సుల్తానాబాద్‌రూరల్: తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ తూర్పటి భార్గవ్‌కృష్ణ(36), కరీంనగర్‌కు చెందిన కల్యాణం శ్రీనివాస్, చల్ల వెంకటేశ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన తూర్పటి హరిబాబు బంధువులు. మూడు రోజుల క్రితం అస్సాంలోని గౌహతిలో కామాఖ్యమాత దర్శనానికి కారులో హైదారాబాద్ వరకు వెళ్లి, అక్కడి నుంచి ఫ్లైట్‌లో బయలుదేరారు. తీర్థయాత్ర ముగించుకొని ఆదివారం వేకువజామున కారులో తిరుగుపయనమయ్యారు. కమలాపూర్ మండలం ఉప్పల్‌లో హరిబాబును దించేందుకువ వెళ్లగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్గవ్‌కృష్ణ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్రగాయాలైన వెంకటేశ్, హరిబాబులు వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్గవ్‌కృష్ణకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
సుల్తానాబాద్‌లో విషాదం
పెద్దపల్లి: ఫొటోగ్రాఫర్ తూర్పాటి భార్గవకృష్ణ మృతితో సుల్తానాబాద్‌లో విషాదం నెలకొంది. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి ఎనిమిదేళ్ల కొడుకు పకోడి తీసుకువచ్చి ‘నాన్న లే తిను’ అనడంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. భార్గవకృష్ణ మృతదేహానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు.
కమలాపూర్ మండలం ఉప్పల్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
ఇద్దరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు


