పంచాయతీ కార్యాలయంలోకి వస్తున్న వరద
ఇంట్లో చేరిన వరద
శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామంలో సోమవారం వర్షం దంచి కొట్టింది. ఉక్కపోతతో సతమతమైన ప్రజలు వర్షంతో కొంత ఊరట చెందారు. వరదనీరు జీపీ కార్యాలయం, ఇళ్లల్లోకి చేరింది. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి ఎత్తు పెంచడంతో రోడ్డుపై వరదనీరు నేరుగా జీపీ భవనంలోకి చేరింది. డోర్లు వేసినా వరద నీరు ఆగక పోవడంతో జీపీ సిబ్బంది వరదనీటిని దారి మళ్లించారు. కుర్చీలు, టేబుళ్లు నీళ్లలో ఉండడంతో పైళ్లు తడవకుండా ఇబ్బందులు పడ్డారు. రజకవాడలోకి వరదనీరు చేరడంతో నిత్యావసర సామగ్రి తడిసిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


