కొత్తపల్లి(కరీంనగర్): ‘డర్టీ హౌస్..కరీంనగర్ శివారులోని ఫామ్‌హౌస్‌ల్లో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ స్పందించారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు, ఫంక్షన్ వేదికలు, ఇతర సంస్థల యజ మానులు, నిర్వాహకులు సూచనలు పాటించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఫామ్‌హౌస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలను కవర్ చేస్తూ కనీసం 60 రోజుల రికార్డింగ్ బ్యాకప్‌తో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, సందర్శకుల వివరాలతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఐదు ఫొటో గుర్తింపు పత్రాలతో కూడిన అతిథి రిజిస్టర్‌ను నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాలు, చట్టవిరుద్ధమైన జూ దం, వ్యభిచారం, అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మరే ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కలిగి ఉండటం, నిల్వ చేయడం, అమ్మడం, పంపిణీ చేయడం, వినియోగించడం వంటివి నిషేధించినట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీ
కరీంనగర్ కార్పొరేషన్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టిన అపరచాణక్యుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్, నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, షుకూర్, నాగుల సతీష్, కుంబాల రాజ్ కుమార్, మాదాసు శ్రీనివాస్, సుదర్శన్, మాలోతు మహాలక్ష్మి పాల్గొన్నారు.
మోడల్ స్కూళ్లను విలీనం చేయాలి
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వాగేశ్వరి కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంలో మోడల్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న టీజీటీలకు నోషనల్ సర్వీస్ ప్రయోజనం అందించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లువేరు మహేశ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల విజయ్‌కుమార్, కార్యదర్శి లాకను బాబు, ఎంఎస్‌ఎఫ్ కార్యదర్శి సురేశ్ ఉన్నారు.


