● ఆర్థికాభివృద్ధిలో మహిళల ముందడుగు
● ఉదయం పూట వ్యాపార బాట
● కుటుంబానికి ఆసరా
● సమాజంలో ఆదర్శం
వేములవాడ: నేటి మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం.. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పనిచేయడం కంటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. చిన్న వ్యాపారం చేసినా సొంత కాళ్లపై నిలబడతామన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. వేములవాడ పట్టణంలో పలువురు మహిళలు ఉదయం పూటే తమ వ్యాపారాలను ప్రారంభించి మధ్యాహ్నంలోపే ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. మిల్లెట్స్ పేరిట ఆరోగ్యకరమైన అల్పాహారం, పాలు, కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. కుటుంబ బాధ్యతలతోపాటు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


