సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాతబస్టాండులో ఆధునిక డిజైన్‌తో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్ల భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసి, రూ.60లక్షలతో సులభ్ కాంప్లెక్స్ భవనాన్ని ‘ఎల్’ ఆకారంలో నిర్మించనున్నారు. అయితే ప్రయాణికులు అత్యవసరం తీర్చుకునేందుకు పాతబస్టాండ్‌లో మొబైల్ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. అందులో నీళ్లు లేక అపరిశుభ్రం మారిక కంపుకొడుతున్నాయి. మొబైల్ టాయిలెట్లలోకి వెళ్లేందుకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సులభ్ కాంప్లెక్స్ కొత్త భవనం ఐదు నెలల్లో పూర్తి అవుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటి వరకు ఈ మొబైల్ టాయిలెట్ వద్ద అదనపు సిబ్బందిని నియమించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.


