రవిచంద్ర, శ్యాంప్రసాద్‌కు ‘ఆటా’ ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

రవిచంద్ర, శ్యాంప్రసాద్‌కు ‘ఆటా’ ఆహ్వానం

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

కరీంనగర్‌కల్చరల్‌: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) తరఫున జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించే 19వ ద్వైవార్షిక ఆటా మహాసభలు, యువజన సదస్సుకు కరీంనగర్‌ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌ లాల్‌ను ముఖ్య అతిథిలుగా ఆహ్వానించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో యువత, వివిధ రంగాల నిపుణులు, సామాజిక నాయకులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యువ నాయకత్వ శిక్షణ, విద్యా, వ్యాపార సదస్సులు, ఉద్యోగ మేళాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుభవాలను పంచుకుంటారు. రవిచంద్ర, శ్యాంప్రసాద్‌లాల్‌కు మాడిశెట్టి గోపాల్‌, అన్నవరం దేవేందర్‌, డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement