జ్యోతినగర్: ‘అయ్యా.. నా బిడ్డకు ప్రాణం పోయండి.. మాకు పుత్రభిక్ష ప్రసాదించండి’ అని కాలేయ మార్పిడి చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడిని బతికించేందుకు దాతలు సాయం చేయాలని తల్లిదండ్రులు మానాల తిరుమలేశ్, స్వప్న వేడుకొంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మూడోడివిజన్ మల్కాపూర్ గ్రామానికి చెందిన తిరుమలేశ్ రోజూ కూలీ పనులు చేస్తేనే పూట గడుస్తుంది. ఈక్రమంలో తన చిన్నకుమారు విరాట్‌కు దీర్ఘకాలిక కాలేయ సంబంధిత వ్యాధి సోకడంతో చికిత్స చేయించే స్థోమతలేక అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రి వైద్యులు విల్సన్ వ్యాధికి సంబంధించిన దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రాణాలు నిలవడానికి అత్యవసరంగా కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. చికిత్సకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుందని తెలియజేశారు. దీంఓత తమ కుమారుడిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు.
తల్లిదండ్రులతో విరాట్
చికిత్స పొందుతున్న విరాట్
కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు
కొట్టు మిట్టాడుతున్న బాలుడు
కాపాడాలని తల్లిదండ్రులు వేడుకోలు


