పునరాలోచన చేయాలి | - | Sakshi
Sakshi News home page

పునరాలోచన చేయాలి

Jun 29 2026 1:41 AM | Updated on Jun 29 2026 1:41 AM

పునరాలోచన చేయాలి ఆంక్షలు తొలగించాలి

భూమికి, రైతుకు అనుకూలమైన విత్తనాలతో పంటలు సాగుచేస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయి. ప్రభుత్వం సూచించిన విత్తన రకాలు ఈ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండవు. ప్రభుత్వం నిర్దేశించిన విత్తనాలతో వరిసాగు చేస్తే నష్టాలు తప్పవు. సర్కారు మరోసారి పునరాలోచన చేయాలి.

అనపురం కమలమ్మ, మహిళా రైతు, దమ్మనపేట

నాకున్న ఐదు ఎకరాల్లో సన్నవడ్లు సాగుచేస్తున్న. సన్నరకాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాలి. భూమిని బట్టి సాగయ్యే, నీటి లభ్యతను బట్టి సాగు చేసే సన్నరకాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించే సన్నరకాలను సాగు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

– ఐలు శ్రీనివాస్‌, పోతిరెడ్డిపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement