సర్‌కు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌కు సహకరించాలి

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

● నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌కల్చరల్‌: ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని నరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు మున్సిపల్‌, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందన్నారు. నగరవ్యాప్తంగా పోలింగ్‌ బూత్‌ల ప్రకారం ఇప్పటి వరకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ దాదాపు 80శాతం పూర్తయ్యిందన్నారు. ఫారాల పంపిణీ వందశాతం పూర్తయిన బీఎల్‌వోలు పూర్తిస్థాయిలో పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫీల్డ్‌ లెవల్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరై ఉండి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందని వారు బూత్‌ లెవల్‌ అధికారులను కలిసేలా ఓటర్లకు సూచనలు చేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాల విషయంలో ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల్లోని హెల్ప్‌ డెస్కులను సందర్శించి, సమస్యను పరిష్కరించేలా పార్టీల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్‌, డూప్లికేట్‌ ఓట్ల తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు. మరణించిన వారి వివరాలను బూత్‌ లెవల్‌ అధికారుల సహకారంతో తొలగించేలా సహకరించాలని సూచించారు.

సైన్స్‌ మ్యూజియం చారిత్రాత్మకమైంది

నగరంలోని సైన్స్‌ మ్యూజియం చారిత్రాత్మకమైందని కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా సైన్స్‌ మ్యూజియాన్ని సందర్శించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్‌ నమూనాలు, గ్యాలరీలను పరిశీలించారు. అధునీకరించిన మ్యూజియాన్ని సందర్శకులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement