పోలియో చుక్కలు వేశారా? | - | Sakshi
Sakshi News home page

పోలియో చుక్కలు వేశారా?

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

పోలియో చుక్కలు వేశారా?

చిగురుమామిడి: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. సోమవారం చిగురుమామిడిలో ఐదేళ్లలోపు వయసు గల పిల్లల్లున్న ఇండ్లను సందర్శించారు. ఆదివారం నాటి పల్స్‌పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయించారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ఆశ, ఏఎన్‌ఎంలను ఆదేశించారు. గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్‌ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్‌వోలకు ఓటర్లు సహకరిస్తేనే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. చిగురుమామిడి సర్పంచ్‌ ఆకవరం భవానీప్రసాద్‌, ఏఎన్‌ఎం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement