దేశంలో ఆర్థిక పారదర్శకత, పన్నుల క్రమశిక్షణ, చట్టబద్ధమైన వ్యాపార వ్యవస్థ బలో పేతానికి చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలు కీలకం. వ్యాపార సంస్థ ప్రారంభం నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయపు పన్ను, టీడీఎస్, ట్రస్టులు, సొసైటీలు, కంపెనీల చట్టబద్ధమైన కంప్లయెన్స్, వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాంకు రుణాలు, కార్పొరేట్ గవర్నెన్స్, విలీనాలు, కొనుగోళ్లు, ఇన్సాల్వెన్సీ ప్రక్రియకు చార్టర్డ్ అకౌంటెంట్లు సమగ్ర సేవలు అందిస్తున్నారు. – వనపట్ల శేఖర్ రెడ్డి, సీఏ
వికసిత్ భారత్–2047 లక్ష్య సాధన దిశగా తీసుకెళ్లడంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం. స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్ వంటి కార్యక్రమాల అ మలులో సీఏలు భాగస్వాములు గా నిలుస్తున్నారు. – జి.ఆనంద్ కుమార్, సీఏ
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, టీ హబ్, టాస్క్ కార్యక్రమాల అమలులో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, విద్యాసంస్థలు, సేవా సంస్థలు, సహకార సంఘాలు చట్టబద్ధంగా ముందుకు సాగేందుకు సీఏల మార్గదర్శకత్వం అవసరం. – ఎం.సంతోష్‌రెడ్డి, సీఏ


