కరీంనగర్‌క్రైం: కమిషనరేట్‌వ్యాప్తంగా 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏ.శ్రీనాథ్‌ను వీఆర్ నుంచి టూటౌన్‌కు, కె.రవిని వన్‌టౌన్ నుంచి హుజూరా బాద్‌కు, వి.శ్రీనివాసరావును టాస్క్‌ఫోర్స్ నుంచి హుజూరాబాద్‌కు, యూనుస్ అహ్మద్ అలీని హుజూరాబాద్ నుంచి వీఆర్‌కు, చీనానాయక్‌ను పీసీఆర్ నుంచి కరీంనగర్ ట్రాఫిక్‌కు, సీహెచ్.తిరుపతి సీసీఆర్‌బీ నుంచి మానకొండూర్, సీహెచ్.నర్సింహారావు సీటీసీ నుంచి ఎస్‌బీకి, టి.నరేశ్‌ను కరీంనగర్ రూరల్ నుంచి సీసీఆర్‌బీకి, డి.పృథ్వీధర్‌గౌడ్‌ను చిగురుమామిడి నుంచి సీసీఎస్‌కు, ఎస్.సంజీవ్‌ను వీఆర్ నుంచి జమ్మికుంటకు, ఎన్.రమేశ్‌ను సీసీఎస్ నుంచి జమ్మికుంటకు, ఎస్.ప్రమోద్‌రెడ్డిని కరీంనగర్ ట్రాఫిక్ నుంచి పీసీఆర్‌కు, ఎం.రమేశ్‌ను వీఆర్ నుంచి సీసీఆర్‌బీకి, ఎం.యాదగిరిని వీఆర్ కరీంనగర్ నుంచి మహిళా పీఎస్‌కు, ఎం.డీ.ఇర్షాద్, బి.ఎల్లయ్యగౌడ్, ఎం.సుధాకర్‌ను వీఆర్ నుంచి ఎస్‌బీకి, వి.తిరుపతిని వీఆర్ నుంచి సీటీసీకి, జి.రామిరెడ్డిని ఎస్‌బీ నుంచి పీసీఆర్‌కు బదిలీ చేశారు.


