కరీంనగర్‌టౌన్: నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఏసీబీ, ఐటీ విచారణ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ అధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం ఎదుట త్రాసులో నోట్ల కట్టలు, పుస్తకాలు ఉంచి వినూత్న నిరసన తెలిపారు. మణికంఠరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బీటెక్ ఫీజుల కన్నా ఎల్‌కేజీ ఫీజులే ఎక్కువగా ఉన్నాయని, అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.5 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని, వారికి అండగా నిలుస్తున్న డీఈవో, ఎంఈవోలను సస్పెండ్ చేయాలన్నారు. నాయకులు మచ్చ రమేశ్, నునవత్ శ్రీనివాస్, లద్దునూరి విష్ణు, కసిరెడ్డి సందీప్‌రెడ్డి, జ్యోత్స్న, అనోశ్ పాల్గొన్నారు.


