జీవన ప్రమాణాలు పెంచే దిశగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జీవన ప్రమాణాలు పెంచే దిశగా అభివృద్ధి

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌ ఉండొద్దు జాతీయ గణాంక దినోత్సవం ఎస్సారార్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తె లిపారు. 46వ డివిజన్‌ పరిధిలోని రాంనగర్‌ రోడ్డు నంబర్‌ 6లో రూ.10 లక్షలతో చేపట్టను న్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు, 35వ డివి జన్‌ కాపువాడలో రూ.51 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఎస్‌డబ్ల్యూజీ పైప్‌లైన్‌ డ్రైనేజీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్‌, సాదవేని సుజాత, తోట అనిల్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రజావాణిలో దరఖా స్తులు పెండింగ్‌లో ఉంచొద్దని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళా భారతిలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులు రాగా, అందులో ఇంజినీరింగ్‌ రెండు, టౌన్‌ ప్లానింగ్‌ ఆరు, రెవెన్యూ రెండు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకటి ఉన్నాయి. కొత్తపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించుకొన్న ఇండ్లకు నగరపాలకసంస్థ ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌, సహాయ కమిషనర్‌ రాజమనోహార్‌, పట్టణ ప్రణాళిక డీసీపీ బషీరొద్దీన్‌, ఏసీపీ శ్రీధర్‌, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్‌ పీసీ మహలనోబిస్‌ జయంతి సందర్భంగా కేంద్ర గణాంక శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్‌ పి.సి.మహలనోబిస్‌ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కేంద్ర గణాంకశాఖ కరీంనగర్‌ ఉప ప్రాంత కార్యాలయ సీని యర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌ శ్రీనివాసరావు, కొమ్మినేని సుధాకర్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌సిటీ: నగరంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ అటనామస్‌ కళా శాల డిగ్రీ 6వ సెమిస్టర్‌ ఫలితాలను సోమవా రం ప్రిన్సిపాల్‌ కల్వకుంట రామకృష్ణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ తిరుకోవెల శ్రీనివాస్‌ విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌లో 78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌, టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

టీజీఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన టీజీఎప్‌సెట్‌– 2026 తొలి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. చివరి రోజు స్లాట్‌ బుక్‌ చేసుకున్న 261 మందికి కరీంనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. మొత్తంగా 3,807మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి తెలి పారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసుకున్న వారు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement