మట్టిని సుగంధ భరితం చేసిన సాహితీవేత్త ‘నలిమెల’ | - | Sakshi
Sakshi News home page

మట్టిని సుగంధ భరితం చేసిన సాహితీవేత్త ‘నలిమెల’

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

కరీంనగర్‌కల్చరల్‌: పరిశోధనలు, అనువాదాల ద్వారా వేర్వేరు భాషలను ఒకే ఊపిరిలోకి ముడివేసి మట్టిని సుగంధ భరితం చేసిన బహుభాషా వేత్త, సాహితీవేత్త నలిమెల భాస్కర్‌ అని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్‌.గోపి అన్నారు. ఆదివారం కరీంనగర్‌ ఫిలింభవన్‌లో జరిగిన భాస్కర్‌ పరిశోధన గ్రంథాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. భాస్కర్‌ ఎంఫిల్‌ పరిశోధనా గ్రంథం ‘తెలుగులో సామెతలు, ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన’, పీహెడీ పరిశోధన గ్రంథం ‘తెలుగు, మలయాళ సామెతలు, కుటుంబ జీవన చిత్రణ’ ఆవిష్కరించారు. అనంతరం నలిమెల తన తల్లిదండ్రులు నలిమెల బుచ్చమ్మ–రామచంద్రం స్మారక తొలి పురస్కారాన్ని కవి అన్నవరం దేవేందర్‌కు అందించారు. తెలంగాణ భాషను శ్వాసించిన కవి అన్నవరంను పురస్కారానికి ఎంపిక చేయడం సముచితమన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘు, బీసీ రచయితల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, తెరవే జిల్లా కార్యదర్శి దామరకుంట శంకరయ్య, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కూకట్ల తిరుపతి, పొన్నం రవిచంద్ర, పీఎస్‌ రవీంద్ర, డాక్టర్‌ రఘురామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement