ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

మానేరు వాగు పరిశీలన ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జర్మనీ పర్యటనలో మరో ఒప్పందం మద్యం మత్తులో వైద్య విధులకు..

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా జె.రవికుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఘ నంగా స్వాగతం పలికారు. రవికుమార్‌ మాట్లాడుతూ పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నియంత్రణకు పాటుపడతామని తెలిపారు. డీటీఎఫ్‌ సీఐ నాగేశ్వర్‌రావు, హుజూరాబాద్‌ సీఐ శ్రీనివాస్‌, తిమ్మాపూర్‌ సీఐ బాబా, జమ్మికుంట సీఐ మాధవీలత, కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌చార్జి సీఐ విజయ్‌ భాస్కర్‌, హెచ్‌సీ/ఈసీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పులి నగేశ్‌గౌడ్‌తో పాటు పలువురు ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన డిప్యూటీ కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

గన్నేరువరం: గన్నేరువరం నుంచి కరీంనగర్‌ వరకు మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గన్నేరువరంలో సాయి టెస్టు పనులను ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ వసంత నాయక్‌ బుధవారం పరిశీలించారు. వారం రోజుల్లో బ్రిడ్జి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండి సంజయ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏ ర్పాట్లు పరిశీలించారు. ఈఈ చారి, డీఈ రాజశేఖర్‌రెడ్డి, ఏఈ సురేశ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొడ్డు సునీల్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కటకం తిరుపతి పాల్గొన్నారు.

కరీంనగర్‌: వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో, రెడ్‌ క్రాస్‌ సొసై టీ సహకారంతో బుధవారం ఐఎంఏ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలు వురు డాక్టర్లు మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక యూనిట్‌ రక్తదానం ద్వారా మూడు నుంచి నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. రెడ్‌క్రాస్‌ బాధ్యులు ఎం. ఎల్‌.ఎన్‌.రెడ్డి, కేశవ్‌రెడ్డి, ఐఎంఏ బాధ్యులు ఆకుల శైలజ, వి.నీలిమ, కాసం శివకుమార్‌, సంతోష్‌ కుమార్‌, నరేశ్‌, రాజేశ్వర్‌, రామణాచారి, మోహన్‌రెడ్డి, మల్లికార్జున్‌, విజయలక్ష్మి, సర్దారున్నిసా, జ్యోతి,మానస పాల్గొన్నారు.

కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జర్మనీలోని గోట్టింగెన్‌ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుందని శాతవాహన యూని వర్సిటీ అధికారులు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఉమేశ్‌ కుమార్‌ జర్మనీ పర్యటనలో భాగంగా ఈ భాగస్వామ్యం సాధ్యమైందన్నారు.

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి ఓ వైద్యుడు మద్యంమత్తులో వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అత్యవసర విభాగాని కి వచ్చిన రోగులు, అక్కడ విధుల్లో ఉన్న రేడియాలజిస్ట్‌ మద్యంమత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది బ్రీత్‌ అనలైజర్‌తో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షకు సహకరించలేదు. తన కారులో పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడా బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు సహకరించలేదు. ఈ ఘటనపై హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీందర్‌ను వివరణ కోసం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement