కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్/జమ్మికుంట: రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ నగరంగా మారుస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. జ్యోతినగర్‌లో రూ.67లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పైప్ లైన్‌ను శనివారం ప్రారంభించారు. కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర పెద్దలను ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్‌ను చేర్పించినట్లు తెలిపారు. ఫలితంగా కేంద్రం నుంచి రూ.840 కోట్లు నిధులు వస్తున్నాయ ని, వాటితో కార్పొరేషన్ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. డంప్‌యార్డ్‌కు రూ.80 కోట్లు విడుదలయ్యాయని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. మేయర్ శ్రీనివా స్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు ప్రవీణ్‌రావు, రమణారెడ్డి, బి. వేణు పాల్గొన్నారు.
దసరా నాటికి కరీంనగర్– వరంగల్ హైవే పనులు పూర్తి
ఈ ఏడాది దసరా నాటికి కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారిని అందుబాటులోకి తెస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. హుజూరాబాద్ శివారులో జరుగుతున్న రహదారి పనులను శనివారం పరిశీలించారు. 90శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కరీంనగర్– జగిత్యాల హైవే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
మోడీది రైతు ప్రభుత్వం
దేశంలో 9.60 కోట్ల మంది రైతులకు అందించే కిసాన్ సమ్మాన్ నిధులు ఒక్కసారి కూడా అగలేదని సంజయ్ అన్నారు. జమ్మికుంటలోని కేవీకేలో 23వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని తిలకించారు. యువతకు 10లక్షల ఉద్యోగాలు కేంద్రం ప్రభుత్వం కల్పించిందన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి, కేవీకే ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్‌రెడ్డి, శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ఉన్నారు.


