పల్స్‌ పోలియో విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియో విజయవంతం చేయాలి

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్‌ సూచించారు. గురువారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పరిధిలోని 25 బూత్‌ల ద్వారా 5,642 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు, ఇందులో వందమంది వలంటీర్లు, సిబ్బంది పా ల్గొంటారని చెప్పారు. అలాగే ఆదివారం తప్పిపోయిన పిల్లలకు 29, 30వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తపల్లి, ఆసిఫ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గ్రీష్మ, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement