కురవడంతో వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడలేదు. నేలలో తేమ నిలవడం లేదు. విత్తనాలు ఎండిపోవడం, నారుమడులు సిద్ధం కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వారం రోజుల్లో భారీవర్షాలు కురవకపోతే వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎదురైతే దిగుబడి తగ్గే ప్రమాదంతోపాటు పెట్టుబడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
● శునకం.. భయం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కుక్కల బెడద తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. 54వ డివిజన్ అశోక్‌నగర్‌లో మాంసం విక్రయాలు జరుగుతుండడం, ఆ వ్యర్థాలను అక్కడే పడవేయడంతో కుక్కల బెడద పెరిగింది. కుక్కల బెడదను నివారించాలని కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి బుధవారం కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి ఫిర్యాదు చేశారు.చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామ దేవతలకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో మహిళలు బిందెలతో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు, కుంకుమ చల్లి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఉప సర్పంచ్ కానవేని జితేందర్, వార్డు సభ్యులు సదగోని ఇందిరా పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●: భూ చిక్కు ముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్టసంఖ్యలో ఉండగా ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి డిజిటల్ సర్వే ప్రారంభం కానుంది. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్షా(మ్యాప్), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూ కమతాలు పెరగటం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవటంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూముల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి పరిష్కారానికి సర్వే చేయక తప్పదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించింది. రోవర్ పరికరాలపై శిక్షణ పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలిసారి రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలు తయారు చేస్తున్నారు. తాజాగా జిల్లాకు ఐదు నుంచి ఏడు మండలాలు ఎంపిక చేయగా, మండలానికో గ్రామంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా సర్వేయర్లకు కరీంనగర్ కలెక్టరేట్లో రోవర్ పరికరాలపై శిక్షణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి నక్షాను రూపొందించనున్నారు. ఒక్కోగ్రామంలో 1500 నుంచి 2500 ఎకరాలకు పైగా సాగుభూములున్నాయి. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుండగా సర్వే నంబర్‌వారీగా నక్షా రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్ నంబర్లను రైతులకు అందిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో వందలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో పాల్గొనగా వీరితోనే ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు. అధునాతన రోవర్ పరికరాలను ఉపయోగించి పక్షం రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. భూ విస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60వేలను సంబంధిత లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్కారు చెల్లించనుంది.ముఖ్యమంత్రి సదస్సు వీక్షణహైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సును కొత్తపల్లి రైతు వేదికలో కలెక్టర్ చిత్రామిశ్రా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, డీఏవో భాగ్యలక్ష్మి, కా ర్పొరేటర్లు వాసాల రమేశ్, వేముల కవిత, రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సీఎం ప్రసంగాన్ని విన్నారు. వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. –కొత్తపల్లిఎడ్లబండి మూలనయాంత్రీకరణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకముందు వ్యవసాయ ఉత్పత్తులు తరలించడంలో రైతులు ఎడ్లబండ్లను విరివిగా వినియోగించేవారు. ఇంట్లో ఏ శుభకార్య మైనా, ఏ ఆపద వచ్చినా ఎడ్లబండ్లే దిక్కుగా మారేవి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మార్కెట్లోకి రావడంతో ఎడ్లబండ్ల వినియోగం తగ్గిపోయి మూలనపడుతున్నాయి. వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఓ రైతు ఇంటి ఎదుట నిరుపయోగంగా ఎడ్లబండి కనిపించింది. –వీణవంక భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావిస్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహసీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తింపు పొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూధార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తుంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. మోకాపై ఉన్న భూమినే కొలవనున్నారు. ఒక రైతుకు 2ఎకరాల భూమి ఉంటే ఎంత భూమి ఉందనేది కొలుస్తారే తప్పా రికార్డులో ఉన్న 2ఎకరాల భూమిని చూపించరు. రైతు అనుభవిస్తున్న భూమిని మాత్రమే కొలవనుండగా దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్ సర్వే చేస్తామని, తదుపరి ప్రభుత్వ ఆదేశాల క్రమంలో హద్దులు నిర్ణయిస్తామని కరీంనగర్ జిల్లా సర్వే లాండ్ ఏడీ కిషన్‌రావు చెబుతున్నారు. -
శభాష్.. సమష్టిగా పని చేస్తున్నారు
కరీంనగర్: హైదరాబాద్‌లోని ఘట్కేసర్లో మంగళవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పార్టీ నేతలను సమష్టిగా పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నారని అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. సమావేశ విరామ సమయంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని బండి సంజయ్ జా తీయ అధ్యక్షుడు నితిన్ నభీన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో శ్రమించాలని సూచించారు. -
లెక్కల్లో లెజెండ్స్
కరీంనగర్‌టౌన్: దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తూ, వ్యాపార సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించే వృత్తిగా చార్టర్డ్ అకౌంటెన్సీ నిలిచింది. డిజిటల్ చెల్లింపులు, ఈ– గవర్నెన్స్, ఆన్లైన్ పన్ను, ఈ–ఇన్వాయిసింగ్, డిజిటల్ ఆడిటింగ్, ఫిన్‌టెక్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ల బాధ్యత మరింత పెరి గింది. మనీలాండరింగ్ నియంత్రణ, ఫోరెన్సిక్ ఆడిట్లో సీఏల సేవలు కీలకంగా మారాయి. 1949 జూలై 1న పార్లమెంట్ చట్టం ద్వారా దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఏర్పడింది. ఏటా జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ 2012 జనవరి 29న 103మంది సభ్యులతో ప్రారంభమైన ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ ప్రస్తుతం 596 మంది సభ్యులు, 1,200 మందికి పైగా విద్యార్థులతో ఉత్తర తెలంగాణలో ప్రముఖ వృత్తిపరమైన సంస్థగా ఎదిగింది. గతంలో సీఏ పరీక్షల కోసం హైదరాబాద్, విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్‌లోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు కావడంతో వేలాది మందికి ప్రయోజనం చేకూరుతోంది. విద్యా ర్థులకు ప్రత్యేక లైబ్రరీ, మాక్ టెస్టులు, స్టడీ సర్కిళ్లు, సెమినార్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025లో బ్రాంచ్‌కు 4,000 చదరపు గజాల స్థలంలో శాశ్వత భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణకు వేదికగగా మారనుంది. -
సీఏ సేవలు తప్పనిసరి
దేశంలో ఆర్థిక పారదర్శకత, పన్నుల క్రమశిక్షణ, చట్టబద్ధమైన వ్యాపార వ్యవస్థ బలో పేతానికి చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలు కీలకం. వ్యాపార సంస్థ ప్రారంభం నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయపు పన్ను, టీడీఎస్, ట్రస్టులు, సొసైటీలు, కంపెనీల చట్టబద్ధమైన కంప్లయెన్స్, వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాంకు రుణాలు, కార్పొరేట్ గవర్నెన్స్, విలీనాలు, కొనుగోళ్లు, ఇన్సాల్వెన్సీ ప్రక్రియకు చార్టర్డ్ అకౌంటెంట్లు సమగ్ర సేవలు అందిస్తున్నారు. – వనపట్ల శేఖర్ రెడ్డి, సీఏ వికసిత్ భారత్–2047 లక్ష్య సాధన దిశగా తీసుకెళ్లడంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం. స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్ వంటి కార్యక్రమాల అ మలులో సీఏలు భాగస్వాములు గా నిలుస్తున్నారు. – జి.ఆనంద్ కుమార్, సీఏ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, టీ హబ్, టాస్క్ కార్యక్రమాల అమలులో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, విద్యాసంస్థలు, సేవా సంస్థలు, సహకార సంఘాలు చట్టబద్ధంగా ముందుకు సాగేందుకు సీఏల మార్గదర్శకత్వం అవసరం. – ఎం.సంతోష్‌రెడ్డి, సీఏ -
రవిచంద్ర, శ్యాంప్రసాద్‌కు ‘ఆటా’ ఆహ్వానం
కరీంనగర్‌కల్చరల్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరఫున జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించే 19వ ద్వైవార్షిక ఆటా మహాసభలు, యువజన సదస్సుకు కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, సివిల్ సప్లైస్ డైరెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్‌ను ముఖ్య అతిథిలుగా ఆహ్వానించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో యువత, వివిధ రంగాల నిపుణులు, సామాజిక నాయకులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యువ నాయకత్వ శిక్షణ, విద్యా, వ్యాపార సదస్సులు, ఉద్యోగ మేళాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుభవాలను పంచుకుంటారు. రవిచంద్ర, శ్యాంప్రసాద్‌లాల్‌కు మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, డాక్టర్ నలిమెల భాస్కర్ అభినందనలు తెలిపారు. -
వైద్యంలో వారియర్స్
కరీంనగర్: తల్లి జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. వైద్య వృత్తిలో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటూనే, కొంత మంది డాక్టర్లు సామాజికసేవలో తరిస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటున్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కథనం..మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్టును 2017 ప్రారంభించా. ఏటా 10 మందికి రూ.30 లక్షలు వెచ్చించి ఉచిత కీలు మార్పి డి ఆపరేషన్లు చేస్తున్నా. నా భార్య డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఏటా 10మంది సంతానం లేని దంపతులకు రూ.20 లక్షలు ఖర్చుచేసి ఉచిత ఐవీఎఫ్ వైద్య సేవలు అందిస్తున్నారు. – డాక్టర్ బంగారి స్వామి, ఆర్థోపెడిక్ సర్జన్ఆడపిల్ల భారమని భావించే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలుగుతాయని మా ఆస్పత్రిలో దేవీ పుత్రిక పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సాధారణ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నాం. – ఎనమల్ల శ్రీదేవి, గైనకాలజిస్టుబీఎన్.రావు చారిటబుల్ ట్రస్టు పేరుమీద 2017 నుంచి సేవ కార్యక్రమాలు చేపడుతున్నా. ఉమ్మడి జిల్లాలో అనీమియా సమస్యతో బాధపడే 10వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం అందజేశాను. కరోనా సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు లక్ష మాస్కులు, 20వేల శానిటైజర్స్ పంపిణీచేశాను. 100 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాం. మహిళకు కుట్టు మిషన్‌లో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధికల్పిస్తున్నాం. – డాక్టర్ బీఎన్ రావు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు -
గేటు సమస్య పరిష్కరించరా?
గంగాధర: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై గంగాఽ దర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు కష్టాలు తప్పడం లేదు. తరచూ గేటు వద్ద వాహనాలు నిలిచిపోవడం, గేటుమధ్యలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామవుతోంది. సోమవారం ఓ భారీ వాహనం గేటు కింద ఇరుక్కు పోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దాదాపు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామైంది. ఇక్కడ వాహనాలు ఇరుక్కు పోవడం, గేటు మొరాయించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఒక్కోసారి రోగులను తరలించే అంబులెన్స్‌లు సైతం పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
గందరగోళం సర్
కరీంనగర్ అర్బన్: పల్లె నుంచి నగరం వరకు ఎక్కడైనా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చర్చే. 2002.. ఓటర్ల గుండెల్లో గుబులు రేపుతుంటే ఓటర్లు దొరక్క బీఎల్వోలు అయోమయానికి గురవుతున్నారు. పక్కాగా ఓటరు జాబితా రూపొందించేందుకే సర్‌ను చేపడుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుండగా, సందేహాలను తీర్చాల్సిన ఉన్నతాధికారులు మీడియాకు సమయం ఇవ్వడం లేదు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడం ఓటర్లకు ఇబ్బందికరంగా మారింది. క్యూఆర్ కోడ్‌తో ముద్రితమైన ఈ పత్రంలో చిన్నతప్పు చేసినా ఓటు విషయంలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. అందుకనే వాటిని నింపడానికి ఓటర్లు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. చదువుకున్న వారూ అందులోని వివరాలను రాయడానికి తటపటాయించాల్సి వస్తోంది. ఫారాలు నింపడంలో ఓటర్ల అవస్థలు జిల్లాలో 1,334మంది బీఎల్వోలు వారి వద్ద ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 800– 900 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లు, తాజా జాబితాలో ఉన్న ఓటర్లకు ఒకే రకమైన ఫారాన్ని ఇస్తున్నారు. అందులో వేర్వేరుగా నింపాల్సి ఉంటుంది. ఎక్కువమంది ఈ విషయంలో అవగాహన లేక పత్రాలు నింపడం లేదు. చాలామందికి ఎపిక్ నంబర్‌ను ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. బీఎల్వోలకు ఇప్పటికే అందుకు సంబంధించి సమగ్ర శిక్షణనిచ్చారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఓటర్లు అడిగే పలు సందేహాలు నివృత్తి చేసేందుకు వారు ఉన్నతాధికారులపై ఆధారపడుతున్నారు. నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, బంధుత్వం తదితర వివరాలు ఎలా పొందుపర్చాలనేది కొన్నిచోట్ల బీఎల్వోలకు తెలియడం లేదు. ఓటర్లు దొరకట్లే చాలా చోట్ల ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన ఉండటం లేదు. కొన్నిచోట్ల పార్టీ నాయకులు హుషారుగా ఓటర్లు, ఇంటి యజమానుల వివరాలు, ఫోన్ నంబర్లను బీఎల్వోలకు అందిస్తున్నారు. బీఎల్వోలకు 1,200 వరకు ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించడంతో ఇబ్బందులు పడుతున్నారు. సహకరించాల్సిన బీఎల్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. బీఎల్వోలు ఓటర్ల జాబితా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతుండగా వృద్ధులు మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నారు. మిగతా వారు ఎక్కడున్నారని అడిగితే వలస వెళ్లారని సమాధానమిస్తున్నారు. గత్యంతరం లేక బీఎల్వో ఉన్నవారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వెనుదిరుగుతున్నారు. ఒక్కో బీఎల్వో నిత్యం 200 మంది ఓటర్ల వివరాలు ఈఎస్ఐ యాప్‌లో సరి చూడాలి. వీరు మొదట ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలి. 2002, 2025లో ప్రచురించిన ఓటర్ల జాబితాలోని పేర్లను సరి చూడాలి. ఆ సమయంలో ఎక్కడ ఓటు వేశారు? ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? ఎవరైనా మృతి చెందారా? పెళ్లి చేసుకొని వెళ్లిపోయారా? వంటి విషయాలను గమనించాలి. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు పొందుపరిచి, ఒక పీపీసైజ్ ఫొటోను అతికించి బీఎల్వోలకు అందించాలి. కానీ, చాలాచోట్ల ఇళ్లలో ఇంటి యజమానులు కనిపించడం లేదు. చాలా ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. -
ఆక్రమణలపై అర్జీల వెల్లువ
‘నా సొంత స్థలంలో సంబంధం లేని వ్యక్తులు నిర్మాణం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఓ వృద్ధుడు ప్రజావాణిలో కన్నీటి పర్యంతమయ్యాడు. క్యూలైన్ నుంచి కలెక్టర్ వద్దకు చేరుకునే వరకూ నేను వృద్ధుడిని, నన్నెవరూ పట్టించుకోవడం లేదంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన గాజర్ల వెంకట్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 6,7లో భూమి ఉంది. అక్కడే ఇంటిని నిర్మించుకుని 40ఏళ్లుగా జీవనం చేస్తున్నాడు. తన భూమిపై ఎలాంటి హక్కు లేని వ్యక్తులు దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శిని కలిస్తే తానేం చేయలేనని, అధికారులకు చెప్పుకో అంటున్నాడని వాపోయాడు.కరీంనగర్ అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఎక్కువ శాతం, భూ సమస్యలు, ఆక్రమణలుపైనే బాధితులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.మాది పేద కుటుంబం. నా తల్లిదండ్రులు నన్ను ఉన్నత చదువులు చదివించాలని అల్గునూరులోని ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్ చేశారు. గతేడాది ఇంటర్లో చేరగా నేను కాలేజీకి వెళ్లింది 20రోజులే. తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో భయమేస్తోంది. నేను కాలేజీకి రాను టీసీ కావాలని అడిగితే పూర్తి ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారు. కలెక్టర్ మేడమ్ నాకు న్యాయం చేయాలి. – కృపాసాగర్, విద్యార్థి, రామన్నపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 206, 207లో 16 ఎకరాల భూమి ఉంది. గత 50ఏళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఉత్తరం వైపు ఒద్యారం నుంచి ఖాజీపూర్ వచ్చే తోవ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. గ్రానైట్ కంపెనీవాళ్లు తోవను దౌర్జన్యంగా తొలగించి ఆక్రమించుకున్నారు. ఇంత దౌర్జన్యమా..? అధికార యంత్రాంగం ఎందుకున్నట్లు? – విద్యాసాగర్, వేణుగోపాల్, ఒద్యారం, గంగాధర గ్రామంలో 312 సర్వే నంబర్లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అందులో ఉన్న వేప, తుమ్మ చెట్లను తొలగించి భూమిని చదును చేశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చర్యలుండవా.? తిరిగి స్వాధీనం చేసుకోరా..? – ఖాజీపూర్ గ్రామస్తులు, కొత్తపల్లి మండలం -
మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026
‘సర్’ ఫారం నింపారా?సైదాపూర్/చిగురుమామిడి: ఓటర్ సవరణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలం ఎలబోతారంలో ఓటర్ సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫారాలు నింపుతున్నారా ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ సవరణ కొత్త కాదని, 2002లోనూ అప్పటి ప్రభుత్వం చేయించిందన్నారు. ఓటర్లు తమ ఓటు తప్పిపోకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గొడిశాలలో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ఒగులాపూర్‌లో రూ.10లక్షలతో నిర్మించిన వీవో సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. చిగురుమామిడిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించే వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. పెద్దమ్మతల్లి విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బొమ్మనపల్లిలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. సైదాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవన ప్రమాణాలు పెంచే దిశగా అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తె లిపారు. 46వ డివిజన్ పరిధిలోని రాంనగర్ రోడ్డు నంబర్ 6లో రూ.10 లక్షలతో చేపట్టను న్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, 35వ డివి జన్ కాపువాడలో రూ.51 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఎస్‌డబ్ల్యూజీ పైప్‌లైన్ డ్రైనేజీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, సాదవేని సుజాత, తోట అనిల్ పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: ప్రజావాణిలో దరఖా స్తులు పెండింగ్‌లో ఉంచొద్దని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళా భారతిలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులు రాగా, అందులో ఇంజినీరింగ్ రెండు, టౌన్ ప్లానింగ్ ఆరు, రెవెన్యూ రెండు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకటి ఉన్నాయి. కొత్తపల్లి చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించుకొన్న ఇండ్లకు నగరపాలకసంస్థ ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహార్, పట్టణ ప్రణాళిక డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీ శ్రీధర్, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ జయంతి సందర్భంగా కేంద్ర గణాంక శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పి.సి.మహలనోబిస్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కేంద్ర గణాంకశాఖ కరీంనగర్ ఉప ప్రాంత కార్యాలయ సీని యర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గోవర్ధన్ శ్రీనివాసరావు, కొమ్మినేని సుధాకర్ పాల్గొన్నారు. కరీంనగర్‌సిటీ: నగరంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటనామస్ కళా శాల డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలను సోమవా రం ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్ విడుదల చేశారు. 6వ సెమిస్టర్లో 78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. టీజీఎప్‌సెట్ ధ్రువపత్రాల పరిశీలన పూర్తిసప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన టీజీఎప్‌సెట్– 2026 తొలి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. చివరి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 261 మందికి కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. మొత్తంగా 3,807మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలి పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. -
పోలియో చుక్కలు వేశారా?
చిగురుమామిడి: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. సోమవారం చిగురుమామిడిలో ఐదేళ్లలోపు వయసు గల పిల్లల్లున్న ఇండ్లను సందర్శించారు. ఆదివారం నాటి పల్స్‌పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయించారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ఆశ, ఏఎన్ఎంలను ఆదేశించారు. గ్రామంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్వోలకు ఓటర్లు సహకరిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. చిగురుమామిడి సర్పంచ్ ఆకవరం భవానీప్రసాద్, ఏఎన్ఎం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు బాలుడు మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన పోతు ప్రణీత్ (11) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల మేరకు.. మానేరు డ్యాంలో మేకలు కాసేందుకు తాతతో వెళ్లిన బాలుడిపై శనివారం సాయంత్రం ఉరుములతో కూడిన పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్ చౌరస్తావద్ద ఆదివారం బైక్‌ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో వరాల కొమురయ్య (54) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరెడ్డిపేటలో వ్యవసాయ పనుల కోసం బైక్‌పై బయల్దేరిన కొమురయ్యను వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన కొండవేన పోశాలు(56) ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో మోటారు చెడిపోయింది. మరమ్మతు కోసం పోశాలు బావిలోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడా..లేదా విద్యుత్ షాక్‌తో మృతిచెందాడా.. అనే విషయమై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మీర్జంపేట ఎల్లమ్మ గుడిలో చోరీకాల్వశ్రీరాంపూర్: మండలంలోని మీర్జంపేటలో రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిలో దొంగలు సుమారు రూ.50 వేలు విలువ చేసే పుస్తెల తాడు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఆదివారం గీతకార్మికులు అమ్మవారి మెడలో గొలుసు చోరీకి గురైనట్లు కనుగొని సర్పంచుకు సమాచారం అందించారు. సర్పంచు శైలజ సదానందం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సందిల్ల శివాలయం, కాల్వశ్రీరాంపూర్ రామాలయంలో దేవుడి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనలు జరిగాయి. షార్ట్ సర్క్యూట్‌తో మెస్ దగ్ధంపెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి క్రాస్‌రోడ్ సమీపంలో గల శ్రీలక్ష్మి మెస్ లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆదివారం మెస్‌ను మూసి ఉంచగా.. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు భావిస్తున్నారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. దాతలు.. దయచూపరూ..జగిత్యాలరూరల్: పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అతడికి వైద్యం చేయించేందుకు ఆ కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోట హరీశ్ జగిత్యాల పరిధిలో విద్యుత్ బిల్లులు కొట్టే స్పాట్ బిల్లర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 18న హన్మాజీపేట శివారులో అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోగా, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం అతను కోమాలో ఉండటంతో రోజుకు రూ.30 వేల వైద్య ఖర్చలవుతున్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో ఎవరైనా మానవతా దృక్పథంతో ఆర్థికసాయం చేస్తే అతని ప్రాణాలు కాపాడవచ్చు. దాతలు ఆదుకోవాలని, వివరాలకు 91009 12072 నంబర్లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్
జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలోని వ్యవసాయ, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బైపీసీ చదివి తెలంగాణ ఎప్‌సెట్–2026(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. సీట్ల వివరాలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం, వరంగల్ అర్బన్ జిల్లా, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, సూర్యపేట జిల్లా హుజుర్నగర్, వికారాబాద్ జిల్లా కొడంగల్, నిజామాబాద్‌లో పది అగ్రికల్చర్ కళాశాలలు ఉండగా, 855 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 500 సెల్ఫ్ ఫైనాన్స్ (పేమెంట్) సీట్లు ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బీఎస్సీ(హార్టికల్చర్) కళాశాలో 30, నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో 25 సీట్లు, వీటికి అదనంగా 4 ఫేమెంట్ సీట్లు ఉన్నాయి. అన్ని కోర్సుల్లో ఫేమెంట్ సీట్లను సైతం తెలంగాణ ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. జూలై 25 చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. సీటు వచ్చిన సమయంలో.. వ్యవసాయ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ కోర్సులకు రూ 50,740, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులో పేమెంట్ సీట్లకు రూ.1,12,790 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సీట్లకు సంబంధించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫీజు చెల్లింపునకు జూలై 24, ఆన్లైన్ దరఖాస్తు పంపేందుకు జూలై 25 చివరి తేదీ. అర్హతలు ఆయా కోర్సులకు జనరల్ అభ్యర్థుల వయస్సు 17 ఏళ్లు పూర్తయి 22 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 25, పీహెచ్‌లకు 27 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది. వ్యవసాయ కోర్సుల్లో 25 శాతం సీట్లు రైతుల పిల్లలకు, రైతు కూలీల పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే, ఆ భూమి విద్యార్థి పేరు మీద లేదా తల్లితండ్రుల పేరిట పట్టా ఉండాలి. ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ల పాటు నాన్ మున్సిపల్ ఏరియా (గ్రామీణ ప్రాంతం)లో చదివి ఉండాలి. పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. తెలంగాణ ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు -
చకచకా అభివృద్ధి పనులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్ రైల్వేస్టేషన్లో అమృత్‌భారత్ పథకం కింద చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. వివిధమండలాలు, గ్రామాలతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన ప్రజలు దూర, సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేలా సకల సౌకర్యాలతో రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. తొలుత అభివృద్ధి పనులు నెమ్మదించినా, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రయాణికులు, రైల్వే ఫోరం సంఘాల నాయకులు, డీఆర్‌యూసీసీ సభ్యులు పనులను వేగంగా చేసేలా చూడాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పనులు ఊపందుకున్నాయి. సోలార్ సిస్టం ఏర్పాటు రైల్వేస్టేషన్ ఎదుట వాహనాల పార్కింగ్ కోసం సోలార్‌ప్లేట్లతో కూడిన షెడ్ ఏర్పాటు చేశారు. వాటికి సమీపంలోని రైల్వే క్వార్టర్లపై కూడా సోలార్ ప్లేట్లు అమర్చారు. సూర్యవిద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేసిన షెడ్ల కింద వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. మారుతున్న రూపురేఖలు అభివృద్ధి పనులతో రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ప్రధాన ముఖద్వారం పనులు పురోగతిలో ఉన్నాయి. లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు ప్లాట్‌ఫామ్స్, బోగీలు నిలిచే సంఖ్యను సూచించే బోర్డులు, ఇతర సేవలను సులువుగా గుర్తించేలా కొత్త సైన్‌బోర్డులు సైతం అమర్చారు. రైల్వేస్టేషన్ ముందు చేపట్టిన గూడ్స్‌షెడ్ పనులు కూడా పూర్తయ్యాయి. వానలు కురిసినా, ఎండలు దంచి కొట్టినా ఇబ్బందులు లేకుండా బియ్యం, ఎరువులు లాంటి తదితర నిల్వలను లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు వీలుగా చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఆకర్షణీయంగా ‘పెద్ద’పల్లి జంక్షన్ ఖాజీపేట–బల్హార్ష సెక్షన్లో రైలు ప్రయాణం చేసేవారికి నిర్మాణాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది పెద్దపల్లి రైల్వేస్టేషన్ అని గుర్తించేలా కనిపిస్తున్నాయి. వీటికితోడు సమీపంలోనే చేపట్టిన రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావొస్తుండడంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చురుకుగా జరుగుతున్నాయని, కొద్దిమాసాల్లోనే అందుబాటులోకి వస్తాయని డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ తెలిపారు. వేగంగా రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు ప్లాట్‌ఫామ్స్‌పై సైన్‌బోర్డుల ఏర్పాటు -
కలహాల కాపురం.. వీడుతున్న దాంపత్యం
‘జగిత్యాల అర్బన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. వారికి ఓ బాబు జన్మించాడు. గొడవల కారణంగా మూడేళ్లుగా భార్య పుట్టింటి వద్దే ఉంటోంది’. ‘బుగ్గారం మండలకేంద్రానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రెండునెలల నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పాప జన్మించినప్పటికీ సదరు మహిళ పుట్టింటి వద్దే పాపతో ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేసింది’.‘కోరుట్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు బాబు జన్మించాడు. అత్తామామలతోపాటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా.. భర్త బాబును తన వద్దే ఉంచుకుని భార్యను పుట్టింటికి పంపాడు. దీంతో, ఆ మహిళ బాబు తనకు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది’.జగిత్యాలక్రైం: చివరి వరకు కలిసి ఉంటామని అ గ్నిసాక్షిగా ప్రమాణం చేసి వివాహం చేసుకున్న దంపతులు.. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్నా రు. మరికొందరు భార్య ఓ చోట, భర్త మరో చోట, పిల్లలు ఇంకో చోట ఉంటూ ఏళ్ల తరబడి కుటుంబ కలహాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దంపతుల మఽ ద్య చిన్న గొడవలు, కుటుంబ విషయాల్లో విభేదాలతో పచ్చని కుటుంబాల్లో చిచ్చు మొదలవుతోంది. దీంతో ఏ ఒక్కరూ తగ్గకపోగా, నువ్వెంత అంటే నే నంత అంటూ భార్యాభర్తలు విడిపోతుండడం, చివరకు పంచాయితీలు, పోలీస్స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతూ ఏళ్ల పాటు కాలం వృథా చేస్తున్నారు. పిల్లలకూ ఇబ్బందులే.. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలతో వారి పిల్లలు కూడా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది పిల్లలు తల్లి వద్ద, మరికొంత మంది తండ్రి వద్ద ఉంటున్నారు. ఇద్దరూ మెట్టు దిగిరాకపోవడంతో వారి పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తల్లి వైపు ఉండాలో, తండ్రి వైపు ఉండాలో తెలియని వయస్సులో క్షోభ అనుభవిస్తున్నారు. ఏళ్లుగా దూరందూరం ఒక్కో జంటది ఒక్కో కారణం. కట్నం తేవట్లేదని ఒకరు, అత్తింటి వారు వేధిస్తున్నారని మరొకరు, భూమి తన పేరున రిజిస్ట్రేషన్ చేయలేదని, పుట్టిన పిల్లలు అందంగా లేరని, భార్య చెప్పినట్లు భర్త వినడం లేదని, భార్య వినట్లేదని, పట్టణాల్లో ఉందామని, స్వగ్రామాల్లోనే ఉండాలని ఇలా.. చిన్నచిన్న కారణాలతో నూటికి 30 కుటుంబాలు దాంపత్య జీవితానికి దూరమవుతున్నాయి. తల్లిదండ్రులను ఎలా కలపాలో తెలియక వారి పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లి దాంపత్య జీవితాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక చాలా మంది దూరంగా ఉంటున్నారు. కొంత మంది భార్య ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంత మంది భార్యలు తమకు జీవితంలో భర్తే వద్దంటూ మొండికేస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలతో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో పాటు, ఆర్థికంగా కుంగిపోతూ బిక్కుబిక్కుమంటున్నాయి. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్న కుటుంబాలు తెలిసి తెలియని వయస్సుల్లో చిన్నారుల క్షోభ -
వర్రీ గుడ్డు !
బోయినపల్లి(చొప్పదండి): పెరిగిన ఉష్ణోగ్రతలతో లేయర్ కోళ్లు అనేకం చనిపోయాయి. ఫలితంగా కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధంతో దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం ఒక ట్రే(30 గుడ్లు) ధర రూ.180 ఉండగా.. ఇప్పుడు రూ.200కి చేరింది. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డు ధర రూ.6.60 పలకడంతో రిటేల్‌గా కిరాణా దుకాణాల్లో రూ.7 నుంచి రూ.8లకు విక్రయిస్తున్నారు. ఎండలకు తగ్గిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచికొట్టడంతో చాలా కోళ్ల ఫారాల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. ఎండ వేడిమికి గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. గతంలో 95 శాతం గుడ్ల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సుమారు కోటి సామర్థ్యం గల లేయర్స్ కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ మార్గంలో సుమారు 30 నుంచి 40 లక్షల కెపాసిటీ గల లేయర్స్ ఫారాలు ఉన్నాయి. రోజుకు 70 లక్షల గుడ్ల ఎగుమతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగ్‌పూర్, కోల్‌కత తదితర రాష్ట్రాలకు రోజూ సుమారు 70 లక్షల గుడ్ల వరకు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సైతం భారీగా కోడిగుడ్ల వాడకం ఉంది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పెరిగిన కోడిగుడ్డు ధరలు ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8 ఎండకు చనిపోయిన కోళ్లు.. తగ్గిన గుడ్ల ఉత్పత్తి యుద్ధంతో పెరిగిన దాణా ధరలు -
మట్టిని సుగంధ భరితం చేసిన సాహితీవేత్త ‘నలిమెల’
కరీంనగర్‌కల్చరల్: పరిశోధనలు, అనువాదాల ద్వారా వేర్వేరు భాషలను ఒకే ఊపిరిలోకి ముడివేసి మట్టిని సుగంధ భరితం చేసిన బహుభాషా వేత్త, సాహితీవేత్త నలిమెల భాస్కర్ అని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి అన్నారు. ఆదివారం కరీంనగర్ ఫిలింభవన్‌లో జరిగిన భాస్కర్ పరిశోధన గ్రంథాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. భాస్కర్ ఎంఫిల్ పరిశోధనా గ్రంథం ‘తెలుగులో సామెతలు, ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన’, పీహెడీ పరిశోధన గ్రంథం ‘తెలుగు, మలయాళ సామెతలు, కుటుంబ జీవన చిత్రణ’ ఆవిష్కరించారు. అనంతరం నలిమెల తన తల్లిదండ్రులు నలిమెల బుచ్చమ్మ–రామచంద్రం స్మారక తొలి పురస్కారాన్ని కవి అన్నవరం దేవేందర్‌కు అందించారు. తెలంగాణ భాషను శ్వాసించిన కవి అన్నవరంను పురస్కారానికి ఎంపిక చేయడం సముచితమన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.రఘు, బీసీ రచయితల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, తెరవే జిల్లా కార్యదర్శి దామరకుంట శంకరయ్య, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కూకట్ల తిరుపతి, పొన్నం రవిచంద్ర, పీఎస్ రవీంద్ర, డాక్టర్ రఘురామన్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని మడిపల్లి, అంకూషాపూర్ గ్రమాల మధ్య శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండలంలో కలకలం రేపింది. టౌన్ సీఐ రామకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాలు.. మడిపల్లి గ్రామానికి చెందిన పైతరి మొగిలి (52) కొన్నేళ్లుగా అంకూషాపూర్ గ్రామంలో కూలీగా, వ్యవసాయ పాలేరుగా పని చేస్తూ ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి మడిపల్లి గ్రామంలో జరిగిన పీరీల పండుగకు సైకిల్‌పై వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా రెండు గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో మొగిలిపై దాడి చేయగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలాన్ని ఏసీపీ మాధవి పరిశీలించారు. తన భర్త హత్యపై మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేశ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తెలిపారు. పాత కక్షలే కారణమా..? గతంలో అంకూషాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళపై పైతరి మొగిలి లైంగికదాడికి యత్నించాడనే ఫిర్యాదుతో కేసు నమోదు కాగా జైలుకు వెళ్లి ఇటీవల వచ్చాడు. ఆ కేసుకు సంబంధించిన పాత కక్షలతో మొగిలి దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన వాహనం బోల్తా..?వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. వాహనం వద్ద ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు ఆరా తీయగా, శనివారం జగిత్యాలలో చోరీకి గురైన పెద్దూరు రామస్వామికి చెందిన వాహనంగా గుర్తించారు. బ్రిడ్జి వద్ద సైడ్ వాల్ నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పలు వాహనాలు కూడా ఇలాంటి ప్రమాదాలకు గురయ్యాయి. -
ఏరువాక.. సాగుదామిక
● సేద్యానికి సిద్ధమవుతున్న రైతన్న ● సన్నాల సాగుకు పెరిగిన డిమాండ్ ● ఏడు రకాల సన్నాలకే బోనస్ ● నేడు ఏరువాక పున్నమి విద్యానగర్(కరీంనగర్): ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ట మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. ఏరువాకతోనే వ్యవసాయ పనులు మొదలవుతాయి. నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా కథనం. ఏరువాక అంటే.. అన్నదాతలు ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు జరుపుకునే పండుగ. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దుల కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి వాటికి భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేస్తారు. దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య సాగు పనులు మొదలుపెడతారు. దేశమంతటా.. ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్టమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లలో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నాఽథునికి స్నానోత్సవం నిర్వహిస్తారు. జాడ లేని చినుకు నైరుతి రుతుపవనాలు జూన్ ప్రారంభంలో కేరళను తాకడంతో వర్షాకాలం మొదలవుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో రుతుపవనాలు జూన్ మొదటి లేదా రెండో వారంలో విస్తరిస్తాయి. ఈ సీజన్లో జూన్ గడిచినా ఇప్పటి వరకు చినుకు జాడ లేక రైతన్న కళ్లలో వత్తులు వేసుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారి ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వర్షాలు కురువాలని వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం ఒక్క పదును వర్షం కూడా కురవకపోవడంతో సాగు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాతావరణ పరిస్ధితులు వెక్కిరిస్తుండడంతో వ్యవసాయశాఖ రాయితీపై ఎరువులు, విత్తనాలు మంజూరు చేసినా తెచ్చుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. సన్నాలతో లాభాలు, ప్రభుత్వ ప్రోత్సాహం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాల వరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 33 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి 7 రకాలకే బోనస్ ప్రకటించి వాటి సాగును ప్రోత్సహిస్తు రైతు వేదికపై విత్తనాల పంపిణీ సైతం ప్రారంభించింది. ఈ రకాలకు నీటి వినియోగం తక్కువతోపాటు అధిక దిగుబడి, మిల్లింగ్ చేస్తే అధిక బియ్యం రావడం ప్రత్యేకత. సాంబామసూరి, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కూనారం సన్నాలు, సిద్ది, కేఎన్ఎం– 7715 (కొత్తతరం సన్న రకం) విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. -
మంచి ప్రొటీన్
ధర నిలకడగా ఉంటే రైతుకు లాభం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోటి వరకు గుడ్ల కోళ్లు ఉన్నాయి. ఇప్పుడు పేరుకే కోడిగుడ్డు రేటు పెరిగింది. కోళ్ల పరిశ్రమ రైతులకు లా భం లేదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు వేలల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. దానా రేట్లు సైతం విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఉన్న ధరలు నిలకడగా కొన్ని నెలలు ఉంటే లేయర్ రైతులకు లాభం. – ఒంటెల వెంకటరమణారెడ్డి, లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. ఎగ్‌తో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. సామాన్యులకు కోడిగుడ్డు అందుబాటులో ఉండే ప్రొటీన్ ఆహారం. ఇందులో కేలరీస్, విటమిన్లు, ప్రోటీన్లు బాగా ఉంటాయి. కరోనా అనంతరం ప్రతీ ఒక్కరు ప్రోటీన్ ఉండే కోడిగుడ్లను తీసుకోవడంలో శ్రద్ద చూపుతున్నారు. – దీప్తి, వైద్యురాలు, వేములవాడ -
తీర్థయాత్రకు వెళ్లి అనంతలోకాలకు
సుల్తానాబాద్‌రూరల్: తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ తూర్పటి భార్గవ్‌కృష్ణ(36), కరీంనగర్‌కు చెందిన కల్యాణం శ్రీనివాస్, చల్ల వెంకటేశ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన తూర్పటి హరిబాబు బంధువులు. మూడు రోజుల క్రితం అస్సాంలోని గౌహతిలో కామాఖ్యమాత దర్శనానికి కారులో హైదారాబాద్ వరకు వెళ్లి, అక్కడి నుంచి ఫ్లైట్‌లో బయలుదేరారు. తీర్థయాత్ర ముగించుకొని ఆదివారం వేకువజామున కారులో తిరుగుపయనమయ్యారు. కమలాపూర్ మండలం ఉప్పల్‌లో హరిబాబును దించేందుకువ వెళ్లగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్గవ్‌కృష్ణ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్రగాయాలైన వెంకటేశ్, హరిబాబులు వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్గవ్కృష్ణకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సుల్తానాబాద్‌లో విషాదం పెద్దపల్లి: ఫొటోగ్రాఫర్ తూర్పాటి భార్గవకృష్ణ మృతితో సుల్తానాబాద్‌లో విషాదం నెలకొంది. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి ఎనిమిదేళ్ల కొడుకు పకోడి తీసుకువచ్చి ‘నాన్న లే తిను’ అనడంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. భార్గవకృష్ణ మృతదేహానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. కమలాపూర్ మండలం ఉప్పల్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు ఇద్దరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు -
సర్కార్ బడికి జై
విద్యానగర్(కరీంనగర్): సర్కారు బడి మెరుగు పడింది. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్రూంలు, ఉచితంగా పుస్తకాలు.. దుస్తులు, షూలతో పాటు ఉదయం అల్పాహారం.. మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు బడిలో గతం కన్నా అత్యుత్తమ బోధన అందుతుండడంతో అడ్మిషన్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలను వీడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రీ ప్రైమరీ మొదలు అన్ని తరగతుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫీజులు భారమై.. మాది పేద కుటుంబం. మా నాన్న కష్టపడి 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివించాడు. ఇప్పుడు ఫీజు ఎక్కువ అడగడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచిగా చదువు చెబుతున్నారని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ నేను చదివిన ప్రైవేట్ స్కూల్ కన్నా పాఠాలు మంచిగా చెప్పుతున్నారు. అర్థం కాలేదంటే మళ్లీ వివరిస్తున్నారు. ఫీజులు లేవు. అన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడే బాగుంది. – వరుకోలు సమన్విత్, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్ ఫలితాలు బాగున్నాయి 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. ప్రస్తుతం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. ఫీజులు ఉండవు. పైగా ఇక్కడ టీచర్లు మంచిగా చెప్పుతున్నారు. పదో తరగతి ఫలితాలు బాగా వచ్చాయని అందరూ చెప్పడంతో నన్ను మా నాన్న ఇక్కడ చేర్పించారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడే బాగుంది. – తిప్పారపు శ్రీలోహిత, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్ కరీంనగర్‌లోని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 27 అడ్మిషన్లు జరిగాయని ప్రధానోపాధ్యాయుడు ముర్మూరి రాజేందర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఆరోతరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో ఎనిమిది మంది, తొమ్మిదవ తరగతిలో ఇద్దరు, పదోతరగతిలో ముగ్గురు చేరారని వివరించారు. ఇంకా 20 మంది వరకు చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నగరంలోని కార్ఖానాగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది చేరారని ప్రధానోపాధ్యాయుడు సంగోజు సత్యనారాయణ చారి తెలిపారు. 6వ తరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో నలుగురు చేరారని, మరో 10 మంది చేరడానికి సిద్ధం అవుతున్నారని వివరించారు. నగరంలోని మంకమ్మతోట బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. ముగ్గురు బాలికలు 6వ తరగతిలో చేరారని తెలిపారు. మరో ఐదుగురు చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నగర పరిధిలోని ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 13 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం ఎస్.శ్రీనివాస్ తెలిపారు. వీరిలో 6వ తరగతిలో ఏడుగురు, 7వ తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ముగ్గురు, 9వ తరగతిలో ఒక్కరు చేరారన్నారు. ఈ నెలాఖరు వరకు మరో 10 మంది వరకు రావొచ్చని తెలిపారు. -
ఫాంహౌస్‌లకు నోటీసులు
కొత్తపల్లి(కరీంనగర్): ‘డర్టీ హౌస్..కరీంనగర్ శివారులోని ఫామ్‌హౌస్‌ల్లో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ స్పందించారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, ఫంక్షన్ వేదికలు, ఇతర సంస్థల యజ మానులు, నిర్వాహకులు సూచనలు పాటించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఫామ్‌హౌస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలను కవర్ చేస్తూ కనీసం 60 రోజుల రికార్డింగ్ బ్యాకప్‌తో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, సందర్శకుల వివరాలతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఐదు ఫొటో గుర్తింపు పత్రాలతో కూడిన అతిథి రిజిస్టర్‌ను నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాలు, చట్టవిరుద్ధమైన జూ దం, వ్యభిచారం, అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మరే ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కలిగి ఉండటం, నిల్వ చేయడం, అమ్మడం, పంపిణీ చేయడం, వినియోగించడం వంటివి నిషేధించినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీకరీంనగర్ కార్పొరేషన్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టిన అపరచాణక్యుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్, నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, షుకూర్, నాగుల సతీష్, కుంబాల రాజ్ కుమార్, మాదాసు శ్రీనివాస్, సుదర్శన్, మాలోతు మహాలక్ష్మి పాల్గొన్నారు. మోడల్ స్కూళ్లను విలీనం చేయాలికరీంనగర్టౌన్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వాగేశ్వరి కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్ఎంఎస్టీఎఫ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంలో మోడల్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న టీజీటీలకు నోషనల్ సర్వీస్ ప్రయోజనం అందించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లువేరు మహేశ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల విజయ్‌కుమార్, కార్యదర్శి లాకను బాబు, ఎంఎస్ఎఫ్ కార్యదర్శి సురేశ్ ఉన్నారు. -
సాగునీరు ఇవ్వకుంటే పాదయాత్ర
కొత్తపల్లి(కరీంనగర్): మేడిగడ్డ పంప్‌హౌజ్ నుంచి వరదకాలువ ద్వారా కరీంనగర్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు ఇవ్వకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపడతామని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అల్టిమేటం జారీ చేశారు. గోదావరి నుంచి 12వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని మళ్లిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ శివారులోని వరద కాలువ తూం వద్ద నియోజకవర్గ రైతులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆదివారం వంటావార్పు, సహపంక్తి భోజనం, మహాధర్నా చేపట్టారు. కొత్తపల్లి మండలం నాగులమల్యాల, బద్దిపల్లి, బావుపేట, ఎలగందుల, కమాన్‌పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు వరదకాలువ తూము నుంచి నీటి మళ్లింపు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, కుంటలు మత్తడి దునికిస్తే.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చి రైతులు నారు పోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారంలోగా ప్రభుత్వం స్పందించి వరద కాలువ తూము ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకపోతే వరద కాలువలో 50 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటి ఎత్తిపోస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని హెచ్చరించారు. -
‘బెస్ట్ అవైలబుల్’కు దరఖాస్తుల వెల్లువ
కరీంనగర్‌టౌన్: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో 11 ప్రైవేటు పాఠశాలల్లో 673 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తాజాగా 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ, 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 120 సీట్లు ఖాళీ ఉండగా 289 మంది దరఖాస్తులు చేసకున్నారు. నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తంగా 120 సీట్లకు ఒకటో తరగతికి నాన్ రెసిడెన్షియల్, ఐదో తరగతికి రెసిడెన్షియల్లో ప్రవేశం ఉంటుంది. ఎంపికై న పాఠశాలలు ఇవే.. జిలాల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న పాఠశాలలు తొమ్మిది ఉన్నాయి. మరో నాలుగు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. నందిని కాన్వెంట్, సెయింట్ ఆల్పోన్స్(కరీంనగర్), వివేకానంద విద్యానికేతన్(గంగాధర), టెట్రా హైడ్రన్ స్కూల్, మాంటిస్సోరీ(హుజూరాబాద్), న్యూమిలినియన్, విద్యోదయ, మాస్టర్ ఎస్వీ, శ్రీకాకతీయ(జమ్మికుంట). కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు లయోలా స్కూల్, విజ్ఞాన్ స్కూల్(కరీంనగర్), కాకతీయ స్కూల్(గంగాధర), కేరళ స్కూల్(హుజూరాబాద్). పేద విద్యార్థులకు వరం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఎంపికై న వారికి పదో తరగతి వరకు ఉచితంగా మెరుగైన విద్య అందిస్తాం. ఉచిత వసతులు కల్పిస్తాం. దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. – వై.తిరుపతిరావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి -
సన్నాలపై సందిగ్ధం!
హుజూరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో వరిసాగుపై ప్రభుత్వ నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలు తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. హుజూరాబాద్ డివిజన్లోని ఇల్లందకుంట మండలంలో 12,000 ఎకరాలు, హుజూరాబాద్ మండలంలో 22,800 ఎకరాలు, జమ్మికుంట మండలంలో 14,500 ఎకరాలు, సైదాపూర్ మండలంలో 19చ500 ఎకరాలు, వీణవంక మండలంలో 23,000 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఇందులో 60 నుంచి 70శాతం సన్నవడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రచారం ఒకటి.. అనుమానాలు వంద సన్న రకాల సాగును పెంచేందుకు వ్యవసాయశాఖ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం కేవలం 8 సన్నరకాలు మాత్రమే సాగుకు సిఫార్సు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేట్ కంపెనీల రకాలను సాగుచేస్తే క్వింటాల్‌కు రూ.500 బోనస్ వర్తిస్తుందా? లేదా? అన్న అంశంపై రైతుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో, తాము ఏ రకాలను ఎంచుకోవాలో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది 33 రకాలకు బోనస్ ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్లో 33 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించింది. ఆ రకాలకే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించింది. వ్యవసాయశాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం1638 (కూనారం వరి2), జేజీఎల్–1798 (జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ సోనా, వరంగల్–44 (సిద్ధి), డబ్ల్యూజీఎల్–962 ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ రకాల పంటకాలం ఎక్కువగా ఉండటంతో పాటు చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు ఎంటీయూ– 1262, ఎంటీయూ– 1061, ఎంటీయూ– 1124కు మొగ్గు చూపుతున్నారు. అయితే సాగుకు సమయం దగ్గర పడుతున్న తరణంలో తమకు నచ్చిన రకాలపై దృష్టి పెడుతున్నారు. -
పునరాలోచన చేయాలి
భూమికి, రైతుకు అనుకూలమైన విత్తనాలతో పంటలు సాగుచేస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయి. ప్రభుత్వం సూచించిన విత్తన రకాలు ఈ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండవు. ప్రభుత్వం నిర్దేశించిన విత్తనాలతో వరిసాగు చేస్తే నష్టాలు తప్పవు. సర్కారు మరోసారి పునరాలోచన చేయాలి. అనపురం కమలమ్మ, మహిళా రైతు, దమ్మనపేటనాకున్న ఐదు ఎకరాల్లో సన్నవడ్లు సాగుచేస్తున్న. సన్నరకాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాలి. భూమిని బట్టి సాగయ్యే, నీటి లభ్యతను బట్టి సాగు చేసే సన్నరకాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించే సన్నరకాలను సాగు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. – ఐలు శ్రీనివాస్, పోతిరెడ్డిపేట -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం 53వ డివిజన్ పరిధిలోని మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్ తదితర ప్రాంతాల్లో నాలా, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షాకాలం వరదతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు రూ.25 కోట్లతో ముంపు సమస్యలను తీర్చనున్నామని తెలిపారు. ఇందుకోసం డీపీఆర్,టెండర్ ప్రక్రియలు పూర్తి చేసి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ లోగా మురుగునీరు, వరద సాఫీగా నాలాలు, డ్రైనేజీల ద్వారా వెళ్లేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్, చెత్త వేయవద్దని, పూడికతీత పనుల సమయంలో మట్టికన్నా ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరపాలకసంస్థ 31వ డివిజన్ దుర్గమ్మగడ్డ,ఖాన్పూర రోడ్ నెం.11 వద్ద రూ.15 లక్షల నగరపాకలసంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 31వ డివిజన్ కార్పొరేటర్ ముఖద్దర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
ఖాకీల్లో కుమ్ములాట
కరీంనగర్ క్రైౖం: ఇద్దరు యువకులతో పోలీసులకు జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)కు చెందిన ఐదుగురు పోలీసు అధికారుల భవిష్యత్ ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. రోడ్డుపై జరిగిన చిన్నపాటి గొడవతో ప్రారంభమైన వ్యవహారం, వైరల్ వీడియో, పరస్పర ఆరోపణలు, బ్లాక్మెయిల్ కుట్ర కేసులు, శాఖాపరమైన విచారణల వరకు వెళ్లడం పోలీసుశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే.. ఈ నెల 19న నగరంలోని మంకమ్మతోటలో రోడ్డు పై బైక్ అడ్డుగా పెట్టడంతో పీటీసీకి చెందిన ఆర్ఐ, ఇద్దరు ఆర్ఎస్సైలతో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులను గుర్తించని యువకుల్లో ఒకరు కర్రతో దాడి చేయడంతో ఆర్ఐ, ఆర్‌ఎస్సైలకు గాయాలయ్యాయి. యువకుడిని వెంటాడి నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి చితకబాదిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ముగ్గురిపై నివేదిక.. మరో ఇద్దరిపై క్రిమినల్ కేసు ఈ ఘటనపై ఆర్ఐతో పాటు ఇద్దరు ఆర్ఎస్సైలపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అయితే వైరల్ అయిన సీసీ కెమెరా వీడియోను ఆధారంగా చేసుకుని పీటీసీలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్ఎస్సైలు సహచర అధికారులను ఇరికించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. వీడియోను చూపిస్తూ ఒక్కో అధికారిని రూ.5 లక్షలు ఇవ్వాలని యువకుల ద్వారా బెదిరించినట్లు ఆర్ఐ ఫిర్యాదుతో ఈనెల 25న ఇద్దరు ఆర్ఎస్సైలపై టూ టౌన్లో నేరపూరిత కుట్ర, ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఐదుగురిపై చర్యలు? ఒకే ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ, మరో ఇద్దరు క్రిమినల్ కేసును ఎదుర్కొంటుండటంతో డిపార్టుమెంట్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా సదరు అధికారులపై సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలు లేదా ఇతర పరిపాలనా నిర్ణయాలు తీసుకునే ఉందని సమాచారం. సహచర అధికారుల మధ్య వ్యక్తిగత విభేదాలు, పరస్పర కక్షలు ఇంత తీవ్రస్థాయికి చేరుకోవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే ఘటనలో ఐదుగురు అధికారులు విచారణను ఎదుర్కొనడం హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకపాలాలకు దిగడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉండగా.. అంతర్గత కుమ్ములాటలు ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా తయారయ్యాయని పలువురు పోలీసులు చర్చించుకుంటున్నారు. -
నేడు పల్స్‌పోలియో
కరీంనగర్: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం 0–5 ఏళ్ల వయస్సులోపు చిన్నారులకు ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 91,178 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు గాను 1,00,300 పోలియో డోస్‌లు సిద్ధంగా ఉంచారు. 18 పీహెచ్‌సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, గ్రామ పంచాచతీ కార్యాలయాలు, వార్డు ఆఫీసులు, డివిజన్ కార్యాలయాలు, ప్రముఖ కూడళ్లలో సెంటర్లు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు. ఈనెల 29,30వ తేదీల్లో జిల్లా కేంద్రంతో పాటు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటా సర్వే నిర్వహించి చుక్కల మందు వేసుకోని చిన్నారులకు అక్కడే పోలియో చుక్కలు వేయనున్నారు. వలస కూలీల పిల్లలకు వారి నివాసాల వద్దకే బృందాలను పంపించి పోలియో చుక్కలు వేయనున్నారు. పనితీరుతో ప్రతిష్ట పెంచాలితిమ్మాపూర్: పోలీసులు తమ పనితీరుతో శాఖ ప్రతిష్టను పెంచాలని, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ ఆవరణలోని పరిసరాలను పరిశీలించి మొక్క నాటారు. అనంతరం తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి పోలీస్ స్టేషన్ల పనితీరుపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. సర్కిల్ పరిధిలోని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని సీపీ పేర్కొన్నారు. సీఐ బొల్లం రమేశ్ అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. డీజీపీ ఆదేశాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థను అందించాలని సీపీ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, ఎస్సై అన్వర్, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు నరేందర్‌రెడ్డి, పృథ్వీగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ఉన్నత విద్య పర్యటనకు శాతవాహన వీసీకరీంనగర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూలై 6 వరకు జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ యు.ఉమేశ్‌కుమార్ ఎంపికయ్యారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సరసిజ కూడా ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన సిఫార్సులు అందించనున్నారు. -
15 టీఎంసీలు ఉన్నాయని నిరూపించు
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ హయాంలో ఇదే సీజన్లో ఎల్ఎండీలో 15 టీఎంసీల నీళ్లున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరూపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే పదవికి రాజీనామా చేసి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఎల్ఎండీ నీటిమట్టాన్ని పరిశీలించి మాట్లాడారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవని, తమ హయాంలో 15 టీఎంసీల నీళ్లు ఉండేవని ప్రజలను ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డ్యాంలో ఆటల పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. తాను అధికారిక ఆధారాలు చూపిస్తున్నానని, 15 టీఎంసీల నీళ్లు ఎప్పుడూ లేవన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి కమలాకర్ రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను 2 టీఎంసీలు తాగునీటికి సరిపోతాయన్నారు. ఇలాంటి డ్రామాలు ఆపకపోతే డ్యాంలో ఫుట్‌బాల్ ఆడినట్లే, ప్రజలు బీఆర్ఎస్ నాయకులను ఫుట్‌బాల్ ఆడుతారని హెచ్చరించారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, లయాక్, చర్ల పద్మ, నెల్లి నరేశ్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, అస్థాపురం తిరుమల, మహాలక్ష్మి, కంది అశోక్‌రెడ్డి, బషీర్, షెహన్షా, మాసుం ఖాన్, రాజ్‌కుమార్, హనీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
సర్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు
కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నగరపాలకసంస్థ కమిషనర్, ఈఆర్వో ప్రఫుల్ దేశాయ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం బల్దియా సమావేశ మందిరంలో బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం పనికిరాదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు తీసుకోవడానికి వీలులేదన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫాంలను పూర్తి చేసేలా బీఎల్వోలు ఓటరుకు అవగాహన కల్పించాలన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లో ఎర్రర్, అన్ కలెక్టెబుల్తో పాటు, ఫార్మాట్ ప్రకారం వివరాలు నింపని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కష్టాలు
కరీంనగర్‌టౌన్: కరువు వచ్చినప్పుడు ఆదుకునేదే కాళేశ్వరం ప్రాజెక్టు అని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగు, తాగునీటిని అందించడం లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో నగర ప్రజలు, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులకు నీటి ఇబ్బందులు మొదలైన దృష్ట్యా శనివారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఎల్ఎండీలో క్రికెట్, హాకీ, వాలీబాల్ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రెండు దశాబ్దాల చరిత్రలో జూన్‌లో ఎల్ఎండీ నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కి పడిపోవడం ఇదే మొదటిసారి అని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఎల్ఎండీలో ఎప్పుడూ 10 టీఎంసీలు నిల్వ ఉండేలా జీవో విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కన్నెపల్లిలోని మోటార్లను ఆన్‌చేసి మిడ్‌మానేరు, ఎల్ఎండీలను నింపాలన్నారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడాతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం32.0/26.0ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 20267వర్షాలు కురవాలని.. చిగురుమామిడి: వర్షాలు కురవాలని మండలంలోని నవాబుపేట్‌లో శనివారం రైతులు, ట్రాక్టర్ యూని యన్ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వరదపాశం సమర్పించారు.వేములవాడ: శనిత్రయోదశిని పురస్కరించుకుని భీమన్న ఆలయంలోని నవగ్రహాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
నాంపల్లి సిగలో పర్యాటక నగ
● నాంపల్లిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు ● ఇప్పటికే ఆకట్టుకుంటున్న కాళీయమర్ధనం ● త్వరలో అందుబాటులోకి ఎయిర్‌ఫోర్స్ విమానంవేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంతో నాంపల్లిగుట్ట ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా ఆకట్టుకుంటుంది. దీనికితోడు తాజాగా గుట్టపైన ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే గుట్టకు మరింత అందం చేకూరనుంది. గరుడ వాహనంపై ఊరేగింపు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో పలు చోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆయా సమయాల్లో స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తుంటారు. పక్షులకు రాజైన గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించడం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈక్రమంలోనే నాంపల్లిగుట్టపై గాలిలో వెళ్లే లోహపు పిట్ట(విమానం) ఏర్పాటు చేస్తున్నారని స్థానిక పెద్దలు చర్చించుకుంటున్నారు. గుట్టపై కాళీయమర్ధనం అప్పటి ఎంపీ విద్యాసాగర్‌రావు హయాంలో నాంపల్లిగుట్ట అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించారు. ఘాట్‌రోడ్డు, కాళీయమర్ధనం, వాటర్ ఫౌంటేయిన్లు ఏర్పాటు చేశారు. గుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనం ఆకర్షణీయంగా నిలిచింది. ఎయిర్‌ఫోర్స్ విమానం.. అదనపు ఆకర్షణ నాంపల్లిగుట్టపై భక్తులకు ఆహ్లాదం పంచేందుకు వీటీడీఏ అధికారులు రెండేళ్లుగా ఎయిర్‌ఫోర్స్ విమానం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టకేలకు గుట్టపైకి ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని తీసుకొచ్చారు. వాటి పనులు ప్రారంభించి పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విమానాన్ని చూసేందుకు స్థానికులు గుట్టపైకి వస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. -
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
కరీంనగర్‌టౌన్: ఆసక్తి, తపన ఉంటే చాలు.. ఐటీఐ శిక్షణతోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లోనూ రాణించవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయిని అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా విస్తరిస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో వివిధ పరిశ్రమల్లో ఎంపిక కానున్నారు. ఏటీసీ సెంటర్లను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ నెల 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో విభిన్న ట్రేడులున్నాయి. విద్యార్థి అభిరుచికి తగిన కోర్సును ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఉన్నత చదువులు చదవలేని నిరుపేదలకు ఈ కోర్సులు వరంగా చెప్పుకోవచ్చు. వివిధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ నియామకాల్లో ఐటీఐ, ఏటీసీ చదవినవారికే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసినవారిలో సుమారు 85 శాతం వరకు ఉపాధి పొందుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందుబాటులో 1,824 సీట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 4 ఏటీసీలు ఉండగా, వాటిలో 1,824 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలో మూడు ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం తాడికల్, చొప్పదండి నియోజకవర్గం వెదిర, హుజూరాబాద్ నియోజకవర్గం రంగాపూర్‌లో ఏటీసీలు మంజూరయ్యాయి. భూసేకరణ, ప్రభుత్వ అనుమతులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకోవాలి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ttps:// iti. telangana. gov. in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. కోర్సు ప్రతిపాదికన వెబ్ ఆప్షన్లు పెట్టి అన్ని ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. దరఖాస్తు సమయంలో ఉపయోగించే సెల్‌ఫోన్ నంబరు, ఈమెయిల్ మాత్రం కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలి. ఏటీసీలతో 85 శాతం ఉద్యోగాలు కోర్సుల వివరాలు ఒక సంవత్సరం కోర్సులు: డీజిల్ మెకానిక్, కంప్యూటర్, వెల్డర్, కోపా(కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్) తదితర కోర్సులు. రెండు సంవత్సరాల కోర్సులు: డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటారు మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ తదితర విభాగాలు. ఏటీసీలో కోర్సులు: మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ ఆటోమేషన్(ఏడాది), ఇండస్ట్రీయల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(ఏడాది), బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ (రెండేళ్లు), అడ్వాన్స్డ్ సీఎస్సీ మెకానిక్ టెక్నీషియన్ (రెండేళ్లు), మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్(రెండేళ్లు). పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇతర వివరాల కోసం అందుబాటులో ఉన్న ఐటీఐ కేంద్రాల్లో సంప్రదించాలి. ఐటీఐ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో(ఏటీసీ) చదివిన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ప్రస్తుతం ఐటీఐ పాసైన విద్యార్థులకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. – కె.అశోక్‌కుమార్, ఐటీఐ ప్రిన్సిపాల్, కరీంనగర్ -
ఎన్యూమరేషన్ ఫామ్ నింపండి ఇలా..
సాక్షి పెద్దపల్లి: ప్రతీపౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈలక్ష్యంతో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్‌లో ఉండే ’ఎన్యూమరేషన్ ఫామ్’ అందిస్తారు. చాలామంది దీనిని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. సరైన సమాచారం అందిస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. ఈ ఫామ్‌ను ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏమిటి? ● ఇది ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక ఫామ్. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫామ్‌లో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి. మొదటి భాగం: రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకోని నింపాలి.ఫామ్‌పై భాగం: మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి. అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫొటో అతికించాలి.01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే: 2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ బాక్స్‌ని పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబరు(భాగం సంఖ్య), క్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సిరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి.01–01–2002 నాటికి ఓటు లేకపోతే: 2002లో మీకు ఓటు లేదు, మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు అనేచోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్(భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్ట్‌లో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కావున, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్‌లో నింపాలి.మూడో భాగం: మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలివేయండి.ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్‌లో ఓటరు కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.1. వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. 2. చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. 3. ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి. 4. ఫొటో, సంతకం: ఫామ్ చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు. -
మత్తు వీడండి.. క్రీడలతో ఒత్తిడిని జయించండి
కరీంనగర్‌క్రైం: యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా క్రీడలు, శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం, అవగాహన గీతాలు ఆకట్టుకున్నాయి. అస్త్ర కన్వెన్షన్ హాలులో జరిగిన అవగా హన సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి.. డ్రగ్స్ దుష్పరి ణామాలపై ప్రత్యేక షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల దుర్వి నియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిగా మారిందన్నారు. వ్యాసరచన, చిత్రలేఖన పో టీల విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి సరస్వతి, డీసీపీవో పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్‌ఖాన్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కారు ప్రమాదంలో వృద్ధుడు..
సిరిసిల్లటౌన్: బజారుకెళ్లి ఇంటికి తిరిగొస్తున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పట్టణంలోని వెంకంపేటకు చెందిన ఆడెపు ఆంజనేయులు(68) గురువారం రాత్రి పాతబస్టాండుకు వచ్చి మందుల షాపులోకి వెళ్లి కొనుక్కొని రోడ్డుపైకి వచ్చాడు. సిగ్నల్ పడుతోందని కారును డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఆంజనేయులును కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని స్థానికులు జిల్లాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనంతోపాటు పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయులు తలకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఇద్దరు కొడకులు ఉన్నారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. -
ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, గతంలో వేములవాడ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన గుండెటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకున్న కేసులో మార్చి 18న రాము, అతడి స్నేహితుడు జక్కని వేణును అరెస్టు చేశారు. వేణు ద్వారా లంచం డబ్బులు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు తన ఆదాయ వనరులకు మించి చట్టవిరుద్ధంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా భవానీనగర్‌లోని అతడి అద్దె నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.20.67 లక్షల నగదు, ఎస్బీఐ ఖాతాలో రూ.29.88 లక్షలు, అతడి తండ్రి యూబీఐ ఖాతాలో రూ.16.77 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్లో ఖాళీ స్థలం, సిరిసిల్లలో వాణిజ్య స్థలం సహా మొత్తం పత్రాల విలువ రూ.87.44 లక్షల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాలు కొనసాగుతున్నాయని, కేసుపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు నగదు, బ్యాంకు డిపాజిట్లు, స్థలాలు వెలుగులోకి.. మార్చిలో లంచం తీసుకున్న కేసులో ఎకై ్సజ్ సీఐ, అతడి స్నేహితుడిపై కేసు -
పల్స్ పోలియో విజయవంతం చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ సూచించారు. గురువారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పరిధిలోని 25 బూత్‌ల ద్వారా 5,642 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు, ఇందులో వందమంది వలంటీర్లు, సిబ్బంది పా ల్గొంటారని చెప్పారు. అలాగే ఆదివారం తప్పిపోయిన పిల్లలకు 29, 30వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తపల్లి, ఆసిఫ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గ్రీష్మ, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
గాయపడ్డ యువకుడు మృతి
చొప్పదండి: మండలంలోని ఆర్నకొండకు చెందిన గుంట మహేశ్ (25) ట్రాలీ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ రెడ్డి కథనం ప్రకారం మహేశ్ బుధవారం చొప్పదండిలోని మర్లవాడలో అమరగొండ సురేశ్ కూతరు వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి బరాత్‌లో పాల్గొని 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు వెంట ఇంటికి నడుచుకుంటు ఆర్నకొండ వైపు వెళ్తుండగా చొప్పదండి నుంచి ధర్మారం వెళ్తున్న ట్రాలీ ఆటో మర్లవాడ వద్ద ఢీకొట్టింది. దీంతో మహేశ్ కిందపడిపోవడంతో స్థానికులు వెంటనే కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి తండ్రి బీరయ్య ఫిర్యాదు మేరకు ట్రాలీ అటో డ్రైవర్ గుమ్మడి తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పుట్టపాక గ్రామంలో అదుపుతప్పిన కారు ● ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు మంథనిరూరల్: పెద్దపల్లి– మంథని ప్రధాన రహదారి మంథని మండలం పుట్టపాక సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దపల్లి గ్రామానికి చెందిన ఏల్పుల మణికంఠ(25) మృతి చెందాడు. వివరాలు.. సిద్దపల్లి గ్రామానికి చెందిన మణికంఠ బిట్టుపల్లికి చెందిన మిత్రుడిని మరికొంతమంది మిత్రులతో కలిసి కారులో దిగబెట్టడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధి చల్లపల్లి స్టేజీ వద్ద కారు అదుపుతప్పి సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న షెడ్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా రాహుల్, ఆకాశ్, అనిల్ గాయపడ్డారు. వీరిని పెద్దపల్లికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్నామని ఏఎస్ఐ మల్లయ్య తెలిపారు. గీత కార్మికుడి ఆత్మహత్యహుజూరాబాద్: హుజూరాబాద్‌కు చెందిన పంజాల భిక్షపతి గౌడ్ (48) అనే గీతకార్మికుడు బుధవారం రాత్రి శ్మశాన వాటికలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని..మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ పంచాయతీ పరిధిలోని అధర్వ్ రిసార్ట్స్‌లో ఓ యువకుడు అనుమానస్పదంగా మృతిచెందాడు. సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు..పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దుర్శిటి సతీశ్‌కు ఇద్దరు కొడుకులు. చిన్నకుమారుడైన దుర్శిటి అఖిల్ (21) రెండునెలల నుంచి హైదరాబాద్‌లోని తుక్కుగూడ ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30న జరిగిన ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చిన అఖిల్ నాలుగురోజుల పాటు ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. అయితే అఖిల్ తన సోదరుడి బైక్ తీసుకెళ్లగా, బైక్ కోసం ఫోన్ చేయడంతో స్నేహితుడు ఎలిగేటి అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి కమాన్పూర్లోని అధర్వ్ రిసార్ట్‌కు వచ్చినట్లు తెలిపాడు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి అఖిల్ కనిపించడం లేదని వెతుకుతుండగా స్విమ్మింగ్‌పూల్ వద్ద షర్ట్, చెప్పులు కనిపించాయని మృతుడి తండ్రి, సోదరుడికి సమాచారమిచ్చారు. వారు రిసార్ట్ వద్దకు చేరుకొని వాచ్మెన్ నెల్లి అభి అలియాస్ ఆర్యప్రకాష్ను ఆరా తీసి వెతికారు. ఈ క్రమంలో అఖిల్ మృతదేహం స్విమ్మింగ్‌పూల్‌లో లభించింది. బర్త్‌డే పార్టీ ఉందని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ఎలిగేటి అరవింద్ తన కుమారుడిని పిలిచాడని, ఈ పార్టీలో 8 మంది యువతులు, 9 మంది యువకులు పాల్గొన్నట్లు తెలిసిందని మృతుడి తండ్రి తెలిపాడు. తన కొడుకు మృతిపై ఎలిగేటి అరవింద్, ముక్కెర అంజి, మరికొందరు స్నేహితులపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కాగా సదరు రిసార్ట్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
‘బెస్ట్’ స్టూడెంట్లపై వివక్ష
పెద్దపల్లి: జిల్లాలోని కొన్ని బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థులతో కాకుండా ఉచితంగా సీట్లు పొందిన వారిని వేరుగా కూర్చోబెట్టి చదువు చెబుదున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు.. స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లోనూ వీరికి అవకాశం కల్పించడం లేదంటున్నారు. జిల్లాలోని 12 ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్అవైలేబుల్ కింద 587 మంది విద్యార్థులను చేర్చుకోగా.. వారిపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయనే విమర్శలు రావడంతో విద్యాభిమానులు నివ్వెరపోతున్నారు. కలెక్టర్‌కు తల్లిదండ్రుల మొర ఎన్టీపీసీ ప్రాంతంలోని విశ్వభారతి హైస్కూల్లో 133 మంది విద్యార్థులు బెస్ట్ అవైలేబుల్ ద్వారా సీట్లు పొందారని, వీరిని పలు ప్రాంతాల్లోని వివిధ స్కూళ్లలో చదివిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై విచారణ జరిపించాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులను ఆ పాఠశాలలో అనుమతించకపోగా, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్ట్‌లు, టై, షూస్‌ను సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని యాజమాన్యం పేరెంట్స్‌కు సూచించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి, ఇటీవల కలెక్టరేట్‌కు చేరకున్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్త మేనేజ్మెంట్ షరతులు 2026– 27 విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు పదిరోజులు గడుస్తోంది. అయినా సుమారు 20 మంది విద్యార్థులు ఇంకా తరగతులకు హాజరు కావడంలేదు. కొత్త యాజమాన్యం(రెండు దశాబ్దాల పాటు నడిచిన స్కూల్‌ను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్) బెస్ట్ అవైలేబుల్ విద్యార్థులను స్కూల్‌కు రానివ్వడం లేదంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కలెక్టర్ నుంచి లేఖ తీసుకురావాలని షరతు పెట్టిందని పేర్కొంటున్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూల్ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ సదరు కొత్త మేనేజ్మెంట్ ఇందుకు విముఖత చూపడం విమర్శలకు తావిస్తోంది. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు.. ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్ అవైలేబుల్ సీట్లు పొందేవారంతా పేదలు, వెనుకబడిన వర్గాల వారే. హఠాత్తుగా యాజమాన్యం మారడంతో వీరి చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన పాఠశాల(బెస్ట్ అవైలేబుల్ స్కూల్ కూడా) యాజమాన్యం ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకుంది. దీనిని సిద్ధార్థ యాజమాన్యం కొనుగోలు చేసింది. పేరు కూడా మార్చేసింది. బెస్ట్ అవైలేబుల్ స్కూల్‌గా ఉన్న సమయంలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రతీ తరగతిలో నలుగురి నుంచి ఐదుగురు విద్యార్థులు ఉచితంగా సీట్లు కేటాయించింది. ప్రభుత్వం వారి ఫీజులు చెల్లించేది. -
వివక్ష చూపుతున్నరు
బెస్ట్ అవైలేబుల్ పథకంలో మా విద్యార్థి ఎంపికయ్యిండు. ఎన్టీపీసీ ప్రాంతంలోని ఓ స్కూల్ వివక్ష చూపుతంది. మా పిల్లలను వేరే కాడ కూర్చోబెట్టి చదివిస్తున్నరు. యజమానిని అడిగితే దాటవేస్తున్నరు. అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. – శంకర్, నివాసి, బాధిత పేరెంట్, లింగాపూర్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం చదువు చెప్పాలి. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. కొన్ని యాజమాన్యాలు బెస్ట్ అవైలేబుల్ స్కీం కొనసాగించలేమని లేఖ ఇచ్చాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. పేద విద్యార్థులకు అన్యాయం జరగనివ్వం. – రవీందర్, ఎస్సీ అభివృద్ధి అధికారి -
చెరువుల కబ్జాతో నీటి ఎద్దడి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి ఎద్దడి.. చెరువులు, కుంటల కబ్జాలకు నిరసనగా సీపీఐ ఆందోళన చేపట్టింది. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయం గేట్ ముందు ఆ పార్టీ నాయకులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సీపీఐ శ్రేణులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, మానేరు డ్యాం నుంచి పక్క జిల్లాలకు నీళ్లను పంపించి, నగరానికి మాత్రం నీటి కష్టాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల కబ్జాలతో నీటి కష్టాలు పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు. వెంటనే చెరువులు, కుంటలను కబ్జాల నుంచి రక్షించాలని, నీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, బుచ్చన్న, పద్మ, అంజలి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలికరీంనగర్క్రైౖం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జైలులో గురువారం ఖైదీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైదీలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ జి.విజయ్‌దేని మాట్లాడుతూ, మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, కొనుగోలు, విక్రయం, రవాణా చేయడం తీవ్రమైన నేరమని, వాటికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్, ఫార్మసిస్ట్ ఆర్.శ్రీలత, జైలర్లు జి.లక్ష్మీనారాయణ, యు.పరశురాములు, డిప్యూటీ జైలర్లు ఎస్.సుధాకర్‌రెడ్డి, కె.అనిల్‌కుమార్, ఎస్.అజయ్‌చారి తదితరులు పాల్గొన్నారు. యోధులను మరువలేంకరీంనగర్: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులను మరువలేమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధులను సన్మానించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని విధించిన అత్యవసర పరిస్థితి దేశానికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బాస సత్యనారాయణ, మాడ వెంకట్ రెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, కళ్లెం వాసుదేవ రెడ్డి, కన్నకృష్ణా, గుజ్జ శ్రీనివాస్ రావు, పుప్పాల రఘు, అలివెల్లి సమ్మిరెడ్డి, బండ రమణారెడ్డి, అనిల్, అడిచెర్ల రాజు, బండారి గాయిత్రి, తనుకు సాయికృష్ణ, రవీందర్, దాసరి రమణారెడ్డి, ఈసంపల్లి మహేశ్, తిరుమల్ రెడ్డి, వంగల ఆంజనేయులు, వాసు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకరీంనగర్టౌన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం వెలువడ్డాయని డీఈవో ఎన్.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 125 మంది బాలురు, 64 మంది బాలికలు మొత్తం 189 మంది పరీక్షలకు హాజరు కాగా 124 మంది బాలురు, 62 మంది బాలికలు, మొత్తం 186 (98.41శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. విద్యార్థులు మార్కులు రీకౌంటింగ్‌కు రూ.500 లేదా రీవెరిఫికేషన్ కోసం రూ.1000 చెల్లించి ఈనెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్లో హాల్ టికెట్ జిరాక్స్, మార్కుల మెమోలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మావా!
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026ఊ.. అంటావా మావా..ఊఊ.. అంటావావేగవంతంగా సర్ ప్రక్రియసాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి ●: ప్రకృతి ఒడిలో ఉపశమనం పొందేందుకు నిర్మించుకున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రి పూట సాగుతున్న ‘చీకటి వినోదాలు’ పెచ్చుమీరుతున్నాయి. మందు, విందులతో మత్తులో చిందులు.. కంచె దాటిన కామం, హద్దులు మీరిన జూదం.. వెరసి కొన్ని ఫాంహౌస్‌లు చీకటి కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. హైదరాబాద్‌కే పరిమితమైన ఫాంహౌస్ సంస్కృతి క్రమేణా జిల్లా కేంద్రాలకు సోకింది. ఫలితంగా చట్టవిరుద్ధమైన పనులకు సురక్షితమైన అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిఘా లోపం వల్లే ఈ అక్రమ ఫాంహౌస్‌ల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, యువతను పెడదోవ పట్టిస్తున్న అక్రమ ఫాంహౌస్లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోరుగా చీకటి కార్యకలాపాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్‌ల సంస్కృతి పెరిగింది. ప్రశాంతత, వినోదాలకు వేదికలుగా నిలవాల్సిన ఫాంహౌస్‌లు చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్‌ల సంస్కృతి జోరందుకుంది. రాత్రి అయిందంటే ఈ ఫాంహౌస్ వేదికలుగా మందు, విందు, వ్యభిచారం వంటి చీకటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా చెడు ధోరణికి అలవాటుపడ్డ యువత ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తూ విందు, వినోదాల్లో తేలియాడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఇలాంటి అక్రమ ఫాంహౌస్లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. నిబంధనలు ఉల్లంఘించిన ఫాంహౌస్‌లను సీజ్ చేయడంతో పాటు, నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అనుమతిలేని నిర్మాణాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫాంహౌస్‌లు నిర్మించారు. కరీంనగర్ శివారు కొత్తపల్లి, కొత్తపల్లి మండలం, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, రామడుగు తదితర మండలాల్లో గ్రామ పంచాయతీ/మున్సిపల్ నుంచి ఎలాంటి కమర్షియల్ అనుమతులు పొందకుండా ఫాంహౌస్‌లను అద్దెకు ఇస్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటికి విద్యుత్ మీటర్ల మంజూరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇష్టారీతిన ఫాంహౌస్‌ల నిర్మాణాలు జరిగినా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదు. కేవలం సొంత అవసరాల కోసం నిర్మించుకున్నట్లు చూపుతూ..లోపల మాత్రం యథేచ్ఛగా ఈవెంట్లు, పార్టీలకు అనుమతులిస్తున్నారు. వినోదం వెనుక వికృత చేష్టలు ఫాంహౌస్ సంస్కృతి తప్పు కానప్పటికీ దాని వెనుక సాగే వికృత క్రీడలే సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ యువత మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్నారు. ఫలితంగా ఘర్ణణలకు దిగుతున్నారు. దీంతో యువత భవిష్యత్తు చీకట్లోకి జారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. పచ్చని ప్రకృతి సాక్షిగా సాగుతున్న ఈ నల్లటి వ్యాపారాలపై అధికారులు నిఘా పెట్టినప్పుడే ఫాంహౌస్ బాగోతాలకు తెరపడుతుంది.ఫాంహౌస్‌ల చాటున సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిరంతరం తనిఖీలు చేస్తూ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశాం. కేవలం కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు మాత్రమే అద్దెకు ఇవ్వాలని, యువతకు ఇవ్వకూడదని సూచించాం. పలు ఫాంహౌస్‌లలో సౌండ్ పొల్యూషన్ కేసులు నమోదు చేశాం. ఫాంహౌస్‌లకు తప్పనిసరిగా అనుమతులుండాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తే సీజ్ చేస్తాం. – బిల్ల కోటేశ్వర్, సీఐ, కొత్తపల్లి -
వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
కరీంనగర్ కార్పొరేషన్: వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. నగరంలోని కళాభారతిలో బుధవారం నిర్వహించిన స్వనిధి మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీధి వ్యాపారుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పీఎం స్వనిధి పథకం ద్వారా లభిస్తున్న అవకాశాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పీఎం స్వనిధి పథకం కింద మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కును 98 మంది లబ్ధిదారులకు అందజేశారు. కొత్త వీధి వ్యాపారులకు డిజిటల్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ అందించారు. పుడ్స్టాళ్ల ఏర్పాటు స్వనిధి మహోత్సవంలో భాగంగా కళాభారతి ఆవరణలో వీధి వ్యాపారులతో ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేశారు. సందర్శకులు స్టాళ్లలోని ఆహారపదార్థాలను రుచిచూశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీ గౌస్ ఆలం, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు. పలు నిర్మాణాలకు శంకుస్థాపన కరీంనగర్ అర్బన్: నూతన కలెక్టరేట్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సుడా ఆధ్వర్యంలో హెలిప్యాడ్, సర్వీస్ రోడ్డు, హెలిప్యాడ్‌కు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసేందుకు బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.53లక్షల సుడా నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ శంకుస్థాపన చేశారు. కొత్త కలెక్టరేట్ నుంచి ఈశాన్యం గేట్ వరకు రహదారి అభివృద్ధి పనులు, గార్డెన్ సుందరీకరణ పనులు ప్రారంభించారు. అధికారులపై ఎమ్మెల్యే గంగుల ఫైర్ కలెక్టరేట్లో పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా తనకు సమాచారమివ్వలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సమాచారంతో పాటు ప్రొటోకాల్ పాటించడంలో అగౌరవపరచడం తగదని, మరోసారి పునరావృతం కావద్దని సూచించారు. -
కారు సునామీ ఖాయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ వైఫల్యాలపై కదం తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా మారిందన్నారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతోందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నుంచి నియోజకవర్గాలవారీగా పార్టీ క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, అవినీతిని కార్మికులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సతీశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
పథకాల అమలులో అగ్రభాగాన నిలపండి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్(కొత్తపల్లి)/తిమ్మాపూర్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టర్ చిత్రామిశ్రా 99 రోజుల కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6నుంచి జూన్ 12వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 4,290 ఫైళ్లు పరిష్కరించగా, 3,835 దరఖాస్తులు స్వీకరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మెగాజాబ్ మేళాలో 292 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, ప్రజావాణి ద్వారా వచ్చిన 2,995 దరఖాస్తుల్లో 2,144 పరిష్కరించినట్లు వివరించారు. అంధ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంధ విద్యార్థులు విద్యను ఆయుధంగా చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సంగీత శిక్షణ గది, రికార్డు గదిని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎల్‌ఎండీకాలనీలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు నిర్వహిస్తున్న మేధో వికలాంగుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. -
హలో.. సర్
పురుషులుకరీంనగర్ అర్బన్: బోగస్ ఓట్ల తొలగింపు, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు లక్ష్యంగా సర్ అడుగులేస్తోంది. ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ దాదాపు పూర్తవగా ఇక బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టనున్నారు. గురువారం నుంచి సదరు ప్రక్రియ ప్రారంభమై జూలై 24వరకు కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో రాజకీయ పార్టీలూ భాగస్వామ్యమయ్యాయి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే బీఎల్వోలకు శిక్షణనిచ్చి సంబంధిత సామగ్రిని అందజేశారు. తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. మృతిచెందిన వారి పేర్లతో పాటు రెండు, మూడు ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించడానికి కేంద్రం ’సర్’ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. బీఎల్వోలు ప్రత్యేక యాప్ ద్వారా ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 జాబితాతో మ్యాపింగ్ చేపట్టారు. 89శాతం పూర్తిచేయగా, కొంతమందికి అవగాహన కొరవడటం, 2002లో ఓటు లేకపోవడం, జాబితాలో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ వివరాలు గుర్తించకపోవడంతో మ్యాపింగ్ జరగలేదు. సర్వేలో ఏం చేస్తారంటే బీఎల్వోలకు అవసరమైన ఫారాలతో పాటు 17వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. వారు ఇంటింటి సందర్శనలో ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందిస్తారు. వాటిని పూర్తి చేసి బీఎల్వోలకు అందించాలి. ఎన్యూమరేషన్ పత్రాల్లో కొత్త జాబితా ప్రకారం ఓటర్ల పేరు, క్రమసంఖ్య, పార్ట్ సంఖ్య, పాత ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. దానిపై ఓటరు జాబితాలోని వివరాలు రాయాలి. కొత్త ఫొటో అతికించి, ఫోన్ నంబరు, ఎపిక్ నంబరును పూరించి, సంతకం చేసి ఒకటి బీఎల్వోకు అందించాలి. మరోటి తమ వద్ద ఉంచుకోవాలి. పాత జాబితాలో వివరాలు లేకున్నా, సరిపోలకున్నా, తప్పులున్నా.. ఎన్యుమరేట్ పత్రంతో జతపర్చాలి. బీఎల్వో ఓటరు ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉంటే నెల రోజుల్లో మూడుసార్లు విధిగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా ప్రతి పది మంది బీఎల్వోల పనితీరు పర్యవేక్షణకు ఓ సూపర్వైజర్ను నియమించగా వారిపై ఆయా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 నుంచి 1,500 వరకు ఓటర్లుండగా సర్ పూర్తయ్యాక కేంద్రాలను హేతుబద్ధీకరిస్తారు. 2002 జాబితాతో పరిశీలన సర్వేలో ప్రధానంగా ఓటరు పేరు 2002 జాబితాలో ఉందో లేదో పరిశీలిస్తారు. పేరు లేకున్నా, ఉండి ప్రస్తుత జాబితాలో లేకుంటే కారణం తెలుసుకుంటారు. అప్పటివరకు జన్మించని వారిని గుర్తించి ప్రస్తుత జాబితాలో చేరుస్తారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు తల్లిదండ్రుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు పొందినవారూ తల్లిదండ్రుల వివరాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్వోలు అందించిన ఫారాలు తీసుకోకున్నా, వివరాలు తెలుపకున్నా ఓటరుగా అనర్హులవుతారు. వలస వెళ్లినవారు ఈ నెల రోజుల్లో విధిగా స్వగ్రామాలకు వచ్చి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఓటర్లకు కాల్ బుకింగ్ సౌకర్యం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా కాల్ బుకింగ్ సౌకర్యం కల్పించింది. బీఎల్వోలు ఓటరును సంప్రదించకుంటే.. నేరుగా వారినే ఇంటికి పిలిపించే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. కాల్ బుకింగ్ సౌకర్యం వినియోగించుకునేందుకు ఓటర్లు ప్లేస్టోర్ నుంచి ’ఈసీఐఎన్ఇటి’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కాల్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు బీఎల్వోలు సదరు ఓటరును సంప్రదిస్తారు. రోజుకు ఎన్ని కాల్స్ బుక్ అయ్యాయి..? ఏ సేవలపై ఓటర్లు వివరాలు అడిగారు..? చూపిన పరిష్కారం ఏమిటీ..? తదితర వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా, డివిజనల్ స్థాయి ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారు. సీ్త్రలుకరీంనగర్ 45 హుజూరాబాద్ 7 మానకొండూరు 1 చొప్పదండి 8 మొత్తం 61థర్డ్జెండర్మొత్తంఓటరు జాబితాను పక్కాగా రూపొందించే ప్రక్రియలో భాగమే సర్. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలు జారీ చేయాల్సిందే. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పకడ్బందీ వివరాల క్రమంలో అక్టోబర్ 1న ఓటరు తుది జాబితా ప్రకటిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్ ఏఈఆర్‌లు 16 సూపర్వైజర్లు 133 బీఎల్వోలు 1,334కరీంనగర్ 1,83,480 హుజూరాబాద్ 1,22,678 మానకొండూరు 1,10,301 చొప్పదండి 1,13,878 మొత్తం 5,30,337కరీంనగర్ 1,84,641 హుజూరాబాద్1,29,666 మానకొండూరు 1,16,083 చొప్పదండి 1,21,963 మొత్తం 5,52,353కరీంనగర్ 3,68,166 హుజూరాబాద్ 2,52,351 మానకొండూరు 2,26,385 చొప్పదండి 2,35,849 మొత్తం 10,82,751 -
విద్యాభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూత
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు కీలక అడుగుపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ ఫలితంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవీ మురళీకృష్ణ, డీజీఎం (హెచ్ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్ఆర్) ఎస్.సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. నూతన కళాశాల భవనం ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. సీఎస్ఆర్ నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్ఏఎల్ సంస్థ అందిస్తున్న సహకారానికి హెచ్ఏఎల్ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కరీంనగర్‌రూరల్: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో చేపట్టిన ‘మాదక ద్రవ్యాల వినియోగం– యువతపై ప్రభావం’ అనే కార్యక్రమంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, సిగరేట్, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి, యాంటీ నార్కోటిక్ సీఐ రఫీక్‌ఖాన్, ఎస్సై లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ రవీందర్, ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 13వ డివిజన్ మార్కండేయనగర్లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్‌ను బుధవారం ప్రారంభించారు. ఒకటో డివిజన్ బృందావన్‌కాలనీ రూ.29.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 13వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల లక్ష్మి, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్షిప్’ టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నగరంలోని ఎస్సారార్ కళాశాలలో రెండవ రోజు బీబీఏ విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్ లెర్నింగ్’ పై శిక్షణ ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ తెలిపారు. శిక్షకులు జడల రమేశ్, ప్రేమ్ చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్, మహేందర్ ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్, పైతాన్ లాంగ్వేజ్, డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి, కళాశాల నోడల్ అధికారులు మధు, రాజేశ్, ఎం.మల్లారెడ్డి, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో రెండోరోజు బుధవారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్‌హ్యాండ్లింగ్ ప్లాంట్లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్పీడీసీఎల్ నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, కొలుపుల రాజు, యుగంధర్, సంపత్ , శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మెరిసిన ఒద్యారం బడి
గంగాధర(చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత, పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయం రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్)ను ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించిన 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించారు.విద్యార్థులు 300 రకాల చెట్లను నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సేంద్రియ విధానంలో కూరగాయల సాగుచేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంతోపాటు, మెరుగైన మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, వంటగది, డైనింగ్‌హాల్, బాలికలకు రెస్ట్‌రూం, బోధనకు డిజిటల్బోర్డు, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు కల్పించారు. -
కాంగ్రెస్‌ది ప్రజావంచన పాలన: జీవన్‌రెడ్డి
మంథని: రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, ప్రజావంచన పాలన అని, 2014కు ముందు రైతులు ఎలా దగా పడ్డారో ఇప్పుడు మళ్లీ అదేపరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎస్ఎల్బీ గార్డెన్లో నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్‌సింగ్, నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీర్ల వెంకటేశ్వర్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఆనాడు కేసీఆర్ రైతుబంధు పేరిటి ఎకరాకు రూ.పది వేలు ఇస్తే.. తాము రూ.పదిహేను వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేశారన్నారు. ప్రస్తుతం రైతుబంధును బంద్ చేసి శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు ప్రభుత్వం చేపట్టిన సర్‌పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై పూర్తిగా ప్రజల్లో అవగాహన లేదన్నారు. కేవలం మార్పులు చేర్పులు మాత్రమే అనుకుంటున్నారని, కానీ జూన్ 25 నుంచి జూలై 24వరకు ఎన్యూమెటర్ ఇంటింటికి వస్తారని, ఈ క్రమంలో గతంలో ఓటు కలిగి ఉన్నా ఫాం నిర్దేసిత సమయంలో సమర్పిస్తేనే ఓటు నమోదు ఆరంభం వుతుందన్నారు. ఫాం నింపివ్వకుంటే ఓటును తొలగించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రెండున్నర సంవత్సరాల కాలాన్ని దృష్ట్టిలో ఉంచుకుని పార్టీ పరంగా గట్టిగా కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్‌గా ఉన్న శ్రీధర్‌బాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాదరణ పొందిన పుట్ట మధుపై రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోచిస్తూ బద్నాం చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుద్దిళ్ల శ్రీధర్ పైసలతో గెలుస్తాడని, కానీ ఎప్పుడూ డబ్బులే గెలువవని తెలిపారు. అనేకమంది మహామహులు డబ్బులుండి కూడా ఓటమిని చవిచూశారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గుర్తు చేశారు. -
‘ఎల్కలపల్లి’ వెలుగులు
ఫెర్టిలైజర్‌సిటీ: అది ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల.. అక్కడ అడుగుపెడితే కార్పొరేట్ స్కూళ్లకు సైతం అసూయ పుట్టక మానదు. పచ్చని చెట్లు, పరిమళించే పూలమొక్కలు.. అద్దంలా మెరిసే పరిసరాలు.. అన్నింటికీ మించి విద్యార్థులపై ఉపాధ్యా యులకు ఉన్న అపారమైన ప్రేమ.. ఇవన్నీ కలగలిసి ఆ పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ (ఎస్హేచ్విఆర్) రేటింగ్‌లో పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల జాతీయస్థాయిలో 49వ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా వందపాఠశాలలు పోటీపడగా.. తెలంగాణ నుంచి ఎంపికై న 10 స్కూళ్లలో ఎల్కలపల్లి బడి ఉంది. ఇది రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం విశేషం. తద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించింది. పచ్చదనం.. నందనవనం ఎల్కలపల్లి బడి వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదం పంచుతోంది. హరితహారంలో నాటిన వివిధ రకాలమొక్కలు, పూలతోట నందనవనాన్ని తలపిస్తోంది. తరగతి గదుల చుట్టూ పచ్చదనం విద్యార్థులకు ప్రకృతి ఒడిలో చదువుకుంటున్న అనుభూతి కలిగిస్తోంది. కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంసలు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి జిల్లా పేరును దేశపటంలో నిలిపిన ఎల్కలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. అన్నింటినీ ఇలాగే తీర్చిదిద్దితే కార్పొరేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ముందుంటారని కొనియాడారు. పరిసరాల పరిశుభ్రతలో నంబర్ వన్ పచ్చదనమే కాదు.. పరిశుభ్రతలోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. సురక్షితమైన తాగునీరు, ఆధునిక శౌచాలయాలు, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది. హెచ్ఎం సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులను సురక్షితంగా బడికి తీసుకురావడం, తిరిగి ఇంటికి చేర్చడం ద్వారా ప్రవేశాలూ పెంచుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. మధ్యాహ్న భోజనంతోపాటు ప్రతీవిద్యార్థికి అదనంగా పౌష్టికాహారాన్ని(న్యూట్రిషన్ ఫుడ్) అందిస్తున్నారు. పండ్లు, గుడ్లు, ఇతర పోషకాలు గల ఆహారం అందిస్తూ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించడం గర్వంగా ఉంది. ఉపాధ్యాయులు, పోషకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి చేశాం. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – ఆడేపు లక్ష్మీనారాయణ, హెచ్ఎం, ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల -
నెహ్రూనగర్.. ఉత్తమ బడి
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల 1978లో ఏర్పాటైంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో 2002లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యత పెరగడంతో ప్రైవేట్ స్కూళ్లపై మక్కువ పెరగడంతో 2016లో విద్యార్థుల సంఖ్య 52కు తగ్గి మూతబడే పరిస్థితికి చేరింది. అప్పుడే ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాఠశాల సిబ్బంది, ఎస్ఎంసీ, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బడిలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. దీంతో 2016లోనే 170కి పెరిగింది. ప్రస్తుతం 191 మంది చదువుకుంటున్నారు. స్వచ్ఛ పురస్కారానికి అడుగులు ఇలా.. సురక్షిత తాగునీరు: దాతలు అందజేసిన ఆర్వో ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందిస్తున్నారు. శౌచాలయాల నిర్వహణ: టాయిలెట్స్ బాలికలు, బాలురకు సపరేట్గా నిర్మించారు. టాయిలెట్స్‌లో నిరంతరం వాటర్ సరఫరా, సబ్బులు, న్యాప్కిన్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపు నిర్మించారు. హ్యాండ్‌వాష్,: మధ్యాహ్న భోజన సమయంలో సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల కెప్టెన్స్ వాటిని తోటి విద్యార్థులు వాడేలా చూస్తారు. టాయిలెట్ వెళ్లొచ్చిన వారితో ఖచ్చితంగా సబ్బుతో హ్యాండ్‌వాష్ చేయిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత: ప్రతీ తరగతిగదిలో డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో చెత్త వేయకుండా స్పెషల్ డస్ట్‌బిన్స్ ఉంచారు. పరిసరాల్లో గ్రీనరీ పెంచి బడిని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇంకుడు గుంత: బడిలో బోరు బావికి సమీపంలో ఆరు ఫీట్లలోతు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. వర్షం నీరు దానిలోకి వెళ్లి భూగర్భ జలాలు పెరిగేలా నిర్మించారు. తడి, పొడి చెత్త నిర్వహణ: బడిలో ఒక చోట కంపోస్టు గుంతను తవ్వించి కూరగాయల వేస్ట్‌ను వేస్తారు. నెల వరకు వర్మీకంపోస్టు తయారై బడితోటకు వినియోగిస్తున్నారు. బడితోట: తక్కువ స్థలంలోనే కొత్తిమీర, ఆకుకూరలు, వంకాయలు, మునగచెట్లు, దొండ పందిరి టమాటలు పెంచి వాటితో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వడ్డిస్తున్నారు. విద్యార్థి సంఘాలు: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రంథాలయ కమిటీ పుస్తకాలు చదివించడం, విద్యార్థులను సైలెన్స్‌గా ఉంచడం చేస్తుంది. పరిశుభ్రం పచ్చదనం కమిటీ ప్రతినిధులు మొక్కలు పెంచడం,వాటికి నీరు ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్న భోజన కమిటీ ద్వారా క్యూలైన్లు, చేతులు పరిశుభ్రంగా కడుక్కొని భోజనం చేసేలా చూస్తారు. పరిశుభ్రతపై అవగాహన: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేతులు కడుక్కోవడం, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లతో అవగాహన కల్పించడం, గోర్లు కత్తిరించడం వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎకోక్లబ్: మట్టితో వినాయకులు తయారుచేసి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ప్రాజెక్టు వర్క్‌కింద పేపర్ బ్యాగుల తయారీ, సింగిల్ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఎర్త్‌డే, వాటర్ డే ప్రాధాన్యతలు వివరిస్తున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగిస్తాం పిల్లల్లో పెరిగిన క్రమశిక్షణ, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో పాఠశాల గొప్ప మైలురాయికి చేరింది. ఇది చాలా సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం పాఠశాల చరిత్రలో నిలిచిపోయిన సంఘటన. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. – వాసాల హరిప్రసాద్, హెచ్ఎం -
దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టు
పాలకుర్తిటౌన్: అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై సృజన్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, దేవరుప్పులకు చెందిన చింత సుదర్శన్, ఇదే మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి కరెన్సీ, ప్రింటర్, కారు, రూ. 8500 నగదు, నాలుగు సెల్ఫోన్లు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న మొహమ్మద్ రియాజ్(28) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రియాజ్ పుట్టుకతోనే మూగ, చెవిటి. కాలనీలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుండేవాడు. తనకు వివాహం చేయాలని తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 23న ఇంటికి వచ్చిన రియాజ్తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశాడు. తల్లితో అర్ధరాత్రి వరకూ మాట్లాడి ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. బుధవారం చూసేరికి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపిక ● నెహ్రూనగర్ మూతబడి నుంచి ఉత్తమంగా.. ● ఒద్యారం స్కూల్ హరితమయం ● బీర్పూర్లో ఉత్తమ బోధన ● స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక
బీర్పూర్.. మెరుగైన బోధన జగిత్యాలరూరల్: మెరుగైన విద్యాబోధనతోపాటు వసతులు, విద్యార్థుల క్రమశిక్షణలో ఉత్తమంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిత విద్యాలయం పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుతుండగా, గత మూడేళ్లుగా పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధిస్తున్నారు. హరిత విద్యాలయంగా ఎంపికవడంతో పాఠశాలలో మెరుగైన వసతుల కల్పించే అవకాశం దక్కింది. ఈ పథకం కింద ఎక్స్పోజర్ విజిట్ ఫ్రీ స్టడీటూర్తోపాటు సైన్స్ అండ్ మ్యాథ్స్‌లో ఉత్తమ మార్కులు సాధించేందుకు బోధన వసతులు కల్పించనున్నారు. ప్రత్యేక బోధనతో ఉత్తమ ఫలితాలు బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యాబోధన దక్కుతుంది. పదో తరగతిలో 573 మార్కులు సాధించాను. ప్రస్తుతం ఇంటర్లో ఎంపీసీలో చేరాను. – కలకోట నిహారిక, విద్యార్థి, ఎంపీసీ మెరుగైన బోధనతోనే.. బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు మౌలిక వసతులు, మెరుగైన విద్యాబోధన అందుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేక నిధుల ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తాం. – సంజనభట్ల నర్సింహమూర్తి, హెచ్ఎం -
బీర్పూర్ పీఏసీఎస్‌లో తొలి ‘స్మార్ట్ విలేజ్ సెంటర్’
● దేశంలోనే మొదటి రూటాజ్ కేంద్రం ఏర్పాటు ● వర్చువల్‌గా ప్రారంభించిన నాబార్డ్ చైర్మన్ అజయ్‌కుమార్ జగిత్యాలరూరల్: బీర్‌పూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో దేశంలోనే తొలి రూటాజ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఏర్పాటైంది. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సంస్థ చైర్మన్ అజయ్‌కుమార్ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సాంకేతిక ఆధారిత గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, సహకార వ్యవస్థను బలోపేతం చేయడం దిశగా ఈ రూటాజ్ విలేజ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ప్రధాన శాసీ్త్రయ సలహాదారు గోవర్దన్ సింగ్ రావత్, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, డీజీఎం సాయి శ్రీనివాస్, డీడీఎం దిలీప్‌చంద్ర, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, డీఏవో భాస్కర్, ఎల్డీఎం రాజ్‌కుమార్, కేడీసీసీ బ్యాంక్ జీఎం శ్రీధర్, చైర్మన్ రాంచందర్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. రూ.33.50 లక్షల సాయం రూటాజ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ కోసం నాబార్డ్ వికాస్ నిధి కింద రూ.33.50 లక్షలతో మూడేళ్ల కాలపరిమితితో ప్రారంభించింది. ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లోని కార్నెల్ సాత్గురు ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో అమలు చేస్తారు. 18 వేల జనాభా కలిగిన 7 గ్రామాలను కవర్ చేస్తుంది. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి.. స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆధునిక, సాంకేతిక పరికరాలను సమకూర్చడం ప్రాజెక్టు లక్ష్యం. -
గొడిశెలపేటలో పిచ్చికుక్కల వీరంగం
వెల్గటూర్: ఎండపల్లి మండలం గొడిశెలపేటలో పిచ్చికుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. సుమారు 12 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో గాయపడ్డవారిలో చీకట్ల పోచయ్య, మోకేనపల్లి విజయ, దొంత నర్సయ్య, బత్తుల లచ్చవ్వ, గుడిసెల నర్సవ, కాంపెళ్లి రాజయ్యతోపాటు మరికొందరు ఉన్నారు. బాధితులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మేకలమందపై చిరుతదాడిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా శివారు అటవీ ప్రాంతంలో బుధవారం మేకలమందపై చిరుత దాడి చేసింది. కాపరి దూరం నుంచి చిరుతను చూసి తండాకు పరుగులు పెట్టాడు. గ్రామస్తులకు విషయం తెలపడంతో కర్రలతో తండావాసులు పెద్దసంఖ్యలో అటవీప్రాంతానికి చేరుకోగా అప్పటికే చిరుత పరారైంది. ధాన్యం కొనుగోలు ఉల్లంఘనపై ఫిర్యాదు మంథని: మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించినట్లు సృష్టించి రైస్ మిల్లుకు తరలించిన అక్రమ దందాపై ఎట్టకేలకు బాధ్యులపై చర్యలకు అధికారులు మందుకు వచ్చారు. ధాన్యం అక్రమ రవాణాలో పాత్రధారులుగా విచారణలో తేలిన పీపీసీ ఇన్చార్జి, ట్యాబ్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్, పీఏసీఎస్ సిబ్బంది, వాహన యజమానులు, డ్రైవర్లు, స్టాఫ్ అసిస్టెంట్ సోదరుడితో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, నమ్మకద్రోహం, కుట్ర వంటి తీవ్రమైన నేరాలతోపాటు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థిని మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్‌కు చెందిన ఇజా(4) ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఇజా బుధవారం స్కూల్‌కు ఆరోగ్యంగా వెళ్లిందని తల్లిదండ్రులు ఫరీదా, ఫారుక్ తెలిపారు. సాయంత్రం ఇజా ఆరోగ్యంం బాగాలేదని పాఠశాల టీచర్ ఫోన్లో తెలిపిందన్నారు. వెంటనే ఇజాను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని, పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇజా మృతిచెందిందని రోదించారు. ఇజా మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీతో ఏం జరిగిందో విచారణ చేయాలని కోరారు. ఎస్సై జ్యోతి పాఠశాలకు చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ఇజా మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కొరడా కరీంనగర్ క్రైం: కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం–2005 (పీఎస్ఏఆర్ఏ) ప్రకారం లైసెన్స్ పొందిన తర్వాతే సేవలు అందించాలని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ వన్‌టౌన్, కరీంనగర్ టూటౌన్, చొప్పదండి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏజెన్సీల ద్వారా సుమారు 146 మంది సెక్యూరిటీ గార్డులు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సెక్యూరిటీ సేవలు నిర్వహించడం నేరమని, సంబంధిత యజమానులు వెంటనే అవసరమైన లైసెన్సులు పొందాలని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మల్యాల: మండలకేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కాలువల సత్య భర్త దుబాయ్ వెళ్లాడు. ఆమె కుమారుడితో కలిసి కరీంనగర్లో నివసిస్తోంది. సత్య తల్లి బుచ్చవ్వ ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటిని శుభ్రపరిచేందుకు వెళ్లగా.. తాళం పగులగొట్టి కనిపించింది. దీంతో సత్యకు ఫోన్లో సమాచారం ఇవ్వగా.. ఆమె చేరుకుని ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువా పగులగొట్టి ఉంది. అందులో దాచిన రెండు తులాల బంగారం, 35 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నాణ్యమైన విత్తనాలు కొనండి
కొత్తపల్లి(కరీంనగర్): రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందాలని డీఏవో జె.భాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం కార్పొరేటర్లు వేముల కవిత, వాసాల రమేశ్‌తో కలిసి విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు మేళా కొనసాగనుందని తెలిపారు. డీడీఏ కె.దామోదర్, ఏడీఏ ఓ.ఉష, ఏవోలు అనూష, బి.తిరుమలేశ్వర్, ఎంఏవో సంతోష్‌కుమార్, ఇఫ్కో సంస్థ జిల్లా మేనేజర్ బి.బాలాజీ పాల్గొన్నారు. శంకరపట్నం: గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పిల్లలను పంపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తామని సర్పంచ్ లావణ్య ప్రకటించారు. చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతం పెంచడమే లక్ష్యంగా తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఇంటిపన్ను మాఫీ చేస్తామని మంగళవారం పాలకవర్గం తీర్మాణించింది. తమ పిల్లలను సర్కారుబడికి పంపించే తల్లిదండ్రుల ఇంటిపన్నును సొంత డబ్బుతో ఐదేళ్లు చెల్లిస్తానని సర్పంచ్ హామీ పత్రాన్ని హెచ్ఎంకు అందజేశారు. కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్షిప్’ టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నగరంలోని ఎస్సారార్ ప్రభు త్వ అటనామస్ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రారంభించారు. మొదటి రోజు బీకాం విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్ లర్నింగ్’ పై శిక్షణ ఇచ్చా రు. శిక్షకులుగా కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగ అధ్యాపకుడు జడల రమే శ్, ప్రేమ్‌చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్, మహేందర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్, పైతాన్ లాంగ్వేజ్, డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా వినియోగించడంపై శిక్షణ ఇచ్చారు. కరీంనగర్‌టౌన్: ఏబీవీపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లా కన్వీనర్ పూసల విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయించారు. ప్రభుత్వం పాఠశాల విద్యపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారంలో చొరవచూపాలని సూచించారు. స్టేట్ హాస్టల్స్ కో–కన్వీనర్ బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముసరి మురళి, విగ్నేష్, వంశీ, విష్ణు పాల్గొన్నారు. ముగిసిన నిందితుల కస్టడీకరీంనగర్క్రైం: పీఎంజే జువెల్లరీ చోరీ కేసులో నిందితుల ఆరు రోజుల కస్టడీ మంగళవారంతో ముగిసింది. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి, మిగిలినవారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దోపిడీ అనంతరం బంగారాన్ని వివిధ చోట్లకు తరలించిన మరో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే వీరిని కరీంనగర్‌కు తీసుకురానున్నట్లు తెలిసింది. కొత్తపల్లి: బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్‌వర్క్స్, ఐబీ ఫీడర్ల పరిధిలోని సర్కస్ మైదానం, పద్మనాయక ఫంక్షన్ హాల్, ఐబీచౌరస్తా, సీఎస్ఐ హాస్పిటల్, రెడ్డిగారి వంటిల్లు, టీటీడీ కల్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్‌సెంటర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్‌కాలనీ ఫీడర్ పరిధిలోని తేజ స్కూల్, విద్యాధరి స్కూల్, రెడ్డి ఫంక్షన్‌హాల్, బూత్బంగ్లా, గుండు హనుమాన్ ఆలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
కరీంనగర్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు. సర్ కార్యక్రమం అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25నుంచి జూలై 24వరకు బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31నుంచి ఆగష్టు 30వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. బీఎల్వోలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లను గుర్తించి నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, మాస్టర్ ట్రైనర్ సంపత్, వివిధ పార్టీల నేతలు సిరాజ్ హుస్సేన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మిల్కూరి వాసుదేవ రెడ్డి, ఎర్రవెల్లి రవీందర్, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
కొత్తపల్లి(కరీంనగర్): యాదాద్రి పవర్ ప్లాంట్(వైటీపీఎస్)లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్‌పీ)లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీజీ జెన్కో చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మంగళవారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ ఆవరణలో నిరసన చేపపట్టారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్పీడీసీఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జెన్కో మేనేజ్మెంట్ టెండర్లు పిలవడం జరిగిందని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్‌ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే సుమారు 1,900 మంది ఉపాధి అవకాశలు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, రాజు, రమేష్, మహేందర్, సంపత్, శ్రీనివాస్, శ్రీనివాస్, పవన్ కుమార్, రజనీకాంత్, మధు, రమణారెడ్డి పాల్గొన్నారు. -
మోసం చేసింది!
మోటబావిసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: వాన ముఖం చాటేసింది. సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ సారి వ్యవసాయ బావులే సాగు కు దిక్కనుకుంటే అక్కడా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు జాడ లేకుండా పోయాయి. ఫలితంగా ఆరుద్ర కార్తె ప్రవేశించినా నేటికీ సరైన వర్షపాతం లేక రైతులు పొలాలు దున్నేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ నీరు అధికంగా తీసుకునే పంటలు కాకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి తమను ప్రకృతి బలంగా పగబట్టినట్లుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేశాయి, సాగునీరు అందించే జలాశయాల్లో నీళ్లు అడుగంటాయి, కనీసం వ్యవసాయ బావి మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుందామంటే భూగర్భజలాలు దారుణంగా పడిపోడి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. దారుణంగా పడిపోయిన జలాలు జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. గతేడాది మేతో పోల్చినప్పుడు గణనీయస్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. ముఖ్యంగా గంగాధర మండలంలో భూ ఉపరితలం నుంచి 15 మీటర్లలో బావులన్నీ ఎండిపోయాయి. చొప్పదండి మండలంలోనూ నీటిమట్టం 14 మీటర్ల లోతున పడిపోయి అదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ రూరల్, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట మండలాల్లో నీటి మట్టాలు కేవలం 4 మీటర్ల వరకే వెళ్లి నిలిచిపోయాయి. ఈ మండలాల్లో చుట్టుపక్కల ఎల్ఎండీ, ఎంఎండీ, పెద్ద చెరువులు ఉన్న కారణంగా ఇక్కడ భూగర్భ జలాలు అంతగా పడిపోలేదు. మిగిలిన మండలాల్లో సరైన నీటివనరులు లేకపోవడంతో ఇక్కడ భూగర్భజలాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. గతేడాది ఆయా మండలాల్లో భూగర్భ జలాలు మీటరు లోపే ఉండటం గమనార్హం. బోర్ల వైపు చూస్తున్న రైతులు.. ప్రస్తుతం సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడం, వ ర్షాలు ముఖం చాటేయడం, బావులలో నీరు పాతాళానికి పోతుండటంతో రైతులు తిరిగి బోర్లు వేసే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా ఈసారి పంటే వేయాలన్న పట్టుదలతో బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి పారుదల సౌకర్యం ఈసారి అంతగా కనిపించకపోవడంతో కౌలు రైతులు పొలాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బోర్లు లేకుండా పంట వేయలేమని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ బావులలో నీళ్లు అడగంటడం.. బోరు బావులు కొన్ని నిమిషాలు మాత్రమే నడవడంతో కొన్ని బావుల వద్ద నారు మడులు అంతంత మాత్రంగా తడుస్తున్నాయి.మండలం మే 2026 మే 2025 చిగురుమామిడి 7.71 0.40 చొప్పదండి 14.37 –1.25 ఇల్లందకుంట 5.62 0.27 గంగాధర 16.13 15.89 గన్నేరువరం 7.59 8.13 హుజూరాబాద్ 7.29 7.46 జమ్మికుంట 4.30 4.79 కరీంనగర్ 11.74 13.38 కరీంనగర్ రూరల్ 3.45 3.82 కొత్తపల్లి 9.15 9.01 కేశవపట్నం 5.86 6.16 మానకొండూరు 2.03 4.10 రామడుగు 11.03 10.57 సైదాపూర్ 4.91 6.72 తిమ్మాపూర్ 8.48 9.82 వీణవంక 4.64 4.88నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, పారకానికి బావి ఉంది. ఈ బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో రూ. మూడున్నర లక్షలు ఖర్చు చేసి 720 ఫీట్ల బోరు వేయించాను. ప్రస్తుతం బోరు 20 నిమిషాలు నడుస్తోంది. ఆ నీరు పశువులు తాగడానికే సరిపోతోంది. నారుమడికి పారడం లేదు. కాలం కరుణిస్తేనే పొలం సాగు చేస్తా. – అమ్ముల ఐలయ్య, గోపాల్రావుపల్లి, గంగాధర మండలం -
28న పల్స్ పోలియో
కరీంనగర్: ఈ నెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, సూపర్వైజరీ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుంచి ఐదు సంవత్సరాల్లోపు వయసు గల 91,178 మంది చిన్నారులను గుర్తించామని, వారికి పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 535 పోలియో బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే 1,00,300 వ్యాక్సిన్ డోసులు చేరాయని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సిబ్బందికి సమగ్ర అవగాహన బూత్‌ల నిర్వహణ, వ్యాక్సిన్ నిల్వ, రవాణా, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, ఇంటింటి సందర్శనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా వలస కార్మికులు, సంచార జాతుల (మైగ్రెంట్) కుటుంబాల పిల్లలను గుర్తించి, వారికిచుక్కలు అందేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుధ, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీవోఎంహెచ్‌ఎన్ డాక్టర్ సనా, డాక్టర్ విప్లవశ్రీ, పీవోఎన్సీడీ డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. -
చిరుధాన్యాలతో లాభాలు
కరీంనగర్ అర్బన్: చిరుధాన్యాల సాగులో యాజ మాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతోనే లాభాలు గడించవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ శాస్త్రవేత్తలు అనురాధ, దీపిక, శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వారా చిరుధాన్యాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణపై శిక్షణ, వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ చేపట్టారు. చిరుధాన్యాల సాగు వివరాలు, ఖేత్ బచావో అభియాన్ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చొప్పదండి, చిగురుమామిడి మండలాలకు చెందిన వివిధ గ్రామాల 40మంది షెడ్యూల్ కులాల రైతులకు 3 కిలోల పీవైపీఎస్–2 జొన్నలు, 2కిలోల పీఆర్ఎస్–2 రాగులు, బయో పెస్టిసైడ్స్ ట్రీకోడెర్మా, ఇమిడాక్లోప్రిడ్, ప్రొపికోనజోల్, కార్బొఫురన్ గుళికలు, టార్పాలిన్లు తదితర ఉత్పాదకాలను పంపిణీ చేశారు. తెలంగాణ రైతు విజ్ఙాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బోగరి హరికృష్ణ, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి బి.రాంప్రసాద్, శాస్త్రవేత్తలు ఇ.రజనీకాంత్, జి.ఉషారాణి, ఇ.ఉమారాణి పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
డ్రైనేజీల్లో ప్లాస్టిక్ గుట్టలు‘చేతిలో వాటర్ బాటిల్. నీళ్లు తాగడం ఆలస్యం. రోడు పక్కన డ్రైనేజీలో పడవేయడమే. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉందా డ్రైనేజీలో వేసేయడమే. పండ్లు, కూరగాయలు.. కవర్ ఏదైతేనేం డ్రైనేజీల్లో విసిరిస్తే సరి’ ఇలా పాదాచారులు, పరిసర నివాసితులు, దుకాణదారులు ఇష్టారీతిన పడవేస్తున్న ప్లాస్టిక్ డ్రైనేజీల్లో భూతంలా మారుతోంది. డ్రైనేజీలు, నాలాల్లో గుట్టలుగా పేరుకుపోయి మురుగునీటిని ముందుకు కదలనీయడం లేదు. దీంతో మురుగునీరు నిలిచిపోయి ఆ ప్రాంతమంతా దుర్వాసన, పందులు, దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వరద ముందుకు వెళ్లలేక రోడ్డెక్కడం, ఇండ్లను ముంచెత్తడం సాధారణంగా మారింది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలో కొద్దిరోజులుగా డ్రైనేజీలు, నాలాల్లో సిల్ట్ తొలగిస్తున్నారు. ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు దర్శనమిస్తున్నాయి. మంగళవారం నగరంలోని జ్యోతినగర్ శివ థియేటర్ సమీపంలో మెయిన్‌రోడ్డు వెంట డ్రైనేజీల్లో సిల్ట్ తీశారు. దుకాణాలు, వ్యాపారసంస్థలు అధికంగా ఉండే ఆ డ్రైనేజీ నుంచి కనీసం రెండు ట్రాక్టర్ల లోడ్‌కు మించి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు బయటపడడం నగరపాలకసంస్థ అధికారులనే కాదు, ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్లనూ షాక్‌కు గురిచేసింది. ప్లాస్టిక్ గుట్టలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ చూసి ఆశ్యర్యపోయారు. ఒక్క డ్రైనేజీలోనే రెండు ట్రాక్టర్ల లోడ్‌కు పైగా ప్లాస్టిక్ బయటపడితే, నగరవ్యాప్తంగా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఇదిలా ఉంటే డ్రైనేజీల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తీస్తే ఈ పరిస్థితి ఉండదని, ఏడాదికి ఒకసారి తీస్తే ఇలానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. – కరీంనగర్ కార్పొరేషన్ పరిశీలిస్తున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ -
దంచికొట్టిన వాన
పంచాయతీ కార్యాలయంలోకి వస్తున్న వరద ఇంట్లో చేరిన వరద శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామంలో సోమవారం వర్షం దంచి కొట్టింది. ఉక్కపోతతో సతమతమైన ప్రజలు వర్షంతో కొంత ఊరట చెందారు. వరదనీరు జీపీ కార్యాలయం, ఇళ్లల్లోకి చేరింది. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి ఎత్తు పెంచడంతో రోడ్డుపై వరదనీరు నేరుగా జీపీ భవనంలోకి చేరింది. డోర్లు వేసినా వరద నీరు ఆగక పోవడంతో జీపీ సిబ్బంది వరదనీటిని దారి మళ్లించారు. కుర్చీలు, టేబుళ్లు నీళ్లలో ఉండడంతో పైళ్లు తడవకుండా ఇబ్బందులు పడ్డారు. రజకవాడలోకి వరదనీరు చేరడంతో నిత్యావసర సామగ్రి తడిసిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
తుప్పు పడుతున్న ప్రభుత్వ వాహనం
‘రాజుల సొమ్ము రాళ్ల పాలేనంటూ’ చాటుతున్నారీ అధికారులు. అధికారుల ప్రయాణాల కోసం ప్రభుత్వం వాహనాలు కేటాయించగా కొత్త వాహనాల మోజులో పడిన అధికారులు పాత కారును ఇలా ముళ్లపొదల్లో పడేశారు. ఇదెక్కడో కాదు సాక్షాత్తు కలెక్టరేట్ సముదాయంలో హెలిప్యాడ్ నిర్మించే ప్రాంతంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. సదరు సఫారీ వాహనాన్ని వేలం వేసినా డబ్బులు వచ్చేవి లేదా చిన్నపాటి మరమ్మతు చేసినా వినియోగించే పరిస్థితి. కానీ, కనిపించకుండా ఓ మూలన పడేశారు. దీంతో కారు టైర్లు, ఇతర పరికరాలు చోరీకి గురవుతున్నాయి. లక్షలు వెచ్చించి ప్రభుత్వం వాహనం సమకూర్చితే లక్షణంగా వదిలేయడం విడ్డూరం. – కరీంనగర్ అర్బన్ -
బోగ్యాస్కు చెక్
● రేషన్, గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ తప్పనిసరి ● బోగస్ ఏరివేతకు కేంద్రం నిర్ణయం ● ఈ నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్కరీంనగర్అర్బన్: బోగస్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. గ్యాస్ కనెక్షన్‌దారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని లేకుంటే గ్యాస్ రాయితీ రద్దవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కలెక్టర్ చిత్రా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు. అలాగే రేషన్ కార్డు యజమానితో పాటు సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించగా జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతినెలా 1 నుంచి 15–17వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. మూడేళ్ల కిందటే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. కానీ, ఆచరణలో ఆమడదూరం. బోగస్ కనెక్షన్లు ఎన్నో? రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పరికిస్తే విస్తుపోవాల్సిందే. జిల్లాలో 10శాతం కుటుంబాలకే రేషన్ కార్డులు లేవని సమాచారం. బడా రాజకీయ నేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సీఏలు, పలు కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్నవారు మినహా అందరికీ రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 3.17లక్షలు కాగా గ్యాస్ కనెక్షన్లు 4.37లక్షలు అంటే 1.20లక్షల కనెక్షన్లు అదనంగా ఉన్నాయి. ఇందులో 20వేల కనెక్షన్లను మినహాయించినా లక్ష కనెక్షన్లు అదనమే. ఈ లెక్కన బోగస్ కనెక్షన్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కనెక్షన్లలో చాలావరకు మృతిచెందినవారి పేరున ఉన్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తయితే అక్రమాల చిట్టా వెలుగుచూడనుంది. నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్ర, ఐరిస్ ఇస్తే సరిపోతుంది. ఒక కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలనేది నిబంధన కాగా పలువురు రెండుమూడు ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఈకేవైసీ పూర్తయితే ఒకే గ్యాస్ కనెక్షన్‌కు సబ్సిడీ రానుంది. మరోరకంగా అక్రమ కనెక్షన్ల సంఖ్య వెలుగుచూడనుంది. మహాలక్ష్మి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 గ్యాస్ బండ ఇస్తుండగా ఉజ్వల పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేవైసీ చేసుకోకుంటే ఇవేవీ వర్తించవని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. నత్తనడకన రేషన్ కేవైసీ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకునే ప్రక్రియలో ఏలాంటి గడువు లేకపోగా ఎప్పుడైనా గడువు విధించవచ్చని, నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులోని ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధ్రువీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా, రేషన్ షాపులు మాత్రం మూసివేసి ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సరుకులు ఇచ్చేటప్పుడు మాత్రమే డీలర్లు దుకాణం తెరుస్తుండగా మిగతా సమయాల్లో సేవలందించడం లేదు. పరిస్థితి ఇలాగుంటే ఈకేవైసీ ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
తరలివచ్చి.. సమస్యలు విన్నవించి
మొత్తం అర్జీలు: 192, అత్యధికంగా హౌజింగ్: 71 కరీంనగర్ కార్పొరేషన్: 65 ఎన్పీడీసీఎల్: 06, వారధి సొసైటీ: 04కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ప్రజలు బారులు తీరారు. తమ పరిస్థితిని కలెక్టర్ చిత్రా మిశ్రాకు వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే, సార్లు లేకుండా ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రజావాణి బాట పట్టారు. ఒక్కో సారు రిటైరవుతుండగా టీచర్ పోస్టులు ఖాళీగా మిగులుతున్నాయని, భర్తీ చేయడం లేదని దివ్యాంగులు వాపోయారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిళ, జలకుమారి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లకు సంబంధించి మొత్తం 192 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్బంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వారి మాటల్లోనే.. -
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలో టౌన్ 2, ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గణేశ్‌నగర్, కమాన్ మెయిన్‌రోడ్, విశాల్‌మార్ట్, ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని వేంకటేశ్వరఆలయం కమాన్, బీరప్పగుడి కమాన్, కొత్తయాస్వాడ, విద్యానగర్, సాలంపుర ప్రాంతాలు, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్ వర్క్స్, ఐబీ ఫీడర్ పరిధిలో సర్కస్ మైదానం, పద్మనాయక ఫంక్షన్ హాల్, ఐబీ చౌరస్తా, సీఎస్ఐ హాస్పిటల్, టీటీడీ కళ్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్ సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
ప్రారంభానికి ముందే పగుళ్లు
కరీంనగర్ అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభానికి ముందే పగుళ్లు బారింది. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పనులు సా..గుతూనే ఉన్నాయి. అప్పటి కలెక్టర్ కర్ణన్ నుంచి ఇప్పటి కలెక్టర్ చిత్రా మిశ్రా వరకు నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించడం పరిపాటిగా సాగుతోంది. ఈ క్రమంలో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ 2లో నిర్మించగా భవనంపై ఫ్లోరింగ్‌లో చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. సెకండ్ కోటింగ్ రంగు వేయడం పూర్తవగా పై ప్రాంతంలో అసలు ప్రైమరీ, ఫైనల్ కలర్ వేయకుండానే వదిలేశారు. ఈ నెలలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయగా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 27న సీఎం ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం కాగా ఆ లోపు పనులు పూర్తవడం అనుమానమే. హడావుడి పనుల క్రమంలో నాణ్యతను విస్మరించే అవకాశాలు లేకపోలేదు. బిల్డింగ్‌పై పగుళ్లు, కలర్ వేయకుండా వదిలిన ప్రాంతం -
నేటి నుంచి విత్తన మేళా
కరీంనగర్‌అర్బన్: రైతుల ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండగా రైతు వేదికలను వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 30వరకు విత్తన మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో మేళా నిర్వహించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశం కాగా కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్థానికంగా ఉండే విత్తన డీలర్లు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సన్నరకాలైన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం–7715, డబ్ల్యూజీఎల్–44 విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కంది, పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు ఉండనున్నాయి. కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దయతోనే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రాజకీయంగా ఎదిగాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. శ్రీధర్‌బాబుపై మధు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. మధుకు రాజకీయ భిక్ష పెట్టిందే శ్రీధర్‌బాబు కుటుంబమన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మధు రూ.900 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రూ.3 లక్షల కోట్లు దోచుకుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను మధు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు, హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర ఆయనదని ధ్వజమెత్తారు. తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసి, అందులో రూ.3 లక్షల కోట్లను కేసీఆర్ కటుంబం దోచుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని, బీజేపీలో ఆ పార్టీ విలీనం కావడం ఖాయమన్నారు. నాయకులు సముద్రాల అజయ్, గోషిక శంకర్, రవీందర్ పాల్గొన్నారు. కరీంనగర్‌క్రైం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలను సోమవారం సీపీ గౌస్ ఆలం పోస్టర్ విడుదల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్–ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ తదితర కార్యక్రమాలు వారం పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు టీజీ ఏప్సెట్– 2026 తొలి విడత కౌన్సెలింగ్ సోమవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. మొదటి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 609 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించినట్లు పిన్సిపాల్ వివరించారు. -
డబుల్ బెడ్రూంలు ఇస్తారా.. ఆక్రమించుకోమంటారా..?
కరీంనగర్‌టౌన్: గత ప్రభుత్వ హయాంలో నిర్మించి న డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు ఇస్తారా.. లేక సీ పీఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకోమంటారా.. అని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో ఎంతోమంది నిరుపేదలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ కిరా యి కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పే ర్కొన్నారు. చింతకుంట ప్రాంతంలో సుమారు 600 ఇళ్లు నిర్మించి పదేళ్లు కావస్తున్నా అర్హులకు కే టాయించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వాటిని పంపిణీ చేయలేదని, తక్షణమే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రా జు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, బుచ్చన్నయాదవ్, అంజలి, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌కు సన్మానం
కరీంనగర్‌టౌన్: కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం నగర శివారులోని అల్గునూరులో దగ్ధమైన విషయం తెలిసిందే. కాగా అగ్నిప్రమాద సమయంలో బస్సులోని 39 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడిన డ్రై వర్ బోయిని ప్రశాంత్‌ను సోమవారం జేబీఎం, చక్రా ఈ –ట్రాన్స్ యాజమాన్యాలు సన్మానించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యతాయుతమైన చర్యల ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడటమే కాకుండా, టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్టను నిలబెట్టినందుకు గుర్తింపుగా ప్రాంతీయ రీజినల్ మేనేజర్ రాజు చేతుల మీదుగా ప్రత్యేక షీల్డ్, ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరె డ్డి, డిప్యూటీ ఆర్ఎం మల్లేశం, 2 డిపో మేనేజర్ శ్రీనివా స్, జేబీఎం ఆపరేషన్స్ మేనేజర్ అభిచరణ్, చక్రా ఈ –ట్రాన్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఖాన్, అన్వర్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో రైతు మృతి
చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు కుందేళ్ళ వెంకటయ్య (48) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెంకటయ్య ఆదివారం తన పొలంలో పనులు చేస్తుండగా ఎండ వేడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకటయ్య ఆదివారం మృతిచెందినట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య తెలిపారు. సోమవారం మృతుడి కొడుకు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించినట్లు వివరించారు. కరీంనగర్‌క్రైం: కరీంనగర్ నగరంలో ఓ వృద్ధురాలు బావిలో పడి మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. శర్మనగర్‌కు చెందిన నలుమాచు సుగుణమ్మ (80) వయసు మీద పడడంతో కళ్లు, చెవులు సరిగా పనిచేయడం లేదు. సోమవారం వేకువజామున ఇంట్లో వాళ్లు నిద్రలేచి చూసేసరికి సుగుణమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంట్లోని బావిలో చూసేసరికి కనిపించింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలుమల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు.. జగిత్యాల–కరీంనగర్ రహదారిపై సోమవారం వేకువజామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు కొండగట్టు సమీపంలో అదుపు తప్పి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కోరుట్లకు చెందిన నాగరాజు, అనిల్, మహమ్మద్ గాయపడ్డారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బైక్ దొంగ పట్టివేత
● వాహనం స్వాధీనం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తమ్మిశెట్టి రవీందర్‌కు చెందిన బైక్‌ను ఈనెల 19న అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన బోర్తుడి సంజీవ్ వాహన దొంగతనాలు చేస్తూ గతంలోనూ బెజ్జూరు, కాగజ్‌నగర్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో చోరీచేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. పెద్దపల్లికి చెందిన రవీందర్ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్‌ను సైతం అపహరించాడు. మంగళవారం శాంతినగర్ శివారు రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనతనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమై అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం విషయం తెలుసుకుంది. నేరాన్ని అంగీకరించడంతో బైక్‌ను స్వాధీనం చేసుకుని, సంజీవ్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. భూపాల్పల్లి డీటీవో వెంకన్న మృతికి నివాళి జగిత్యాలక్రైం: జిల్లాలో 27నెలలు ఎంవీఐగా పనిచేసి.. పదోన్నతిపై భూపాల్పల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం టిప్పర్ ఢీకొని మృతిచెందడంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన వెంకన్న 2003లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. కేటీపీఎస్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏడీఏగా పదోన్నతి పొందారు. ఏపీపీఎస్సీలో పరీక్ష రాసి రవాణా శాఖలో ఎంవీఐగా ఉద్యోగం పొందారు. 15 రోజుల క్రితమే భూపాల్పల్లి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతిపై జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సందాని, ఎంవీఐ రామారావు, అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్‌లు సంతాపం వ్యక్తం చేశారు. అప్పుల బాధ తో వ్యక్తి ఆత్మహత్య ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన బాలసాని బాలరాజు(40) ఆదివా రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బాలరాజు భార్య క్యాన్సర్ వ్యాధికి గురై మృతిచెందింది. ఆమె చికిత్స కోసం బాలరాజు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేక మనోవేదనకు గురైన బాలరాజు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారుడు, కూతురు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం, మానవతవాదులు చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్యోతి తెలిపారు. -
దశాబ్దం తర్వాత బడికి ఊపిరి
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎంఈవో తదితరులు పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంఈవో కనకతార, సర్పంచ్, ఉపాధ్యాయులు మెట్‌పల్లిరూరల్: దశాబ్దాల తరబడి పిల్లలకు అక్షరాలు నేర్పి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల మూతబడడంతో ఆ గ్రామ సర్పంచ్ దంపతులు చలించిపోయారు. మూతబడిన ఆ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కంకణం కట్టుకున్నారు. ముందుగా తమ ఇద్దరు పిల్లలను పాఠఽశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఇందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పాఠశాలను తెరిపించాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో చర్యలు చేపట్టిన అధికారులు మూతబడిన పాఠశాలను తెరిపించారు. మెట్పల్లి మండలం కేసీఆర్తండాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పదేళ్ల కిందట మూతబడింది. అప్పటి నుంచి ఆ పాఠశాలను తిరిగి తెరిపించాలని ఎవరూ దృష్టి సారించలేదు. ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికై న మంజుల, గణేశ్ దంపతులు పాఠశాలకు పూర్వవైభవం తేవాలని వారి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని ఊరంతా తెలిపారు. దీంతో మిగతా వారు కూడా తమ పిల్లలను చేర్పిస్తామని చెప్పడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను పునఃప్రారంభించారు. మెట్పల్లి ఎంఈవో కనకతార సోమవారం పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో సాముహిక అక్షరాభ్యాసం చేయించారు. పుస్తకాలు, నోట్‌బుక్కులు ఇతర సామగ్రి అందించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 25 ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ మదన్‌లాల్, విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాల సర్పంచ్ తన పిల్లలను చేర్పించడంతో పూర్వవైభవం 25మందికి చేరిన విద్యార్థుల సంఖ్య -
ఒద్యారం స్కూల్‌కు జాతీయ పురస్కారం
కరీంనగర్‌టౌన్: జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. కరీంనగర్ జిల్లా నుంచి ఒద్యారం ప్రభుత్వ హైస్కూల్, పెద్దపల్లి జిల్లా నుంచి ఎల్కపల్లి పాఠశాల, జగిత్యాల జిల్లా నుంచి బీర్పూర్ పాఠశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నెహ్రూనగర్ హైస్కూల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్)ను రెండేళ్లుగా ప్రకటిస్తుంది. పాఠశాల ఆవరణ, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన నీరు, పచ్చదనం తదితర అంశాలను పరిశీలించి గ్రేడ్ నిర్ణయిస్తారు. కరీంనగర్ జిల్లాలోని ఒద్యారం పాఠశాలలో 300 రకాల చెట్లను విద్యార్థులు సంరక్షిస్తూ, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ, సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకు గానూ రాష్ట్ర స్థాయిలో ఎంపికై న 10 పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు స్కూళ్లు ఎంపికవగా, కరీంనగర్లో ఒద్యారం జడ్పీహెచ్ఎస్ను ఎంపిక చేశారు. మెరిట్ సర్టిఫికెట్తో పాటు రూ.1లక్ష ప్రోత్సాహక నిధి, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక విద్యా అధ్యాయన పర్యటనకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బెల్టుషాపుల బంద్‌కు జీపీ తీర్మానం
జమ్మికుంట: మద్యం అమ్మకాల కట్టడికి మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచన చేసింది. సోమవారం సర్పంచ్ పసుల తిరుమల అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్‌షాపుల నిర్వహణ బంద్ చేయాలని తీర్మానం చేశారు. జీపీ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందని, మద్యం విక్రయాలకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ.2వేల బహుమతి అందజేస్తామని పాలకవర్గం తీర్మానం చేసింది. కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, వార్డు సభ్యులు సురేశ్, సాయిరాం, హసీనా, శ్రీనివాస్, కళ్యాణి, శేషివాదన, ఆంజనేయులు, చెన్నబోయిన చంద్రమౌళి, రాణి తదితరులు పాల్గొన్నారు. కాగా బెల్ట్‌షాపుల బంద్‌పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసున్నారు. -
రూ.14.56 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం
కరీంనగర్‌సిటీ: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల వసతి గృహాల సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు అధికారికంగా మొదలుకానున్నాయని సోమవారం వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. రూ.14.56 కోట్ల అంచనాతో రెండు హాస్టళ్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారని పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నం.132/1లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో వసతి గృహాలను నిర్మించనున్నారు. పనులు వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను వీసీ ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుందని, 2027 జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన వసతి, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
నాగ్‌పూర్ టు అల్గునూర్
● గంజాయి తరలిస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులు తిమ్మాపూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గంజాయి కొనుగోలు చేసి తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో యువకులకు అమ్ముతున్న అల్గునూర్‌కు చెందిన అందె అజయ్, సిల్ల పరశురామ్, ముసాపురి అరవింద్‌ను ఎల్ఎండీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై అన్వర్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం ముగ్గురు యువకులు గంజాయితో బైక్‌పై అల్గునూర్వైపు వెళ్తున్నారని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అల్గూనూర్ చౌరస్తాలో గంజాయితో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నించారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఛేజ్ పట్టుకున్న పోలీసులు.. వారిని తనిఖీ చేయగా, పాలిథిన్ కవర్లో 235 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అదుపులోకి తీసున్నారు. యువకుల నుంచి బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
ఇక విత్తనోత్పత్తి బాటలో..
వేములవాడరూరల్: రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు పండించిన ధాన్యం కొంటున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఇక విత్తనోత్పత్తిని చేపట్టనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రణాళిక రూపొందించి నాబార్డు సహకారంతో విత్తనాలను తయారు చేసి సొసైటీల ద్వారా రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈనెల 20న కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సమావేశమయ్యారు. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 12 సొసైటీల్లో విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. 12 సొసైటీల్లో పైలట్ ప్రాజెక్టుగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక్కో జిల్లా నుంచి మూడే సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాజన్నసిరిసిల్లలో వేములవాడ, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కరీంనగర్ జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట, జగిత్యాల జిల్లాలో రాయికల్, జైన, బీర్పూర్, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, నందిమేడారం, ఎలిగేడు ప్రాథమిక సహకార కేంద్రాలను ఎంపిక చేశారు. పీఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు నాణ్యమైన విత్తనోత్పత్తి చేయనున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. సీడ్ ఉత్పత్తి తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేసే సొంత బ్రాండ్‌తో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల సరఫరా ధాన్యం కొనుగోళ్లతో తోడ్పాటు రైతుల అభివృద్ధిలో సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలో 12 సొసైటీలు ఎంపిక -
ఆవునూర్‌లో అపురూప పురాతన విగ్రహాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని ఆవునూర్‌లో ప్రాచీన శివాలయం పరిసరాల్లో వందల ఏళ్ల నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపే రాజ్‌కుమార్ తెలిపారు. సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ఆవునూర్‌కు ప్రాచీన చరిత్ర ఉందని, చెరువుకట్ట సమీపంలోని శివాలయ ప్రాంగణంలో చాముండేశ్వరీ విగ్రహం ఉందని, ఇది 14వ శతాబ్దానికి చెందిందని తెలిపారు. పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం, పరహస్తాల్లో కత్తి, రక్తపాత్రలతో సుఖాసీనస్థితిలో విగ్రహం ఉందని, కరండ మకుటాన్ని ధరించి ఉందని పేర్కొన్నారు. 15వ శతాబ్దానికి చెందిన కాలభైరవుడు జ్వాలాకేశాలతో పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం కలిగి ఉన్నాడని, పరహస్తాల్లో ఖడ్గం, ఖండిత శిరస్సును కలిగి ఉన్నాడని, నగ్నమొలతో, నడుముకు కపాల మేఖలను ధరించి ఉన్నాడని తెలిపారు. ఖండిత శిరస్సు రక్తపు చుక్కల కోసం కుక్కపైకి దుముకుతున్న దృశ్యాలను శిల్పులు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. గుడి ప్రాంగణంలో చాళుక్యశైలి పోలిన నంది 12వ శతాబ్దానికి చెందిందన్నారు. సంతానం కోసం ఆరాధించే నాగశిల కూడా ప్రాచీనమైందని తెలిపారు. అమూల్యమైన ప్రాచీనశిల్ప సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాముండేశ్వరీ విగ్రహం కాలభైరవుడి విగ్రహం చరిత్ర పరిశోధకుడు రాజ్‌కుమార్ -
సొసైటీ బ్రాండ్‌తోనే..
ఇప్పటి వరకు సొసైటీల ద్వారా ఎరువులు, రుణాలు, ధాన్యం కొనుగోళ్లు మాత్రమే చేపట్టాం. ఇక నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను రైతులకు సొసైటీ బ్రాండ్‌తో ఇవ్వనున్నాం. ఇలా ఇవ్వడం ద్వారా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చు. – జిల్లా రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా.ఆర్.సాయికుమార్ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సొసైటీ ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టి సొసైటీ బ్రాండ్‌పై రైతులకు అందిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద వేములవాడ సొసైటీని ఎంపిక చేశారు. మా సొసైటీకి విత్తనోత్పత్తి చేసేందుకు సొంత స్థలాలు కూడా ఉన్నాయి. – ఏనుగు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వేములవాడ -
పీఎంజే కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
కరీంనగర్‌క్రైం: పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17న కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు నిందితులు సుబోధ్‌సింగ్, రఘునాథ్, రావిష్, అమర్‌సింగ్, జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్‌ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామడుగు మండల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్సీ కార్డులు, మొబైల్ ఫోన్, అక్కడే దాచి ఉంచిన పిస్టల్, మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు ఎండీ ఆదిల్‌ఖాన్‌ను బిహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటాకార్ డ్రైవర్ జైనులబ్దీన్కు ఆదిల్ఖానే కారు, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. మహమ్మద్ మెహతాబ్‌ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు అరెస్టయి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ సిబ్బందిని సీపీ అభినందించారు. -
యువకుడి అదృశ్యం
సైదాపూర్: మండలంలోని పెరుకపల్లి గ్రామానికి చెందిన అర్కల అనిల్(27) గురువారం నుంచి కనిపించడంలేదని బంధువులు ఫిర్యాదు చేసినట్లు సైదాపూర్ ఎస్సై స్వాతి ఆదివారం తెలిపారు. అనిల్‌కు గొల్లగూడెంకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. మనస్పర్థలతో రెండు నెలల క్రితం విడాకులు పొందారు. గురువారం ఇంటి నుంచి సైదాపూర్‌కు వచ్చి కూరగాయల మార్కెట్లో బైక్ పెట్టాడు. తన తమ్ముడు రాకేష్‌కు సెల్ ఫోన్ బండి టూల్ బాక్స్‌లో, తాళం ట్యాంక్ కవర్లో పెట్టానని సందేశం పెట్టాడు. తర్వాత ఫోన్ కాంటాక్టులు డిలీట్ చేశాడు. శుక్రవారం బంధువులు అనిల్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వానమ్మా.. రావమ్మా
కరీంనగర్ అర్బన్: మృగశిర ముగిసి నేటినుంచి ఆరుద్ర కార్తె ప్రవేశిస్తుండగా జాడలేని వానలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎండలు దంచి కొడుతుండగా.. వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక విత్తనాలు మొలవడం లేదు. మొలిచి నా నిలవడం లేదు. ప్రభుత్వ ఆదరణ ఉందా అంటే అదీ లేదు. రైతు భరోసా జాడ లేకపోగా.. రైతు బీమా ఊసే లేకుండా పోయింది. రాయితీ విత్తనాల మాట వినిపించక పోగా.. అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రిక్తహస్తం చూపుతుండటంతో అన్నదాత బతుకు జీవుడా అంటూ బిక్కుబిక్కుమంటున్నాడు. వర్షాభావంతో రూ.కోట్లలో నష్టం మృగశిర ఆరంభంలో వర్షాలు ఊరించగా అంతలోనే ముఖం చాటేశాయి. జిల్లాలో కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి, గన్నేరువరం, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, శఽంకరపట్నం, మానకొండూరు, వీణవంక, సైదాపూర్ తదితర ప్రాంతాల్లో పత్తి సాగు చేశారు. నేలలో ఆశించిన వర్షపాతం నమోదవకుండానే దుక్కిలోనే విత్తనాలు వేశారు. విత్తనాలు వేసి 15రోజులు దాటగా 75శాతమే మొలక రాగా ప్రస్తుతం ఆ మొక్కలూ వాడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లాలో రూ.70కోట్ల వరకు నష్టం వాటిల్లనుంది. దుక్కులు, విత్తనాలతో పాటు కూలీ ఖర్చులు తడిసి మోపెడవనున్నాయి. బ్యాంకర్ల కొర్రీలు సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు ఏటా కొర్రీలతో వేధిస్తుండగా ఈ సారి రుణ ప్రణాళికే ఖరారు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అనువైన సమయంలో రుణాలందితే రైతులకు కొండంత అండగా ఉండేది. అలాంటిది ఇప్పటి వరకు కమిటీ స మావేశం కాకపోవడం రుణ ప్రణాళికను ఆమోదించకపోవడం దేనికి సంకేతమని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ ఇంకా పరిపూర్ణం కాకపోవడంతో లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకలయ్యారు. విత్తనాలు ఏవి? రాయితీ విత్తనాలకు మంగళం పాడగా పచ్చిరొట్ట మాత్రమే ఇస్తున్నారు. వరి విత్తనాలు ఆశించినస్థాయిలో ఇవ్వడం లేదు. వేరుఽశనగ, కందులు, శనగ, మినుములు, పెసలు ఇతర విత్తనాలు గతంలో ఆన్లైన్ ద్వారా పంపిణీ చేయగా రెండేళ్లుగా ఆ ఊసే లేదు. ఏటా పంపిణీ చేసే విత్తనాలు క్షేత్రస్థాయి డిమాండ్‌కు సరిపోవడం లేదు. పరిఽశోధన స్థానాలు గానీ విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాల నిల్వలపై ప్రచారం చేయకపోవడం శోచనీయం. పంట డబ్బులు రాలేదు.. రైతు భరోసా జాడ లేదు అన్నదాతకు ఆర్థిక భరోసాగా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుండగా ఇంకా అతీగతి లేదు. యాసంగి సీజన్లో కేవలం ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయం రూ.6వేలు రైతుల ఖాతాలో పడింది. లక్షల మందికి సాయం అందాల్సి ఉండగా స్పష్టత లేదు. తాజాగా వానాకాలం సీజన్‌కు పెట్టుబడి సాయం పడాల్సి ఉండగా, ప్రక్రియ మొదలు కాలేదు. జిల్లాలో గత సంవత్సరం వానాకాలం సాగులో రూ.150కోట్లు విడుదల చేయగా అంతకుముందు యాసంగికి గానూ రూ.145కోట్లు జమ చేశారు. ఇక ధాన్యం, మక్కలు విక్రయించిన రైతులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే నగదు ఖాతాకు చేరుతుందని ప్రభుత్వం ప్రకటించగా క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది. రైతు బీమా ఏది? సహజ మరణమైనా, ఏ కారణంతో మరణించినా రైతు బీమా కింద సదరు కుటుంబానికి రూ.5లక్షలు రావాల్సి ఉండగా వందకు పైగా బాధిత కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా ప్రభుత్వ సాంత్వన కరవైంది. 60ఏళ్లలోపు వయసు ఉంటే బీమాకు అర్హత కాగా ఏడాదికి పైగా బీమా సొమ్ము కోసం పడిగాపులు కాస్తున్నారు. 120మందికి బీమా డబ్బులు రావాల్సి ఉండగా అవి సదరు కుటుంబాలకు ఎంతో ఆసరా. ఎల్ఐసీకి ఏటా బీమా ప్రీమియం ప్రభుత్వం రెండు సార్లు చెల్లించాల్సి ఉండగా గత ఫిబ్రవరిలో చెల్లించలేదని సమాచారం.జిల్లాలో సాగు విస్తీర్ణం 3,41,056ఎకరాలు(అంచనా) వేసిన పత్తి: 40,500ఎకరాలు విత్తన ఖర్చు: 11.50కోట్లు డ్రైస్పెల్ ఇలాగే 3రోజులు సాగితే.. విత్తన, దుక్కి, లేబర్ ఖర్చులు వృథాజూన్లో ఇప్పటి వరకు కురవాల్సిన వాన 98.3మిల్లీ మీటర్లు నమోదైన వర్షపాతం: 45.7 మిల్లీ మీటరు వర్షం కురిసిన రోజులు: 3 -
పెద్ద బాడిసె పుస్తకావిష్కరణ
కరీంనగర్‌కల్చరల్: అద్భుతమైన చరిత్రకు, అభ్యుదయ పోరాటాలకు నిలయమైన కరీంనగర్ నేల నుంచి విశ్వకర్మల వృత్తి పనిముట్లను అక్షరబద్ధం చేస్తూ చారిత్రక కావ్యంగా పెద్ద బాడిసె కవితా సంపుటిని అందించడం అభినందనీయమని గంటా మనోహర్‌రెడ్డి అన్నారు. భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఫిలిం భవన్లో మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ద బాడిసె కవితా సంపుటిని ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకట్ల తిరుపతి, ఆంగ్ల కవి గందె పరశురాంరావు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అనేక వస్తువులను కవితా రూపంలో చక్కగా వివరించారని తెలిపారు. పెద్దిరాజు సత్యనారాయణ రాజు ఆహ్వానం పలికిన ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్‌రెడ్డి, కాళిదాసు, కసిరెడ్డి జలంధర్‌రెడ్డి, తడిగొప్పుల కుమారస్వామి, చిమ్మని చంద్రశేఖర్, జి.హన్మయాచారి, కొండ దినేశ్, జి.రాజమల్లయ్య, సందెవేని నరేంద్ర, కట్ట శ్యామ్‌సుందర్, రాపర్తి వెంకటేశ్వర్లు, గూడెపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయించిన ఉపాధి
● ఆర్థికాభివృద్ధిలో మహిళల ముందడుగు ● ఉదయం పూట వ్యాపార బాట ● కుటుంబానికి ఆసరా ● సమాజంలో ఆదర్శంవేములవాడ: నేటి మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం.. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పనిచేయడం కంటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. చిన్న వ్యాపారం చేసినా సొంత కాళ్లపై నిలబడతామన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. వేములవాడ పట్టణంలో పలువురు మహిళలు ఉదయం పూటే తమ వ్యాపారాలను ప్రారంభించి మధ్యాహ్నంలోపే ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. మిల్లెట్స్ పేరిట ఆరోగ్యకరమైన అల్పాహారం, పాలు, కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. కుటుంబ బాధ్యతలతోపాటు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
రైల్వే ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి
రామగుండం: ఆటో కిరాయి విషయమై తలెత్తిన వివాదంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రామగుండం చేరుకున్న విజయ్‌కుమార్ అనే కార్మికుడు కరీంనగర్‌కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోవాలాను సంప్రదించాడు. కిరాయి విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్‌కుమార్‌పై ఆటో డ్రైవర్ దాడి చేయడంతో గాయపడ్డాడు. సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉపక్రమించగా మిగతా ఆటోడ్రైవర్లు అతనిని వారించడంతో ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా అస్వస్థత● చాకచక్యంగా రోడ్డును దింపిన బస్సు ● ప్రభుత్వాసుపత్రికి డ్రైవర్ తరలింపుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దకల్వల స్టేజీ సమీపంలోకి చేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిరుపతి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న బస్సు (టీఎస్ 02 9326) నడుపుతున్న డ్రైవర్ తిరుపతికి కుడి చేయి కాలు పనిచేయకపోవడంతో హైరానా పడ్డాడు. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. గమనించిన కండక్టర్ భారతి, బస్సులోని 25మంది ప్రయాణికులు వెంటనే డ్రైవర్ తిరుపతిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. డ్రైవర్ చాకచక్యంగా రోడ్డు పక్కన నిలపడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతిగంగాధర: గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్‌షాక్‌తో ఆరెపల్లి హన్మయ్య(60) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం విరిగిపడి, వైర్లు కింద పడిపోయాయి. బైక్‌పై వెళ్తున్న హన్మయ్య వైర్లు గమనించక ముందుకు కదిలాడు. కాళ్లకు తీగలు తగిలి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
వేములవాడలో రంగుబిల్లల జూదం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని రంగుబిల్లల జూదం పేరుతో అందినకాడికి ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు శనివారం రాత్రి వరంగల్ జిల్లా నుంచి ఓ కుటుంబం వేములవాడకు చేరుకుంది. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నాక కుటుంబ సభ్యుల్లోని ఒకరు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో నిర్వహిస్తున్న రంగుబిల్లల జూదం వైపు వెళ్లాడు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమవారాల్లో జాతరగ్రౌండ్, ఓపెన్ పార్కింగ్ స్థలం ప్రాంతాల్లో రంగుబిల్లల జూదం రూ.100తో మొదలై రూ.5 వేల వరకు సాగుతోంది. ఇందులో నిర్వాహకులు మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో ఆట ఆడుతూ ఏకంగా ఓ వ్యక్తి రూ.5 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో నగదు పోగొట్టుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నగదు పోగొట్టుకున్న కుటుంబానికి కొంత నగదు ఇచ్చి అక్కడ నుంచి నిర్వాహకులు జారుకున్నారు. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్న జూదం అంశంపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అమాయక భక్తులే టార్గెట్ -
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
● రవాణాశాఖ మంత్రి పొన్నం హుజూరాబాద్/చిగురుమామిడి/శంకరపట్నం: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవా ణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, తిరుపతి, శంకర్ పాల్గొన్నారు. ఫోర్‌లైన్ బాధితులకు న్యాయం చేయాలి చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఫోర్‌లైన్ నిర్మాణంలో ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఆదివారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం ఇప్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సర్పంచ్ జంగ శిరీష, హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, చిగురుమామిడి సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచ్ మెడబోయిన రాజు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరాఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు. కేశవపట్నం మీదుగా వెళ్తూ, కాన్వాయ్ ఆపి స్థానికులతో మాట్లాడారు. మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద రిక్వెస్ట్‌స్టాప్ ఏర్పాటు చేసినా బస్సులు ఆగడం లేదని మంత్రికి స్థానికులు వివరించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక రావడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. వెల్నెస్ సెంటర్లో వైద్యుల ఇష్టారాజ్యంకరీంనగర్: కరీంనగర్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వెల్నెస్ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవల కోసం వచ్చారు. ఓపీ సమయం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత డాక్టర్ గది తలుపు తెరవకుండా రోగులను వేచి ఉండేలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌ను పలు మార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా వైద్యులు అందుబాటులోకి రాకపోవడం, రోగుల సమస్యలను పట్టించుకోకపోవడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం విచారకరమని పేర్కొన్నారు. సెంటర్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. టీజీ ఏప్సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకోసం ఈనెల 19వ తేదీ 28 వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 22వ తేదీ నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ప్రిన్సిపాల్ డి.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచినా రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేయడంలోనూ, కొత్త పంట రుణాలు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. -
యోగా.. వేడుకగా
కరీంనగర్లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, యోగాసనాలు వేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్‌క్రైం: అంతర్జాతీయ యోగాడేను ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఉదయాన్నే ఆయా ప్రాంతాల్లో యోగా గురువుల సమక్షంలో ఆసనాలు వేశారు. పలువురు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయుష్‌శాఖ వరంగల్ రీజినల్ ప్రాంతీయ అధికారి ప్రమీలాదేవి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన జడ్జి ఎస్.శివకుమార్, జడ్జిలు సంతోష్ కుమార్, నీరజ, పావని, చిరాగ్ మెహతా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో యోగా డే నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో యోగా వాక్‌ను జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ప్రారంభించారు. -
పేషెంటుగా వచ్చి.. దొంగతనానికి యత్నించి
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. పేషెంటుగా ఆసుపత్రికి వచ్చిన ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలోని గదుల్లో జనం రద్దీ లేని డ్రెస్సింగ్ రూంలోకి చేరి అక్కడ ఉన్న కొంత సామగ్రిని సంచిలో వేసుకున్నాడు. అలాగే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది బ్యాగులో ఉంచిన సెల్‌ఫోన్‌ను కూడా అపహరించాడు. సీసీ కెమెరాలో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. పొరపాటు చేశానని, ఇకముందు ఇలాంటి తప్పులు చేయనని వేడుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సదరు వ్యక్తిని మందలించి వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిరామగుండం: రామగుండం టెంపుల్ రోడ్డులో నివాసముంటున్న మాచినేని రమేశ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషన్ భగీరథలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న రమేశ్ ఆదివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రామగుండం రైల్వే వంతెనపై వెనుక నుంచి బొలేరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం ఎస్సై గుండేటి సంధ్యారాణి తెలిపారు. కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతోంది. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఆదివారం కాశ్మీర్‌గడ్డ మైసమ్మ చెట్టు ప్రాంతంలో కుక్కలు దాడులకు దిగాయి. పలువురిని గాయపరిచాయి. కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలను నగరపాలకసంస్థ ప్రారంభించినప్పటికి, సరిపడా సంఖ్యలో చేసే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కల బెడదను నివారించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
నీట్‌కు 2,661 మంది హాజరు
కరీంనగర్‌టౌన్: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలి పారు. పరీక్ష నిర్వహణను కలెక్టర్, సీపీ గౌస్ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. కరీంనగర్‌లోని ఎస్ ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను సందర్శించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. 2,661 మంది హాజరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షకేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులకు 2,661 మంది హాజరయ్యారు. 340 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో 744 మందికి 662మంది హాజరుకాగా, 82మంది గైర్హాజరయ్యారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో 720 మందికి 651మంది హాజరయ్యారు. 69మంది గైర్హాజరయ్యారు. అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లో 408 మందికి 359 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో 361 మందికి 316మంది హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 312 మందికి 278 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో 288 మందికి గాను 251మంది హాజరుకాగా, 37 మంది గైర్హాజరయ్యారు. చింతకుంటలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల జూనియర్ కళాశాలలో 168 మందికి 144మంది హాజరుకాగా, 24 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థికి పోలీస్ సాయం కరీంనగర్ క్రైం: నీట్ పరీక్ష రాసేందుకు ఓ యువతి కరీంనగర్ వచ్చింది. సమయం గడిచిపోతుండడంతో ఆందోళనతో ఉంది. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ తన బైక్‌పై యువతిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద చేర్చాడు. కానిస్టేబుల్‌ను సీపీ అభినందించారు.నగరంలోని మహిళా కళాశాల వద్ద పరీక్షకు హాజరైన విద్యార్థులు -
భారీగా ఈదురుగాలులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రాంతంలో ఆదివారం భారీగా ఈదురుగాలులు వీచాయి. పెద్దపల్లి మండలం అందుగులపల్లి, భోజన్నపేట గ్రామాల్లో కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. అందుగులపల్లికి చెందిన కామ వెంకటి ఇంటిపై కప్పు ఎగిరిపోగా పైకప్పు రేకులు చెల్లాచెదురుగా పడ్డాయి. భోజన్నపేటలో విద్యుత్ తీగలు రాపిడి జరిగి చెలరేగిన మంటలు సమీపంలో ఉన్న కల్వల సంపత్, రాజయ్యలకు చెందిన వరిగడ్డి కుప్పలపై పడ్డాయి. వరిగడ్డికి నిప్పంటుకోవడంతో సమీపంలో ఉన్న ఇంటియజమానులు, గ్రామస్తులు హైరానా పడ్డారు. ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం వచ్చినా అక్కడకు చేరుకునే మార్గంలేక పోవడంతో సమీపంలో ఉన్న వ్యవసాయబావి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకుని మంటలను అదుపు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఊపిరిపీల్చుకున్నారు. మెట్పల్లి పాఠశాలలో చోరీశంకరపట్నం: మండలంలోని మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పట్టపగలు చోరీ జరిగింది. ఉదయం పాఠశాలలో యోగా డే జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఆరుగురు మైనర్లు కంప్యూటర్ గదులకు వేసిన తాళాలు పగులగొట్టి కంప్యూటర్లను ధ్వంసం చేశారు. రెండు సైకిళ్లు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టి సైకిళ్లను పాఠశాలకు అప్పగించారు. రూ.లక్షలు విలువ చేసే కంప్యూటర్లను ధ్వంసం చేసిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. హత్యాయత్నం ఘటనపై కేసు నమోదుకరీంనగర్ క్రైం: కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్పై ఈ నెల 18న గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18 రాత్రి 11 గంటల ప్రాంతంలో తన బైక్‌పై కిసాన్‌నగర్‌లో రోడ్డుపై వెళ్తుండగా వెనుకవైపు నుంచి ఓ కారు అతివేగంగా ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిందని తెలిపాడు. కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు గమనించానని, తన బైకును ఢీకొట్టిన తరువాత మళ్లీ ఢీకొట్టేందుకు యత్నించారని ఆరోపించాడు. ఈ ఘటనలో తనకు తీవ్రగాయాలు కాగా, బైక్ ధ్వంసమైందని తెలిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్రీటౌన్ సీఐ తిరుమల్ తెలిపారు. -
బుద్ధుని శిల్పం కాదు
వేములవాడ: వేములవాడ భీమేశ్వరాలయంలో గల మానవ శిల్పాన్ని గతంలో ‘బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పం’గా భావించి ప్రచారం చేసినట్లు చరిత్ర పరిశోధకుడు, డిస్కవరీ మ్యాన్రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం తన అభిప్రాయాన్ని వెల్ల డించారు. భీమేశ్వరాలయంపై 30 రోజుల చాలెంజ్‌లో భాగంగా రూపొందించిన వీడియోల్లో ఆలయం అడుగుభాగంలో పడుకుని ఉన్న మానవ శిల్పాన్ని పొరపాటున బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పంగా పేర్కొన్నానని ఆయన చెప్పారు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దానిలో యజ్ఞోపవీతం (జంధ్యం) స్పష్టంగా కనిపించడంతోపాటు, శిల్పానికి చిరు బొజ్జ కూడా చెక్కి ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ రెండు లక్షణాలు హిందూ భక్తుని రూపాన్ని సూచిస్తున్నాయని, బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పాల్లో ఇటువంటి లక్షణాలు సాధారణంగా కనిపించవని అభిప్రాయపడ్డారు. భీమేశ్వరాలయం ఆది నుంచి శైవక్షేత్రంగానే కొనసాగిందని, ఇప్పటివరకు ఈ ఆలయం బౌద్ధారామంగా లేదా జైన దేవాలయంగా ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. పురావస్తు, చారిత్రక అంశాలపై పరిశోధనలు చేసే సమయంలో కొత్త ఆధారాలు లభించినప్పుడు గత అభిప్రాయాలను సవరించుకోవడం పరిశోధనలో సహజ ప్రక్రియేనని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పరిశోధకుల బాధ్యత అని పేర్కొన్నారు. టేకు కలప పట్టివేతమానకొండూర్: మానకొండూర్ మండలంలోని రంగపేట సర్పంచ్ ఇంటి వద్ద ట్రాక్టర్లో ఉన్న కలపను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ కొత్త రాంరెడ్డి ఇంటి వద్ద టేకు కలప ట్రాక్టర్లో లోడుతో ఉన్న సమాచారాన్ని ఫారెస్టు అధికారులు తెలుసుకుని శనివారం అర్ధరాత్రి దాటాక దాడిచేసి పట్టుకున్నారు. పోలీసుల పర్యవేక్షణలో ట్రాక్టర్‌ను కరీంనగర్ కార్యాలయానికి తరలించారు. -
దిగుబడి మేలు..దిగుమతి వద్దు
కరీంనగర్ అర్బన్: రైతులు సాంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్ అవసరాలను బట్టి సాగు చేయడం ప్రస్తుతం అవసరం. ఒకప్పుడు అనుములు, మినుములు, పెసలు, కందులు, జొన్నలు, రాగుల పంటలతో అలరారిన పొలాలు నేడు వరి, పత్తి పంటలకే పరిమితం అవుతున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాలపై ఆధారపడాల్సిందేనా.? గత సీజన్లో 3.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2.75 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీంతో జిల్లాలో నిత్యావసరాలకు దిగుమతే గతి కానుంది. వ్యవసాయ నిపుణులు సైతం పంటల సాగు విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అవసరాలు, వినియోగంపై స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తున్నాయి. పంట మార్పిడి.. క్రాప్ కాలనీల్లేవ్ జిల్లాలో సాగయ్యే పంటలకు సంబంధించి క్రాప్ కాలనీలుగా విభజించి పంటలను సాగుచేయించాలని గత ప్రభుత్వం 2017లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హడావుడి చేసిన అధికారులు మాటలకే పరిమితమవగా ఆచరణలో కరువైంది. పప్పులు... కూరగాయల్లేవ్ అంతర్జాతీయంగా చిరు, తృణ ధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ జిల్లాలో ఈ పంటల సాగు అందని ద్రాక్షే. చిరు, తృణ ధాన్యాలే కాకుండా కంది, మొక్కజొన్న, మినుము, పెసర, బబ్బెర లాంటి పంటలు సైతం అవసరం మేర పండించుకోలేకపోవడంతో వీటి ధరలు అమాంతం పెరిగి వినియోగదారుడిపై ఆర్థిక భారం పడుతోంది. నూనె గింజలకూ కొరత ఏర్పడుతోంది. ప్రజల వినియోగం మేరకు పంటలను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ పంటల లోటు కనిపిస్తోంది. దీంతో నిత్యావసరాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండగా, ఇది రోజు రోజుకు జఠిలం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో గతంలో 5 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవగా వానాకాలం సీజన్లో కేవలం 571.84 ఎకరాల్లో సాగు చేయడం ఆందోళనకర పరిణామం. ఇవన్నీ సాగు కాలే ఏటా జిల్లాలో చాలావరకు పంటలు సాగవలేదని స్పష్టమవుతోంది. బజ్ర, శనగలు, ఆముదం, బీన్స్, బేర్, కొర్రలు, అవాలు, నిగర్(గడ్డి), పిల్లిపెసర, రాగులు, కుసుమ, చెఱకు, ఎండజనపనార, గోధుమలు, అల్లం, ఉల్లిగడ్డ, ముల్లంగి, పాలకూర, చిరుధాన్యాలు, ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టెల్ మిల్లెట్, సామలు వంటి పంటలను సాగు చేయలేదు.పంట పేరు ఎకరాలు వరి 2,71,334 కందులు 904 మొక్కజొన్న 3681 మిరప 687 బబ్బర్లు 30 పెసలు 92 కూరగాయల సాగు విస్తీర్ణం 571.84 ఎకరాల్లో సాగయ్యాయి.కంది పప్పు: 2,000 టన్నులు పెసర పప్పు: 1,000 టన్నులు కూరగాయలు: 2,625 టన్నులు -
G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు
వేములవాడ: మా నాన్న గుండ్లూరి ఆంజనేయులు. ఎన్ని కష్టాలొచ్చినా భరించేవారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లం. నా చదువుల కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయి సివిల్ కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పని చేశారు. నేను నిద్ర లేవకముందే ఇంటి నుంచి వెళ్లి, నేను పడుకున్నాక ఇంటికి వచ్చిన రోజులు కోకొల్లలు. అప్పట్లో మాకు చెల్లించే స్కూల్ ఫీజులతో ప్లాట్లు వచ్చేవని నాన్న ఫ్రెండ్స్ అనేవారు. వారి మాటలను లెక్కచేయకుండా పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అలా చదవడం వల్లే నేను ఉద్యోగం సాధించి వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నా. నాన్నే నాకు స్ఫూర్తి. -
నాన్నే మొదటి గురువు
జగిత్యాలజోన్: మా నాన్నే.. నా మొదటి గురువు. నేను జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నానంటే అంతా మా నాన్న భిక్షే. మాది రాజమండ్రి. నాన్న చిత్తూరి లక్ష్మణ్‌రావు(లచ్చారావు) న్యాయవాది. నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ అంతా నాన్నే. అమ్మాయిలంటే ఇంటి పని, వంట పని కాదని, ఉన్నత స్థాయికి ఎదిగి, నీవే పది మందికి ఆదర్శంగా మారాలని ఎప్పుడు చెపుతుండేవారు. నాది సైన్స్ గ్రూపు అయినా నాన్నను ఆదర్శంగా తీసుకుని ఎల్ఎల్బీ పూర్తి చేశా. నాన్న నాపై చూపెడుతున్న ప్రేమ, అనురాగాలతో యూనివర్శిటీ స్థాయిలో నాలుగు గోల్డ్‌మెడల్ సాధించేవరకు తీసుకవచ్చాయి. తర్వాత నాన్న వద్దే అడ్వకేట్‌గా శిష్యరికం తీసుకున్నా. నాన్న జ్యూడిషియల్ వ్యవస్థలో ఉన్న మంచి చెడులు చెపుతుండడం, పది మందికి న్యాయం చేస్తే మనకు కలిగే మనశ్శాంతి, అనుభూతుల గురించి వివరించేవారు. దీంతో, అడ్వకేట్‌గా కేసులు వాదించే స్థాయి నుంచి జడ్జిగా కేసుల్లో తీర్పులు ఇచ్చే స్థాయికి ఎదిగానంటే అంతా మా నాన్న చలవే. అందుకే జీవితాంతం నాన్నకు రుణపడి ఉంటాను. చిన్నప్పుడు నాన్నతో ఉన్న జ్ఞాపకాలు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని బరువైన జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. నాన్నను తలచుకోని రోజు ఉండదు. నాన్నతో పాటు అమ్మ ప్రేమలత, పెంచిన అమ్మ అన్నపూర్ణమ్మ, తమ్ముడు శ్రీనివాస్‌లు కూడా నా పురోభివృద్ధికి కారణం. – సి.రత్నపద్మావతి, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
నాన్న స్ఫూర్తితో కంపెనీ
రామగుండం: తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ స్థాపించాడు గద్దె శ్రీచరణ్. రామగుండానికి చెందిన గద్దె శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవార్డులు కై వసం చేసుకున్నారు. శ్రీచరణ్ అదే బాటలో నడుస్తూ మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. 2016లో ఎల్పీయూ యూనివర్సిటీలో సీఎస్ఈ ఇంజినీరింగ్ పూర్తి చేసే క్రమంలో సొంతంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రూపొందించాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం సోషల్ ఆడిట్ మోబైల్ అప్లికేషన్ రూపొందించాడు. ఈ కంపెనీ ప్రస్తుతం 500 క్లయింట్లకు సేవలందించడంతో పాటు 1,050 ప్రాజెక్టులను డెలివరీ చేసి, ఒక మిలియన్ డాలర్ రెవెన్యూ మైలు రా యికి చేరుకుంది. నాన్న ప్రోత్సాహమే ఇందుకు కారణం అంటున్నాడు. -
కరీంనగర్‌ను మోడల్‌గా మారుస్తా
కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్/జమ్మికుంట: రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ నగరంగా మారుస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. జ్యోతినగర్‌లో రూ.67లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పైప్ లైన్‌ను శనివారం ప్రారంభించారు. కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర పెద్దలను ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్‌ను చేర్పించినట్లు తెలిపారు. ఫలితంగా కేంద్రం నుంచి రూ.840 కోట్లు నిధులు వస్తున్నాయ ని, వాటితో కార్పొరేషన్ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. డంప్‌యార్డ్‌కు రూ.80 కోట్లు విడుదలయ్యాయని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. మేయర్ శ్రీనివా స్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు ప్రవీణ్‌రావు, రమణారెడ్డి, బి. వేణు పాల్గొన్నారు. దసరా నాటికి కరీంనగర్– వరంగల్ హైవే పనులు పూర్తి ఈ ఏడాది దసరా నాటికి కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారిని అందుబాటులోకి తెస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. హుజూరాబాద్ శివారులో జరుగుతున్న రహదారి పనులను శనివారం పరిశీలించారు. 90శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కరీంనగర్– జగిత్యాల హైవే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మోడీది రైతు ప్రభుత్వం దేశంలో 9.60 కోట్ల మంది రైతులకు అందించే కిసాన్ సమ్మాన్ నిధులు ఒక్కసారి కూడా అగలేదని సంజయ్ అన్నారు. జమ్మికుంటలోని కేవీకేలో 23వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని తిలకించారు. యువతకు 10లక్షల ఉద్యోగాలు కేంద్రం ప్రభుత్వం కల్పించిందన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి, కేవీకే ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్‌రెడ్డి, శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ఉన్నారు. -
రేవంత్ పాలనలో సంక్షోభంలో రైతాంగం
మానకొండూర్: రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రైతాంగం సంక్షోభంలో పడిందని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్‌లో శనివారం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం దేశానికి వెన్నెముకలా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల వెన్నెముకనే విరగ్గొట్టే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతుబంధు, రైతు బీమా అమలులో అనిశ్చితి ఏర్పడిందన్నారు. దాదాపు 40 రకాల సన్న వరిధాన్యాలు ఉండగా, 7 రకాలకే బోనస్ ప్రకటించడం సరికాదన్నారు. రేవంత్ ఢిల్లీకి 71సార్లు వెళ్లి తెలంగా ణకు, ముఖ్యంగా రైతులకు ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం నీటితో మధ్య మానే రు, దిగువ మానేరు నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, పారునంది కిషన్, దేవ సతీశ్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు పాల్గొన్నారు. కలిసికట్టుగా నగర అభివృద్ధికరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని 53వ డివిజన్ శర్మనగర్‌లో సుడా నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. నగరంలోని అంతర్గత రోడ్లు , డ్రైనేజీలకు నిధులు వెచ్చించి ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత– రమణ, డీఈ రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ మేరాజ్, సమియోద్దీన్, హరికృష్ణ, అబ్దుల్ వసీం, అనిల్, రాము, శ్రీనివాస్, కలీం పాల్గొన్నారు. ప్రేమపేరుతో యువత మోసపోవద్దుకరీంనగర్కల్చరల్: ప్రేమ, వ్యామోహానికి మధ్య ఉన్న తేడాను గుర్తించి యువత ముందుకు సాగాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సంచాలకుడు జీవీ.శ్యామ్ ప్రసాద్ లాల్ సూచించారు. శనివారం ఫిలింభవన్‌లో సమతా సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన గండ్ర హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గండ్ర లక్ష్మణరావు తన తండ్రి పేరిట అందిస్తున్న ఈ పురస్కారాన్ని ‘ప్రేమలు’ నవల రచయిత్రి తటవర్తి నాగేశ్వరికి ప్రదానం చేశారు. ప్రేమకు, మోహానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ నవల ద్వారా చక్కగా వివరించారని అభినందించారు. కరిమిండ్ల లావణ్య, ఆడెపు లక్ష్మీపతి, కొత్తిరెడ్డి మల్లారెడ్డి, గాజుల రవీందర్, కొత్త అనిల్ కుమార్ పాల్గొన్నారు. నేడు ‘పెద్ద బాడిసె’ పుస్తకావిష్కరణకరీంనగర్కల్చరల్: భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్లో ఆదివారం జరిగే సాహిత్య సభలో కరీంనగర్‌కు చెందిన కవి మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ద బాడిసె కవితా సంపుటిని రిటైర్డ్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ ఆవిష్కరిస్తారని పెద్దిరాజు సత్యనారాయణ రాజు తెలిపారు. విశిష్ట అతిథిగా ప్రముఖ కవి, విమర్శకులు గంటా మనోహర్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా బహు గ్రంథకర్త సంపత్ కుమార్, ప్రధాన వక్తగా ఎర్రోజు వెంకటేశ్వర్లు హాజరవుతారని అన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. -
లోక్ అదాలత్‌లో 2,703 కేసులు పరిష్కారం
కరీంనగర్ క్రైం: రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సరైన మార్గమని జిల్లా ప్రధాన న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాదన్నారు. డీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల పరిష్కారానికి సీపీ ఆదేశాలతో తమవంతు కృషి చేస్తున్నామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లతో కేసుల పెండింగ్ తగ్గుతుందన్నారు. న్యాయమూర్తులు పలు కేసులు పరిష్కరించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో 2,703 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, న్యాయమూర్తి రాణి తెలిపారు. వీటిలో సివిల్ 56, క్రిమినల్ 2,557, ఇతర కేసులు 90 ఉన్నాయన్నారు. మోటారు ప్రమాదం కేసుల్లోని బాధితులకు రూ.3,01,43,416 పరిహారం ఇచ్చేలా పరిష్కరించినట్లు వివరించారు. -
నా విజయం.. నాన్నకు అంకితం
జ్యోతినగర్(రామగుండం): నేను ఈ స్థాయికి రావడానికి నాన్న ఉమామహేశ్వర్ చూపిన క్రమశిక్షణే కారణం. ఆయన ప్రోత్సాహంతో ఇటీవల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు సాధించా. నాన్న పర్యావరణవేత్త, రైతు. అమ్మ న్యాయవాది. అన్నయ్య ఆదిత్య హైదరాబాద్‌లో ఓ సంస్థలో పని చేస్తున్నారు. వదిన పూజా చెబ్రోలు అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్‌లో, వైద్య ప్రపంచ ఆరోగ్య విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం అండతో ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వాన్ని నాన్న నేర్పించారు. యూపీఎస్సీ వంటి క్లిష్టమైన పరీక్షలో విజయం సాధించడానికి కుటుంబ ప్రోత్సాహం ఎంతో కీలకం. నా విజయం నాన్నకు అంకితం. యువత పట్టుదలతో ముందుకు సాగితే గుర్తింపు సాధించవచ్చు. – శశాంక్ దహెగాం, ఎన్టీపీసీ, రామగుండం -
సర్వం నాన్నే!
నాన్న.. రెండక్షరాల ఈ పదం ప్రతీ వ్యక్తికి గుండె ధైర్యం.. ప్రపంచాన్ని జయించేంత మనో నిబ్బరం.. అమ్మ లోకానికి పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం భూమిపై పుట్టాక పరిచయమయ్యే తొలి స్నేహితుడు నాన్న.. జీవిత పాఠాలు బోధించే తొలి గురువు నాన్న.. బుడిబుడి అడుగులు వేసే సమయంలో ఎక్కడ పడిపోతామోనని భయపడుతూ.. వెన్నంటే ఆయన వేసే అడుగులు మనం లైఫ్‌లో స్థిరపడే వరకూ ముందుండి నడిపిస్తాయి. నాన్న ఎన్నో కష్టాలు పడుతూ.. పిల్లల సంతోషం కోసం అన్నీ త్యాగం చేస్తాడు. పిల్లలు జీవితంలో ఎక్కే ప్రతీ మెట్టులో నీడలా వెన్నంటే ఉంటాడు. కుటుంబ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా ఒంటెద్దు బండిలా లాగుతూ.. పిల్లల ముఖంలో నిత్యం చిరునవ్వులు చూస్తూ సంతోషించే వ్యక్తి నాన్న.. నాన్న అంటే భయపడే రోజు నుంచి స్నేహితుడిగా అన్నీ పంచుకునే కాలంలో చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!తల్లిదండ్రులతో శశాంక్గద్దె శ్రీచరణ్, ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ కంపెనీ వ్యవస్థాపకుడు -
యోగాసనమే శ్వాసగా..
కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన యోగా క్రీడాకారిణి జాపతి ఆమని యోగాను జీవిత విధానంగా మార్చుకుని జాతీయస్థాయికి ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, శిక్షణ దొరకడం కష్టమైనప్పటికీ, పట్టుదల, కఠిన సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కేరళలో జరిగిన జాతీయస్థాయి సీనియర్స్‌లో సత్తా చాటి 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయస్థాయితో పాటు నేపాల్‌లో జరిగిన పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. -
నేత్రాలు దానం
కోల్‌సిటీ: వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరి నేత్రాలను దానం చేసి రెంటు కుటంంబాలు ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్‌కు చెందిన డి.రఘు (46) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలుకావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి రాజు (29) శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ఇద్దరి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేత్రాల ద్వారా నలుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు అందనుంది. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, వెల్ది కవిత అనంతరాములు, తడబోయిన రాములు, దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు అభినందించారు. బావిలో పడి బాలుడి మృతికొత్తపల్లి: కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలోని బతుకమ్మ చెరువు బావిలో పడి బాలుడు మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. రేకుర్తిలోని స్వామికాలనీకి చెందిన షకీర్‌ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ ఖాన్ (16) తన స్నేహితులు షేక్ అఫ్రోజ్, యాకుబ్ అలీ, షకీర్ఖాన్లతో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలనీ సమీపంలోని బతుకమ్మ చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఆడుకుంటుండగా షకీర్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. తనతో ఉన్న స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు షకీర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడి మృతి
● కుమారుడి కళ్లు దానం చేసిన తండ్రి వెల్గటూర్: ట్రాక్టర్ పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండపల్లికి చెందిన తొట్ల మధూకర్ (26) తన పొలానికి పశువుల ఎరువు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ కిరాయి మాట్లాడుకున్నాడు. డ్రైవర్ అతివేగంగా.. అజాగ్రతగా నడపడంతో మధూకర్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఘటనలో తల, చాతిపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. కన్నుమూసినా ఇద్దరికి చూపు మధుకర్ మృతిచెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మధూకర్ అవయవాలను దానం చేయాలని తండ్రి లచ్చయ్య నిర్ణయించుకుని ఎస్సై ఉదయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సిబ్బంది మధూకర్ నేత్రాలను సేకరించారు. చికిత్స పొందుతూ ఒకరు..మల్లాపూర్: మండలంలోని హుస్సేన్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేక్ ఖాసీం (19) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖాసీం తన బైక్‌పై రోడ్డుపై వెళ్తుండగా ఖానాపూర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖాసీం తలకు తీవ్రగాయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఖాసీం తండ్రి షేక్ నన్నేసాబ్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ గుగ్లావత్ గోపిచంద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. యువకుడి ఆత్మహత్యకరీంనగర్క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ తన కుమారుడు మహ్మద్ అహ్మద్(19)తో కలిసి ఉపాధి నిమిత్తం కరీంనగర్ వచ్చారు. నగరంలోని చికెన్ సెంటర్లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్ చికెన్సెంటర్కు రాకుండా బయట తిరుగుతుండడంతో శనివారం ఇర్ఫాన్ మందలించాడు. మనస్తాపానికి గురైన అహ్మద్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇర్ఫాన్ గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఇర్ఫాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తాగుడు వద్దన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్యఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య మందలించినందుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి పెద్దొళ్ల చిన్న నర్సయ్య(43) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి భార్య కవితతో గొడవ పడుతున్నాడు. ఇలాగైతే ఎలా అని కవిత మందలించగా.. మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వడ్ల గోదాముకే కన్నం
ఆరుగురి అరెస్ట్.. పరారీలో ఒకరుసిరిసిల్ల: సులభంగా డబ్బు సంపాదించాలనే దురా శకు వెళ్లిన ఇంటిదొంగలు కటకటాలపాలయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆరుగురిని జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు రావడంతో రెండు నెలలుగా కొనుగోళ్లు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే అక్రమార్కులు వడ్ల గోదాముకే కన్నం వేశారు. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గతంలోనూ జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఏం జరిగిందంటే.. సిరిసిల్లకు చెందిన ఓ లారీ యజమాని, అతని తమ్ముడు, మరో ఇద్దరు కూలీలతో కలిసి గత సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు పెద్దూరు అపెరల్ పార్క్‌లోని ఓ గోదాములోకి లారీతో వెళ్లారు. సుమారు 150 నుంచి 200 బస్తాలను లారీలో ఎక్కించుకొని నేరుగా కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆ వడ్లను కొనుగోలు చేసినట్లు ట్రక్‌షీట్ తయారు చేసి మళ్లీ అపెరల్ పార్క్‌లోని గోదాముకే తరలించేందుకు సిద్ధమయ్యారు. తీగ లాగితే కదిలిన డొంక అపెరల్‌పార్క్ గోదాములోని వడ్లను దొంగిలించిన ఘటనలో గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే 13 లారీల వడ్లను అమ్మిన అక్రమాలు వెలుగుచూశాయి. 86 బస్తాలను దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిన గోదాం మేనేజర్ విజయ్ అక్రమ ట్రక్షీట్లకు, 13 లారీల వడ్లను దారి మళ్లించడానికి కారణకుడని తేలింది. విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు కలిసి రూ.91 లక్షల విలువైన 13 లారీల వడ్లను అమ్మేసినట్లు తేలింది. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, మరో సింగిల్‌విండో చైర్మన్ కలిసి నకిలీ ట్రక్‌షీట్‌తో లారీ వడ్లను రైస్‌మిల్లులో దింపకుండానే దింపినట్లు రికార్డులు సృష్టించి వడ్ల సొమ్మును పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ధాన్యం నిల్వలపై అనుమానాలు జిల్లాలోని 36 రైస్‌మిల్లులకు ధాన్యం అందించారు. మరోవైపు అపెరల్ పార్క్‌లోని 22 గోదాముల్లో వడ్ల ను నిల్వచేశారు. జగిత్యాల జిల్లాకు 14 గోదాములు కేటాయించగా.. రెండు గోదాముల్లో వడ్లను, మరో 12 గోదాముల్లో మక్కలు నిల్వచేశారు. 2024–2025 యాసంగి సీజన్లోనూ అపెరల్ పార్క్‌లో నిల్వ చేసిన ధాన్యానికి, తిరిగి రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యానికి మధ్య 10వేల టన్నులు తేడా వచ్చింది. తాజాగా 13 లారీల వడ్లు పక్కదారి పట్టిన ఘటన చర్చనీయాంశమైంది. గుమ్మికి ‘ఇంటి దొంగల’ ఎసరు 13 లారీల వడ్లు పక్క దారి నకిలీ ట్రస్షీట్లతో అక్రమాలు ఆరుగురి అరెస్ట్.. పరారీలో రుద్రంగి ఐకేపీ సెంటర్ ఇన్చార్జి అధికార పార్టీ నేతలను ఆశ్రయించిన అక్రమార్కులుఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. జూన్ 15న అర్ధరాత్రి సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గోదాములోని 86 బస్తాల ధాన్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారని స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు చెందిన గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా గోదామ్ మేనేజరే మరికొందరితో కలిసి నకిలీ ట్రక్‌షీట్లతో 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సిద్దిపేటలో విక్రయించినట్లు తేలింది. అందరూ ఇంటిదొంగలే.. గోదాం మేనేజర్, కరీంనగర్‌కు చెందిన ఉత్కం విజయ్, వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్షీట్లు తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి రెండు ట్రక్షీట్లు జారీ చేయగా.. గోదాం మేనేజర్ విజయ్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో రైతుల పేరిట వచ్చిన ఆ రెండు లారీల ధాన్యం డబ్బులను ముగ్గురు కలిసి పంచుకున్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్‌లో పనిచేసే కుమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్‌తో కలిసి ఒక్క లారీకి నకిలీ ట్రక్‌షీట్ తయారు చేసి గోదాం మేనేజర్ విజయ్‌కి అందించారు. వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో రాజశేఖర్ ఆ నకిలీ ట్రక్షీట్కు ఆమోదం తెలిపారు. రైతుల పేరిట వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకున్నారు. పది లారీల వడ్లను దారి మళ్లించారు అపెరల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల వడ్లను అక్కడ దించకుండానే దించినట్లుగా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ వడ్లను వేములవాడకు చెందిన రైస్‌మిల్లర్ చేపూరి మధుకర్ ద్వారా సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్‌కు అమ్మేశారు. ఆయన ఆ లారీలను వివిధ రైస్‌మిల్లులకు మళ్లించాడు. పది లారీల వడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను నిందితులు పంచుకున్నారు. ఇలా మొత్తం 13 లారీల వడ్లను అమ్మేశారు. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి.. ఉత్కం విజయ్, వాసాల గణేశ్, కమ్మరి రాజశేఖర్, గాజుల నవీన్, చేపూరి మధుకర్, చిటుకుల శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి పరారీలో ఉన్నారు. రూ.14.16 లక్షలు స్వాధీనం.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్ ఆరుగురి వద్ద రూ.14.16 లక్షలు, సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.46.21 లక్షలను ఫ్రీజ్ చేశామని ఎస్పీ మహేశ్ బీ గీతే వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను చేధించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగరాజు, గణేశ్, హెడ్‌కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవి, నాగరాజులను ఎస్పీ అభినందించారు. -
ఇంటిపనితో ‘యోగ’ం
కరీంనగర్‌స్పోర్ట్స్: ఒకప్పుడు మన ఇళ్లలోనే యోగం ఉండేది. వాకిట్లో ముగ్గు, వంటింట్లో వంట, ఇంటి శుభ్రత, బట్టల ఉతుకుడు ఇవి కేవలం పనులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే యోగా వ్యాయామాలు. కాలక్రమేణా వాటిని సాధారణ పనులుగా భావించి, ఆరోగ్యం కోసం బయట వెతకడం ప్రారంభించాం. కానీ మన అవ్వలు, అమ్మలు చేసిన ప్రతి ఇంటి పని శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ప్రేమను అందించే ఇంటి యోగం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం కోసం యోగా కేంద్రాలు, జిమ్‌లు, ఫిట్నెస్ కార్యక్రమాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వేకువజాము నుంచే మొదలు వేకువజామున నిద్రలేచి ముగ్గు వేయడం ద్వారా మోకాళ్లు, వెన్నెముకకు వ్యాయామం లభించేది. బట్టలు ఉతకడం, ఆరేయడం వంటి పనులు చేతులు, భుజాలు, నడుంకు బలాన్ని ఇచ్చేవి. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు రక్తప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగపడేవి. ఇక నేటి తరంలో యంత్రాలపై ఆధారపడటం పెరిగింది. ఇంటి పనులు తగ్గి ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేసే జీవనశైలిలో మెడనొప్పి, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇంటి పనులపై సమాజం చేసిన ప్రధాన తప్పు ఇంటి పనులను తక్కువగా చూడటమే. యోగాసనం పేరుతో చేస్తే గౌరవం, ఇంట్లో చేస్తే సాధారణ పని అనే భావన ఏర్పడింది. ఇంటి పనుల వెనుక ఉన్న ప్రేమ, సేవ, బాధ్యత, కుటుంబ సంక్షేమం వంటి విలువలను మనం మరిచిపోయాం. నిజానికి వంట చేయడం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు. కుటుంబానికి ఆరోగ్యం, ప్రేమ అందించడం. ఇల్లు శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము తొలగించడం కాదు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమని అర్థం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్, మిడ్‌మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే
ఉమ్మడి జిల్లా వ్యవసాయానికి గోదావరి, మానేరు నదులు ప్రాణాధారం. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులే ఇటు ఉమ్మడి జిల్లాకు, అటు ఇతర జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అలాంటి ఈ రెండు నదులు ఈ వేసవిలో దాదాపుగా ఎండిపోతున్నాయి. ఈ పరిణామం రైతులను, వ్యవసాయాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అప్పర్ మానేరు 1 టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 19 అడుగులకు చేరుకుంది. ఇక 27 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్‌మానేరు డ్యామ్ (ఎంఎండీ)లో ప్రస్తుతం 7.4 టీంఎసీలకే పరిమితమైంది. లోయర్‌మానేర్ డ్యాం (ఎల్ఎండీ) 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 6 టీఎంసీలే నమోదు చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా జలాశయాల్లో నీటి ఆవిరి ఇంకా కొనసాగుతుందని నీటిపారుదల అధికారులు వాపోతున్నారు. ఇక జగిత్యాల జిల్లా పంటలకు కీలకమైన ఎస్సారెస్పీ వరద కాలువలో సాధారణంగా ఆరు మీటర్ల వరకు ఉంటే నీరు ప్రస్తుతం రెండు మీటర్లకు పరిమితమైంది. దీని ఆధారంగా జిల్లాలో 30వేల ఎకరాల పంటలు సాగవుతాయి. -
19 మంది ఎస్సైల బదిలీ
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్‌వ్యాప్తంగా 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏ.శ్రీనాథ్‌ను వీఆర్ నుంచి టూటౌన్‌కు, కె.రవిని వన్‌టౌన్ నుంచి హుజూరా బాద్‌కు, వి.శ్రీనివాసరావును టాస్క్‌ఫోర్స్ నుంచి హుజూరాబాద్‌కు, యూనుస్ అహ్మద్ అలీని హుజూరాబాద్ నుంచి వీఆర్‌కు, చీనానాయక్ను పీసీఆర్ నుంచి కరీంనగర్ ట్రాఫిక్‌కు, సీహెచ్.తిరుపతి సీసీఆర్బీ నుంచి మానకొండూర్, సీహెచ్.నర్సింహారావు సీటీసీ నుంచి ఎస్బీకి, టి.నరేశ్‌ను కరీంనగర్ రూరల్ నుంచి సీసీఆర్బీకి, డి.పృథ్వీధర్గౌడ్ను చిగురుమామిడి నుంచి సీసీఎస్‌కు, ఎస్.సంజీవ్‌ను వీఆర్ నుంచి జమ్మికుంటకు, ఎన్.రమేశ్‌ను సీసీఎస్ నుంచి జమ్మికుంటకు, ఎస్.ప్రమోద్‌రెడ్డిని కరీంనగర్ ట్రాఫిక్ నుంచి పీసీఆర్‌కు, ఎం.రమేశ్‌ను వీఆర్ నుంచి సీసీఆర్బీకి, ఎం.యాదగిరిని వీఆర్ కరీంనగర్ నుంచి మహిళా పీఎస్‌కు, ఎం.డీ.ఇర్షాద్, బి.ఎల్లయ్యగౌడ్, ఎం.సుధాకర్‌ను వీఆర్ నుంచి ఎస్బీకి, వి.తిరుపతిని వీఆర్ నుంచి సీటీసీకి, జి.రామిరెడ్డిని ఎస్బీ నుంచి పీసీఆర్‌కు బదిలీ చేశారు. -
రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం
కరీంనగర్ కార్పొరేషన్: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా నగరంలోని తెలంగాణచౌక్‌లో కేక్ కట్ చేశారు. 2029 ఎన్ని కల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. సివిల్ హాస్పిటల్ వద్ద ఆర్ష మల్లేశం కేక్ కట్ చేశారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో దన్గర్‌వాడీ పాఠశాలలో పెన్నులు అందించా రు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మడుపు మోహన్, పులి ఆంజనేయులు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రతకరీంనగర్ కార్పొరేషన్: ప్రజల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యపడుతుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చేపడుతున్న పారిశుధ్య పనులను శుక్రవారం నగరంలోని 20,56 డివిజన్లలో పర్యవేక్షించారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా, నగరపాలకసంస్థకు సహకరించాలని కోరారు. డ్రైనేజీల్లో చెత్తను వేయడం వల్ల మురుగునీరు సులువుగా ముందుకు వెళ్లలేక, నిలిచిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. డ్రైనేజీల్లో సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని, మురుగునీళ్లు సాఫీగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి శానిటేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్పొరేటర్లు తాటి ప్రభావతి, పర్వతం మల్లేశం పాల్గొన్నారు. ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపుకరీంనగర్టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ, ఐటీసీలలో 2026–27 సంవత్సరానికి మొదటి దశ అడ్మిషన్ల దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కె.అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసైన ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో ఎస్ఎస్ిసీ మెమో, బోనోఫైడ్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. వివరాలకు 85004 61506 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో లాటరీ ద్వారా ఎంపికకరీంనగర్టౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరం ప్రవేశానికి లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుందని వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు ఒక ప్రకటనలలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1వ తరగతి (నాన్–రెసిడెన్షియల్), 5వ తరగతి(రెసిడెన్షియల్)లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో సహ వారి తల్లిదండ్రులు ఈనెల 23న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో హాజరు కావాలని సూచించారు. జాతీయస్థాయి సర్పంచ్ సంవాద్‌లో విజయంరామడుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయస్థాయి సర్పంచ్ సంవాద్ పోటీల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి, వెలిచాల గ్రామాల సర్పంచ్‌లు ప్రథమ, తృతీయ స్థాయిల్లో నిలిచారని ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో శ్రావణ్‌కుమార్ తెలిపారు. కేంద్రం నిర్వహిస్తున్న నెలవారీ పోటీల్లో ఆత్మ నిర్భర్ మహిళ అంశంపై జరిగిన జాతీయస్థాయి పోటీలలో కోరటపల్లి సర్పంచ్ మేకల మహేశ్వరి(ప్రథమ), వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగరావు (తృతీయ)స్థాయిలో నిలవడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, మహిళ సాధికారత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. -
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన మోదీ
చిగురుమామిడి: దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడానికి ప్రధాని నరేంద్రమోదీ కారణమని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో పార్టీ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటికి దేశంలో రూ.55 లక్షల కోట్ల అప్పులుంటే 12ఏళ్లకాలంలో రూ.214 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 40శాతం రాష్ట్రాలే ఇవ్వాలని ప్రధాని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి, బూడిద సదాశివ, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ, పైడిపెల్లి వెంకటేశ్ పాల్గొన్నారు. -
రోడ్డుపై బండరాళ్లు.. అడ్డంగా స్టాపర్లు
ప్రయాణికుల పాలిట ప్రమాద ఘంటికలుగా మారాయి. వాహనాల స్పీడును తగ్గించేందుకు కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై వైద్య కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సూచికల బోర్డులు ప్రమాదకరంగా మారాయి. వేగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్ జరగకుండా బండలు పెట్టడం ప్రయాణానికి తలనొప్పిగా మారుతోంది. వాహనాల తాకడికి స్టాఫర్లు ఓ వైపు, బండలు మరోవైపు జరిగి చెల్లాచెదురు అవుతున్నాయి. పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. – కొత్తపల్లి(కరీంనగర్) -
కరీంనగర్
వాతావరణంజిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.7ఒంటికి యోగా మంచిదేగా.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటా రు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నిపుణులు, గురువులు సూచిస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కథనం..మా ఊళ్లో బెల్ట్‌షాపులు వద్దు మంథని: పల్లెల్లోని బెల్ట్‌షాపులపై పంచాయతీ పాలకవర్గాలు నిషేధం విధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. మంథని డివిజన్లో అధికారులకు వినతిపత్రాలు అందించాయి. -
చదువు ‘కొనాల్సిందేనా’?
కరీంనగర్‌టౌన్: నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఏసీబీ, ఐటీ విచారణ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం ఎదుట త్రాసులో నోట్ల కట్టలు, పుస్తకాలు ఉంచి వినూత్న నిరసన తెలిపారు. మణికంఠరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బీటెక్ ఫీజుల కన్నా ఎల్కేజీ ఫీజులే ఎక్కువగా ఉన్నాయని, అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.5 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని, వారికి అండగా నిలుస్తున్న డీఈవో, ఎంఈవోలను సస్పెండ్ చేయాలన్నారు. నాయకులు మచ్చ రమేశ్, నునవత్ శ్రీనివాస్, లద్దునూరి విష్ణు, కసిరెడ్డి సందీప్‌రెడ్డి, జ్యోత్స్న, అనోశ్ పాల్గొన్నారు. -
త్వరితగతిన భూధార్ సర్వే
కరీంనగర్ అర్బన్: భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, రీ– సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా, నాన్– కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా తదితర అంశాలపై శుక్రవారం రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భూధార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి అర్హులైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, భూములకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని పేర్కొన్నారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయండి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో 25వ డివిజన్ పరిధి సుభాష్‌నగర్ ఏరియా, బుట్టి రాజారాం కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను డీఆర్వో స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. బిల్లులు జమ కాని లబ్ధిదారుల వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ డీఈ వెంకటరమణ, ఏఈలు ఊర్మిల, వర్షిణి ఉన్నారు. పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న జిల్లా ప్రధాన పశువుల ఆసుపత్రిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి ద్వారా పశువులకు అందిస్తున్న సేవలు, వాక్సినేషన్, మందుల వివరాలు తెలుసుకున్నారు. గదులు కలియ తిరుగుతూ ల్యాబరేటరీ, శస్త్ర చికిత్స గదులు, ఎక్స్‌రే గది, మందుల గది పరిశీలించారు. సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి ముందు శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని పరిశీలించి తొలగించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు నరేష్ కుమార్, వినోద్ కుమార్ ఉన్నారు. -
వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో శుక్రవారం 16వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి పర్యవేక్షణలో జరిగిన వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు, అనంతనాగేంద్ర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వస్తిపుణ్యాహవాచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండల పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు. లక్ష్మీగణపతి, రుద్ర సహిత చండీ హోమాలను నిర్వహించారు. విద్యారణ్య భారతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. -
ఒంటికి యోగా మంచిదేగా..
భారతీయ సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిన యోగా ప్రక్రియ ప్రపంచాన్ని ఆకర్షించింది. రుషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, పతంజలి వంటి సాధువులు మనకు అందించిన వరం. యోగా, యోగాసనాల ప్రక్రియకు గురువు అవసరం. యోగా సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. శరీర కదలిక యోగా అయితే.. ధ్యానం మనసుకు సరైన వ్యాయామమవుతుంది. ధ్యానం ద్వారా నిశ్చలత్వం ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది. ఇంద్రియాలను వశపరుచుకొని చిత్తాన్ని ఈశ్వరుడి మీద పెట్టడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం. ●విద్యానగర్(కరీంనగర్): యోగాలో ఎన్నో ఆసనాలున్నాయి. మరెన్నో సాధనలున్నాయి. వీటన్నింటిని చేసేటప్పుడు పాటించే ఏకై క సూత్రం శ్వాస క్రియలు సరిగ్గా చూడడం. దీనివల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరమవుతాయి. దీంతోపాటు శరీ రంలో హార్మోన్స్ విడుదలై శరీరంతోపాటు మనసు కూడా ప్రశాంతంగా మారి మానసిక సమస్యలతోపాటు కంటి, ఆరోగ్య సమస్యలు తగ్గి కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్య ఔషధంగా పని చేస్తుంది. శారీరక, మానసిక సమస్యలు దూరం మన శరీరరంలో అనేక సమస్యలకు ఒత్తిడే ప్రధాన కారణం. యోగాతో ఒత్తిడి చాలావరకు దూరమౌతుంది. నిద్రలేమి, మానసిక, గుండె, బీపీ సమస్యలు, నడుము నొప్పి, స్పాండిలైటిస్, మెడనొప్పులు వంటివి యోగాతో దూరమవుతాయి. 21న.. ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున ఉత్తరార్థ గోళంలో అ త్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండడంతో ఈ రోజున యోగా దినోత్సవంగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ దుర్మరణం
ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లిలోని మూలమలుపు వద్ద శుక్రవారం రాత్రి గోదావరిఖని నుంచి ముత్తారానికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కూలీ దుర్మరణం చెందాడు. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన రేండ్ల తిరుపతి(35) అనే కూలీ ఆర్ అండ్ బీ రోడ్డు పనులు చేయడానికి ముత్తారానికి వచ్చాడు. రోడ్డుకు వైట్ పెయింట్ వేసి కేశనపల్లి వద్ద మూలమలుపు వద్ద ఆగాడు. ఈక్రమంలో తిరుపతిని ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించామని, ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై రవికుమార్ తెలిపారు. మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్ జగిత్యాలక్రైం: బంగారం అమ్మిస్తానని నమ్మించి మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన గండి లలిత కుమారుడి ఆరోగ్యం బాగా లేనందున జగిత్యాల పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఈనెల 16న జాయిన్ చేసింది. ఆస్పత్రి బిల్ కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో మెడలోని బంగారు పుస్తెలు, గుండ్లు అమ్ముదామని అనుకుంటుండగా శుక్రవారం ఆమెకు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు బంగారం అమ్మి డబ్బులు తీసుకువస్తామని నమ్మించి బంగారంతో పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై సుప్రియ కేసు నమోదు చేశారు. కొత్తబస్టాండ్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లికి చెందిన కత్తెరపాక దేవేందర్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నంద్యాల తిరుపతిరావును పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. చేపలవేటకు వెళ్లి.. కరెంట్ షాక్‌తో మృతి చెంది.. సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మినుగు రమేశ్(36) శుక్రవారం చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రమేశ్ తన తమ్మడు నరేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు స్థానిక కుంటకు చేరుకున్నారు. అక్కడ కరెంట్ షాక్ పెట్టి చేపలుపట్టే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని మద్ధిర్యాల గ్రామానికి చెందిన మల్క రాజేశ్వరరావు అనే రైతుకు చెందిన ఎద్దు శుక్రవారం పంట పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఎద్దు విలువ రూ.యాభై వేల వరకు ఉంటుందని రైతు పేర్కొన్నాడు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని కోరాడు. -
నా బిడ్డకు ప్రాణం పోయండి
జ్యోతినగర్: ‘అయ్యా.. నా బిడ్డకు ప్రాణం పోయండి.. మాకు పుత్రభిక్ష ప్రసాదించండి’ అని కాలేయ మార్పిడి చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడిని బతికించేందుకు దాతలు సాయం చేయాలని తల్లిదండ్రులు మానాల తిరుమలేశ్, స్వప్న వేడుకొంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మూడోడివిజన్ మల్కాపూర్ గ్రామానికి చెందిన తిరుమలేశ్ రోజూ కూలీ పనులు చేస్తేనే పూట గడుస్తుంది. ఈక్రమంలో తన చిన్నకుమారు విరాట్‌కు దీర్ఘకాలిక కాలేయ సంబంధిత వ్యాధి సోకడంతో చికిత్స చేయించే స్థోమతలేక అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రి వైద్యులు విల్సన్ వ్యాధికి సంబంధించిన దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రాణాలు నిలవడానికి అత్యవసరంగా కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. చికిత్సకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుందని తెలియజేశారు. దీంఓత తమ కుమారుడిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. తల్లిదండ్రులతో విరాట్ చికిత్స పొందుతున్న విరాట్ కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు కొట్టు మిట్టాడుతున్న బాలుడు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకోలు -
యోగాతో లాభాలు
యోగాతో ఆరోగ్యపరంగా చాలా లాభా లున్నాయి. ప్రతిరోజు ఉదయం కేఈ ఎస్ గార్డెన్లో నిర్వహించే యోగా తరగతులకు తప్పనిసరిగా హాజరౌవుతా. వివిధ ఆసనాలు మేయడం, ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – తాటి ప్రభావతి, కార్పొరేటర్ ఆరోగ్యం.. ప్రశాంతత ఆరోగ్యవంత జీవనానికి యోగా తోడ్పడుతుంది. నిత్యం వంట పని, ఇంటి పనులు, పిల్లలతో సతమతమవడంతో ఎన్నో చికాకులు. రోజు ఉదయం ప్రశాంత వాతావరణంలో యోగా, ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. – తొడుపునూరి వాణి, వాసవీనగర్, కరీంనగర్ ఒత్తిడి మాయం నిత్యం ఎన్నో సమస్యలు, బీజీ లైఫ్‌తో జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరానికి తగిన వ్యాయయం జరిగి జబ్బులకు చాలావరకు దూరంగా ఉండొచ్చు. – ఆదిమూలం రజిత, రాఘువేంద్రనగర్, కరీంనగర్ -
వ్యర్థాలకు ఉంది అర్థం
వేములవాడ: ప్లాస్టిక్ బాటిల్..కవర్.. కాదేది సృజనకు అనర్హం అన్నట్టుగా వేములవాడకు చెందిన సౌజన్య ప్లాస్టిక్ వ్యర్థాలను అందమైన కళాఖండాలుగా సృష్టిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్నారు. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను అందమైన కళారూపాలుగా మారుస్తున్నారు. పర్యావరణ ప్రేమికురాలిగా, ఒక వ్యాపారీగా సౌజన్య సరికొత్త ప్రయాణం చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు అందం నేడు ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి శాపంగా మారాయి. ఎక్కడ చూసినా పేరుకుపోతున్న ప్లాస్టిక్కవర్లు, బాటిళ్లతో పర్యావరణం కలుషితమవుతోంది. కానీ వేములవాడకు చెందిన సౌజన్య ఆ వ్యర్థాలనే తన ఉపాధికి మార్గంగా ఎంచుకున్నారు. అందరూ పారేసే ప్లాస్టిక్ వస్తువులకు తన సృజనాత్మకతను జోడిస్తున్నారు. అద్భుతమైన రెసిన్, క్రాఫ్ట్ ఆర్ట్, గులాబీల బొకేలుగా మారుస్తున్నారు. ఆలోచన చిన్నది.. ఆశయం పెద్దది సాధారణంగా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు ఏదో ఒక చిన్న వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ సౌజన్య మాత్రం వినూత్నంగా ఆలోచించింది. సమాజానికి మేలు చేస్తూనే, తనకు నచ్చిన రంగంలో రాణించాలనుకుంది. పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని శుభ్రం చేసి రంగులు, విభిన్న అలంకరణలతో అద్భుతమైన గృహాలంకరణ వస్తువులుగా, బహుమతులుగా తయారు చేస్తున్నారు. వ్యర్థాలే ఇక్కడ రంగుల కళాఖండాలు సౌజన్య చేతిలో పడితే సాధారణ ప్లాస్టిక్ కూడా ఒక అపురూపమైన బహుమతిగా మారిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, పూల రేకులు, ముత్యాలను ఉపయోగించి అద్భుతమైన వాల్ హ్యాంగింగ్గా తయారు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల సహాయంతో నిజమైన గులాబీలను తలపించేలా రెడ్‌రోజ్ బొకేను రూపొందించారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఈ బొకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వయం ఉపాధితో స్వావలంబన ఇలా తయారు చేసిన వస్తువులను సౌజన్య స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడికి తన ప్రతిభను జోడించి వ్యాపారం మొదలుపెట్టారు. ఈ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడటమే కాకుండా వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా చేయాలో సమాజానికి చూపిస్తున్నారు. ప్టాస్టిక్ బాటిల్, కవర్లతోనే అందమైన ఆకృతులు వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్న సృజన ఆదర్శం వేములవాడకు చెందిన అతివవేస్ట్లో బెస్ట్ నా లక్ష్యం ప్లాస్టిక్ అనేది భూమికి హానికరం. దాన్ని పారేయకుండా ఇలా రీసైకిల్ చేసి అందమైన వస్తువులుగా మార్చితే పర్యావరణానికి మేలు జరుగుతుంది. మనకు ఉపాధి దొరుకుతుంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నా ఇన్‌స్ట్రాగామ్‌లో కానీ, 94418 61385లో సంప్రదిస్తే కస్టమర్ అభిరుచికి అనుగుణంగా తయారుచేసి అందిస్తాను. – సౌజన్య -
ఊపిరితిత్తుల మార్పిడిలో ఎక్మో కీలక పాత్ర
కరీంనగర్: తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో ఊపిరితిత్తులు పూ ర్తిగా దెబ్బతిన్న రోగుల ప్రాణా లను కాపాడడంలో ఎక్మో సపోర్ట్‌తోపాటు ఊపిరితిత్తుల మార్పిడి(లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స కీలక పాత్ర పోషిస్తోందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చివరి దశ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ లేదా ఇతర తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యాల కారణంగా ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ అందించే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఎక్మో లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని వివరించారు. ఈ విధానంలో శరీరం వెలుపల ఉన్న యంత్రం కృత్రిమ ఊపిరితిత్తుల్లా పని చేసి రక్తానికి ఆక్సిజన్ అందించి తిరిగి శరీరంలోకి పంపుతుందని చెప్పారు. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు దాత లభించేవరకు ప్రాణాలను నిలబెట్టే బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ విధానంగా ఎక్మో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అని, గుండె–ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ బృందం సమన్వయంతోనే విజయవంతంగా నిర్వహించగలమన్నారు. డాక్టర్ జీవన్, సుధీర్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు.. డెయిరీకి జరిమానా పెద్దపల్లి: రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు వేయొద్దని సూచించినా.. వినకుండా నిబంధనలు ఉల్లంఘించిన కరీంనగర్ డెయిరీకి రూ.3వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయ సమీపంలోని డెయిరీ ఎదుట రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు వేయడంతో గమనించిన సిబ్బంది.. జరిమానా విధించారని పేర్కొన్నారు. ఇకనుంచి తరచూ షాపుల ఎదుట తనిఖీలు చేస్తామని, కుళ్లినపండ్లు పారవేసినా జరిమానా తప్పవని ఆయన హెచ్చరించారు. -
మా ఊళ్లో బెల్ట్‌షాప్‌లు వద్దు
మంథని: పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యంతో అనేక కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. టీషాప్లకన్నా ముందే బెల్ట్‌షాపులు ప్రారంభిస్తూ.. అర్ధరాత్రి దాటాక కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి. పల్లెలేకాదు.. పట్టణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. పోలీస్స్టేషన్లు, బడి, గుడికి సమీపంలోనే బెల్ట్‌షాప్‌లు నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వానికి అనధికారికంగా ఆదాయం సమకూర్చే మార్గం కావడంతో ఇలాంటి వ్యవస్థను నియంత్రించలేకపోతున్నారనే చర్చ సాగుతోంది. ఈక్రమంలోనే మద్యం విక్రయాలను నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానించడం, ఇందుకు సహకరించాలని ఎకై ్సజ్ అఽధికారులకు వినతిపత్రాలు సమర్పించడం జోరందుకుంది. మంథనిలో చైతన్యం బెల్ట్‌షాపులకు వ్యతిరేకంగా మంథని మండలంలో చైతన్యం మొదలైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లిలో మద్యం విక్రయాలు వద్దని తీర్మానించారు. గాజులపల్లి సర్పంచ్ ఏకగా బెల్ట్‌షాప్‌ల ఎత్తివేతకు సహకరించాలని ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మంథని మండలం మల్లేపల్లిలో బెల్ట్ దుకాణాలు మూసివేయాలని మాజీ సర్పంచ్ ఎరుకల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఆర్డీవో సురేశ్‌కు మహిళలు వినితిపత్రం అందించారు. బెల్ట్‌షాప్‌లతో యువత మద్యానికి బానిస అవుతోందని, కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు పెచ్చుమీరుతున్నాయని, శాంతిభద్రలు అదుపుతప్పుతున్నాయని విన్నవించారు. మంథని ప్రాంతంలో మహిళలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా చేపట్టిన ఈ ఉద్యమం వివిధ గ్రామాలకూ విస్తరిస్తోంది. ఒక్కో గ్రామంలో ఐదు వరకు.. జిల్లాలో 266 పంచాయతీలతోపాటు, రామగుండం కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 77 మద్యం దుకాణాలు, 9 బార్, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. వీటితోపాటు ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు బెల్ట్షాపులూ ఉన్నాయి. మున్సిపల్, కార్పొరేషన్‌లోనూ 10 –15వరకు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో వైన్స్‌షాపులు తెరుకవముందే బెల్ట్ దుకాణాలు తెరచుకోవడం, మూసివేసినా.. లభ్యమవుతుండడంతో మద్యం ప్రియులు మత్తులో మునిగితేలుతున్నారు. గ్రామాల్లోనూ బెల్ట్ దుకాణాలు కిరాణాల్లో నడుస్తున్నాయి. దీంతో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది. నియంత్రణ చర్యలు శూన్యం అనేక అనర్థాలకు బెల్ట్‌షాప్‌లు కారణవుతున్నాయని తెలిసినా పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖలు నిస్సహా య స్థితిలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలోనే బెల్ట్ దుకాణాల నిర్వాహకులను బైండోవర్ చేయడం, ఆ తర్వాత వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా బెల్ట్‌షాప్‌లు దక్కించుకోవడానికి గ్రామాల్లో వేలం పాటలు కూడా చోటుచేసుకోవడం గమనార్హం. వీటి నిర్వాహకులు కొన్ని గ్రామాల్లో అభివృద్ధికి సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో మద్యం దుకాణాలకు ఆటంకం లేకుండా నడుస్తున్నాయని అంటున్నారు. బెల్ట్‌షాప్‌లు తొలగించాలని ఎకై ్సజ్ అధికారికి వినతిపత్రం అందిస్తున్న గాజులపల్లి సర్పంచ్ సుధాకర్, స్థానికులు మంథని ఆర్డీవో సురేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న మల్లేపల్లి మహిళలు గ్రామ పంచాయతీల తీర్మానం అధికారులకు వినతిపత్రాలు పల్లెవాసుల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం స్వచ్ఛంద నిర్ణయాలపై అభినందనలు -
కంపుకొడుతున్న మొబైల్ టాయిలెట్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాతబస్టాండులో ఆధునిక డిజైన్‌తో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్ల భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసి, రూ.60లక్షలతో సులభ్ కాంప్లెక్స్ భవనాన్ని ‘ఎల్’ ఆకారంలో నిర్మించనున్నారు. అయితే ప్రయాణికులు అత్యవసరం తీర్చుకునేందుకు పాతబస్టాండ్‌లో మొబైల్ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. అందులో నీళ్లు లేక అపరిశుభ్రం మారిక కంపుకొడుతున్నాయి. మొబైల్ టాయిలెట్లలోకి వెళ్లేందుకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సులభ్ కాంప్లెక్స్ కొత్త భవనం ఐదు నెలల్లో పూర్తి అవుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటి వరకు ఈ మొబైల్ టాయిలెట్ వద్ద అదనపు సిబ్బందిని నియమించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..!
రామగుండం: ‘అమ్మా..నాన్నా.. నన్ను, తమ్ముడిని ఒంటరిగా చేసి వెళ్తున్నారు.. మీరు ఇకలేరని మానసిక వికలాంగుడైన తమ్ముడికి ఎలా చెప్పేది.. నన్ను స్కూల్‌కు ఎవరు తీసుకెళ్తరు? ఎవరి దగ్గరుండాలి?నాకూ, తమ్ముడికి చాక్లెట్లు, స్వీట్లు తేవాలని ఎవరినడగాలి.. మీరు వెళ్లిపోతున్నారనే మాకు ఆటబొమ్మలు తీసుకొచ్చారు కదా?’ అని తల్లిదండ్రులను కోల్పోయిన లోహిత(9) రోదించడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు శుక్రవారం అంతర్గాంలో జరిపించారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు రేఖ, జయ పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం గోదావరిఖనిలోని తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో బుధవారం వేములవాడ, కొండగట్టులో దైవ దర్శనం చేసుకున్నారు. అదేరాత్రి ఒక కారులో ఊశెట్టి చంద్రశేఖర్–రేఖ దంపతులతోపాటు వారి కుమారుడు లోహిత్, రేఖ చెల్లెలి కుమారుడు జన్ను నిహాల్(3)తో కలిసి హైదరాబాద్ బయలు దేరారు. లోహిత తన చిన్నమ్మ జయ కారులో కూర్చుంది. గురువారం వేకువజామున మేడ్చల్ జిల్లాలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రశేఖర్–రేఖ, జన్ను నిహాల్ మృతిచెందారు. లోహిత్ కుడికాలు విరిగి అపస్మారక స్థితికి చేరగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఊశెట్టి చంద్రశేఖర్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య రేఖ గృహిణి, ఫుట్‌బాల్‌పై మక్కువ ఉండడంతో మృతదేహంపై క్రీడా దుస్తులు, ఫుట్‌బాల్ ఉంచి దహన సంస్కారాలు పూర్తిచేశారు. జయ, రేఖ ట్విన్స్ జన్ను రవీందర్ – జయ, చంద్రశేఖర్ – రేఖ తోడల్లుళ్లు. జయ, రేఖ ట్విన్స్. రవీందర్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. జయ అక్కడే ట్రాన్స్‌కో ఏడీఈ. వీరి స్వగ్రామం జమ్మికుంట. వీరి కుమారుడు నిహాల్ ప్రమాదంలో మృతిచెందాడు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కుమారుడి మృతదేహాన్ని మోస్తున్న తల్లిదండ్రులు తల్లిదండ్రుల మృతదేహాలకు కొరివి పెట్టేందుకు నిప్పు మోస్తున్న కూతురు లోహిత తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు మూడేళ్ల కుమారుడిని కోల్పోయిన దంపతులు విషాదం నింపిన హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగిసిన ముగ్గురి అంత్యక్రియలు -
‘టు లెట్’ బోర్డులు !
పెరిగిన ఆన్లైన్ కొనుగోళ్లు ఇటీవల ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు చేరడంతో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఐదారేళ్ల క్రితం ఆన్లైన్ షాపింగ్ అంటే రెడీమేడ్ డ్రెస్సులు, మొబైల్ఫోన్లు, ఫుడ్ ఆర్డర్ల వరకే ఉండేది. కానీ నేడు అన్ని నిత్యావసరాలకు ఇంట్లో ఉండే ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారు. ఆన్లైన్లో డిస్కౌంట్లు, వోచర్స్ పేరిట ఆకర్షిస్తున్నారు. దీంతో ఇంట్లో ఉపయోగపడే గుండుపిన్ను నుంచి పప్పులు, ఉప్పులు, నూనెల వరకు ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారు. అద్దెల భారం ఇటీవల మండల కేంద్రాల్లోనూ దుకాణాల అద్దెల భారం పెరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక షట్టర్ అద్దె నెలకు రూ.6వేల నుంచి రూ.10వేలు, పాతబస్టాండ్‌లో అద్దెలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. రాచర్లగొల్లపల్లిలో రూ.10 వేల వరకు ఉన్నాయి. ముస్తాబాద్‌లో రూ.8వేల నుంచి రూ.10వేలు, గంభీరావుపేటలో రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఉంటున్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్లలో అయితే మరీ ఎక్కువగా అద్దెలు ఉన్నాయి. మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న చిన్నపాటి షటర్‌కు కూడా రూ.15 వేలు ఆపైనే అద్దెలు ఉన్నాయి. ఖాళీగా షట్టర్లు వ్యాపారులు అద్దెలు చెల్లించలేక పలు షట్టర్లు ఖాళీగా ఉంటున్నాయి. రాచర్లగొల్లపల్లిలో 15 వరకు షట్టర్లు ఖాళీగా ఉండగా, ఎల్లారెడ్డిపేటలో 10 ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అయితే వందల కొద్దీ షట్టర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈనెలలో కనిపించిన దుకాణం వచ్చే నెల వరకు ఉండడం లేదు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ నుంచి కొత్తచెరువు వరకు 50 వరకు షట్లర్లకు ‘టు లెట్’ బోర్డులు కనిపిస్తున్నాయి. వేములవాడలోనూ రోడ్డు విస్తరణ పనులతో భక్తులు నిలుస్తుండకపోవడంతో ప్రధాన రహదారి వెంట చాలా దుకాణాలు మూతబడ్డాయి. ఎల్లారెడ్డిపేటలో నెల రోజులుగా మూతబడ్డ బిర్యానీ సెంటర్ గంభీరావుపేటలో ఆరు నెలలుగా మూతపడ్డ షట్టర్ మడిగెలు మాయం అంతటా ‘టు లెట్’ బోర్డులు ! దందా లేక వ్యాపారుల పరేషాన్ అద్దె కూడా చెల్లించలేని వైనం ఆన్లైన్ షాపింగ్‌తో స్థానిక వ్యాపారులకు ముప్పు ఇప్పటికే పలు మార్కెట్లు మాయంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆన్లైన్ షాపింగ్.. గల్లీకో దుకాణం వెలుస్తుండడంతో సూపర్ మార్కెట్లు.. పెద్ద దుకాణాలు మాయమవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారం జరిగిన సూపర్మార్కెట్లలో నేడు రూ.10వేల నుంచి రూ.20వేల లోపే విక్రయాలు జరుగుతున్నాయి. ఇంత భారీ మార్పుతో ఇప్పటికే జిల్లాలో ముప్పై వరకు సూపర్ మార్కెట్లు, ఇరువై వరకు ఫుడ్ బిజినెస్ వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. అయితే కొత్తగా కూడా మరిన్ని మార్టులు వెలిశాయి. కానీ ఆ మార్టుల్లోనూ గిరాకీ అంతంతే ఉంది. మండల కేంద్రాల్లో అయితే పలువురు వ్యాపారులు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దుకాణాలు మూసివేస్తున్నారు. జిల్లాలో ప్రధాన రహదారి వెంట షట్టర్లకు ‘టు లెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఇబ్బందులు పడుతున్నం నేను ముప్పై ఏళ్లుగా పూలు, పండ్ల వ్యాపారం చేస్తున్న. మొన్నటి వరకు గిరాకీ బాగా ఉండేది. కానీ కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా నడవడం లేదు. దీంతో పండ్ల విక్రయాలు బంద్‌చేసిన. ఇప్పుడు పూలు మాత్రమే అమ్ముతున్న. అది కూడా అంతంతే గిరాకీ ఉంది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. – అక్బర్, పూలు, పండ్ల వ్యాపారీ, గొల్లపల్లి రెంట్ ఎక్కువై మూసివేసినం మాకు గతంలో ముస్తాబాద్‌లో మెడికల్ షాపు ఉండేది. మొదట్లో బాగానే నడిచేది. కానీ తర్వాత సరిగ్గా నడవ లేదు. అద్దె కూడా ఎక్కువగా ఉండడంతో చెల్లించలేక దుకాణం తీసివేసినం. నేను ఇప్పుడు వేరే చోట పనిచేస్తున్న. – దేవేందర్, ముస్తాబాద్ -
ఆదర్శం.. ఈ సర్పంచులు
రాయికల్: మండలంలోని కుర్మపల్లి సర్పంచ్ మ్యాకల మల్లేశం, ఉపసర్పంచ్ పుల్ల లత శుక్రవారం తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలోహెచ్ఎం ఎలిగేటి రాజ్‌కిశోర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బుగ్గారం: ప్రభుత్వ బడులు ప్రైవేట్‌కు ఏమాత్రం తీసిపోవని ఉన్నత చదువులు చదివిన ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారి సేవలను స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు వినియోగించుకోవాలని సిరికొండ సర్పంచ్ ధర్మరాజు అన్నారు.ఈ మేరకు తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ గజ్జెల విజయ్,ప్రధానోపాధ్యాయురాలు హేమలత, కార్యదర్శి హేమలత,గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్లు అడ్డగింతపెగడపల్లి: మండలంలోని లింగాపూర్‌లో శుక్రవారం ప్రైవేట్ స్కూల్ బస్సులను స్థానికులు అడ్డుకున్నారు. సర్పంచ్ కాశెట్టి వీరేశం ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులను, ప్రైవేట్ సూళ్ల బస్సులు తమ గ్రామానికి రావొద్దని యాజమాన్యాన్ని కోరారు. ప్రైవేటు స్కూళ్లలో చదివించడం వల్ల ప్రభుత్వ పాఠశాల మూతపడే దశకు చేరుకుంటుందని ప్రభుత్వ పాఠశాల మనుగడకు గ్రామస్తులు సహకరించాలన్నారు. -
అమృత్ ఆలస్యం
● అమృత్ 2.0లో రూ.13 కోట్లు మంజూరు ● బాలానగర్‌లో కొనసాగుతున్న వాటర్‌ట్యాంక్ ● మిషన్ భగీరథ పైపుల లీకేజీ ● వేములవాడలో తీవ్రమైన నీటి కష్టాలు ● పూర్తికాని పనులు.. అందని తాగునీరువేములవాడఅర్బన్: వేములవాడ పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తోంది. కానీ పనులు మాత్రం కొస ముట్టలేవు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తుండగా.. నీరు అందని కాలనీలకు ఈ అమృత్ నిధులతో నీటిని అందించాలని భావించారు. పట్టణంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీతో జలాలు వృథా అవుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. రిపేర్లు చేయకుండా మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చాల్సిన మిషన్ భగీరథ నీళ్లు రోడ్డు పాలవుతుండగా.. అమృత్ 2.0 పనులు జాప్యమవుతున్నాయి. రూ.13కోట్లతో పనులు వేములవాడ మున్సిపల్‌కు అమృత్ 2.0లో భాగంగా రూ.13 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని బాలానగర్‌లో తాగునీటికి ఇబ్బందిగా ఉండటంతో 8 వేల కేఏల్ సామర్థ్యంతో వాటర్‌ట్యాంక్‌ను నిర్మిస్తున్నారు. ఇంకా పనులు పూర్తి కాలేదు. పైపులైన్ పనులు పూర్తి అగ్రహారం ఫిల్టర్‌బెడ్ నుంచి నాంపల్లి మీదుగా వేములవాడలోని మహాలక్ష్మి కాలనీ వరకు మిషన్ భగీరథ పైపులైన్‌ను గతంలోనే వేశారు. ఆ పైపులైన్ నుంచి బాలానగర్ నూతన వాటర్ ట్యాంక్ వరకు పైపులైన్ వేశారు. ఆ ట్యాంక్ నుంచి అవుట్లైన్లు కూడా ఇచ్చారు. మొత్తం పైపులైన్లు సుమారు 18 కిలోమీటర్లు వేసినట్లు తెలిపారు. పైపులైన్లు లేని చోట తాగునీటికి ఇబ్బందిగా ఉంటే ఈ నిధుల నుంచి వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో పూర్తిచేస్తాం అమృత్ నిధులతో పట్టణంలోని బాలానగర్‌లో వాటర్‌ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ట్యాంక్‌కు ఇన్, అవుట్ పైపులైన్లు వేశాం. ఈ పనులు జూలై చివరి వరకు పూర్తి చేసి తాగునీరు అందిస్తాం. పట్టణంలోని పైపులైన్లు లేని చోట కొత్తగా వేస్తాం. – అనన్య, వేములవాడ, పబ్లిక్ హెల్త్ ఏఈ -
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పొక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. ఏసీపీలు శ్రీనివాస్, జి.విజయ్ కుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, వేణుగోపాల్, వాసాల సతీశ్, ప్రతాప్ పాల్గొన్నారు. -
ష్యూరిటీలకు చార్జీలు ఇవ్వాల్సిందే
● రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు కరీంనగర్ అర్బన్: ఎఫ్‌సీఐ మిల్లింగ్ చార్జీల చెల్లింపులో నిబంధనలను బూచీగా చూపి ష్యూరిటీలను ఆందోళనకు గురి చేయడం తగదని రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ఆక్షేపించారు. జిల్లాకు రూ.3కోట్ల వరకు చార్జీలు రావాల్సి ఉందని, కేవలం డిఫాల్టర్లకు ష్యూరిటీ సంతకం చేసినందుకు సదరు బిల్లులు ఆపడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. గురువారం స్థానిక రైస్‌మిల్లర్ల సంఘ భవనంలో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఘటనలకు తావులేకుండా 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులు దింపుకున్నాయని, ఇతర జిల్లాల నుంచి మరో 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. 187 రైస్‌మిల్లులుండగా 110 మిల్లులు మనుగడలో ఉన్నాయని, బకాయి ఉండి వందశాతం సీఎంఆర్ చెల్లించిన మిల్లులకూ ధాన్యం కేటాయించారని వివరించారు. యాసంగి సీఎంఆర్‌కు సంబంధించి అధిక ఉష్ణోగ్రతల వల్ల నూక అవుతుందని, రారైస్ చేయడానికి వీలు కాదన్నారు. జిల్లాకు సరిపడా బాయిల్డ్ టార్గెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత బకాయి ఉన్న మిల్లులకు 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ మాఫీ చేసి వారికి కూడ అవకాశం కల్పించి అన్ని మిల్లులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం డైరెక్టర్లు విశ్వనాథ వీరకుమార్, కె.కేశవరెడ్డి, తొడుపునూరి శివప్రసాద్, బోనగిరి శశికిరణ్, వేణు పాల్గొన్నారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించాలిచిగురుమామిడి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో ప్రశాంత్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని ఇందుర్తి జెడ్పీపాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంట గది, విద్యార్థుల హాజరుశాతం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కుల పంపిణీ, ల్యాబ్‌ను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడా రు. సెల్ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉండాలన్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఎంఈవో జయప్రద, ఉపాధ్యాయులు మంజుల, శ్రీదేవి, సరిత, ఓదెలు కుమార్, తిరుపతి, వేణు, సూర్యప్రకాశ్, పవన్‌కుమార్, చారి ఉన్నారు. హక్కులను కాపాడేందుకే ఏఐటీయూసీ ఉద్యమం కరీంనగర్‌టౌన్: కార్మికుల హక్కులు, చట్టాలను కాపాడేందుకు ఏఐటీయూసీ ఉద్యమిస్తోందని ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఏఐటీయూసీ ఆఫీస్ బేరర్స్, అనుబంధ సంఘాల ముఖ్యనేతల సమావేశం పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సెప్టెంబర్ 6,7,8వ తేదీల్లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్చార్జి వీఎస్.బోస్, ఎస్.బాలరాజు, కలవేన శంకర్,, టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మారని తీరు.. వెళ్లని నీరు!
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట) రహదారిపై మళ్లీ నీరు నిలుస్తోంది. రెండు రోజుల పాటు హడావిడి చేసిన అధికారులు చేతులెత్తేశారు. శాశ్వత పరిష్కారానికి డ్రైనేజీ నిర్మాణమొక్కటే మార్గం కాబట్టి, నిధులు లేకపోవడంతో వర్షాకాలంలో రహదారి అధ్వానంగా మారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. రహదారికిరువైపుల ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు వెళ్లే మార్గం లేక లోతుగా ఉన్న ప్రదేశంలో నిలుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరో వైపు డ్రైనేజీ నీటితో రహదారిపై గోతులు పడుతున్నాయి. డ్రైనేజీల్లో నిండుకున్న స్లర్రీ, వ్యర్థాలు రహదారికి ఇరువైపుల నిర్మించిన డ్రైనేజీలో గ్రానైట్ స్లర్రీ(గ్రానైట్ చూర్ణం), వ్యర్థాలు నిండుకున్నాయి. దీంతో చుట్టుపక్కనున్న ఇండ్లలోని మురికి నీరు వెళ్లే మార్గం లేక లోతుగా ఉన్న రహదారిపై వచ్చి చేరుతున్నాయి. వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది. డ్రైనేజీల్లో నిండుకున్న స్లర్రీ, వ్యర్ధాలు తొలగిస్తేనే వర్షపు, మురికి నీరు వెళ్లేందుకు మార్గం సుగుమవుతుంది. నిబంధనలు విరుద్ధంగా అనుమతులు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్) 40 ఫీట్ల రోడ్డు చూపుతూ నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా కేవలం 20 ఫీట్ల రోడ్డును చూపుతూ గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు మామూలుగా తీసుకుంటుండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు బావుపేట తూంకుంట ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని, గ్రామ పంచాయతీ అనుమతి ఎలా వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రహదారిపై నిలుస్తున్న నీరు ఈ తూంకుంట వైపు వెళ్లాల్సి ఉన్నందున ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై దృష్టిసారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సొంతంగా రూ.3లక్షలు ఖర్చు చేశా బావుపేట రహదారిపై నిలుస్తు న్న నీటి మళ్లింపుకు ఇప్పటి వరకు సొంతంగా రూ.3 లక్షలు ఖర్చు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 150 మీటర్ల డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన స్లర్రీ, వ్యర్థాల తొలగింపుతో పాటు శాశ్వాతంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తాం. – పెంచాల ఆంజనేయులు, సర్పంచ్, బావుపేట -
ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు
సిరిసిల్లటౌన్: ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం పోయేలా చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన చింత అభిషేక్(29) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు నెలల క్రితం కొడుకు పుట్టగా దైవదర్శనం కోసం ఇంటికి రావాలనుకున్నాడు. బుధవారం రాత్రి విధులు నిర్వర్తించి గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రైవేటు యాప్ ట్యాక్సీ కారును బుక్‌చేసుకుని ఎక్కాడు. కారు డ్రైవర్ జగిత్యాల జిల్లాకు చెందిన ఆర్మూరి శ్రీకర్, వేములవాడ సోమేశ్లను అదే కారులో ఎక్కించుకొని నలుగురు స్వస్థలాలకు బయల్దేరారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుకనుంచి ఢీకొట్టాడు. అభిషేక్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందాడు. మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనకు కారణమైన కారు డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు వెతికి పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ రోడ్డుపై ఆపడం, కార్డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు -
రూ.2వేల కోట్ల కుంభకోణంపై సిట్ వేయాలి
కరీంనగర్‌టౌన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, బూట్లు, టైలు, ప్లేట్లు తదితర వస్తువుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన దాదాపు రూ.2వేల కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో గురువారం మాట్లాడుతూ టెండర్లలో అవకతవకలు జరిగాయని హరీశ్‌రావు, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఆధారాలతో ఆరోపించారని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ఉలిక్కిపడి సమాధానం చెప్పడానికి జంకుతున్నారని విమర్శించారు. టెండర్లలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సిట్, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడం మానేసి, హరీశ్‌రావు, ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌లపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారికి తగదని హెచ్చరించారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘువీర్‌సింగ్, సర్దార్ రవీందర్ సింగ్, ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాంరెడ్డి పాల్గొన్నారు.


