లోక్‌ అదాలత్‌లో 2,703 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 2,703 కేసులు పరిష్కారం

Jun 21 2026 6:34 AM | Updated on Jun 21 2026 6:34 AM

● జిల్లా ప్రధాన న్యాయమ్తూర్తి ఎస్‌.శివకుమార్‌

కరీంనగర్‌ క్రైం: రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ సరైన మార్గమని జిల్లా ప్రధాన న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.శివకుమార్‌ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాదన్నారు. డీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి సీపీ ఆదేశాలతో తమవంతు కృషి చేస్తున్నామన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లతో కేసుల పెండింగ్‌ తగ్గుతుందన్నారు. న్యాయమూర్తులు పలు కేసులు పరిష్కరించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌లో 2,703 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, న్యాయమూర్తి రాణి తెలిపారు. వీటిలో సివిల్‌ 56, క్రిమినల్‌ 2,557, ఇతర కేసులు 90 ఉన్నాయన్నారు. మోటారు ప్రమాదం కేసుల్లోని బాధితులకు రూ.3,01,43,416 పరిహారం ఇచ్చేలా పరిష్కరించినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement