ఆదర్శం.. ఈ సర్పంచులు | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. ఈ సర్పంచులు

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

రాయికల్‌: మండలంలోని కుర్మపల్లి సర్పంచ్‌ మ్యాకల మల్లేశం, ఉపసర్పంచ్‌ పుల్ల లత శుక్రవారం తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలోహెచ్‌ఎం ఎలిగేటి రాజ్‌కిశోర్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బుగ్గారం: ప్రభుత్వ బడులు ప్రైవేట్‌కు ఏమాత్రం తీసిపోవని ఉన్నత చదువులు చదివిన ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారి సేవలను స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు వినియోగించుకోవాలని సిరికొండ సర్పంచ్‌ ధర్మరాజు అన్నారు.ఈ మేరకు తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గజ్జెల విజయ్‌,ప్రధానోపాధ్యాయురాలు హేమలత, కార్యదర్శి హేమలత,గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్లు అడ్డగింత

పెగడపల్లి: మండలంలోని లింగాపూర్‌లో శుక్రవారం ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను స్థానికులు అడ్డుకున్నారు. సర్పంచ్‌ కాశెట్టి వీరేశం ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులను, ప్రైవేట్‌ సూళ్ల బస్సులు తమ గ్రామానికి రావొద్దని యాజమాన్యాన్ని కోరారు. ప్రైవేటు స్కూళ్లలో చదివించడం వల్ల ప్రభుత్వ పాఠశాల మూతపడే దశకు చేరుకుంటుందని ప్రభుత్వ పాఠశాల మనుగడకు గ్రామస్తులు సహకరించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement