మావా! | - | Sakshi
Sakshi News home page

మావా!

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026 ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా మావా! 8లోu

న్యూస్‌రీల్‌

డర్టీహౌస్‌

ఫాంహౌస్‌ల్లో జోరుగా అసాంఘిక కార్యకలాపాలు

సిటీ దాటితే సీక్రెట్‌ సామ్రాజ్యం

వినోదం వెనుక వికృత చేష్టలు

కరీంనగర్‌ శివారులలో విచ్చలవిడిగా పార్టీలు

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026
ఊ.. అంటావా మావా..
ఊఊ.. అంటావా
వేగవంతంగా సర్‌ ప్రక్రియ

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కొత్తపల్లి :

ప్రకృతి ఒడిలో ఉపశమనం పొందేందుకు నిర్మించుకున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రి పూట సాగుతున్న ‘చీకటి వినోదాలు’ పెచ్చుమీరుతున్నాయి. మందు, విందులతో మత్తులో చిందులు.. కంచె దాటిన కామం, హద్దులు మీరిన జూదం.. వెరసి కొన్ని ఫాంహౌస్‌లు చీకటి కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. హైదరాబాద్‌కే పరిమితమైన ఫాంహౌస్‌ సంస్కృతి క్రమేణా జిల్లా కేంద్రాలకు సోకింది. ఫలితంగా చట్టవిరుద్ధమైన పనులకు సురక్షితమైన అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిఘా లోపం వల్లే ఈ అక్రమ ఫాంహౌస్‌ల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, యువతను పెడదోవ పట్టిస్తున్న అక్రమ ఫాంహౌస్‌లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జోరుగా చీకటి కార్యకలాపాలు

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్‌ల సంస్కృతి పెరిగింది. ప్రశాంతత, వినోదాలకు వేదికలుగా నిలవాల్సిన ఫాంహౌస్‌లు చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్‌ల సంస్కృతి జోరందుకుంది. రాత్రి అయిందంటే ఈ ఫాంహౌస్‌ వేదికలుగా మందు, విందు, వ్యభిచారం వంటి చీకటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా చెడు ధోరణికి అలవాటుపడ్డ యువత ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తూ విందు, వినోదాల్లో తేలియాడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఇలాంటి అక్రమ ఫాంహౌస్‌లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. నిబంధనలు ఉల్లంఘించిన ఫాంహౌస్‌లను సీజ్‌ చేయడంతో పాటు, నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

అనుమతిలేని నిర్మాణాలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫాంహౌస్‌లు నిర్మించారు. కరీంనగర్‌ శివారు కొత్తపల్లి, కొత్తపల్లి మండలం, కరీంనగర్‌ రూరల్‌, తిమ్మాపూర్‌, రామడుగు తదితర మండలాల్లో గ్రామ పంచాయతీ/మున్సిపల్‌ నుంచి ఎలాంటి కమర్షియల్‌ అనుమతులు పొందకుండా ఫాంహౌస్‌లను అద్దెకు ఇస్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటికి విద్యుత్‌ మీటర్ల మంజూరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇష్టారీతిన ఫాంహౌస్‌ల నిర్మాణాలు జరిగినా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదు. కేవలం సొంత అవసరాల కోసం నిర్మించుకున్నట్లు చూపుతూ..లోపల మాత్రం యథేచ్ఛగా ఈవెంట్లు, పార్టీలకు అనుమతులిస్తున్నారు.

వినోదం వెనుక వికృత చేష్టలు

ఫాంహౌస్‌ సంస్కృతి తప్పు కానప్పటికీ దాని వెనుక సాగే వికృత క్రీడలే సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ యువత మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్నారు. ఫలితంగా ఘర్ణణలకు దిగుతున్నారు. దీంతో యువత భవిష్యత్తు చీకట్లోకి జారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. పచ్చని ప్రకృతి సాక్షిగా సాగుతున్న ఈ నల్లటి వ్యాపారాలపై అధికారులు నిఘా పెట్టినప్పుడే ఫాంహౌస్‌ బాగోతాలకు తెరపడుతుంది.

ఫాంహౌస్‌ల చాటున సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిరంతరం తనిఖీలు చేస్తూ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశాం. కేవలం కుటుంబ సభ్యుల ఫంక్షన్‌లకు మాత్రమే అద్దెకు ఇవ్వాలని, యువతకు ఇవ్వకూడదని సూచించాం. పలు ఫాంహౌస్‌లలో సౌండ్‌ పొల్యూషన్‌ కేసులు నమోదు చేశాం. ఫాంహౌస్‌లకు తప్పనిసరిగా అనుమతులుండాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తే సీజ్‌ చేస్తాం. – బిల్ల కోటేశ్వర్‌, సీఐ, కొత్తపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement