ధర నిలకడగా ఉంటే రైతుకు లాభం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోటి వరకు గుడ్ల కోళ్లు ఉన్నాయి. ఇప్పుడు పేరుకే కోడిగుడ్డు రేటు పెరిగింది. కోళ్ల పరిశ్రమ రైతులకు లా భం లేదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు వేలల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. దానా రేట్లు సైతం విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఉన్న ధరలు నిలకడగా కొన్ని నెలలు ఉంటే లేయర్ రైతులకు లాభం.
– ఒంటెల వెంకటరమణారెడ్డి,
లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు,
ఉమ్మడి కరీంనగర్
కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. ఎగ్‌తో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. సామాన్యులకు కోడిగుడ్డు అందుబాటులో ఉండే ప్రొటీన్ ఆహారం. ఇందులో కేలరీస్, విటమిన్లు, ప్రోటీన్లు బాగా ఉంటాయి. కరోనా అనంతరం ప్రతీ ఒక్కరు ప్రోటీన్ ఉండే కోడిగుడ్లను తీసుకోవడంలో శ్రద్ద చూపుతున్నారు. – దీప్తి, వైద్యురాలు, వేములవాడ


