ఓటరు జాబితా పక్కాగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

● అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా కోరారు. సర్‌ కార్యక్రమం అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25నుంచి జూలై 24వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. జూలై 24న పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31నుంచి ఆగష్టు 30వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్‌ 28వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి అక్టోబర్‌ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తారని, ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లను గుర్తించి నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, మాస్టర్‌ ట్రైనర్‌ సంపత్‌, వివిధ పార్టీల నేతలు సిరాజ్‌ హుస్సేన్‌, సత్తినేని శ్రీనివాస్‌, నాంపల్లి శ్రీనివాస్‌, సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌, మిల్కూరి వాసుదేవ రెడ్డి, ఎర్రవెల్లి రవీందర్‌, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement